For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రెగ్నెన్సీ సమయంలో హెయిర్ ఫాల్ తగ్గించే ఎఫెక్టివ్ రెమెడీస్..!

|

మహిళలు గర్భధారణ పొండానికి, గర్భం పొందిన తర్వాత స్త్రీ శరీరంలో అనేక మార్పులు జరుగుతాయి. హార్మోనుల హెచ్చుతగ్గుల మార్పులు సాధరణం. ఈ హార్మోనుల ప్రభావం వల్ల అనేక శరీరంలో అనేక మార్పులతో పాటు గర్భిణీ స్త్రీలో అనేక సందేహాలు కూడా మొదలవుతాయి.

10 Effective Ways To Prevent Hair Fall During Pregnancy

ఎటువంటి ఆహారం తీసుకోవాలి. ఎలా ఉండాలి. కడుపు పెరిగే బిడ్డ సంరక్షణ, ప్రసవం, ప్రసవం తర్వాత ఆరోగ్యం, ప్రీనేటల్ వెయిట్, పోస్ట్ నేటల్ వెయిట్ ఇలా అన్నింటిలోనూ సందేహాలు మెదలువుతాయి. అలాగే గర్భధారణ సమయంలో ఏర్పడే స్ట్రెచ్ మార్క్ తొలగింపు, చర్మం సంరక్షణ, జుట్టు సంరక్షణ అన్నింటి గురించి సందేహాలతో పాటు వాటికి పరిష్కార మార్గాలు వెదకడం మొదలు పెడుతారు.

10 Effective Ways To Prevent Hair Fall During Pregnancy

గర్భం పొందిన తర్వాత హార్మోనుల ప్రభావం చేత చాలా మంది మహిళలో జుట్టు, గోళ్ళు వేగంగా పెరగడం గమనించవచ్చు. గర్భిణీ స్త్రీలు ఈ విషయాన్ని గమనించినట్లైతే, కొంత మందిలో జుట్టు రాలడం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కేశ సౌందర్యాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే ప్రసవం తర్వాత విటమిన్లు, క్యాల్షియం, ఐరన్ లోపం వల్ల తిరిగి జుట్టు రాలడం మొదలవుతుంది. కాబట్టి, గర్భధారణ సమయంలో జుట్టు సంరక్షణ చాలా క్లిష్టమైనది. గర్భధారణ సమయంలో జుట్టు సంరక్షణ కోసం కొన్ని చిట్కాలు మీకోసం....

ఆర్గానిక్ ప్రొడక్ట్స్ :

ఆర్గానిక్ ప్రొడక్ట్స్ :

నేచురల్ మరియు ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ను ఉపయోగించడం వల్ల హెయిర్ ఫాల్ ను తగ్గించుకోవచ్చు. తలలో స్కిన్ ఇన్ఫెక్షన్, అలర్జీల రియాక్షన్ తగ్గించడంలో నేచురల్ ప్రొడక్ట్స్ గ్రేట్ గా సహాయపడుతాయి.

ఆయిల్ మసాజ్ :

ఆయిల్ మసాజ్ :

కొబ్బరి నూనె, బాదం నూనె, ఆలివ్ లేదా మస్టర్డ్ ఆయిల్ ను గోరువెచ్చగాచేసి తలకు అప్లై చేసి మసాజ్ చేయడం వల్ల హెయిర్ ఫాల్ తగ్గుతుంది.

అలోవెర జెల్ :

అలోవెర జెల్ :

అలోవెర జెల్ చాలా అవరకూ అన్ని రకాల స్కిన్ సమస్యలను నివారిస్తుంది. అలోవెర జెల్ ను తలకు అప్లై చేసినప్పుడు, తలలో డ్రైనెస్, ఇన్ఫెక్షన్స్ ను తగ్గించి, హెయిర్ ఫాల్ తగ్గిస్తుంది.

ఆమ్లా:

ఆమ్లా:

జుట్టు రాలడం తగ్గించడంలో ఆమ్లా బెస్ట్ రెమెడీ. ఆమ్లా పౌడర్ ను ఓరల్ గా లేదా తలకు అప్లై చేయడం వల్ల హెయిర్ ఫాల్ తగ్గుతుంది.

యాంటీబ్యాక్టీరియల్ వేప:

యాంటీబ్యాక్టీరియల్ వేప:

హెయిర్ ఫాల్ తగ్గించడంలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కలిగి వేప ఆకును తలకు ఉపయోగించడం వల్ల తలలో ఎలాంటి ఇన్ఫెక్షన్ ఉన్నా తగ్గిస్తుంది. బ్యాక్టీరియా పెరగకుండా నివారిస్తుంది.

కోకనట్ మిల్క్ :

కోకనట్ మిల్క్ :

ఫ్రెష్ కోకనట్ మిల్క్ అరకప్పు తీసుకుని, పింగర్ టిప్స్ తో తలకు అప్లై చేసి మసాజ్ చేయాలి. అరగంట తర్వాత హెర్బల్ రెమెడీస్ తో తలస్నానం చేయాలి. ఫ్రెష్ మిల్క్ ను ఉపయోగించడం వల్ల హెయిర్ ఫాల్ తగ్గుతుంది.

ఆయిల్స్ :

ఆయిల్స్ :

ఒక టేబుల్ స్పూన్ ఆముదం, ఒక టీస్పూన్ ల్యావెండర్ ఆయిల్ మిక్స్ చేసి తలకు అప్లై చేయాలి. ఇలా చేస్తే స్కిన్ క్లియర్ అవుతుంది. హెయిర్ ఫాల్ తగ్గుతుంది.

లెమన్ జ్యూస్ :

లెమన్ జ్యూస్ :

ఒక గిన్నెలో లెమన్ జ్యూస్ తీసుకుని అందులో నిమ్మరసం మిక్స్ చేయాలి. దీన్ని తలకు అప్లై చేసి , అరగంట తర్వాత తలస్నానం చేయాలి.

మెంతులు :

మెంతులు :

రాత్రుల్లో నీళ్లలో మెంతులను నానబెట్టి, ఉదయం మెత్తగా పేస్ట్ చేసి, తలకు అప్లై చేసి మసాజ్ చేయాలి. మూడు నాలుగు గంటల తర్వాత తలస్నానం చేయాలి. ఇలా చేస్తుంటే తప్పకుండా హెయిర్ ఫాల్ తగ్గుతుంది.

పెరుగు, గుడ్డు, ఆలివ్ ఆియల్ :

పెరుగు, గుడ్డు, ఆలివ్ ఆియల్ :

పెరుగు, గుడ్డు, ఆలివ్ ఆయిల్ ను పేస్ట్ లా చేసి తలకు అప్లై చేసి, అరగంట తర్వాత తలస్నానం చేయాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తుంటే జుట్టు రాలడం తగ్గుతుంది. అలాగే జుట్టు కుదుళ్లు బలంగా తయారవుతాయి.

English summary

10 Effective Ways To Prevent Hair Fall During Pregnancy

10 Effective Ways To Prevent Hair Fall During Pregnancy,Home Remedies For Hair Fall During Pregnancy:Try out these simple solutions at home and see the difference.
Desktop Bottom Promotion