For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఖచ్చితంగా గర్భం పొందడానికి సహాయపడే 10 హెల్తీ ఫుడ్స్..!!

By Lekhaka
|

పిల్లలంటే ఇష్టమా..? పిల్లల కోసం ప్లానింగ్ లో ఉన్నారా? ఎన్ని రకాలుగా ప్రయత్నించినా, ట్రీట్మెంట్స్ తీసుకున్నా ఫలితం కనబడుట లేదని బాధపడేవారు చాలా మందే ఉంటారు. కన్సీవ్ అవ్వాలని ఒకసారి మీ మనస్సులోకి వచ్చిందంటే వెంటనే మీరు తీసుకోవల్సిన మొదటి స్టెప్. మీరు డైట్ ను చెక్ చేయాలి. లేదా మీరు తీసుకునే డైట్ లో మార్పులు చేసుకోవాలి. డైట్ లో మార్పులు చేసుకోవడం వల్ల బరువు పెరగరు కానీ, ఫెర్టిలిటిని పెంచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నేచురల్ గా గర్భం పొందడానికి సహాయపడుతాయి. హెల్తీబేబీ పుట్టడానికి సహాయపడుతాయి. గర్భం పొందిన తర్వాత ప్రతి ఒక్కరూ సలహాలిస్తుంటారు. ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి. ఎలాంటి ఆహారాలను తీసుకోకూడదని సలహాలిస్తుంటారు. కుంటుంబంలో జాగ్రత్తలు ఎక్కువగా చెబుతుంటారు. .

మహిళలైతే వారి అనుభావాలను పంచుకుంటుంటారు. వారు గర్భందాల్చినప్పుడు ఎలాంటి ఆహారాలు తినే వారు , గర్భం పొందడానికి ముందు నుండి ఎలాంటి ఆహారాలను తినే వారని చెబుతుంటారు. ప్రతి ఒక్కరూ చెప్పే విషయాలను విని మనస్సులో కొంచెం అందోళన కలగవచ్చు. అది గందరగోళానికి దారితీస్తుంది. కాబట్టి అందరు చెప్పింది గుడ్డిగా ఫాలో అవ్వకుండా, ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. కన్సీవ్ అవ్వడానికి సహాయపడే ఆహారాలనే ఎంపిక చేసుకోవాలి. తీసుకునే ఆహారాల్లో ఏవేవి ఉంటాయి, అవి కన్సీవ్ అవ్వడానికి ఏవిధంగా సహాయపడుతాయన్న విషయాలను ముందుగా తెలుసుకోవడం, అవగాహన చేసుకోవడం మంచిది.

పిల్లల కోసం ప్లానింగ్ లో ఉన్నవారు ఈ క్రింది లిస్ట్ లోని ఫుడ్స్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకవోడం వల్ల , ఇవి వ్యాధినిరోధకతను పెంచడంతో పాటు, గర్భం పొందే అవకాశాన్ని ఎక్కువ పెంచుతుంది. మరి ఆ ఆహారాలేంటో ఒకసారి తెలుసుకుందాం..

1. డార్క్ లీఫీ వెజిటేబుల్స్:

1. డార్క్ లీఫీ వెజిటేబుల్స్:

గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ లో ఆకుకూరలు, బ్రొకోలి, ఇతర గ్రీన్ లీఫ్ ఓవలేషన్ ను పెంచుతాయి. దాంతో గర్భం పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. గర్బం పొందాలనుకునే వారు ఈ పవర్ ప్యాక్ ఫుడ్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం మంచిది. వీటిలో యాంటీఆక్సిడెంట్స్, ఐరన్, ఫోలిక్ యాసిడ్స్ అధికంగా ఉంటాయి .రెగ్యులర్ గా గ్రీన్ లీఫ్ తినడం వల్ల పుట్టబోయే బిడ్డలో లోపాలుండవు. బేబీ డెవలప్ మెంట్ బాగుంటుంది. గ్రీన్ లీఫ్ ను సలాడ్స్, సూప్స్, సాండ్విచ్ రూపంలో తీసుకోవచ్చు.

