For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భధారణకు ముందు శరీర బరువును తగ్గించుకోవడం మంచిది, ఎందుకని?!

గర్భధారణ పొందటానికి ముందు, మీరు అన్ని రకాలుగా ఆరోగ్యంగా ఉన్నారని నిర్ధారించుకోవడం చాలా ముఖ్యము. మీరు గర్భం దాల్చడానికి ప్లాన్ చేసుకునే ముందు శరీరంలో అవాంచితంగా ఉన్న బరువును కోల్పోవటం చాలా మంచిది.

By Ssn Sravanth Guthi
|

గర్భధారణ పొందటానికి ముందు, మీరు అన్ని రకాలుగా ఆరోగ్యంగా ఉన్నారని నిర్ధారించుకోవడం చాలా ముఖ్యము. మీరు గర్భం దాల్చడానికి ప్లాన్ చేసుకునే ముందు శరీరంలో అవాంచితంగా ఉన్న బరువును కోల్పోవటం చాలా మంచిది.

గర్భధారణకు ముందుగా అధిక బరువును కలిగి ఉండటం వల్ల, మీరు గర్భధారణ జరిగే సమయంలో అనేక సమస్యలకు కారణం కావచ్చు. మీరు ముందుగానే కొన్ని పౌండ్ల శరీర బరువును కోల్పోవటం వల్ల , గర్భం పొందిన తర్వాత, మీకు మరియు మీ బిడ్డకు చాలా రకాల ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి.

ఇప్పటికీ మీరు పైన చెప్పిన విషయాన్ని ఒప్పుకోకపోతే, గర్భధారణకు ముందు కొంత బరువు కోల్పోయేలా మిమ్మల్ని ప్రేరేపించడానికి ఇక్కడ కొన్ని ముఖ్యమైన విషయాలు తెలియజేయబడ్డాయి.

బిడ్డ పుట్టేందుకు ఉన్న చిక్కులు :

బిడ్డ పుట్టేందుకు ఉన్న చిక్కులు :

బిడ్డకు జన్మనివ్వడం, గర్భస్రావం జరగటం మరియు బిడ్డ పుట్టే ప్రక్రియలో లోపాలు ఎదురయ్యే టటువంటి మరి కొన్ని సమస్యలకు ఊబకాయం కారణమని అనేక అధ్యయనాలు తెలిపాయి.

సంతానోత్పత్తికి సంభవించే పరిస్థితులు :

సంతానోత్పత్తికి సంభవించే పరిస్థితులు :

సాధారణంగా, అధిక బరువును కలిగి ఉండటం వల్లకూడా గర్భం ధరించే అవకాశాలు తగ్గిపోయే ప్రమాదం ఉంది. అవును ఊబకాయం అనేది మీ సంతానోత్పత్తి సాధ్యమయ్యే పరిణామాలపై జోక్యం చేసుకోగలదు.

గర్భధారణ-మధుమేహం :

గర్భధారణ-మధుమేహం :

గర్భధారణ సమయంలో ఊబకాయం వల్ల అధిక రక్తపోటు, గర్భధారణ-మధుమేహం మరియు మరికొన్ని ఇతర సమస్యల ముప్పును పెంచుతాయి.

బాల్యంలోనే మధుమేహం :

బాల్యంలోనే మధుమేహం :

సాధారణ సమస్యలను పక్కన పెడితే, గర్భదారణ సమయంలో ఆ తల్లి అధిక బరువును కలిగి ఉంటే; పుట్టే బిడ్డకు భవిష్యత్తులో ఆరోగ్యపరంగా ఎదురయ్యే చాలా సమస్యలు జీవితకాలం పాటు ఉంటాయి. అటువంటివాటిలో బాల్యంలోనే వచ్చే మధుమేహం ఒకటి.

బరువు తగ్గుతారు :

బరువు తగ్గుతారు :

మీరు ఖచ్చితంగా బరువు తగ్గాలా ? కానేకాదు,

కానీ మీరు ఆరోగ్యవంతమైన శరీర బరువును పరిమితంగా కలిగి ఉంటే, ఈ విషయంలో మీరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. కానీ, మీరు ఈ విషయం పైన ఎక్కువ శ్రద్ధను వహిస్తే, మీ శరీరానికి కావలసిన ముఖ్యమైన పోషకాలను కోల్పోయేలా చేస్తుంది.

గర్భధారణలో బరువు పెరుగుట :

గర్భధారణలో బరువు పెరుగుట :

గర్భధారణ కారణంగా, మీ శరీర బరువు సాధారణంగానే పెరుగుతుంది. కానీ మీరు గర్భధారణకు ముందు నాజూకుగా ఉన్నట్లయితే, ఇలాంటి సమయంలో పెరిగే బరువు మిమ్మల్ని ఎక్కువగా ప్రభావితం చేయదు. కానీ మీరు ఇప్పటికే అధిక బరువును కలిగి ఉంటే గర్భధారణ సమయంలో అదనంగా శరీర బరువును పెరగటం వల్ల ఎదురయ్యే పరిణామాలు కాస్త ఆందోళనకరంగా ఉంటాయి.

డెలివరీ తర్వాత :

డెలివరీ తర్వాత :

ఆరోగ్యమైన శరీర బరువును కలిగి ఉన్న మహిళలు గర్భధారణ సమయంలో, ఊబకాయం ఉన్నవారి కంటే మెరుగైన పనితీరును కలిగివుంటారని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. గర్భధారణకు ముందు నాజూకుగా ఉన్న మహిళల విషయంలో, డెలివరీ తరువాత చాలా త్వరగా మీ బరువును కోల్పోవటం అనేది సాధ్యపడుతుంది.

English summary

Lose Weight Before Pregnancy

Carrot has excellent nutritional properties that have been used in the preparation of natural medicines. Carrots have the ability to combat natural disorders like phlegm, cold, flu etc.
Desktop Bottom Promotion