For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భధారణ సమయంలో చేపలను తినడం చాలా మంచిదని పరిశోధనలో వెల్లడైంది.

|

చాలామంది ప్రజలు చేపలను తినడం అనారోగ్యంగా భావిస్తారు ముఖ్యంగా వర్షాకాలంలో వినియోగించడాన్ని ! మీరు చేపలను వినియోగించడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు పుష్కలంగా ఉన్నాయని తెలుసుకోవటం మిమ్మల్ని భయపెట్టవచ్చు.

గర్భధారణ సమయంలో చేపలను తినే మహిళలు తమ గర్భంలో ఉన్న శిశువులకు ఆస్తమా అనేది వృద్ధి చెందడం నుండి రక్షించే అవకాశాలు ఉన్నాయని ఒక కొత్త పరిశోధనలో కనుగొనబడింది.

చేపలలో తక్కువ కొవ్వును, మంచి కొవ్వుగా పిలవబడే "ఒమెగా-3 కొవ్వు ఆమ్లాలను" కలిగి ఉంటుంది. అలాగే విటమిన్-డి మరియు బి-2 (రిబోఫ్లావిన్), కాల్షియం మరియు భాస్వరం వంటి విటమిన్లు సమృద్ధిగా కలిగి ఉన్నాయి. మరియు ఐరన్, జింక్, అయోడిన్, మెగ్నీషియం, మరియు పొటాషియం వంటి ఖనిజాలకు గొప్ప మూలపదార్థంగా చేపలు ఉన్నాయి.

వారానికి కనీసం 2 సార్లు చేపలను తినటం వల్ల రక్తపోటును తగ్గిస్తుంది మరియు గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

US లో ఉన్న దక్షిణ ఫ్లోరిడా విశ్వవిద్యాలయ పరిశోధకులు నిర్వహించిన రెండు అధ్యయనాలను సమీక్షించారు. అలా అధ్యయనం చేసిన తరువాత గర్భధారణను కలిగి వున్న స్త్రీలు వారి మూడో త్రైమాసికంలో రోజువారీగా అధిక మోతాదులో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లను తినడం వల్ల, వారి పిల్లలలో శ్వాస సమస్యలు ఎదురయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి.

వారి అధ్యయనం కోసం, మూడవ త్రైమాసికంలో ఉన్న 346 గర్భిణీ స్త్రీలను పరిగణనలోకి తీసుకున్నారు. ఈ మహిళలు ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలను ప్రతిరోజూ తీసుకోగా, మరొక 349 మందికి స్త్రీలు మాత్రం ఒక ప్లాసిబోను తీసుకున్నారు. పరిశోధకులు ఒమేగా -3 కొవ్వు ఆమ్లాల యొక్క వారి రక్త స్థాయిల ఆధారంగా ఆ పరిశోధనలో ఉన్న మహిళలను మూడు బృందాలుగా విభజించారు.

అత్యల్ప రక్తం స్థాయిలను కలిగి ఉన్న మహిళలు, చేప నూనెను భర్తీ చెయ్యడం నుండి చాలా రకాల ప్రయోజనాలను పొందారు.

మరొక అధ్యయనంలో, పరిశోధకులు మూడవ త్రైమాసికంలో ఉన్న గర్భిణీ స్త్రీలను - చేపల నూనె, ప్లాసిబో మరియు "నో ఆయిల్" అనే 3 రకాల యాదృచ్ఛిక సమూహాలుగా వేరు చేశారు. చేపల నూనె సమూహం ప్లాసిబో (ఆలివ్ నూనె) సమూహం వలె ప్రతిరోజూ ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలను తీసుకుంది. "నో ఆయిల్" సమూహం వారు ఎంచుకున్నట్లుగా మూడవ త్రైమాసికంలో చేపల నూనెను (లేదా) చేపను తినవచ్చని విచారణ ప్రతిపాదనలో ఒక భాగంగా తెలుపబడినది.

