For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఒక పరిశోధన ప్రకారం, గర్భం వచ్చే అవకాశాలను మెరుగుపరిచే ఒక ఉత్తమమైన మార్గం కలదు.

మద్యపానమును ఏ రకంగానైనా తీసుకోవడం వలన, అది మీ ఆరోగ్యానికి హానికరంగా మారుతుందని చాలామంది ప్రజలు చెప్పినట్లుగా మీరు విన్నారు, కాని ఒక కొత్త పరిశోధన ప్రకారం, రెడ్-వైన్ను అప్పుడప్పుడు ఒక గ్లాసు మోతాదులో త

|

మద్యపానమును ఏ రకంగానైనా తీసుకోవడం వలన, అది మీ ఆరోగ్యానికి హానికరంగా మారుతుందని చాలామంది ప్రజలు చెప్పినట్లుగా మీరు విన్నారు, కాని ఒక కొత్త పరిశోధన ప్రకారం, రెడ్-వైన్ను అప్పుడప్పుడు ఒక గ్లాసు మోతాదులో త్రాగడం వలన మీకు సహాయపడగలదని ఒక సూచన ప్రాయమైన సలహాగా చెప్పవచ్చును.

ఇది మీకు ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు, కానీ ప్రతి వారంలో ఒకసారి రెడ్-వైన్ను త్రాగడం వలన గర్భం వచ్చే అవకాశాలను మరింత మెరుగుపడగలవని ఒక కొత్త అధ్యయనంలో కనుగొనబడినది. ఏదేమైనప్పటికీ, రెడ్ వైన్ను ఎక్కువ త్రాగడం వల్ల అది హానికరంగా మారిపోతుందని ప్రతీ ఒకరు అర్థం చేసుకోవాలి.

US లో వాషింగ్టన్ యూనివర్సిటీ పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో, ఎప్పటికప్పుడు రెడ్-వైన్ తాగుతూ ఉండే స్త్రీలలో మంచి అండాశయ నిల్వలను కలిగి ఉంటాయని కనుగొన్నారు - ఏ సమయంలోనైనా విడుదలయ్యేందుకు సిద్ధంగా ఉన్న గుడ్ల పరిమాణాన్ని అండాశయం కలిగి ఉంటుంది.

health benefits of red wine

ఈ అధ్యయనం సమయంలో, పరిశోధకులు 18-44 సంవత్సరాల వయస్సులో ఉన్న 135 మంది మహిళలను పరిగణనలోకి తీసుకున్నారు. ఇందులో పాల్గొనే వారి రెడ్-వైన్ తీసుకోబడిన ట్రాక్ యొక్క సమాచారాన్ని ఉంచాలని కోరారు.

ఈ అధ్యయనం సమయంలో, ప్రతి మహిళ యొక్క యాంటల్ ఫోలికల్స్ను లెక్కించడానికి పరిశోధకులు అల్ట్రాసౌండ్ స్కానర్లను ఉపయోగించారు, ఇది ఆమె భవిష్యత్తు కోసం కలిగి ఉన్న గుడ్లు సంఖ్యను గుర్తిస్తుంది.

ఈ పరిశోధనలో, ఒక మాసం (నెల)లో రెడ్-వైన్ను ఐదు కన్నా ఎక్కువ సార్లు తీసుకున్నవారిలో అధికముగా అండాశయాల నిల్వలను కలిగి ఉన్నట్లుగా అనుభూతిని పొందారు ఎందుకంటే, ఇది మహిళల పునరుత్పత్తి యొక్క ఆరోగ్యానికి సంబంధించిన కొలమానము.

ఇంతలో వైట్-వైన్, బీర్ మరియు స్పిరిట్ వంటివి అధిక సంతానోత్పత్తి అవకాశాలను కలిగి లేదని - పరిశోధకులు సూచించారు.

ఇక్కడ రెడ్-వైన్ను త్రాగటం వల్ల కలిగే ఇతర ప్రయోజనాల గూర్చి చెప్పబడి ఉన్నాయి. అవేమిటో మీరు ఒకసారి చూడండి.

1. గుండెకు చాలా మంచిది :

1. గుండెకు చాలా మంచిది :

రెడ్-వైన్లో పాలీఫెనోల్స్, రెస్వెట్రాల్ మరియు క్వెర్సిటిన్ వంటి సమ్మేళనాలను కలిగి ఉండి, హృద్రోగాల నుండి రక్షించే లక్షణాలను కలిగి ఉంటాయి. క్వెర్సిటిన్ సమ్మేళనం రక్తపోటును నియంత్రిస్తుంది మరియు దానికి కారణమయ్యే ఆక్సీకరణం యొక్క ఒత్తిడిని నిరోధించడానికి సహాయపడుతుంది అందువలన, గుండె ఆరోగ్యాన్ని పెంచేదిగా సహాయపడుతుంది.

పరిమితమైన మొత్తంలో రెడ్-వైన్ను త్రాగటం వల్ల మీ హృదయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుందని అనేక అధ్యయనాలు తెలియజేస్తున్నాయి.

2. కొలెస్ట్రాల్ను మెరుగుపరచడానికి సహాయకారిగా ఉంటుంది :

2. కొలెస్ట్రాల్ను మెరుగుపరచడానికి సహాయకారిగా ఉంటుంది :

రెడ్-వైన్లో ఉన్న రెస్వెట్రాల్ సమ్మేళనం ఫలితంగా, తక్కువ-సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ (LDL) తగ్గించడానికి (లేదా) రక్తాన్ని గడ్డకట్టించే చెడు కొలెస్ట్రాల్ను నిరోధిస్తుంది.

ఏది ఏమయినప్పటికీ, ఒక మితమైన స్థాయిలో ఈ మద్యాన్ని త్రాగటం వల్ల మాత్రమే అధిక ప్రయోజనాలను పొందవచ్చు - అలా కాకుండా ఎక్కువ స్థాయిలో తీసుకోవడం వల్ల మీ ఆరోగ్యానికి హానికరంగా మారుతుందని గుర్తుంచుకోండి.

3. డయాబెటిస్ నివారణకు సహాయకారి :

3. డయాబెటిస్ నివారణకు సహాయకారి :

రెడ్-వైన్ మితమైన స్థాయిలో త్రాగటం వల్ల శరీరంలో ఉన్న గ్లూకోజ్ స్థాయిలను నెమ్మదించేలా చేసేందుకు సహాయపడుతుంది మరియు రక్తంలో ఉన్న చక్కెర స్థాయిలను పెరగకుండా నిరోధిస్తుంది. గ్లూకోజ్ సంగ్రహణను ప్రేరేపించే ఎంజైమ్ యొక్క చర్యను నిరోధించడానికి రెడ్-వైన్ సహాయపడుతుంది, దీని వలన మధుమేహం నివారించబడుతుంది.

4. బరువు పెరుగుటను నిరోధిస్తుంది :

4. బరువు పెరుగుటను నిరోధిస్తుంది :

రెడ్-వైన్, పిసిటానాన్నో అనే సమ్మేళనాన్ని కలిగి ఉంటుంది, ఇది కొవ్వు కణాలను నాశనం చేయడంలో మరియు అభివృద్ధి చెందని కండరాల కణాల సామర్థ్యాన్ని నిరోధించడానికి సహాయపడుతుంది. ఒక గ్లాస్ మోతాదులో అప్పుడప్పుడు ఈ రెడ్-వైన్ను తీసుకోవడం వల్ల బరువు పెరగకుండా ఉండుటకు మరియు స్థూలకాయాన్ని నిరోధించడానికి సహాయపడుతుంది.

5. అల్జీమర్స్ వ్యాధి నివారించేదిగా :

5. అల్జీమర్స్ వ్యాధి నివారించేదిగా :

రెడ్ వైన్లో ఉండే రెస్వెట్రాల్ సమ్మేళనం అల్జీమర్స్ వ్యాధిని నివారించడంలో సహాయపడుతుంది మరియు చిత్తవైకల్యం ( జ్ఞాపక శక్తికి మూలమైన వ్యాధి) యొక్క పురోగతిని తగ్గిస్తుంది. ప్రస్తుత తరం వారు ఈ రెడ్-వైన్ను త్రాగటం వలన జ్ఞాపకశక్తి మందగించే ముప్పును తగ్గించటానికి సహాయపడుతుందని అనేక అధ్యయనాలు తెలియజేశాయి.

English summary

One Best Way To Improve Pregnancy Chances According To A Research

A new study has found that drinking a glass of red wine every week helps to improve your chances of pregnancy. However, one should understand that if one drinks too much of red wine then it could turn harmful. Red wine is also good for the heart, helps prevent cholesterol, prevent diabetes and weight gain as well.
Desktop Bottom Promotion