Latest Updates
-
బ్రేకప్ అయినా జ్ఞాపకాలతో తీరని వేదన.. మాజీ లవర్‌ను మరిచిపోవడం ఎలా.? -
ప్రొటీన్స్, ఫైబర్ గని..మీ పొట్టను కరిగించే గ్రీన్ దోశ..ఎలా చేసుకోవాలంటే -
ఎదిగే పిల్లల కోసం చింతాకు పప్పు.. రాయలసీమ స్టైల్లో ఇలా చేస్తే వావ్ అవ్వాల్సిందే.! -
ఈ ఆయిల్‌తో మసాజ్ చేస్తే నెల రోజుల్లోనే చిక్కటి కనుబొమ్మలు మీ సొంతం.! -
ఫ్యాట్ తక్కువ, ఎనర్జీ ఎక్కువ.. గుంటూరు స్పెషల్ వంకాయ ఇగురు పప్పు.! -
ఎండలో ఫేస్ ట్యాన్ అవుతుందా?.. ఈ నాలుగు పప్పులతో మెరిసే చర్మం మీ సొంతం.! -
శని గ్రహంశాపమా, వరమా? -
ఎలాంటి సాస్‌లు లేకుండా గోబీ 65.. ఇలా చేస్తే ఇక స్ట్రీట్ ఫుడ్ జోలికే వెళ్లరు.! -
చిన్న అబద్ధాలు నమ్మకాన్ని ఎలా నెమ్మదిగా కూల్చేస్తున్నాయి -
రామ్ చరణ్ ఫేవరెట్ ఇదే..చేపల పులుసు ఇలా చేస్తే తిరుగులేని టేస్ట్!
గర్భిణీలో దగ్గు, జలుబు నివారించే సులభ మార్గాలు..
ప్రతి ఒక్క మహిళకు తన జీవితంలో ప్రెగ్నెన్సీ చాలా ఎక్సైటింగ్ సమయం. మహిళ మొదటి సారి గర్భం పొందడం ఒక మధురానుభూతి. అనుభూతితో పాటు మనస్సులో అనేక అపోహాలు అందోళనలు . ఆహారాలు, జాగ్రత్తలు, మెడిసిన్స్ ఎలాంటివి తీసుకోవాలన్న ఆలోచనలు కలుగుతాయి. ముఖ్యంగా గర్భం పొందిన తర్వాత ఆరోగ్యం గురించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. గర్భధారణ 6నెలల్లో 2వ ట్రైమిస్టర్ పూర్తి అవుతుంది . ఆ తర్వాత అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన సమయం మూడవ టైమిస్ట్రర్స్ మొదలవుతుంది. ఈ సమయంలో గర్బంలోని బేబీని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి.
గర్భం పొందిన తర్వాత పొట్టలో పెరిగే బిడ్డకు ఒక కొత్త జీవితాన్ని అందివ్వడంలో తల్లి శరీరంలో వ్యాధినిరోధక శక్తిలోహెచ్చుతగ్గులుంటాయి . ఇలాంటప్పుడు బేబీ సురక్షితంగా ఉండటం చాలా అవసరం. ఈ సమయంలో కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ కు అంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కు, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. దగ్గు మరియు జలుబుకు కారణం అవుతుంది. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఎదుర్కొనే అత్యంత సాధారణ జబ్బుల్లో జలుబు దగ్గు ఒకటి.
గర్భధారణ సమయంలో జలుబు మరియు దగ్గు నుండి ఉపశమనం పొందడానికి నివారించుకోవడం ఎలా అని ఆందోళ చెందుతుంటారు. అందుకు హోం రెమెడీస్ గ్రేట్ గా సహాయపడుతాయి. గర్భధారణ సమయంలో డాక్టర్స్ సూచించన మెడిసిన్స్ ఉపయోగించడం వల్ల కొన్ని రకాల సైడ్ ఎఫెక్ట్స్ కు ఉంటాయి. అలాగే ఎలాంటి సెల్ఫ్ మెడికేషన్స్ ను ఉపయోగించకపోవడం మంచిది . ఇలా చేయడం వల్ల పొట్టలో పెరిగే బేబీకి హాని కలిగిస్తుంది.
జలుబు మరియు దగ్గు నివారించడానికి కొన్ని నేచురల్ రెమెడీస్ ఉపయోగపడుతాయి. అయితే కాస్త ఆలస్యం అయినా, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. . అయితే బిడ్డకు సురక్షితమో కాదో తెలుసుకొని మరీ వాడాలి. ఆరు నెలల్లో వచ్చే జలుబు మరియు దగ్గు నివారించడానికి కొన్ని సాధారణ హోం రెమెడీస్ ఏంటో తెలుసుకుందాం....

శరీరంను ఎప్పుడూ హైడ్రేషన్ లో పెట్టుకోవాలి:
శరీరం ఎప్పుడూ తేమగా ఉండేలా చూసుకోవాలి. జలుబు దగ్గుతో బాధపడే వారు రోజుకు కనీసం 10 గ్లాసుల నీళ్ళైనా తాగాలి . జలుబుతో బాధపడే వారు 12గ్లాసుల నీళ్ళు కూడా తాగొచ్చు.

