For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పురుషులలో సంతానోత్పత్తి: డయాబెటిక్ పురుషులు తీసుకోవలసిన ప్రికాషన్స్

ఇటీవలి అధ్యయనాల ప్రకారం, డయాబెటిస్ అనే సమస్య కూడా ఇన్ఫెర్టిలిటీకి దారితీయడంలో ప్రధాన పాత్ర పోషిస్తుందని తెలుస్తోంది. డయాబెటిస్ అనే ఆరోగ్య పరిస్థితిలో మన శరీరం తగిన ఇన్సులిన్ ని ఉత్పత్తి చేయలేకపోవడమనే

|

ఈ భూమిపై జన్మించిన ప్రతి ఒక్కరూ తన వంశం వృద్ధి చెందాలని కోరుకుంటారు. పిల్లలను కలిగివుండటం ద్వారా జీవితం సార్థకమవుతుందని చాలా మంది భావిస్తారు. అయితే, దురదృష్టవశాత్తు, ఈ మధ్యకాలంలో స్త్రీపురుషులలో సంతానోత్పత్తి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. జన్యులోపాలు, ఒబెసిటీ, మద్యానికి బానిసగా మారడం వంటి కొన్ని అంశాలు సంతానోత్పత్తి సామర్థ్యంపై దుష్ప్రభావం చూపిస్తున్నాయి. అలాగే, జీవనశైలిలో సంభవిస్తున్న కొన్ని మార్పులు కూడా ఇన్ఫెర్టిలిటీ సమస్యకు దారితీస్తున్నాయి.

ఇటీవలి అధ్యయనాల ప్రకారం, డయాబెటిస్ అనే సమస్య కూడా ఇన్ఫెర్టిలిటీకి దారితీయడంలో ప్రధాన పాత్ర పోషిస్తుందని తెలుస్తోంది. డయాబెటిస్ అనే ఆరోగ్య పరిస్థితిలో మన శరీరం తగిన ఇన్సులిన్ ని ఉత్పత్తి చేయలేకపోవడమనే లక్షణం అలాగే సెల్యూలర్ స్థాయికి తగిన ఇన్సులిన్ ని గ్రహించలేకపోవడమే లక్షణం కనిపిస్తుంది. ఇటీవలి కాలంలో డయాబెటిస్ సమస్య తీవ్రతరమైంది. ఎక్కువ మంది డయాబెటిస్ సమస్యతో సతమతమవుతున్నారు. యువతరం కూడా ఈ సమస్య బారిన పడుతుండడం బాధపడవలసిన విషయం. ప్రాణాంతక వ్యాథి కానప్పటికీ డయాబెటిస్ అనే ఈ సమస్య అనేక ఇతర సమస్యలను స్వాగతిస్తుంది. ఆయా సమస్యలన్నీ కలగలిపి ఇన్ఫెర్టిలిటీని కలిగిస్తాయి.

డయాబెటిస్ కు అలాగే పురుషులలో క్షీణిస్తున్న సంతానోత్పత్తి సామర్థ్యానికి గల సంబంధం ఇటీవలే వెలుగులోకి వస్తోంది. మీరు ఒకవేళ డయాబెటిక్ అయి పండంటి శిశువుకి జన్మనివ్వడానికి ప్రయత్నిస్తున్నట్టయితే మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లలకై ప్రయత్నించడానికి ముందు డయాబెటిక్ పేషంట్లు తమ బ్లడ్ షుగర్ లెవల్స్ ను నార్మల్ గా ఉంచుకోవడానికి తగు జాగ్రత్తలు తీసుకోవాలి.

ఇక్కడ, మేల్ ఫెర్టిలిటీ పై డయాబెటీస్ అనే సమస్య దుష్ప్రభావం చూపకుండా ఉండేందుకు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం....

పురుషులలో సంతానోత్పత్తి సామర్థ్యాన్ని కాపాడుకునే మార్గాలు

ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి:

ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి:

డయాబెటిస్ అనే సమస్య పురుషుల సంతానోత్పత్తి సామర్థ్యాన్ని దెబ్బతీస్తుందని ఇటీవల అధ్యయనాలలో తేలిన విషయం తెలిసినదే. స్పెర్మ్ కౌంట్ ని తగ్గించడం ద్వారా మేల్ ఫెర్టిలిటీని దెబ్బతీస్తుంది. అయితే ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం ద్వారా ఈ సమస్య నుంచి కాస్తంత ఉపశమనం పొందవచ్చు.

అధిక ఉష్ణోగ్రతల నుంచి దూరంగా ఉండండి :

అధిక ఉష్ణోగ్రతల నుంచి దూరంగా ఉండండి :

డయాబెటిస్ ప్రభావంవలన మైటోకాండ్రియా డేమేజ్ తో పాటు సెమెన్ వాల్యూమ్ తగ్గిపోతుంది. తద్వారా, స్పెర్మ్ క్వాలిటీ తగ్గిపోతుంది. అందువలన, అధిక ఉష్ణోగ్రతలకు దూరంగా ఉండడం ఆరోగ్యానికి మంచిది.

