రాశులను బట్టీ గర్భిణీల అనుభూతులు

By Bharath Reddy

ప్రెగ్నెన్సీ అనే గుడ్ న్యూస్ తెలియగానే మహిళలు ఆనందంగా ఫీలవుతారు. అయితే గర్భిణీలు ఆ తొమ్మిది నెలల కాలంలో కొన్ని అనుభూతులు మధురానుభూతులతో హ్యాపీగా గడుపుతారు.

గర్భాధారణను ప్రతి స్త్రీ చాల హ్యాపీగా ఫీలవుతుది. ఆ విషయాన్ని మాటల్లోగానీ, రాతల్లో గానీ చెప్పలేం. అది అనుభవించే వాళ్లకే తెలుస్తుంది.

how pregnancy feels

గర్భాన్ని అసౌకర్యంగా ఫీలవుతారా ? గర్భాధారణపై మీ అభిప్రాయం ఏమిటని మహిళల్ని అడిగితే ఒక్కొక్కరి నుంచి ఒక్కో సమాధానం వస్తుంది. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కో రీతిగా ఆ సమయాన్ని ఫీలవుతారు.

వారివారి రాశులను బట్టీ గర్భిణీలు ప్రెగ్నెన్సీ సమయంలో ఏవిధంగా ఫీలవుతారో తెలుసుకుందామా.

మేషం (మార్చి 21 - ఏప్రిల్ 19)

మేషం (మార్చి 21 - ఏప్రిల్ 19)

ఈ రాశి వారు సాధారణంగా దూకుడు స్వభావంతో, ఉత్సాహంగా, ఆనందంగా, ఉద్వేగభరితంగా ఉంటారు. వీరు గర్భాధారణ సమయంలో చాలా సంతోషంగా ఉంటారు. ప్రెగ్నెన్సీ సమయంలో కూడా వారి చిన్న చిన్న పనులు చేసకుంటూ ఉత్సాహంగా గడుపుతారు. ఎవరైన గర్భిణీ కొత్త స్కిల్ పనులు నేర్చుకునే పనిలో నిమగ్నకావడం లేదా ఇంటికి సంబంధించిన ఏదైనా పనిని తానే స్వయంగా చేసుకోవడం మీరు చూశారా? అయితే కచ్చితంగా ఆమె మేషరాశికి చెందిన మహిళ అని మీరు గుర్తించవచ్చు.

వృషభం (ఏప్రిల్ 20 - మే 20)

వృషభం (ఏప్రిల్ 20 - మే 20)

ఈ రాశి వారు ప్రతి విషయంలో ఒక్క ప్రణాళిక ప్రకారం వెళ్లాలనుకుంటారు. వీరు ప్రతి విషయంలో బాగా కేర్ తీసుకుంటారు. గర్భధారణ సమయంలో వీరు వివిధ రకాలు ఆహారాలను తినాలని భావిస్తుంటారు. అయితే ప్రతి విషయంలో వీరు ఆచితూచి అడుగు వేయడం వల్ల ఎలాంటి ఇబ్బందులు తలెత్తవు.

మిథున రాశి (మే 21 - జూన్ 20)

మిథున రాశి (మే 21 - జూన్ 20)

ఈ రాశి మహిళలు గర్భధారణ సమయంలో ఆందోళన చెందుతుంటారు. ఎందుకంటే వీరు సంప్రదించిన డాక్టర్ కూడా మిమ్మల్ని అనేక విషయాలు అడిగి ఇబ్బందిపెట్టి ఉండొచ్చు. అందువల్లే మీరు అలా ఇబ్బందులుపడుతుంటారు. అయితే డాక్టర్, వారి పార్టనర్ చెప్పే సూచనలు పాటించి మీరు జాగ్రత్తగా వ్యవహరిస్తే చాలు. అలాగే ఈ రాశివారు సన్నిహితులతో సానిహిత్యంగా ఉండడం మంచిది.

కర్కాటక రాశి (జూన్ 21 - జూలై 22)

కర్కాటక రాశి (జూన్ 21 - జూలై 22)

కర్కాటక రాశి మహిళలు ఎంతో భావోద్వేగంతో ఉంటారు. వీరు పుట్టబోయే పిల్లలపై ఎంతో ప్రేమ కలిగి ఉంటారు. వారిని కనుపాపాలుగా చూసుకోవాలని భావిస్తారు. ఈ రాశి వారు చాలా గొప్ప తల్లులు. అయితే గర్భధారణ సమయంలో ఈ రాశి వారు భావోద్వేగాలను నియంత్రణలో ఉంచుకోవాలి. కాస్త మానసిస ఉల్లాసం కోసం అలా తిరుగుతూ ఉండాలి.

సింహ రాశి (జూలై 23 - ఆగష్టు 22)

సింహ రాశి (జూలై 23 - ఆగష్టు 22)

ఈ రాశి మహిళలు గర్భధారణ సమయంలో తమ భాగస్వామి నుంచి ఎక్కువ ప్రేమను కోరుకుంటాను. అయితే అది ఏమీ తప్పు కాదు. గర్భిణీ స్త్రీలకు సంరక్షణతో పాటు వారిపై ప్రత్యేక శ్రద్ధ చూపడం చాలా అవసరం. గర్భధారణ సమయంలో ఈ రాశివారికి సరైన సంరక్షణ ఇవ్వకుంటే వారు సహనాన్ని కోల్పోవచ్చు. అందువల్ల ఈ రాశివారికి వీలైనంత వరకు వారి భాగస్వామి ప్రేమను పంచాలి. అలా చేయడం తల్లీబిడ్డలకు చాలా మంచిది.

