For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భధారణ సమయంలో రొమ్ములో మార్పులు: వారం నుండి వారంకి

By Lakshmi Bai Praharaju
|

స్త్రీలలో గర్భధారణ సమయంలో శరీరంలో గుర్తించలేని మార్పులు వస్తాయి. ఈ మార్పులు ప్రారంభంలో, నెలల సమయంలో, చివరికి డెలివరీ తరువాత కూడా జరుగుతాయి. తల్లులు ఈదశను తమ జీవితంలో ఎంతో కీలకంగా భావిస్తారు. గర్భం దాల్చిన దగ్గర నుండి శిశువు జన్మించే వరకు స్త్రీలు తమ శరీరంలో జరిగే మార్పులకు అనుగుణంగా శరీరం సిద్ధమవుతుంది. ప్రధాన పరివర్తన ఛాతీలో సంభవిస్తుంది. స్త్రీల రొమ్ముకు మరోపేరు క్షీర గ్రంధి. ఇది 'మమ్మ’ అనే లాటిన్ పదం నుండి ఉద్భవించింది.

Breast Changes During Pregnancy: Week by Week

నవజాత శిశువుల ఆహారానికి రొమ్ములు వాటికవే సిద్ధమవుతాయి. అందరికీ తెలిసిన ఒకేఒక అత్యంత సాధారణ విషయం ఏమిటంటే రొమ్ము పరిమాణం పెద్దదిగా మారడం. ఈ భారీ మార్పులకు అనుగుణంగా వందలకొద్దీ విషయాలు ఉన్నాయి, ఇది కొంతకాలం పాటు జరుగుతుంది, అకస్మాత్తుగా కాదు. ఈ మార్పు ప్రతి వారం జరుగుతుంది, దానిగురించి కింద వివరించబడింది.

1 నుండి 4 వ వారం

1 నుండి 4 వ వారం

1వ వారం గర్భంలో ఫాలిక్యులర్, గుడ్డు ఆండోత్సర్గ దశ. రొమ్ములో జరిగే మొదటి మార్పు పాల నాళాలు, అలియోలర్ బడ్స్ అభివృద్ది చెందడం. గుడ్డు ఫలదీకరణం చెందిన రెండవ వారంలో ఈమర్పులు ఎక్కువగా ఉంటాయి. మూడవ వారంలో ఛాతీ సున్నితంగా తయారవుతుంది, ఇది గర్భధారణకు మొట్టమొదటి చిహ్నంగా పరిగణించబడుతుంది. నాల్గవ వారంలో ఛాతీకి రక్తప్రసరణ పెరిగి, చనుమొనల చుట్టూ సున్నితత్వం ఏర్పడుతుంది. కాబట్టి, ఈ సమయంలో జలదరింపు, కొరికినట్టు ఉండే సంచలనం సర్వ సాధారణం. పాలు ఉత్పత్తి చేసే కణాల పునరుత్పత్తి వేగవంత౦గా జరుగుతుంది.

5 నుండి 8వ వారం

5 నుండి 8వ వారం

రొమ్ము కణాల నిర్మాణం పాల సరఫరాకు అనుకూలంగా భారీ మార్పుకు గురవుతుంది. ప్లజెంటల్ లాక్టోజెన్స్ అనే హార్మోన్లు ఛాతీతో అనుసంధానం అవుతాయి. గ్లా౦డులర్ టిష్యూ పెరుగుదలతో ఛాతీ నిండుగా ఉండడం వల్ల, స్త్రీ అసౌకర్యానికి గురవుతుంది. ఇది పాల వాహిక ఉబ్బడ౦ వల్ల కూడా జరుగుతుంది. చనుమొనల చుట్టూ ఉండే ప్రదేశం ముదురు రంగులోకి మారడం వల్ల, శిశువు పాలు తాగేటపుడు దాన్ని గుర్తించడానికి సహాయపడుతుంది. చనుమొనలు అసాధారణంగా బైటికిరావడం ప్రారంభమవుతాయి. ఇవన్నీ ఐదు, ఆరు వారాల మధ్య జరుగుతాయి. ఏడవ వారంలో, ఈస్త్రోజేన్ లేదా ప్రోజేస్త్రోజేన్ వల్ల రెండు రొమ్ముల బరువు దాదాపు 650 గ్రాములు పెరుగుతుంది. ఎనిమిదవ వారంలో ఛాతీ చర్మం కింద ‘మర్బ్లింగ్’ అని పిలవబడే మచ్చ ఏర్పడుతుంది. ఇది సిరలలో మంచి రక్తసరఫరా జరగడానికి మాత్రమే సహాయపడుతుంది. 4 , 28 మధ్య, మొంట్గోమేరీ ట్యుబెరకల్స్ అనే చిన్న గడ్డలు, చనుమొనలు చుట్టూ చేరి చర్మాన్ని మృదువుగా చేసి, బాక్తీరియని నిరోధిస్తుంది.

