Latest Updates
-
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు!
డేంజర్: టీ నేజ్ లో గర్భం దాల్చిడం వల్ల ఎదుర్కొనే మేజర్ సమస్యలు!!
గర్భధారణ అనేది ప్రతి స్త్రీకి ఒక వరం వంటిది. అయితే ఆ గర్భధారణ సరైన సమయంలో జరిగితేనే ఆరోగ్యానికి మంచిది. ఈ విషయంలో ఏదైన సమయాని కంటే ముందు జరిగిన మరియు ప్రకృతికి విరుద్దంగా జరిగినా అది తీవ్రంగా సమస్యలకు దారితీస్తుంది. టీనేజ్ ప్రెగ్నెన్సీ ప్రీటైమింగ్ మ్యాటర్.
పెళ్ళి తర్వాత గర్భధారణ ప్రతి స్త్రీ కళలు కనే ఒక అద్భుతం మార్పు. ఒక బిడ్డకు జన్మ నివ్వడం ఒక అదృష్టంగానే కాదు ఆ అనుభం చాలా అద్భుతంగా ఆస్వాదిస్తారు. అయితే అనుకోకుండా గర్భందాల్చిన , ఆ ఎంజాయ్ మెంట్ మరియు ఎక్సైట్ మెంట్ కొంత వరకూ తగ్గుతుంది.
నిజానికి, టీనేజ్ ప్రెగ్నెస్సీలో అనేక సమస్యలుంటాయి. టీనేజ్ లో గర్భందాల్చడం వల్ల తల్లికి మరియు బిడ్డకు కూడా చాలా ప్రమాధం. తల్లి, బిడ్డ ఫిజికల్ గా మరియు మెంటల్ గా సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుంది. మరో ప్రక్క సోషియల్ మరియు ఎకనామికల్ సమస్యలు కూడా ఎదుర్కోవల్సి వస్తుంది. చిన్న వయస్సులోనే మ్యారేజ్ చేయడం టీనేజ్ ప్రెగ్నెన్సీకి ఒక పెద్ద కారణం. చిన్న వయస్సులో ఉన్నప్పుడు గర్ల్స్ చాలా సంతోషంగా ఉంటారు, అయితే చిన్న వయస్సులోనే పెళ్ళి చేయడం ద్వారా పెళ్ళి తర్వాత వచ్చే సమస్యలన్నింటికి బాధ్యత వహించాల్సి వస్తుంది. చిన్నవయస్సులోనే రతిలో పాల్గొనడం వల్ల తల్లి మరియు బిడ్డలో సమస్యలకు దారితీస్తుంది.
అంతే కాదు కొంత మంది టీనేజ్ గర్ల్స్ అజాగ్రత్త వల్ల కూడా టీనేజ్ లోనే గర్భం పొందుతుంటారు. అందువల్ల టీనేజ్ లోనే వారు అనేక సమస్యలను ఎదుర్కోవల్సి వస్తుంది. అవేంటో మీరు తెలుసుకోవాలంటే ఈ క్రింది స్లైడ్ క్లిక్ చేయాల్సింది...

కాలేజిలకు వెళ్లడం మానేస్తుంటారు:
టీనేజ్ లోనే పెళ్ళిళ్లు చేయడం వల్ల కాలేజ్ లు మానేయడం, చదువును సగంలోనే ఆపేయడం వల్ల ఈ పరిస్థితి చాలా ఎక్కువగా ఉంటుంది. టీనేజ్ లో గర్భం పొందడం వల్ల అమ్మాయిలు సిగ్గుపడి, కాలేజ్ లకు వెళ్లడానికి భయపడి నిలిపేస్తుంటారు. కాబట్టి, ఒక రకంగా టీనేజ్ ప్రెగ్నెన్సీ అమ్మాయిల కెరీర్ ను దెబ్బతీస్తుందని చెప్పవచ్చు.

బేబీలో సమస్యలు:
తల్లిలోనే కాదు పుట్టే బిడ్డకూడా ప్రీమెచ్చుర్ ప్రెగ్నెన్సీ సమస్యలు పెరుగుతాయి. టీనేజ్ బాడీ ప్రెగ్నెన్సీకి సహకరించక పోవడం వల్ల గర్భధారణ సమయంలో కొన్ని సమస్యలు ఎదుర్కుంటారు. పుట్టినప్పుడు ఉండాల్సిన దాని కంటే తక్కువగా బరువు ఉన్నట్లైతే అది సాధారణ సమస్య. తరచూ వారు జాండిస్, మలేరియా వంటి సమస్యలను ఎదుర్కొంటారు. ముఖ్యంగా బిడ్డ సిక్ అయినప్పుడు బిడ్డ బాగోగుల చూసుకోవడానికి తగినంత శక్తి ఉండదు.