పరిశోధన సమయంలో, చేపల నూనెను మరియు "నో ఆయిల్" సమూహాలు వాళ్ళ- 24 ఏళ్ల వయస్సులోనే తక్కువ ఆస్తమా మందులని తీసుకున్నారని కనుగొన్నారు, ఈ రెండు వర్గాలు తక్కువగా ఉబ్బసమును మాత్రమే వృద్ధి చెంది ఉన్నారు.

"ఒక వారంలో 8-12 ఔన్సుల చేపలను (లేదా) 2-3 చేపలను (కొంచెం ఎక్కువ ఖర్చుతో కూడుకున్నదే అయినప్పటికీ) తీసుకోవడం వల్ల, అది ఆస్త్మా నుండి తగిన రక్షణను కలిగించడమే కాకుండా, కడుపులో వున్న శిశువు పెరుగుదల మరియు అభివృద్ధికి సహాయపడే ప్రయోజనకరమైన పోషకాలను బలపరుస్తుంది" అని పరిశోధకుడు రిచర్డ్ లాకే చెప్పాడు.

ఇక్కడ ఆస్తమాని నివారించడానికి కొన్ని ఉత్తమమైన సహజ మార్గాలు గురించి వివరించబడి ఉన్నాయి, వాటిని తెలుసుకోవడం కోసం ఈ క్రింది విశేషాలను చదవండి.

1. అల్లం :

1. అల్లం :

అల్లమును, శోథ నిరోధక లక్షణాలను కలిగిన మూలపదార్థంగా పిలుస్తారు. మీరు చెయ్యాల్సినదల్లా కొన్ని అల్లం ముక్కలను తీసుకొని, దానిని మెత్తగా నూరి, అలా వచ్చిన ముద్దను పిండి, రసాన్ని వేరు చేయాలి. ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు, ఒక టీ-స్పూను అల్లం రసాన్ని - సగం కప్పతో ఉన్న నీటితో కలిపి, తీసుకోవాలి. ఈ విధంగా ప్రతి రోజూ చేయడం వలన మీకు అనేక రకాల ప్రయోజనాలను కలిగిస్తుంది.

2. వెల్లుల్లి :

2. వెల్లుల్లి :

కొన్ని వెల్లుల్లి లవంగాలను తీసుకోండి, సగం కప్పు పాలలో వీటిని వేసి బాగా మరిగించండి. అలా తయారైన మిశ్రమాన్ని చల్లార్చిన తర్వాత ఇలా తయారైన వెళ్ళి పాలను శరీరంలోకి అనుమతించేందుకు ఈ పాలను త్రాగండి. ఇది మీ ఊపిరితిత్తులలో ఉన్న రక్త చలన దోషమును తీసేయడమే కాకుండా, ఆస్త్మాను తగ్గించడంలోనూ సహాయపడుతుంది.

3. యూకలిప్టస్ ఆయిల్:

3. యూకలిప్టస్ ఆయిల్:

యూకలిప్టస్ ఆయిల్ అనేది శ్లేష్మపొరలో ఉన్న అడ్డంకులను తొలగించేదిగిగా ఉన్నట్లు తెలుస్తుంది. మీరు చేయవలసినదల్లా :- ఒక గిన్నె వేడి నీటిలో కొన్ని చుక్కల యూకలిప్టస్ నూనెను చేర్చండి. అలా తయారైన పానీయం నుండి మీరు ఆవిరిని పీల్చడం (లేదా) లోతైన శ్వాసను తీసుకోవటానికి ప్రయత్నించండి. ఇది ఆస్తమాను తగ్గించడానికి సహాయపడుతుంది.

English summary

Eating Fish During Pregnancy Is Good, Finds Research

Fish contains omega-3 fatty acids or what is known as the good fat. Also fish is rich in vitamins such as D and B2, calcium and phosphorus and is also a great source of minerals, such as iron, zinc, iodine, magnesium, and potassium. A new research has found that women who consume fish during pregnancy are likely to protect their
Story first published: Sunday, December 24, 2017, 17:00 [IST]