2. బీన్స్ :

2. బీన్స్ :

ఫెర్టిలిటి పెంచే ఆహారాల్లో బీన్స్ కూడా ఒక సూపర్ ఫుడ్. లెంటిల్స్, శెనగలు, బ్లాక్ బీన్స్ మరియు సోయాబీన్స్ వంటి వాటిలో ఫైబర్, జింక్, ఫొల్లెట్, ప్రోటీన్, క్యాల్షియంలు ఎక్కువగా ఉంటాయి. అనిమల్ బేస్డ్ ప్రొడక్ట్స్ అయిన మాంసాహారంలో కూడా ఇవి ఎక్కువగా ఉంటాయి. ప్రోటీన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. అయితే ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్స్ ఫుడ్స్ బీన్స్ తినడం వల్ల సులభంగా జీర్ణం అవుతుంది. బీన్స్ ను సలాడ్స్, సాండ్విచ్, వెజిటేబుల్స్ కర్రీస్ తయారీలో జోడించవచ్చు.

3. పాలు :

3. పాలు :

డైరీ ప్రొడక్ట్స్ లో ఒకటి పాలు, గర్భం పొందడానికి ఇదొక బెస్ట్ ఫుడ్. ఇందులో క్యాల్షియం అధికంగా ఉంటుంది. ఫాస్సరస్ , విటమిన్ డి కూడా ఎక్కువగా ఉంటాయి. ఇవి పుట్టబోయే బేబీలో ఎముకల ఆరోగ్యానికి చాలా అవసరం. అయితే పరిమితంగా తీసుకోవాలి. పాలను మిల్క్ షేక్స్, ఫ్లేవర్డ్ లేదా ప్లెయిన్ గా కూడా తీసుకోవచ్చు. ఫ్రూట్స్ తో కలిపి తీసుకోవచ్చు.

4. గుడ్డు:

4. గుడ్డు:

గుడ్లలో అమినోయాసిడ్స్ అధికంగా ఉంటాయి. గర్భం పొందడానికి గుడ్డు కూడా సహాయపడుతాయి. గుడ్డలో ఉండే అమినో యాసిడ్స్ గర్భం పొందే ఛాన్సెస్ ను పెంచుతాయి. అయితే గుడ్లలో ఉండే ప్రోటీన్స్ ఫీమేల్ బాడీలో రీప్రొడక్టివ్ సిస్టమ్ ను యాక్టివ్ గా ఉంచుతాయి. గుడ్లను ఆమ్లెట్ , వాఫ్ లెస్, సాండ్విచ్, సలాడ్స్, స్ర్కాబుల్డ్ ఎగ్స్ రూపంలో తీసుకోవచ్చు.

5. బెర్రీస్ :

5. బెర్రీస్ :

బెర్రీస్ లో కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉంటాయి. ఇవి విటమిన్ సి, పొటాషియం, ఫొల్లెట్, ఫైబర్, ఫ్లూయిడ్స్ ఎక్కువ. ఓవరీస్ లో ఎగ్స్ సెల్స్ డ్యామేజ్ కాకుండా, బ్లాక్ కాకుండా నివారిస్తుంది. బెర్రీస్ ను స్మూతీస్ , సలాడ్స్, సెరల్స్ తో కలిపి తీసుకోవచ్చు.

6. బ్రౌన్ బ్రెడ్ :

6. బ్రౌన్ బ్రెడ్ :

కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉన్న ఆహారాలను తీసుకోవడంలో అనేక అపోహలుంటాయి. అందువల్ల, కార్బోహైడ్రేట్స్ ను అవాయిడ్ చేయడానికి వీల్లేదు. అందుకోసం, వైట్ బ్రెడ్ లేదా రైస్ కు బదులుగా త్రుణధాన్యాలతో తయారుచేసిన బ్రెడ్ ను ఎంపిక చేసుకోవాలి. కార్బోహైడ్రేట్స్ బ్లడ్ షుగర్ లెవల్స్, ఇన్సులిన్ ను లెవల్స్ మీద ప్రభావం చూపుతుంది. ఇన్సులిన్ లెవల్స్ బెటర్ గా ఉంటే, హార్మోన్స్ బ్యాలెన్స్ అవుతాయి. ఫెర్టిలిటిని మెరుగుపరుస్తుంది. గర్భం పొందడానికి ఇది కూడా ఒక బెస్ట్ ఫుడ్స్ అని చెప్పొచ్చు. దీన్ని బటర్, హనీ, టోస్ట్ రూపంలో తీసుకోవచ్చు..