9 నుండి 12వ వారం

9 నుండి 12వ వారం

తొమ్మిదవ వారంలో రొమ్ము చుట్టుకొలత పెరిగి, నలుపుగా మారుతుంది. దానితోపాటు, రెండవ రొమ్ము కూడా పెరుగుతుంది. రొమ్ము చుట్టూ నల్లగా పెరిగేది తేలిక రంగుతో కూడిన కణజాలం మాత్రమే. రంగు తక్కువ ఉన్న స్త్రీలలో ఇది అంతగా కనిపించకపోవచ్చు. 10 వ వారం ఈ సమయంలో ప్రధానంగా రొమ్ము పెరగడం వల్ల పెద్ద బ్రా కోసం వెళ్ళే సమయం. 12వ వారంలో చనుమొనలు అణిగి ఉండడం జరుగుతుంది, ముఖ్యగా మొదటి సారి గర్భం దాల్చిన తల్లుల్లో గర్భ వృద్ది తోపాటు సరిదిద్దబడుతుంది.

13 నుండి 16వ వారం

13 నుండి 16వ వారం

13, 14 వారాలలో రక్తప్రసరణలో విరపీతమైన పెరుగుదల వస్తుంది. స్థానాలపై బుడిపెలు కూడా కనిపిస్తాయి. 16వ వారంలో రొమ్ము ఎక్కువ నాజూకుగా ఉంటుంది. ఈసమయంలో రొమ్ము నుండి స్ట్రా రంగు చిక్కని ద్రవం కనిపిస్తుంది. డెలివరీ తరువాత పాలు వచ్చేవరకు శిశువు ఈ ద్రవాన్నే తీసుకుంటాడు. కోలోస్ట్రం అని పిలవబడే ఈ ద్రవం శిశువుకు అవసరమైన పోషకాలను కలిగి ఉంటుంది. ఇది అవసరమైన రోగనిరోధక శక్తిని కూడా ఇస్తుంది. రక్తకణాల పెరుగుదల వల్ల రక్తం చుక్కలు కనిపిస్తాయి. ఇది చాలా సాధారణం కానీ ఇలాంటి సందర్భాలలో వైద్యుని సంప్రదించడం మంచిది.

17 నుండి 20వ వారం

17 నుండి 20వ వారం

18వ వారంలో రొమ్ములో కొవ్వు ఏర్పడుతుంది. కొంతమంది స్త్రీలలో రోమ్ములపై గడ్డలు కనిపించడం మొదలవుతుంది. ఈ గడ్డలలో సిస్ట్ లు, గలాక్టోసేల్స్, ఫైబ్రో డెనోమాస్ వంటి రకాలు కనిపిస్తాయి. చాలా కేసులలో, గడ్డలు నిరపాయ గ్రంధులు. 20 వ వారం లో చర్మంపై చారలు కనిపిస్తాయి. ముఖ్యంగా రొమ్ము కింది భాగంలో కనిపిస్తాయి. ఇది చర్మం సాగడం వల్ల ఏర్పడతాయి. కొంతమంది అదృష్టవంతులకు ఇలాంటివి ఏర్పడవు.

