For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఐవిఎఫ్ ట్రీట్మెంట్ తో గర్భం పొందిన తర్వాత అబార్షన్ జరగకుండా తీసుకోవల్సిన జాగ్రత్తలు..!

స్త్రీలు గర్భవతులుగా ఉన్నప్పుడు సహాయం లేకపోతే గర్భస్రావం ఎంత సాధారణమో ఐవీఫ్ ద్వారా గర్భం ధరించినప్పుడు గర్భస్రావం అంతే సాధారణం.

By Lekhaka
|

స్త్రీలు గర్భవతులుగా ఉన్నప్పుడు సహాయం లేకపోతే గర్భస్రావం ఎంత సాధారణమో ఐవీఫ్ ద్వారా గర్భం ధరించినప్పుడు గర్భస్రావం అంతే సాధారణం.సరైన వయసులో వివిధ కారణాల వల్ల గర్భం ధరించని స్త్రీలు కాస్త లేటు వయసులో ఐవీఎఫ్ వైపు మొగ్గి గర్భం ధరిస్తారు. అటువంటి వారిని గర్భ స్రావం కృంగదీస్తుంది.స్త్రీలలో ముప్ఫై ఏళ్ళ తరువాత వచ్చే గర్భాలలో ప్రతీ ఐదింటిలో ఒక గర్భం విచ్చిన్నమయ్యే ఆస్కారం ఉంటుంది.ఐవీఎఫ్ ట్రీట్‌మెంట్ తరువాత గర్భ స్రావం జరగకుండా చూడటానికి కొన్ని పద్ధతులున్నాయి.

ఒక ఐవీ ఎఫ్ పేషెంటుగా మీకు మీ చికిత్సా కేంద్రం మీ శరీరానికి సంబంధించిన హార్మోను ప్రొఫైల్ని అందచేయాలి.ఈ హార్మోన్ల స్థాయికీ గర్భస్రావానికీ సంబంధముంది.

How To Prevent A Miscarriage During IVF

గర్భాశయములో సమస్యలు గర్భస్రావానికి కారణాలు. ఇదే కారణం వల్ల ఐవీఎఫ్ చికిత్స తరువాత గర్భం దాల్చినా కూడా గర్భస్రావానికి ఆస్కారం ఉంది.అందువల్ల మీ గర్భాస్రయానికి సంబంధించిన పరీక్షలు అన్నీ పూర్తిగా చేయించుకోండి.

మీ ఐవీఎఫ్ చికిత్స తరువాత మీరు మీ సొంత అండాలతో లేదా దానం చేసిన అండాల ద్వారా గర్భం ధరించినా కూడా మీ గర్భం విచ్చిన్నమవ్వకుండా ప్రొజెస్టీరాన్ అనే హార్మోను ఇస్తారు.దీని వల్ల వాంతులయ్యే ఆస్కారం ఉంది అందువల్ల శరీరంలో ఈ హార్మోను స్థాయిలో హెచ్చు తగ్గులొచ్చి గర్భ స్రావమయ్యే ఆస్కారం ఉంది.

ఐవీఎఫ్ ద్వారా గర్భం దాల్చినప్పుడు గర్భస్రావాన్ని అరికట్టడం ఎలాగ?

మీరు మానిసికంగా మరియూ శారీరకంగా సిద్ధమయ్యాకే ఐవీఎఫ్ చికిత్స తీసుకోండి. ఏ రకంగా గర్భం దాల్చినా కూడా గర్భ స్రావానికయ్యే కారణాలు ఒక పటాన అంతు చిక్కేవి కావు.

ఐవీఎఫ్ చికిత్స తీసుకున్నప్పుడూ గర్భ స్రావాన్ని నిరోధించడమెలాగ??

ఐవీఎఫ్ ద్వారా గర్భం దాల్చినప్పుడు గర్భస్రావాన్ని అరికట్టడం ఎలాగ?

రక్తం చిక్కగా ఉన్నా లేదా గడ్డ కట్టినా గర్భస్త పిండానికి రక్త సరఫరా ప్రభావితమయ్యి గర్భస్రావానికి ఆస్కారం ఉంటుంది. ఐవీఎఫ్ చికిత్సకి ముందు రక్త పరీక్షలో వెళ్ళడయ్యే రక్త సంస్యల గురించి తెలుసుకోవడానికి పరీక్షలు చేయించుకోండి.

స్త్రీలు గర్భం ధరించడానికి ఏమైనా అడ్డకున్లుంటే వాటిని మందుల ద్వారా అధిగమించవచ్చు.ఐవీఎఫ్ చికిత్స తీసుకునేవాళ్ళు చాలా మంది గుర్తు పెట్టుకుని మందులు వేసుకోవడం కష్టంగా భావిస్తారు.కానీ గర్భస్రావ నిరోధానికి క్రమం తప్పకుండా మందులు తీసుకోవడం చాలా ముఖ్యం.

ఐవీఎఫ్ ద్వారా గర్భం దాల్చినప్పుడు గర్భస్రావాన్ని అరికట్టడం ఎలాగ?

గర్భాశయ ద్వారం బలహీనత కూడా గర్భస్రావానికి ఒక కారణం.సరైన చికిత్స తీసుకోవడం ద్వారా ఈ కారణం చేత అయ్యే గర్భస్రావాన్ని నిరోధించవచ్చు.మీరు మీ డాక్టరు గారు ఇద్దరూ సంసిద్ధులయ్యి ఉంటే ఈ కారణం వల్ల గర్భస్రావాన్ని నివారించడం సులువు.

ఐవీఎఫ్ ద్వారా గర్భం దాల్చినప్పుడు గర్భస్రావాన్ని అరికట్టడం ఎలాగ?

ఒక వేళ మీకు ఇంతకుముందు కనుక నెలలు నిండకుండా పిల్లలు పుట్టినా లేదా చివరి నెలల్లో గర్భస్రావమైనా జాగ్రత్త.ఇంఫెక్షన్ల వల్ల కూడా గర్భ స్రావమవుతుంది.అందువల్ల మీ ఐవీఎఫ్ ట్రీట్మెంటుకి ముందూ తరువాత కూడా దీని గురించి జాగ్రత్త వహించండి.

ఐవీఎఫ్ ద్వారా గర్భం దాల్చినప్పుడు గర్భస్రావాన్ని అరికట్టడం ఎలాగ?

సరిగ్గా కడగని కూరగాయలు,పండ్ల ద్వారా మరియూ పిల్లి మలం ద్వారా టోక్సోప్లాస్మోసిస్ అనే ఇంఫెక్షన్ వస్తుంది. అందువల్ల మీరు తీసుకునే పళ్ళు, కూరగాయలని బాగా కడిగాకా కానీ తీసుకోవద్దు. అలాగే పిల్లులకి కూడా దూరంగా ఉండండి.

English summary

How To Prevent A Miscarriage During IVF

Miscarriages during IVF are as typical as miscarriages in non assisted pregnancies. Since older women often try IVF, miscarriages may sadly let them down. After thirty, one in five pregnancies lead to miscarriage. There are ways in which IVF patients can reduce the possible risk of miscarriage after their treatment.
Desktop Bottom Promotion