స్టీమింగ్:
స్టీమింగ్ చాలా ఎఫెక్టివ్ మరియు నాజల్ బ్లాకేజ్ ను క్లియర్ చేయడానికి స్టీమింగ్ సిస్టమ్ ను సిఫారస్సు చేయబడినది. కానీ ఎలాంటి మందులైనా నీటిలో కలిసిపోతాయి, కాబట్టి డాక్టర్ ను కలవకుండా ఎలాంటి మెడిసిన్స్ స్టీమింగ్ చేసే హాట్ వాటర్లో మిక్స్ చేయకూడదు

సాల్ట్ వాటర్ తో గార్గిలింగ్ చేయాలి:
జలుబు ద్వారా గొంత నొప్పి కూడా వస్తుంది. దీన్ని ఉప్పునీటితో గార్గిలింగ్ చేయడం ద్వారా కొద్దిగా ఉపశమనం కలుగుతుంది. కొద్దిగా ఉప్పును గోరువెచ్చని నీటిలో మిక్స్ చేసి గొంతులో పోసి గార్గిలింగ్ చేయాలి. రోజూ మూడు సార్లు చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది. అలాగే ఆ నీటిలోనే రెండు మూడు వెల్లుల్లి రెబ్బలు వేయాలి.

గ్రీన్ వెజిటేబుల్స్ ఫ్రెష్ ఫ్రూట్స్ తినాలి:
మంచి పోషకాహారం తీసుకోవడం వల్ల తల్లి, బిడ్డ ఆరోగ్యానికి గ్రేట్ గా సహాయపడుతాయి . ఫ్రెష్ గా ఉండే వెజిటేబుల్స్ మరియు ఫ్రూట్స్ లో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి . ఇవి శరీరంలో కణాలను యాక్టివ్ గా మరియు హెల్తీగా స్ట్రాంగ్ గా ఉంచుతాయి. ఇన్ఫెక్షన్స్ తో పోరాడుతాయి.

రెస్ట్ :
గర్భణీలో దగ్గు జలుబు,వైరల్ ఇన్ఫెక్షన్స్ నివారించుకోవడానికి తగినంత విశ్రాంతి చాలా అవసరం . వైరల్ ఇన్ఫెక్షన్స్ నుండి త్వరగా కోలుకోవాలంటే తగినంత విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం.

సరైన శుభ్రత పాటించాలి:
గర్భధారణ సమయంలో సరైన శుభ్రతను పాటించడం చాలా అవసరం . దగ్గు జలుబుతో పోరాడే వారు ఎప్పుడూ హైజినిక్ గా ఉండాలి. దగ్గినప్పుడు, తుమ్మినిప్పుడు, చేతులు అడ్డుపెట్టుకోవాలి. అప్పటికప్పుడు చేతులు శుభ్రం చేసుకోవాలి.

సెలైన్ నాజల్ డ్రాప్స్:
జలుబు చేస్తే శ్వాసనాళాలు బ్లాక్ అవ్వడం వల్ల శ్వాస పీల్చడానికి కష్టంగా ఉంటుంది. కాబట్టి, సెలైన్ నాజల్ డ్రాప్ చాలా గ్రేట్ గా సహాయపడుతుంది. మరియు ఇది సురక్షితమైనది. ఇది బేబికి ఎలాంటి హాని కలిగించదు . ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు జలుబు మరియు దగ్గు నివారించడానికి దీన్ని ప్రయత్నించవచ్చు.

అల్లం టీ:
గర్భధారణ సమయంలో జలుబు మరియు దగ్గు నివారించడానికి అల్లం టీ మరో ఉత్తమ పద్దతి.ఇది సాధారణంగా వచ్చే జలుబును చాలా ఎఫెక్టివ్ గా నివారిస్తుంది . దీన్నీ రెగ్యులర్ గా త్రాగుతుంటే మూడు, నాలుగు రోజుల్లో ఉపశమనం కలిగిస్తుంది .

తేనె:
దగ్గు మరియు గొంతు నొప్పి నివారించడంలో తేనె ఆల్ టైమ్ ఫేవరెట్ . ఒక టీస్పూన్ తేనెను తీసుకొని నేరుగా తీసుకోవడం లేదా టీలో మిక్స్ చేసుకొని తీసుకోవడం మంచిది . అలాగే తేనె మరియు నిమ్మరసం తీసుకోవడం కూడా గర్భధారణ సమయంలో దగ్గు మరియు జలుబును తగ్గిస్తుంది.

పుదీనా
గర్భధారణ సమయంలో దగ్గు మరియు జలుబును ఎలా నివారించుకోవాలనుకుంటే, జలుబు, దగ్గకు పుదీనా ఒక బెస్ట్ నేచురల్ రెమెడీ . పుదీనాలో ఉండే మెంతాల్ గొంతు నొప్పి మరియు దగ్గును నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. పుదీనా రెగ్యులర్ డైట్ లో చేర్చుకొని ఆరోగ్యంగా ఉండవచ్చు!



Click it and Unblock the Notifications