For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అబార్షన్ జరగకూడదనుకుంటే ఎట్టిపరిస్థితిలో తినకూడని ఆహారాలు..!

గర్భధారణ సమయంలో తల్లి ఆరోగ్యకరమైన ఆహారాలను తీసుకోవడం చాలా అవసరం. ఇలాంటి వారిలో ఆరోగ్య సమస్యలు చాలా తక్కువగా ఉంటాయి. గర్భం పొందిన తర్వాత తల్లి కొన్ని ఖచ్చితమైన ఆహారాలను తీసుకోకూడదు. అవేంటో ఒక సారి తెల

By Lekhaka
|

గర్భం పొందడం ఒక గొప్ప వరం. గొప్ప అవకాశం అని డాక్టర్స్ చెబుతుంటారు.కానీ, మొదటసారి గర్భం పొందినప్పటి నుండి గర్భస్రావం జరుగుతూనే ఉంటే , అప్పుడు శరీరంలో మనకు తెలియని సమస్యలేమిటో జరుగుతున్నట్లు గుర్తించి, వెంటనే పరిష్కరించుకోవాలి. అయితే, కొన్ని సందర్భాల్లో గర్భస్రావం జరగడమనేది సహజమైనదే అయితే అందుకు కొన్ని సింపుల్ హోం రెమెడీస్ లేదా సింపుల్ పిల్స్ లేదా హెర్బ్స్ ట్రీట్ చేస్తాయి.

గర్భస్రావానికి వివిధ రకాల కారణాలున్నాయి, కొన్ని గర్భస్రావాలు, హార్మోనుల అసమతుల్యత వల్ల , మరొకన్ని యూట్రస్ వీక్ గా ఉండటం వల్ల జరుగుతాయి. చాలా వరకూ గర్భస్రావాలు బ్లడ్ క్లాట్స్ ఏర్పడటం మరియు వ్యాధినిరోధక సమస్యల వల్ల కూడా జరగుతుంటాయి. ఇటువంటి పరిస్థితిలో , గర్భాశయంలో పిండం ఏర్పడే వరకు బాగనే ఉన్నా, తర్వాత గర్భస్రావాలు జరగుతుంటాయి.గర్భస్రావాలకు కారణమేదైనా, ఈ సమస్యను నివారించుకోవడం చాలా అవసరం . గర్భం పొందడానికంటే ముందే జాగ్రత్తలు తీసుకోవడం వల్ల తర్వాత ప్రెగ్నెన్సీలో గర్భ స్రావం జరగకుండా నివారించుకోవచ్చు.

Stay Away From These 8 Foods If You Want To Avoid Miscarriages!

ఆశ్చర్యకరమైన విషయమేటంటే గర్భస్రావానికి ఆహారాలు కూడా కారణమవుతాయి., గర్భం పొందడం చాలా సున్నితమైన అంశం. కాబట్టి, తల్లితో పాటు బిడ్డకు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం.

తల్లి తీసుకునే న్యూట్రీషియన్, డైట్ ముఖ్యపాత్రను పోషిస్తాయి. తల్లి ఏఏ ఆహారాలను తీసుకుంటుందో, అవే ఆహారాలను బిడ్డకు కూడా చేరుతాయి. కాబట్టి, గర్భధారణ సమయంలో తల్లి ఆరోగ్యకరమైన ఆహారాలను తీసుకోవడం చాలా అవసరం. ఇలాంటి వారిలో ఆరోగ్య సమస్యలు చాలా తక్కువగా ఉంటాయి. గర్భం పొందిన తర్వాత తల్లి కొన్ని ఖచ్చితమైన ఆహారాలను తీసుకోకూడదు. అవేంటో ఒక సారి తెలుసుకుందాం. గర్భ స్రావం జరగకుండా నివారించుకుందాం...

శుభ్రం చేయని వెజిటేబుల్స్, ఫ్రూట్స్

శుభ్రం చేయని వెజిటేబుల్స్, ఫ్రూట్స్

శుభ్రం చేయని, నీటితో కడగని వెజిటేబుల్స్, ఫ్రూట్స్ వివిధ రకాల మైక్రోబ్స్ ను కలిగి ఉంటాయి. ఇవి తల్లిలో ఇన్ఫెక్షన్స్ కు దారితీస్తుంది. అదే విధంగా గర్భస్రావానికి దారితీస్తుంది.

కాఫీ ఎక్కువగా తాగడం

కాఫీ ఎక్కువగా తాగడం

గర్భధారణ సమయంలో ఎక్కువగా కాఫీ తాగడం వల్ల గర్భస్రావానికి దారితీస్తుంది. ఎక్సెస్ కెఫిన్ శరీరంలో వేడిని పెంచుతుంది. దాంతో గర్భస్రావం జరిగే అవకాశాలు ఎక్కువ.

 ఎక్సెస్ గ్రీన్ టీ

ఎక్సెస్ గ్రీన్ టీ

ఒక కప్పు కంటె ఎక్కువ గ్రీన్ టీ తాగినా ప్రమాదమేనని రీసెంట్ గా జరిపిన పరిశోధనల్లో కనుగొన్నారు. ఇది గర్భస్రావానికి దారితీస్తుందని హెచ్చరి్తున్నారు. గ్రీన్ టీలో కూడా కెఫిన్ అధికంగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు .

 లిచి

లిచి

లెట్చి , గర్బిణీల ఎట్టి పరిస్థితిలో తినకూడని పండ్లలో ఇది ఒకటి. ఇది శరీరంలో వేడి పుట్టిస్తుంది. వైజినల్ బ్లీడింగ్ కు కారణమవుతుంది. గర్భస్రావానికి దారితీస్తుంది.

మొలకెత్తిన బంగాళదుంప

మొలకెత్తిన బంగాళదుంప

మొలకెత్తిన బంగాళదుంపలో సొలానిన్ అనే కాంపౌండ్ ఉండటం వల్ల ఇది ఫీటస్ కు డ్యామేజ్ కలిగిస్తుంది. గర్భస్రావానికి కారణం అవుతుంది. కాబట్టి స్ప్రాటెడ్ పొటాటోలకు దూరంగా ఉండాలి

నువ్వులు

నువ్వులు

గర్భిణీల శరీరంలో వేడిని పుట్టించే ఆహారాల్లో నువ్వులు ఒకటి. ముఖ్యంగా తేనెతో మిక్స్ చేసి తింటే గర్భస్రావానికి కారణమవుతుంది.

లివర్

లివర్

మాంసాహారం తినే వారైతే అనిమల్ లివర్ తినడం మానేయాలి. ఇందులో విటమిన్ ఎ అధికంగా ఉంటుంది. ఇది పిండం విచ్ఛిన్నం చేసి, గర్భస్రావానికి కారణమవుతుంది.

చేపలు

చేపలు

కొన్ని రకాల చేపల్లో మెర్క్యురి అధికంగా ఉంటుంది. దాంతో కంటిన్యుగా గర్భస్రావాలు జరుగుతుంటాయి. అందువల్ల కొన్ని రకాల చేపలను తినకపోవడం మంచిది.

English summary

Stay Away From These 8 Foods If You Want To Avoid Miscarriages!

Stay Away From These 8 Foods If You Want To Avoid Miscarriages!
Story first published: Tuesday, January 17, 2017, 7:57 [IST]
Desktop Bottom Promotion