గర్భధారణ సమయంలో పాటించవలసిన సురక్షితమైన శృంగార భంగిమలు..

Posted By: R Vishnu Vardhan Reddy
Subscribe to Boldsky

ఇప్పటికీ చాలా మంది, గర్భధారణ సమయం లో శృంగారం చేయొచ్చా, చేయకూడదా అనే విషయమై కొద్దిగా అయోమయానికి లోనవుతుంటారు. గర్భం దాల్చినప్పుడు కూడా శృంగారం లో పాల్గొనటం వల్ల ఎటువంటి నష్టం లేదు అంటున్నారు నిపుణులు.

మీరు సౌకర్యవంతంగా భావించినంత వరకు శృంగారం చేయటం లో తప్పు లేదని, అది ఒక సాధారణ మరియు ఆరోగ్యవంతమైన విషయమే అనే విషయాన్ని మరొక్క సారి స్పష్టం చేయ దలిచారు.

పిల్లలు పుట్టాలంటే ఎప్పుడు కలవాలి? ఫెర్టిలిటీ డేస్ ఎప్పుడు?

కాబట్టి, గర్భం దాల్చిన తరువాత కూడా శృంగారం లో పాల్గొనవచ్చు కానీ, సాధారణంగా చేసే భంగిమల్లో శృంగారం చేస్తే కొద్దిగా అససౌకార్యానికి గురవుతుంటారు, ఇబ్బందులు కూడా పడుతుంటారు.

అందుకు కారణం లోపల బిడ్డ పెరుగుతుండటంతో పొట్ట కొద్దిగా పెద్దది అయిపోయి మీకు అసౌకర్యాన్ని కలిగిస్తుంటుంది. ఇలాంటి సమయాల్లో ఎలాంటి భంగిమల్లో శృంగారం చేస్తే ఆనందంగా శృంగారాన్ని ఆస్వాదించవచ్చు అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

గర్భధారణ టైమ్ లో లైంగిక ప్రక్రియ జరపుట మంచిదేనా?

1. పక్క పక్కన పడుకోవడం :

1. పక్క పక్కన పడుకోవడం :

ఈ భంగిమలో శృంగారం చేయడం వల్ల మీ యొక్క బరువు మీ భాగస్వామి పై పడదు. ఇద్దరూ మీ ముఖాలు అభిముఖంగా ఉండేలా మంచం పై పడుకోండి మరియు ఇద్దరి శరీరాలు కలిసి 'వి' ఆకారాన్ని ప్రతిభింభించేలా చూసుకోండి. సహకారం కోసం మీ వెనుక ఒక దిండుని పెట్టుకోండి, మీ రెండు కళ్ళను మీ భాగస్వామి యొక్క తొడల భాగం పై ఉంచండి.ఈ భంగిమలో మీరు ఎంతో విశ్రాంతిగా మరియు సౌకర్యవంతంగా భావిస్తారు.

2. స్త్రీ పైన ఉండటం :

2. స్త్రీ పైన ఉండటం :

గర్భం దాల్చిన తొమ్మిది నెలలు పాటు ఈ భంగిమ లో శృంగారం చేసినా ఎటువంటి ఇబ్బంది లేదు. మీ భాగస్వామి వెనకకు వాలి పడుకొని ఉన్నప్పుడు , మీరు మీ యొక్క భాగఫాస్వామి పై కూర్చోండి, ఇలా చేయడం వల్ల అంగ ప్రవేశాన్ని మీరు నియంత్రిచగలరు. మరియు ఇలా కూర్చోడం వల్ల కడుపులో పెరుగుతున్న బిడ్డ మరియు గర్భాశయం పై ఎటువంటి ఒత్తిడికి లోనుకావు.

3. కుర్చీ పైన :

3. కుర్చీ పైన :

ఈ భంగిమ చాలా సౌకర్యవంతమైనది మరియు తీవ్రమైనది, ఎందుకంటే మీరు మీ యొక్క భాగస్వామిని మరింత గట్టిగా ఆలింగనం చేసుకోవచ్చు. మీ భాగస్వామి, కుర్చీ వెనుక భాగాన్ని ఆసరాగా చేసుకొని కూర్చున్న తరువాత, అతడి పై మీరు కూర్చోండి. మీరు కూర్చున్న భంగిమ కి దగ్గర్లో ఏదైనా గోడ లేదా ఏదైనా మీకు సహకారం అందించే వస్తువు ఉండేలా చూసుకోండి. ఎందుకంటే శృంగారం అయిపోయిన తరువాత ఆ భంగిమ నుండి లేచేటప్పుడు మీకు లేవటానికి అవి సహకారం అందిస్తాయి .