మానసిక సమస్యలు:
టీనేజ్ వయస్సులో గర్భం పొందడం వల్ల మానసిక సమస్యలు పెరగుతాయి. ఎక్కువగా స్ట్రెస్ కు గురి అవ్వడం. ముఖ్యంగా గర్భధారణ సమయంలో ఎక్కువ ఎమోషనల్ గా మరియు ఫిజికల్ గా స్ట్రెస్ కు గురి అవుతుంటారు . ఈ వయస్సులో సమస్యలను పరిష్కరించుకోగలిగిన సామర్థ్యం లేకపోవడం వల్ల సమస్యలు మరింత పెరుగుతాయి. మర తల్లిదండ్రులు, లేదా భర్త తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే మానిసిక సమస్యలు మరింత ఎక్కువ అయ్యే ప్రమాదం ఉంది .

ఇతర ఆరోగ్య సమస్య:
అడోలసెంట్ మదర్స్ టీనేజ్ ప్రెగ్నెన్సీలో అనేక హెల్త్ ప్రాబ్లెమ్స్ ఎదుర్కోవల్సి వస్తుంది . ముఖ్యంగా వారు వెయిట్ లాస్, అనీమియా, లైంగిక సమస్యలు, ఊబకాయం, మరియు మరికొన్ని ఇతర సమస్యలను ఎదుర్కోవల్సి వస్తుంది . ఇంకా తల్లి, ప్రసవ సమయంలో ఎక్కువ రక్తాన్ని కోల్పోవలసి వస్తుంది. ఇంకా టీనేజ్ ఉండే చెడు అలవాట్ల కారనంగా స్మోకింగ్, డ్రింకింగ్ కారణంగా, సైరన్ డైట్ ను అనుసరించకపోవడం వల్ల గర్భస్రావానికి దారితీస్తుంది.

ప్రీమెచ్యుర్ డెలివరీ:
టీనేజ్ ప్రెగ్నెన్సీ వల్ల మరో హెల్త్ సమస్య. టీనేజ్ అంటేనే అమ్మాయిలు శారీరకంగా ఎదుగుల అప్పుడే ప్రారంభమైన సమయం. భవిష్యత్తులో తల్లి కావడానికి రెడీ అవ్వడానికి సిద్దం అవ్వడానికి ఇది ప్రారంభ లక్షణాలు. కాబట్టి, అలాంటి పరిస్థితి చిన్న వయస్సులోనే వస్తే బిడ్డకు మరియు తల్లికి లైఫ్ రిస్క్ అవుతుంది.

హై బ్లడ్ ప్రెజర్:
టీనేజ్ లో ఎవరైనా గర్భం పొందితే, వారు కుంటుబంలో మరియు సమాజంలో ఎక్కవు సమస్యలను ఎదుర్కోవల్సి వస్తుంది . అది మనిషిలో హైపర్ టెన్షన్ మరియు బ్లడ్ ప్రెజర్ ను పెంచుతుంది 20నుండి 30 వయస్సు గల వారిలో ఎక్కువగా హైబిపిని ఎదుర్కోవల్సి వస్తుంది.

ఫైనాన్షియల్ కండీషన్:
టీనేజ్ ప్రెగ్నెన్సీలో అమ్మాయి మాత్రమే ఎక్కువ జాగ్రత్త తీసుకోవల్సి ఉంటుంది. అందువల్ల ఆమె ఫైనాన్షియల్ గా మరయు స్థిరంగా నిలబడుటకు కష్టం అవుతుంది. ఈ సమయంలో తగిన ఉద్యోగం దొరకడం కష్టం అవుతుంది. ఆత్మనూతనను కోల్పోవడం వల్ల డిప్రెషన్ కు గురి అవుతారు. క్లాస్ మేట్స్ సహాయం చేయకుండా, సలహాలనిస్తుంటారు. అన్ని రకాలుగా ఆమె సమస్యలను ఎదుర్కోవల్సి వస్తుంది.



Click it and Unblock the Notifications











