For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భిణీల్లో నిద్రలేమికి కారణాలివే !

By Y. Bharath Kumar Reddy
|

గర్భంతో ఉన్నప్పుడు ప్రతి మహిళ ఎంతో సంతోషిస్తుంది. తాను తల్లి కాబోతున్నానే ఆనందంలో ఉంటుంది. అలాగే ఆ సమయంలో ఆమె అనేక ఒత్తిళ్లకు గురవుతుంది. ఇందులో మొదటిది నిద్రలేమి. 80శాతం కంటే ఎక్కువ మంది గర్భిణీలు నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నట్లు కొన్ని సర్వేల్లో తేలింది.

గర్భిణీలకు ఒకవైపు బాగా అలిసిపోయి నిద్ర వస్తున్నట్లు ఫీలింగ్ కలుగుతుంంది. మరోవైపు నిద్రపోలేని పరిస్థితిలో ఉంటారు. దీంతో చాలా అసహనానికి గురవుతారు. గర్భిణీగా ఉన్నప్పుడు హార్మోన్ల మార్పు, శారీరక అసమానతలు వల్ల నిద్ర లేమి సమస్య మొదలవుతుంది. ప్రెగ్నెన్సీలో ప్రతీ త్రైమాసికంలో నిద్ర లేమి సమస్య పెరుగుతూనే ఉంటుంది.

reasons for pregnancy insomnia

<strong>తల్లి నిద్రలేమి పిల్లలపై ప్రభావం చూపుతుందా?!</strong>తల్లి నిద్రలేమి పిల్లలపై ప్రభావం చూపుతుందా?!

ముఖ్యంగా హార్మోన్లలో మార్పులు తలెత్తడం వల్ల చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. బాగా నిద్రపోతే మేలని గర్భిణీలకు అనిపిస్తూ ఉంటుంది. అయితే నిద్ర మాత్రం సరిగ్గా పట్టదు. గర్భిణీలలో నిద్రలేమికి కారణాలు ఏమిటో తెలుసుకుందామా.

బిడ్డ కదలికలు

బిడ్డ కదలికలు

ప్రెగ్నెన్సీ చివరి సమయంలో గర్భంలో బిడ్డ కదలికలు పెరుగుతాయి. దీంతో సరిగ్గా నిద్రపోలేరు. కొన్ని సందర్భాల్లో గాఢ నిద్రలో ఉన్న వెంటనే మేల్కొవాల్సి వస్తుంది. తర్వాత ఇక నిద్రపట్టదు. గర్భంలో బిడ్డ కదలికల వల్ల గర్భిణీలకు నిద్రలేమి సమస్య ఏర్పడుతుంది. అయితే కొందరు మహిళలు నిద్ర కన్నా బిడ్డ కదలికలను ఎక్కువగా ఆనందిస్తారు.

ఆందోళన / ఒత్తిడి

ఆందోళన / ఒత్తిడి

గర్భిణీలు ఎక్కువ ఒత్తిడి, ఆందోళనలకు గురవుతుంటారు. ఎక్కువగా పుట్టబోయే బిడ్డ గురించే ఆలోచిస్తూ ఉంటారు. అలాగే దీంతో వారిలో నిద్రలేమి సమస్య ఏర్పడుతుంది. బిడ్డ పుట్టబోయే చివరి దశలో ఎక్కువగా ఈ సమస్య తలెత్తుతుంటుంది. ఎందుకంటే ఆ సమయంలో గర్భిణీలు ఎక్కువ ఆందోళనకు గురవుతారు.

కాళ్ల తిమ్మిరిలు

కాళ్ల తిమ్మిరిలు

ఇక గర్భిణీలు ఎక్కువగా కాళ్ల తిమ్మిరిల సమస్యతో బాధపడుతుంటారు. రాత్రి సమయాల్లో ఈ సమస్యతో ఎక్కువగా ఇబ్బందిపడుతుంటారు. నిద్రపోయే సమయంలో కాళ్ల తిమ్మిరిలు వస్తుంటాయి. ఒక్కోసారి గాఢ గాఢ నిద్రలో ఉన్న కూడా కాళ్ల తిమ్మిరిల వల్ల అకస్మాత్తుగా నిద్రలో నుంచి మేల్కొంటారు.

తరచుగా మూత్రంరావడం

తరచుగా మూత్రంరావడం

గర్భధారణ సమయంలో తరచుగా మూత్రవిసర్జన కోసం వెళ్లాల్సి వస్తోంది. తరచుగా నడుస్తుండటం వల్ల ఎక్కువగా బాత్ రూం కి వెళ్ళాల్సి వస్తుంది. బాగా నిద్రపోయే సమయంలో కూడా యూరిన్ కోసమని లేవాల్సి వస్తుంది. దీంతో నిద్రకు భంగం కలుగుతుంది. చివరి త్రైమాసికంలో ఈ సమస్య మరింత తీవ్రమవుతుంది. రాత్రి సమయాల్లో మూత్రం ఎక్కువ రావడానికి కారణం పిండం పెరగటం. అది బ్లాడెర్ పై ఎక్కువ ఒత్తిడి ని కలిగించడం వల్ల ఈ సమస్య తలెత్తుతుంది. ఈ పరిస్థితిలో మానసిక ఒత్తిడి ఎక్కువై నిద్రలేమి సమస్యను పెంచుతుంది.

బేబీ బంప్

బేబీ బంప్

ఇక బేబీ బంప్ అనేది కూడా గర్భిణీలలో నిద్రలేమి సమస్యకు కారణం అవుతుంది. ఆ సమయంలో వీలైనంత వరకు డాక్టర్ సలహాలను తీసుకోవాలి. లేదంటే ఎక్కువగా ఇబ్బందులుపడాల్సి వస్తుంది. నైటంతా నిద్రలేకుండా గడపాల్సి వస్తుంది.

<strong>గర్భధారణ సమయంలో ఎదురయ్యే 14 సమస్యలు</strong>గర్భధారణ సమయంలో ఎదురయ్యే 14 సమస్యలు

ఆహారం

ఆహారం

గర్భధారణ సమయంలో కొన్నిసార్లు గర్భిణీలు తీసుకునే ఆహారం కూడా నిద్రలేమికి కారణం కావొచ్చు. కాఫీ లేదా ఇతర ఏవైనా నిద్రకు భంగం కలిగించే ఆహారాలు ఏవి తీసుకున్నా చాలా ఇబ్బందులుపడాల్సి వస్తుంది. గర్భిణీలు వీలైనంత వరకు వాటికి దూరంగా ఉండాలి. ఈ విషయంలో డాక్టర్ల నుంచి కూడా సలహాలు తీసుకోవాలి.

కలలు

కలలు

కొందరు గర్భిణీలు నిద్రలో వైర్డ్ డ్రీమ్స్ కు గురవుతుంటారు. కలల వల్ల రాత్రి సమయంలో అకస్మాత్తుగా నిద్రలో నుంచి మేల్కొంటారు. ఇలా కలలు రావడానికి చాలా కారణాలున్నాయి. ఆందోళనలు, ఏం జరగనుందోననే భయం, పుట్టబోయే బిడ్డ ఆరోగ్యం, ఇతర ఆలోచనల వల్ల రాత్రి సమయంలో గర్భిణీలకు ఆలోచనలు వస్తుంటాయి.

English summary

Reasons For Pregnancy Insomnia

Current surveys indicate that more than 80% of the pregnant women experience insomnia at least once. Here are the reasons for pregnancy insomnia.
Story first published:Thursday, November 2, 2017, 16:09 [IST]
Desktop Bottom Promotion