ఎమోషనల్ సపోర్ట్ ను అందుకోండి:

ఎమోషనల్ సపోర్ట్ ను అందుకోండి:

డయాబెటిక్ పురుషులను లిబిడో సమస్య వేధిస్తుంది. అందుకే, వారు తమ భాగస్వామి నుంచి ఎమోషనల్ సపోర్ట్ ను ఆశిస్తారు. కౌన్సెలర్ల ద్వారా కూడా భార్యాభర్తలిద్దరూ తమ సందేహాలను నివృత్తి చేసుకుని పేరెంట్ హుడ్ వైపు చేరే మార్గాన్ని సుగమం చేసుకోవచ్చు.

అలసటకి తగిన చికిత్సను పొందండి:

అలసటకి తగిన చికిత్సను పొందండి:

డయాబెటిక్ పురుషులలో అలసట ఎక్కువగా కనిపిస్తుంది. ప్రత్యేకించి శృంగారంలో పాల్గొనే సమయంలో వీరు అలసటకు ఎక్కువగా గురవుతారని ఇటీవలి అధ్యయనాలు పేర్కొంటున్నాయి. డయాబెటిస్ సమస్యతో పాటు ఈ సమస్యతో అనుసంధానమైన ఇతర సమస్యలకు తగిన చికిత్స తీసుకోవడం ద్వారా సంతోషంగా ఉండవచ్చు.

హార్మోన్ల అసమతుల్యతను సరిచేయడానికి చికిత్స తీసుకోండి:

హార్మోన్ల అసమతుల్యతను సరిచేయడానికి చికిత్స తీసుకోండి:

పాంక్రియాస్ ద్వారా ఇన్సులిన్ అనే హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. అయితే, డయాబెటిస్ అనేది ఇన్సులిన్ స్థాయిలను అసమతుల్యం చేస్తుంది. దీని ప్రభావం పునరుత్పత్తి హార్మోన్లపై కూడా పడుతుంది. అందువలన, హార్మోన్ల సమతుల్యతకై సరైన చికిత్సని తీసుకోవాలి.

తగిన వ్యాయామం చేయండి:

తగిన వ్యాయామం చేయండి:

డయాబెటీస్ అనేది ఒబెసిటీకి కూడా దారితీస్తుంది. తద్వారా తండ్రయ్యే సామర్థ్యంపై దుష్ప్రభావం పడుతుంది. ప్రతిరోజూ తగిన వ్యాయామం చేయడం ద్వారా ఈ సమస్యను నిర్మూలించుకోవచ్చు.

మెడికల్ సపోర్ట్:

మెడికల్ సపోర్ట్:

డయాబెటిస్ వలన నాడులు దెబ్బతినే ప్రమాదం కలదు. దాంతో, రిట్రోగ్రేడ్ ఎజాక్యులేషన్ సమస్యకు గురవుతారు. ఈ సమస్యలో వీర్యమనేది నేరుగా మూత్రాశయంలోకి వెళుతుంది. డయాబెటిస్ బారిన పడిన పురుషుల ఫెర్టిలిటీపై ఈ సమస్య దుష్ప్రభావం చూపుతుంది. అందువలన, సరైన సమయంలో తగిన వైద్య సలహాను తీసుకుని సమస్యను పరిష్కరించుకోవాలి.

యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా కలిగిన ఆహారపదార్థాలను తీసుకోండి:

యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా కలిగిన ఆహారపదార్థాలను తీసుకోండి:

డయాబెటిక్ పురుషులలో బ్లడ్ షుగర్ స్థాయిలు పెరగడం వలన ఫ్రీ రాడికల్స్ పెరుగుదలను గమనించవచ్చు. ఈ ప్రభావం సంతానోత్పత్తి సామర్థ్యంపై పడుతుంది. దీనివలన జన్యుపరమైన నష్టం కూడా కలగవచ్చు. అందువలన, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా కలిగిన ఆహారపదార్థాలను తీసుకోవడం ద్వారా పండంటి బిడ్డకి జన్మనిచ్చే సామర్థ్యాన్ని పెంపొందించుకోవచ్చు.

భాగస్వామికి తెలియచేయండి :

భాగస్వామికి తెలియచేయండి :

డయాబెటిక్ పురుషులను అంగస్థంభన సమస్య వేధిస్తుంది.ఈ సమస్య వారి దాంపత్య జీవితంలో ఇబ్బందులను తీసుకురాకుండా ఉండేందుకు వారు తమ భాగస్వామితో స్పష్టంగా మాట్లాడి వారి నుంచి ఆశించే విషయాలను తెలియచేయాలి.

ఈ జాగ్రత్తలు పాటించడం ద్వారా డయాబెటిస్ అనేది మేల్ ఫెర్టిలిటీకి అడ్డుగోడగా ఉండదని తెలుసుకోవచ్చు.

English summary

Fertility Diabetes | Male Fertility | Fertility Diabetic Male

The effects of diabetes on male fertility can be bad. Does diabetes affect male fertility? To know if diabetes affects fertility in men, read on.
Desktop Bottom Promotion