For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హై ఇంటెన్సిటి వర్కౌట్స్ కారణంగా పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ తగ్గుతుందా..?

తరచుగా వ్యాయామం చేయడం అనేది ఈరోజుల్లో చాలామంది పురుషులకు తెలిసిన సాధారణ జ్ఞానం, దానివల్ల వారు బలంగా, ఆరోగ్యంగా, అందంగా కనిపిస్తారని భావన కదా? అయితే, అధిక తీవ్రంగా వ్యాయామం చేయడం వల్ల పురుషులలో స్పెర్మ

By Lekhaka
|

తరచుగా వ్యాయామం చేయడం అనేది ఈరోజుల్లో చాలామంది పురుషులకు తెలిసిన సాధారణ జ్ఞానం, దానివల్ల వారు బలంగా, ఆరోగ్యంగా, అందంగా కనిపిస్తారని భావన కదా? అయితే, అధిక తీవ్రంగా వ్యాయామం చేయడం వల్ల పురుషులలో స్పెర్మ్ కౌంట్ తగ్గుతుందా?

ఇప్పుడు, మనందరికీ తెలుసు, వ్యాయామం అనేది అత్యంత ఆరోగ్యకరమైన అలవాటు. నిజానికి, ప్రతిరోజూ వ్యాయామం చేయడం చాలా మంచిది, వ్యాయామం అనేక రకాల రోగాలకు నివారించి, మిమ్మల్ని బలవంతులుగా చేస్తుంది.

వ్యాయామాల వల్ల కలిగే ఆరోగ్యకర ప్రయోజనాల గురించి మనం మాట్లాడుకోవడం ప్రారంభిస్తే, అది అలా సాగుతూనే ఉంటుంది, అవునా?

అయితే, వారు చెప్పినట్టు, ఏదైనా మితిమీరితే చెడుకి దారితీస్తుంది. అందువల్ల, అధిక తీవ్రంగా వ్యాయామం చేయడం వల్ల పురుషులలో స్పెర్మ్ కౌంట్ తగ్గి సంతానోత్పత్తి సమస్యలకు దారితీస్తుందని ఇటీవల జరిగిన పరిశోధనలో వెల్లడైంది.

చాలామంది పురుషులు, కొంత వయసు వచ్చాక, కుటుంబం ప్రారంభించి పిల్లల గురించి ఆలోచిస్తారు. అయితే, మీ స్పెర్మ్ కౌంట్, వాటి నాణ్యత కు చెందిన కొన్ని విషయాలలో మీరు చాలా జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం.

అయితే, అధిక తీవ్రమైన వ్యాయామం స్పెర్మ్ కౌంట్ పై ప్రభావం ఎలా పడుతుంది? ఈ ఆర్టికిల్ లో ఆ విషయం గురించి తెలుసుకుందాం.

యదార్ధం #1

యదార్ధం #1

పరిశోధనా అధ్యయనాలు 25-40 మధ్య వయసు ఉన్న 261 ఆరోగ్యకర పెళ్ళైన పురుషులను చేర్చారు; వారు అధ్యయనాలకు విషయాలుగా పరిగానిన్చాబడ్డారు.

యదార్ధం #2

యదార్ధం #2

261 మందిని 2 గ్రూపులుగా విభజించారు. ఒక గ్రూపు అధిక తీవ్రతతో వ్యాయామం చేసేవారైతే, మరో గ్రూపు కేవలం ఒక మోస్తరు వ్యాయామాలు చేసేవారు.

యదార్ధం #3

యదార్ధం #3

12 వారాల్లో, ఒక మోస్తరు వ్యాయామం చేసేవారు ప్రతిరోజూ దాదాపు 35 నిముషాలు ట్రెడ్మిల్ మీద జాగింగ్ లేదా నడుస్తారు.

యదార్ధం #4

యదార్ధం #4

12 వారాలకి, ప్రతిరోజూ దాదాపు 50-60 నిమిషాలపాటు ట్రెడ్మిల్ మీద ఎక్కువ వేగంతో రన్నింగ్ చేస్తూ తీవ్రమైన వ్యాయామాలు చేస్తారు.

యదార్ధం #5

యదార్ధం #5

12 వారాల చివర, వీర్య విశ్లేషణ నిర్వహించబడుతుంది, ఈ రెండు గ్రూపుల పురుషుల నుండి వీర్య నమూనాలను సేకరించిన తరువాత, లేబొరేటరీ వద్ద వారి స్పెర్మ్ కౌంట్ పరీక్షిస్తారు.

యదార్ధం #6

యదార్ధం #6

వీర్య విశ్లేషణ తరువాత, ఎక్కువ తీవ్రతతో వ్యాయామం చేసిన వారి స్పెర్మ్ కౌంట్ వేరే గ్రూప్ వారితో పోలిస్తే చాలా తక్కువగా ఉందని పరిశోధకులు గుర్తించారు.

యదార్ధం #7

యదార్ధం #7

అయితే ఆ గ్రూపులో ఉన్న పురుషులందరి స్పెర్మ్ కౌంట్ తగ్గలేదు, 45% కంటే ఎక్కువమంది సభ్యుల్లో మాత్రమే ఆమార్పు కనపడింది.

యదార్ధం #8

యదార్ధం #8

ఎక్కువ తీవ్రతతో వ్యాయామం చేసిన పురుషులలో పోషకాలు, బరువు బాగా తగ్గడం వల్ల స్పెర్మ్ కౌంట్ తగ్గిందని పరిశోధకులు తమ అభిప్రాయాన్ని వెల్లడించారు.

English summary

Can High Intensity Workout Reduce Sperm Count In Men?

It is common knowledge that most men these days, tend to workout often, so that they can remain fit, healthy and looking great, right? Well, can high intensity workout reduce the sperm count?
Story first published: Friday, January 20, 2017, 16:43 [IST]
Desktop Bottom Promotion