4. పక్క పక్క న పడుకోవడం, వెనుక వైపు నుండి :

4. పక్క పక్క న పడుకోవడం, వెనుక వైపు నుండి :

మీరు మొదట పడక పై పడుకోండి. మీ భాగస్వామి మీ వీపుకు అభిముఖంగా పడుకోమని చెప్పండి. మీకు ఎక్కడైతే సహకారం కావాలని అనిపిస్తుందో అటువంటి దగ్గర దిండ్ల సహాయాన్ని తీసుకోండి. ఈ భంగిమలో అంగ ప్రవేశం అనేది అంత లోతుగా జరగదు కానీ ఇది కూడా మంచిదే. ఎందుకంటే గర్భధారణ చివరి దశకు చేరుకున్నప్పుడు మరి లోతు గా అంగ ప్రవేశం జరగటం వల్ల మీరు అసౌకర్యానికి గురవుతారు కాబట్టి ఇలా చేయడం మంచిదే.

5. మంచం చివరిన:

5. మంచం చివరిన:

మీకు గనుక అంగం బాగా లోపలికి వెళ్తోంది అనే భావన మీకు కలగాలంటే, గర్భ ధారణ సమయం లో ఈ శృంగార భంగిమను ప్రయత్నించండి. మంచం చివరికి వచ్చి మీరు మీ వీపు భాగాన్ని వాల్చి పడుకోండి. మీ కాళ్ళు వంచి, మీ పాదాలు నేలను తాకేలా చూసుకోండి. మీ వీపుభాగం చదును గా ఉండకూడదు, కాబట్టి ఒక దిండుని మీ వెనుక పెట్టుకోండి. మీ భాగస్వామి అతనికి తోచినట్లు మోకాళ్ళ పై నిలబడి లేదా నిలబడి మంచం ఎత్తుని బట్టి అతనికి ఎలా సౌకర్యవంతంగా ఉంటే ఆలా మీతో శృంగారం చేస్తాడు.

6. స్త్రీ పైన ఉండి వెనక్కి తిరిగి ఉండటం:

6. స్త్రీ పైన ఉండి వెనక్కి తిరిగి ఉండటం:

ఈ భంగిమలో మీకు మీరు శక్తివంతులుగా భావిస్తారు. ఎందుకంటే మీ భాగస్వామి వెనుక నుండి అతని చేతులతో మిమల్ని పట్టుకొని మీకు చేయూతనిస్తాడు. మీ భాస్వామి తన వీపుని వాల్చి పడుకున్న తరువాత మీరు మీ వీపు భాగాన్ని అతని ముఖానికి అభిముఖం గా ఉండేలా అతని పై న కూర్చోండి. అతను మీ వీపుని చూడగలగాలి. ఈ భంగిమలో మీ పొట్ట బరువుని అతని తొడలు కూడా మోసి మీకు సహకారం అందిస్తాయి. అలానే మీరు కూడా శృంగార సమయంలో అతని కాళ్ళను పట్టుకొని , వాటి మద్దతుతో శృంగారం చేసి బాగా ఆస్వాదిస్తారు.

7. జాగ్రత్తలు:

7. జాగ్రత్తలు:

ఓరల్ సెక్స్ ( నోటితో చేయు శృంగారం):

గర్భధారణ సమయంలో ఓరల్ సెక్స్ అనేది సురక్షితమైనది. కానీ మీ భాగస్వామి ఓరల్ సెక్స్ చేసేటప్పుడు అతని నోటి ద్వారా గాలిని ఊదకూడదు, ఇలా చేయటం వల్ల రక్త నాళ్లలో గాలి బుడగలు ఏర్పడి, రక్త నాళ్లలో రక్తం గడ్డగట్టి రక్త ప్రసరణ ఆగిపోయే అవకాశం ఉంది. ఇలా జరగటం మీకు, మీ లోపల పెరుగుతున్న బిడ్డకు ఇద్దరికీ మంచిది కాదు. మీ భాస్వామి ఎప్పుడైతే గాలిని మీ జననేంద్రియాలు వద్ద ఊదుతాడో అటువంటి సమయంలో ఈ గాలి బుడగలు అనేటివి ఏర్పడుతాయి.

చిట్కా: మీ భాగస్వామికి గనుక ఓరల్ హెర్పెస్ అనే వ్యాధి గనుక ఉన్నట్లయితే ఓరల్ సెక్స్ చేయకండి, నోటితో చేయు శృంగారానికి దూరంగా ఉండండి.

English summary

Pregnancy Safe Intercourse positions

Many of you are still confused about sex during pregnancy and just to make it clear once again it's absolutely normal and healthy till you are comfortable doing it. So, sex is still in the picture when you are pregnant but the problems occur when your normal positions may start feeling uncomfortable as your belly gets bigger with time.
Story first published: Tuesday, September 12, 2017, 13:00 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more