Just In
- 21 min ago May Day 2024 Wishes : శ్రామికులు లేనిదే అభివృద్ధి లేదు.. శ్రామికుల దినోత్సవ శుభాకాంక్షలు
- 56 min ago పుచ్చకాయ జ్యూస్ లో ఈ ఒక్కటి కలిపి తాగితే చాలు వేసవి ఆరోగ్య సమస్యలు బలాదూర్..మీ శరీరానికి శాంతం..ఉపశమనం
- 2 hrs ago కుబేర యోగం తో మే 1 నుంచి ఈ మూడు రాశుల వారికి ధనం, ఐశ్వర్యం, సంపదలు పెరుగుతాయి
- 4 hrs ago 24 ఏప్రిల్ 2024: ఈ రోజు రాశి ఫలాలు మీ రాశికి ఈ రోజు ఎలా ఉంటుంది ఏ పనులు చేస్తే మంచిది ఇక్కడ తెలుసుకోండి..
గర్భధారణ సమయంలో బ్లాక్ టీ తాగడం సురక్షితమేనా?!
గర్భధారణ సమయంలో 300 మిల్లీగ్రాముల వరకు కెఫీన్ తీసుకోవడం మంచిదే. అంటే అది 2-3, 8-oz కప్పులతో సమానం. ఈ విధంగా, రోజుకు 2-3 కప్పుల టీ ని మీకుమీరే పరిమితం చేసుకోవడం సురక్షితంగా భావించబడుతుంది. చాకొలేట్, కో
గర్భధారణ సమయంలో చేయాల్సినవి, చేయకూడని వాటి జాబితా చాలా పెద్దదిగా ఉంటుంది. మీ కడుపులో బిడ్డ పెరుగుతూ ఉన్నపుడు మీరు తీసుకున్న ఆహరం ఎక్కువసేపు అలానే ఉండదు అనేది తెలిసిన విషయమే. మీరు ప్రతిరోజూ ఆహారంలో భాగంగా తీసుకునే పదార్ధాలనే సాధారణంగా ఉపయోగించండి, కొన్నిసార్లు ఆరోగ్యకర ఎంపికలతో వాటిని మార్చండి, కాని అవి మీ బేబీకి లేదా మీకు ఎటువంటి హాని కారకం కాకూడదు. అలాంటి వాటిలో బ్లాక్ టీ కూడా ఒకటి.
కామెల్లియా సినేన్సిస్ చెట్టు ఆకుల నుండి తయారుచేసిన ఈ బ్లాక్ టీ అధిక కెఫీన్ కలిగిన టీ లలో ఒకటి. 8 కప్పుల టీ లో 40-120 గ్రాముల మధ్య మీరు ఎన్నికునే బ్రాండ్ ఎంపిక పై ఆధారపడి కెఫీన్ ఉంటుంది. కాబట్టి, గర్భధారణ సమయంలో బ్లాక్ టీ తాగడం సురక్షితమేనా?
గర్భధారణ సమయంలో బ్లాక్ టీ: సురక్షితమా, కాదా?
గర్భధారణ సమయంలో 300 మిల్లీగ్రాముల వరకు కెఫీన్ తీసుకోవడం మంచిదే. అంటే అది 2-3, 8-oz కప్పులతో సమానం. ఈ విధంగా, రోజుకు 2-3 కప్పుల టీ ని మీకుమీరే పరిమితం చేసుకోవడం సురక్షితంగా భావించబడుతుంది. చాకొలేట్, కోలా, కాఫీ వంటి ఇతర పదార్ధాలలో కూడా కెఫీన్ ఉంటుందని తెలుసుకోవడం ముఖ్యం. ఇటువంటి అన్ని ఆహార పదార్ధాలు తీసుకునే ముందు కెఫీన్ స్థాయిని పరిగణలోనికి తీసుకోవడం చాలా అవసరం.
అయితే, మీరు స్థాయిని మించి ఎక్కువగా తీసుకుంటే, మీరు మీ బిడ్డ కింద సూచించిన అనేక ప్రమాదాలకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి.