For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భాధారణ సమయంలో కడుపుబ్బరాన్ని నివారించే హోం రెమెడీస్

|

గర్భధారణ సమయంలో కడుపుబ్బరం అనేది చాలా సాధారణ సమస్య. కడుపుబ్బరం అసౌకర్యానికి గురిచేస్తుంది. ముఖ్యంగా గర్భం పొందిన ప్రారంభదశలో గర్భిణీలకు అసౌకర్యాన్ని కలిగిస్తుంది. హార్మోనులు అసమతుల్యతల వల్ల గర్భాధారణ సమయంలో కడుపుబ్బరానికి గురిచేస్తుంది.

కాబట్టి, గర్భిణీలు ఎప్పటికప్పుడు శరీరాన్ని తగినంత హైడ్రేషన్ లో ుంచుకోవాలి. కొన్ని సింపుల్ రెమెడీస్ తో ఇలాంటి అసౌకర్యాన్ని తొలగిస్తుంది . అయితే, ఈ క్రింది తెలిపిన హోం రెమెడీస్ ను మీరు తీసుకోవాలనుకున్నప్పుడు డాక్టర్ ను తప్పనిసరిగా సంప్రదించాలి .

గర్భాధారణ సమయంలో ఈ సమస్యను నుండి బయటపడటానికి వివిధ రకాల మార్గాలున్నాయి . షుగర్ ఫుడ్స్ తీసుకోవడం మానేయడం, భోజనం తక్కువగా తీసుకోవడం, వీటికి ప్రత్యామ్నాయంగా ఫైబర్ ఫుడ్స్ అధికంగా తీసుకుంటూ..ప్రతి రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది . అలాగే డీప్ ఫ్రై చేసిన ఆహారాలు నివారించి, ఒత్తిడి లేని జీవితాన్ని పొందాలనుకుంటే హెల్తీ ఫుడ్స్ ను ఎంపిక చేసుకోవాలి.

వీటితో పాటు, గర్భధారణ సమయంలో మీరు తీసుకోవల్సిన మరికొన్ని హోం రెమెడీస్ ఈ క్రింది విధంగా ఉన్నాయి. ఇవి కడుపుబ్బరాన్ని నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతాయి. మరి గర్భాధారణ సమయంలో కడుపుబ్బరాన్ని నివారించే ఆహారాలేంటో తెలుసుకుందాం...

 మెంతులు:

మెంతులు:

మెంతులు ఒక ఉత్తమ హోం రెమెడీ. కడుపుబ్బరాన్ని నివారించడంలో ఇది గ్రేట్ గా సహాయపడుతుంది . గుప్పెడు మెంతులను ఒక గ్లాసు నీటిలో వేసి రాత్రంతా నానబెట్టాలి . తర్వాత రోజు ఉదయం మెంతులు నానబెట్టిన నీటిని వడగట్టి పరగడుపున త్రాగాలి.

 ఒత్తిడి తగ్గించుకోవాలి:

ఒత్తిడి తగ్గించుకోవాలి:

గర్భధారణ సమయంలో ఒత్తిడి మరో ముఖ్యమైన సమస్య. ఒత్తిడి కారణంగా కూడా కడుపుబ్బరం మరియు అసౌకర్యం ఉంటుంది . ఒత్తిడిలో మనం తీసుకొనే ఆహారంతో పాటు గాలిని కూడా మనకు తెలియకుండానే మింగుతుంటాము . ఇది కడుపుబ్బరానికి దారితీస్తుంది . టెన్షన్ మరియు స్ట్రెస్ కడుపులో పెరిగే బిడ్డమీద వ్యతిరేక స్వభావం కలిగి ఉంటుంది.

ద్రవాలు ఎక్కువగా తీసుకోవాలి:

ద్రవాలు ఎక్కువగా తీసుకోవాలి:

ఎక్కువగా నీరు తీసుకోవడం వల్ల శరీరం హైడ్రేషన్ లో ఉంటుంది . మరియు ప్రొపర్ బౌల్ మూమెంట్ ఉంటుంది, దాంతో కడుపుబ్బరం తగ్గించుకోవచ్చు మరియు మలబద్దకం నివారించబడుతుంది. ఎక్కువగా నీరు మరియు ఫ్రెష్ జ్యూస్ లు తీసుకోవడం వల్ల కడుపుబ్బరం నివారించుకోవచ్చు.

ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవాలి:

ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవాలి:

ముఖ్యంగా గర్భాధారణ సమయంలో కడుపుబ్బరం మరియు మలబద్దకం సమస్యలను నివారించుకోవడానికి, అసౌకర్యాన్ని తగ్గించుకోవడానికి ఫైబర్ రిచ్ ఫుడ్స్ ను ఎక్కువగా తీసుకోవాలి.

పుదీనా తినాలి

పుదీనా తినాలి

పుదీనా ఉబ్బరం తగ్గించడం మరియు కడుపు నొప్పి తగ్గటానికి ఉపయోగకరంగా ఉంటుంది. కడుపు ఉబ్బరం కారణంను పరిక్షించినపుడు ఉబ్బరం బాధ ఏ సమయంలో నైన రావచ్చు. పుదీనాను టీ లేదా ఒక క్రషర్ రూపంలో తీసుకోవచ్చు.పుదీనాను ఒక బుడగలు వచ్చే పానీయంతో కలిపి తీసుకోవటం అనేది చాలా మంచి పరిష్కారం అని చెప్పవచ్చు. పుదీనాతో పాటు ఉబ్బరం నొప్పులు తక్షణ ఉపశమనం కలిగించటానికి అల్లం,నల్ల ఉప్పు,నిమ్మరసం మొదలైనవి ఉన్నాయి. ఈ ఆహారాలను తీసుకోవటం వలన ఉబ్బరం నొప్పి తగ్గి మళ్ళీ కడుపును తేలికగా చేస్తుంది.

అల్లం:

అల్లం:

అల్లం స్టొమక్ అప్ సెట్ నివారిస్తుంది మరియు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. . ఇది జీర్ణశక్తిని పెంచే అద్భుత హెర్బ్ . అందుకు మీరుచేయాల్సిందల్లా , అల్లంను టీ రూపంలో తీసుకోవడం . ఇది వికారం, బ్లోటింగ్, మరియు స్టొమక్ అప్ సెట్ ను నివారిస్తుంది.

నట్స్:

నట్స్:

నట్స్ లో నియాసిన్ కాంపౌడ్ మనకు అవసరం అయిన న్యూట్రీషియంట్స్ జీర్ణవ్యవస్థను యాక్టివ్ గా ఉంచడంలో గ్రేట్ గా సహాయపడుతుంది . పొట్టలో గ్యాస్ ను నివారించడానికి రోజులో అప్పుడప్పుడు నట్స్ తింటుండాలి. అంతే కాదు, తల్లికి అవసరం అయ్యే పోషకాలన్నీ ఈ నట్స్ ద్వారా పొందవచ్చు.

 అరటి:

అరటి:

అరటిపండులో ఫైబర్ అధికంగా ఉంది. అరటిపండ్లు మలబద్దానికి కారణమయ్యే గ్యాస్ మరియు కడుపుబ్బరాన్ని తగ్గిస్తాయి . కాబట్టి, అరటిపండ్లలో ఉండే పొటాషియం అనే మినిరల్స్ శరీరంలో ఫ్లూయిడ్ లెవల్స్ రెగ్యులేట్ చేస్తుంది. బ్లోటింగ్ నుండి ఉపశమనం కలిగిస్తుంది.

వ్యాయామం:

వ్యాయామం:

కడుపుబ్బరం నివారణకు మరో అద్భుతమైన మార్గం వ్యాయామం. నడక వల్ల గ్యాస్ సమస్యలను నివారించుకోవచ్చు. శరీరంలో చేరిన గ్యాస్ ను నివారించడంతో ప్రేగుల్లో ఒత్తిడిని పెంచి మరింత బెటర్ గా జీర్ణం అవ్వడానికి సహాయపడుతుంది.

English summary

Top Remedies For Bloating In Pregnancy

Bloating is one of the common problems women face during pregnancy. Bloating causes a lot of discomfort in the initial stages of pregnancy. Hormonal imbalance is said to be the main cause of bloating in pregnancy.
Story first published: Monday, April 18, 2016, 15:25 [IST]
Desktop Bottom Promotion