21 నుండి 24 వ వార౦

21 నుండి 24 వ వార౦

రొమ్ము పరిమాణం ఇంతకూ ముందుకంటే పెద్దగా అవుతుంది. కొత్త బ్రా కోసం షాపింగ్ చేయడం మంచి ఆలోచన. ఇతర మెటీరియల్స్ కంటే కాటన్ ని ఎంచుకోవడం మంచిది, ఎందుకంటే రొమ్ముపై కొవ్వు ఎక్కువ ఉండడం వల్ల చెమట బాగా ఏర్పడుతుంది కాబట్టి. కింద బిగుతుగా ఉండే బ్రా ల కంటే ఫ్రీ గా ఉండే వాటిని ఎంచుకోవాలి ఎందుకంటే నరాల్లో రక్తప్రసరణ స్వేచ్చగా జరిగేట్టు చూడడం మంచిదని సూచన.

25 నుండి 28 వ వారం

25 నుండి 28 వ వారం

26వ వారంలో, రొమ్ము నిండుగా అయి, కిందకు వాలతాయి. స్థాన్యంలో తరచుగా ద్రవం కారుతుండడం కనిపిస్తుంది. ఇది ప్రతి గర్భవతి లో జరుగదు. నిజానికి రొమ్ములు మీ బిడ్డ కోసం 27 వ వారంలో పాల ఉత్పత్తికి తయారవుతాయి. ప్రోజేస్తేరోన్ బిడ్డకు జన్మని ఇచ్చేవరకు పాలు బైటికి రాకుండా నిరోధిస్తుంది. 28వ వారంలో, చర్మ ఉపరితలం కింద రక్తకణాలు కనిపిస్తాయి, దానితోపాటు, చనుమొనల చుట్టూ రంగు, రక్తప్రసరణ పెరుగుతుంది. పాలనాళాలు పెరగడం ప్రారంభిస్తాయి.

29 నుండి 32వ వారం

29 నుండి 32వ వారం

రోమ్ములపై చెమట రాష్ లు ఏర్పడడం అనేది 30వ వారంలో జరిగే ఒక సమస్య. శ్లేష్మ పొరలు, రక్తనాళాలలో రక్తప్రసరణ అధికంగా జరగడం వల్ల ఇది ఏర్పడుతుంది. చెమట దద్దుర్ల వల్ల ఇన్ఫెక్షన్ రాకుండా చికిత్స చేయాలి. 32 వ వారంలో రొమ్ము చుట్టూ ఉన్న చర్మాన్ని మృదువుగా ఉంచే సెబం ద్రవంతో కూడిన చిన్న గడ్డలు ఏర్పడతాయి కాబట్టి, ఆసమయంలో రొమ్ముపై సబ్బును వాడకూడదు. స్ట్రెచ్ మార్క్స్ కూడా ఎక్కువ కనిపిస్తాయి.

33 నుండి 36వ వారం వరకు

33 నుండి 36వ వారం వరకు

సెబమ్ స్రావంతో పాటు, స్థానం కూడా చనుమొనలు దాటి బైటికిరావడం గుర్తిస్తాము. పెరిగిన దానికి ముందే ప్రోజేస్తోరోన్ చనుమొనలకు ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తుంది. పెరుగుదల మొత్తం ఈసమయంలోనే జరుగుతుంది కాబట్టి, 36వ వారంలో నర్సింగ్ బ్రా కొనుక్కోవచ్చు. పాల ఉత్పత్తి ప్రరంభమయినపుడు రొమ్ము పరిమాణం కొద్దిగా పెరిగి, తరువాత తిరిగి సాధారణ స్థితికి వస్తుందనే విషయాన్నీ కూడా అందరూ గ్రహించాలి. కాబట్టి, తెలివిగా సైజ్ ని ఎన్నుకోండి.

37 నుండి 40 వరకు

37 నుండి 40 వరకు

స్తన్యం ముదురు రంగు మారి, పసుపు రంగు నుండి పాలిపోయిన రంగులోకి మారుతుంది. రొమ్ములు 38 వ వారానికి పూర్తిగా అభివృద్ది చెందుతాయి. సంకోచాన్ని ప్రేరేపించే ఆక్సిటోసిన్ హార్మోను, ఛాతీని చేతితో కదిపినపుడు విడుదలవుతుంది.

English summary

Breast Changes During Pregnancy: Week by Week

Remarkable changes can be seen in the body during the phase of pregnancy in a woman. The only one most common thing that everyone knows is that the breast becomes bigger in size. There are hundreds of other things that cater to the massive change and it happens over a period of time, not all of a sudden. These changes
Desktop Bottom Promotion