కన్య రాశి (ఆగష్టు 23 - సెప్టెంబర్ 22)

కన్య రాశి (ఆగష్టు 23 - సెప్టెంబర్ 22)

ఈ రాశి వారికి కాస్త సిగ్గు ఎక్కువ. ఎవరైన గర్భాధారణకు సంబంధించిన ప్రశ్నలు అడిగితే కాస్త అసహనానికి గురువుతుంటారు. గర్భధారణ సమయంలో ఈ రాశి వారు కాస్త చిరాకుగా ఉంటారు.

తులరాశి (సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22)

తులరాశి (సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22)

ఈ రాశి వారు సోషనల్ రిలేషన్స్ ఎక్కువగా కలిగి ఉంటారు. ప్రతి ఒక్కరితో ఆత్మీయంగా ఉంటారు. గర్భధారణ సమయంలో వీరి చుట్టూ

స్నేహితులు, కుటుంబ ఉన్నట్లయితే వీరు ఫుల్ హ్యాపీగా ఫీలవుతారు. ఒంటరిగా మాత్రం అస్సలు ఉండలేరు. చాలా బాధపడతారు. నిరత్సాహానికి గురవుతారు. 9 నెలల్లో ప్రతి క్షణం ఆస్వాదిస్తూ గడపడానికి ఇష్టపడతారు.

వృశ్చికం (అక్టోబర్ 23 - నవంబర్ 21)

వృశ్చికం (అక్టోబర్ 23 - నవంబర్ 21)

ఈ రాశి మహిళలు చాలా ధైర్యంగా ఉంటారు. వీరు గర్భాధారణ సమయంలో భావోద్వేగాలపై నియంత్రణ కోల్పోకుండా ఉంటారు.

అయితే ప్రెగ్నెన్సీ సమయంలో ఈ రాశి మహిళల సహనం పరీక్షించటం మంచిది కాదు. వారు తమ సహనాన్ని కోల్పోతారు. అంతేకాకుండా కొన్ని సందర్భాల్లో తీవ్ర నిరాశకు గురవుతారు. అందువల్ల పార్టనర్ ఈ రాశి మహిళను ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలి.

ధనుస్సు (నవంబర్ 22 - డిసెంబర్ 21)

ధనుస్సు (నవంబర్ 22 - డిసెంబర్ 21)

ఈ రాశి వారు గర్భధారణ సమయంలో అత్యంత అసహనానికి గురవుతారు.

వీరు 9 నెలల పాటు వేచి ఉండడానికి కాస్త ఇబ్బందిపడతారు. ఇక డెలవరికి రోజులు దగ్గరపడుతున్నప్పుడు మరింత అసహనానికి గురవుతారు. కానీ వీరు గర్భాధారణ సమయంలో వచ్చే సమస్యలను తట్టుకునే స్వభావం కలగి ఉంటారు. ఈ విషయంలో వారు ఎలాంటి సమస్యలను పార్టనర్ కు తెలపరు.

మకరరాశి (డిసెంబర్ 22 - జనవరి 19)

మకరరాశి (డిసెంబర్ 22 - జనవరి 19)

సాధారణంగా మకరరాశి మహిళలు చాలా క్రమశిక్షణతో ఉంటారు. వీరు మంచి సమన్వయం, సహనం, ఓర్పు కలిగి ఉంటారు. బాగా నిర్వహించబడుతున్నారు. కాబట్టి వీరు గర్భధారణంలో సమయంలో ఏర్పడే ఆటుపోట్లను ఎదుర్కోగలుతారు. వాటిని ఎదుర్కొనే నేర్పు వీరు కలిగి ఉంటారు. అలాగే గర్భాధారణ సమయంలో చివరికి దశలో ఏర్పడే ఇబ్బందులను కూడా వీరు భరించగలరు.

కుంభం (జనవరి 20 - ఫిబ్రవరి 18)

కుంభం (జనవరి 20 - ఫిబ్రవరి 18)

ఈ రాశి వారికి బోర్ డమ్ అంటే అస్సలు పడదు. గర్భధారణ అనేది వీరికి చిరాకుగా ఉంటుంది. ఆ సమయంలో వీరు బాగా విసుగు చెందుతారు. కానీ వీరు స్మార్ట్ నెస్, స్నేహశీలతత్వంతో ఆ బోర్ డమ్ ను కూడా పోగొట్టుకోగల నేర్పరులు. ఈ రాశి వారు ఆ సమయంలో పుస్తకాలు చదివడమో లేదా సంగీతాన్ని వినడమో లేదా వారికి నచ్చిన ఇతర కార్యకళాపాలతో ఫుల్ గా టైమ్ పాస్ చేస్తారు.

మీనం (ఫిబ్రవరి 19 - మార్చి 20)

మీనం (ఫిబ్రవరి 19 - మార్చి 20)

ఈ రాశివారు సున్నితమనస్కులు. అయితే ఆ సున్నితత్వమే వీరిని కాస్త ఇబ్బందులకు గురి చేస్తుంది. గర్భధారణ సమయంలో ఈ రాశి మహిళలు చిన్న, చిన్న విషయాలకే ఆందోళన చెందుతారు. అందువల్ల ఆ సమయంలో వారి భాగస్వామి ఎప్పడు తోడుగా ఉండాలి.

Story first published: Saturday, October 28, 2017, 8:30 [IST]
Desktop Bottom Promotion