7. డ్రై ఫ్రూట్స్ :

7. డ్రై ఫ్రూట్స్ :

బాదం, వాల్ నట్స్, పిస్తా, వంటి వాటిలో ప్రోటీన్స్, న్యూట్రీషియన్స్ ఎక్కువగా ఉంటాయి. వీటిలోఆరోగ్యానికి హాని కలిగించే ట్రాన్స్ ఫ్యాట్స్ లేదా శ్యాచురేటెడ్ ఫ్యాట్స్ తక్కువగా ఉంటాయి. ఇవి అమినో శ్యాచురేటెడ్ ఫ్యాట్స్ తో తయారుచేయబడినవి. అందుకే ఇవి గర్భం పొందే అవకాశాన్ని పెంచుతాయి. డ్రై ఫ్రూట్స్ లో విటమిన్ ఇ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి, వీటిని సలాడ్స్, స్నాక్స్ రూపంలో తీసుకోవడం మంచిది.

8. సాల్మన్ :

8. సాల్మన్ :

కన్సీవ్ అవ్వడానికి ముందు చేపలు తినడం మంచిది కాదు, ఇవి శరీరంలో వేడి కలిగిస్తాయని చెబుతుంటారు. ఇది నిజమే , అయితే షార్క్, స్వార్డ్ ఫిష్, కింగ్ మకెరల్ , టైల్ ఫిస్ వంటివి తినడం మంచిది కాదు.వీటిలో మెర్క్యురి ఎక్కువగా ఉంటుంది. ఇది సంవత్సరం పాటు శరీరంలో అలాగే ఉండిపోతాయి. వీటికి బదులు, సాల్మన్ ఫిష్ తినడం మంచిది. సాల్మన్ ఫిష్ లో ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉంటాయి.వీటిలో మెర్క్యురి తక్కువగా ఉంటుంది. సాల్మన్ ఫిష్, హార్మోన్స్ ను రెగ్యులేట్ చేస్తుంది. బ్లడ్ సర్క్యులేషన్ మెరుగుపరుస్తుంది. రీప్రొడక్టివ్ సిస్టమ్ ను ఆరోగ్యంగా ఉంచుతుంది. గర్భం పొందే ఛాన్సెస్ ను పెంచుతుంది. సాల్మన్ క్రోమోజోమ్స్ బ్రేక్ కాకుండా నివారిస్తుంది. దాంతో బర్త్ డిఫెక్ట్స్, గర్భస్రావం వంటివి జరగవు.

9. అరటి పండ్లు:

9. అరటి పండ్లు:

అరటిపండ్లలో విటమిన్ బి6 మరియు పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇవి సెక్స్ హార్మోన్స్ ను పెంచుతాయి. రెగ్యులర్ గా అరటిపండ్లు తినడం వల్ల పీరియడ్స్ రెగ్యులర్ గా ఉంటాయి. ఎగ్ డెవలప్ మెంట్ హెల్తీగా ఉంటుంది. ఇవి ఆహారాన్ని ఎనర్జీ రూపంలో మార్చుతుంది. కొత్తగా ఎర్ర రక్త కణాలు ఏర్పడుతాయి. బేబీ గ్రోత్ కు , కళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇంకా అనేక ప్రయోజనాలను అందిస్తుంది.

10 రెడ్ మీట్ :

10 రెడ్ మీట్ :

రెడ్ మీట్ లో ఐరన్ విటమిన్ బి12 ఎక్కువగా ఉంటుంది. ఇది అనీమియా నివారిస్తుంది. ఫెర్టిలిటి రిస్క్ ను తగ్గిస్తుంది. రెడ్ బ్లడ్ సెల్స్ ఉత్పత్తి చేయడంలో ముఖ్య పాత్రపోషిస్తుంది. నాడీవ్యవస్థను మెరుగుపరుస్తుంది. ఆర్గానిక్ రెడ్ మీట్ ను మాత్రమే , మితంగా తీసుకోవాలి..

English summary

10 Foods Which Can Improve Your Chances Of Getting Pregnant

One should not follow any suggestion blindly as it is essential to find out why the consumption of a particular food is helpful in conceiving. What are its contents and how to consume it?
Desktop Bottom Promotion