For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భిణీలో డిప్రెషన్ లక్షణాలు, డిప్రెషన్ తగ్గడానికి నేచురల్ మార్గాలు

|

గర్భిణీతో ఉన్నప్పుడు 100లో పదిమంది అనేక రకాల తీవ్రతతో డిప్రెషన్‌లోకి వెళ్తారు. ఈ సమయంలో హార్మోన్ల మార్పుల వల్ల, శారీరక మార్పుల వల్ల, గర్భం పెరిగేకొలదీ కలిగే అసౌకర్యం, నొప్పులు, గర్భధారణ మీద భయం, అపోహలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ముందు గర్భంలో వచ్చిన సమస్యల వల్ల, ఇలా అనేక కారణాల వల్ల, కొందరు గర్భిణీలలో డిప్రెషన్‌ కొద్దిగా నుంచి తీవ్రంగా వచ్చే అవకాశాలు ఉంటాయి.

దీనివల్ల దేనిమీద ఆసక్తి లేకపోవటం, కోపం, భయం, ఏడుపు, ఎవరితో మాట్లాడకపోవటం, నిద్రలేకపోవటం, లేక అతిగా నిద్రపోవటం, ఆహారం సరిగా తీసుకోకపోవటం, లేక అతిగా తినడం వంటి ఎన్నో లక్షణాలు ఉండవచ్చు. దీనివల్ల కడుపులో బిడ్డ సరిగా పెరగకపోవటం, కొన్నిసార్లు పుట్టిన బిడ్డ మానసిక ఎదుగుదలలో లోపాలు తలెత్తే సమస్యలు ఉంటాయి. దీనికి చికిత్సలో భాగంగా మొదట కుటుంబసభ్యులు ఈ లక్షణాలని గుర్తించగలగాలి.

 గర్భిణీలలో డిప్రెషన్‌

ఈ సమయంలో వీరికి కుటుంబసభ్యుల మద్దతు ఎంతగానో అవసరం. వారిలో ప్రేమగా మాట్లాడాలి, ఎక్కువ సమయం గడపాలి, బయట చల్లగాలికి వాకింగ్‌కు తీసుకువెళ్లటం, వాళ్లకి నచ్చిన ప్రదేశాలకు తీసుకువెళ్లటం, ప్రాణాయామం, మెడిటేషన్‌ చెయ్యించటం వంటి వాటివల్ల చాలావరకు ఈ లక్షణాలకు ఉపశమనం కలుగుతుంది. ఇంకా కూడా లక్షణాలు తీవ్రంగా ఉన్నప్పుడు, డాక్టర్‌ని సంప్రదించి వారి పర్యవేక్షణలో యాంటి డిప్రెసెంట్‌ మందులు వాడవలసి ఉంటుంది. అయితే వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కాబట్టి, న్యేచురల్ పద్దతిలో గర్భిణీల్లో డిప్రెషన్ తగ్గించుకోవడానికి కొన్ని మార్గాలు

1. వ్యాయామం :

1. వ్యాయామం :

గర్భిణీలు వ్యాయామం చేయడం వల్ల న్యేచురల్ గా శరీరంలో సెరోటిన్ లెవల్స్ పెరుగుతాయి. అలాగే కార్టిసోల్ లెవల్స్ కూడా తగ్గుతాయి.

2. తగిన విశ్రాంతి తీసుకోవలి:

2. తగిన విశ్రాంతి తీసుకోవలి:

నిద్రలేమి వల్ల శరీరం మరియు మనస్సు మీద ఎక్కువ ఒత్తిడి పెరుగుతుంది. ఇలాంటి స్ట్రెస్ ను రోజురోజూకు హ్యాండిల్ చేయడం చాలా కష్టం. కాబట్టి ఒత్తిడి పెంచుకోకుండా ఎప్పటికప్పడు విశ్రాంతి తీసుకోవడం, స్ట్రెస్ తగ్గించుకోవడం చేయాలి. రోజుకు సరిపడా నిద్రపోవాలి. అలాగో రోజూ ఒక సమయానికి నిద్రపోవాలి.

3. డైట్ అండ్ న్యూట్రీషియన్:

3. డైట్ అండ్ న్యూట్రీషియన్:

చాలా ఆహారాలు మూడ్ కు సంబంధిచినవై ఉంటాయి. కొన్ని ఆహారాలు స్ట్రెస్ ను పెంచుతాయి . మానసిక ప్రశాంతతకు అంతరాయం కలిగిస్తాయి. అలాంటి వాటాలో కెఫిన్, షుగర్స్, ప్రొసెస్ చేసిన ఆహారాలు, కార్బోహైడ్రేట్స్, ఆర్టిఫిషియల్ ఆడిటివ్స్, లోప్రోటీన్స్ మానసి, శరీరక ఆరోగ్యం మీద ప్రభావం చూపుతాయి. కాబట్టి, గర్భిణీ తీసుకునే ప్రతి ఆహారం మీద ప్రత్యేక శ్రద్ద, అవగాహన కలిగి ఉండాలి.

4. ఆక్యుపంక్చర్:

4. ఆక్యుపంక్చర్:

గర్భిణీ స్త్రీలలో డిప్రెషన్ తగ్గించడానికి ఆక్యుపంక్చర్ సహాయపడుతుందని రీసెంట్ స్టడీస్ ద్వారా కనుగొన్నారు.

5. ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్:

5. ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్:

ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మన ఆరోగ్యానికి ఏవిధంగా సహాయపడుతుందో మనందరికీ తెలసిన విషయమే. అయితే రీసెంట్ స్టడీ ప్రకారం ఓమేగా 3 ఫ్యాటీయాసిడ్స్ సప్లిమెంట్ ను రోజూ తీసుకోవడం వల్ల డిప్రెషన్ లక్షణాలను నివారిస్తుంది.

English summary

Depression During Pregnancy and Natural Ways to Treat Depression in Pregnancy Telugu

Depression During Pregnancy and Natural Ways to Treat Depression in Pregnancy, take a look..
Story first published: Monday, June 19, 2017, 13:18 [IST]
Desktop Bottom Promotion