For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భధారణ సమయంలో తరచుగా వచ్చే జలుబు మరియు దగ్గులను నివారించగల చిట్కాలు

గర్భధారణ సమయంలో, మహిళల యొక్క శరీరం చాలా రకాలుగా పరివర్తనం చెందుతుంది. అలా మానవ శరీరం అన్నింటికి సర్దుబాటు కావడానికి కొంత సమయం పడుతుంది. ఉబ్బెత్తుగా పెరుగుతున్న శరీర పరిమాణం ఆధారంగా - బరువు పెరగడాన్ని

|

గర్భధారణ సమయంలో, మహిళల యొక్క శరీరం చాలా రకాలుగా పరివర్తనం చెందుతుంది. అలా మానవ శరీరం అన్నింటికి సర్దుబాటు కావడానికి కొంత సమయం పడుతుంది. ఉబ్బెత్తుగా పెరుగుతున్న శరీర పరిమాణం ఆధారంగా - బరువు పెరగడాన్ని కొంతమంది మహిళలు తట్టుకోవడం చాలా కష్టంగా ఉండవచ్చు. ఇలాంటి దశలో ఉండగా, గర్భిణీ స్త్రీలు వ్యవహరించే ఇతర పరిస్థితులకు అనుగుణంగా ఎదురయ్యే కొన్ని రకాల సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. అలాంటి సమయంలో అనారోగ్యంగాని సంభవిస్తే, వారి పరిస్థితి మరింతగా దిగజారుతుంది.

జలుబు మరియు దగ్గు అనేవి అందరికీ సంభవించే అతి సాధారణమైన సమస్యని చెప్పవచ్చు. గొంతులో ఇబ్బంది, ముక్కు కారటం, నిరంతరంగా వచ్చే తుమ్ములు, అలిసిపోవడం అనేటటువంటివి వాటి యొక్క లక్షణాలుగా చెప్పవచ్చు. ఈ లక్షణాలలో ఏవైనా మీకు సంభవించినట్లయితే, దగ్గు మరియు జలుబులను రెండింటినీ నివారించడానికి తక్షణమే తగు చర్యలను తీసుకోవడం చాలా మంచిది.

tips to prevent cold and cough

మీ రోజువారీ జీవన విధానంలో మీరు కలిగివున్న కొన్ని అలవాట్లు కొన్ని సమస్యల నుండి బయటపడేసేందుకు ఖచ్చితంగా పనిచేస్తాయి. ఏదేమైనప్పటికీ, జలుబు మరియు దగ్గు సమస్యలు ఎదురైనప్పుడు మీ గర్భంలో ఉన్న శిశువు గురించి మీరు ఆందోళన చెందవలసిన అవసరం లేకుండానే - దానికదే సంరక్షించబడుతున్నది. కానీ అలా అని ఈ సమస్యను తేలిగ్గా తీసుకోవాలని మీకు చెప్పటంలేదు. జలుబు మరియు దగ్గును నివారించటానికి పాటించవలసిన జాగ్రత్తలను ఈ క్రిందన ఇవ్వబడ్డాయి. అవేమిటో ఒకసారి మీరు చూడండి !

1. ఫ్లూకు సంబంధించిన టీకాను వేయించుకోండి :

1. ఫ్లూకు సంబంధించిన టీకాను వేయించుకోండి :

జలుబును నివారించే మంచి వైద్య మార్గం ప్రస్తుతానికి అందుబాటులో లేదు. మీకు గర్భధారణ జరిగిన మూడవ త్రైమాసికం లోపు ఏ సమయంలో అయినా మీరు దీని భారిన పడవచ్చు. వాస్తవానికి, జలుబు నుండి రక్షణనివ్వడం అనేది, మీరు శిశువుకు జన్మనిచ్చిన ఆరు నెలల తరువాత వరకు ఉంటుంది. కాబట్టి, ఇలాంటి ఫ్లూ ఏ విధంగానూ మీ బిడ్డను ప్రభావితం చెయ్యదు. గర్భధారణ సమయంలో మీరు దీని నుండి పూర్తిగా సురక్షితంగా ఉంటారు.

2. ప్రతినిత్యం చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవాలి :

2. ప్రతినిత్యం చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవాలి :

వ్యక్తిగత పరిశుభ్రతను కలిగి ఉండటం అనేది జలుబు మరియు దగ్గును నివారించగల ఒక ఉత్తమమైన మార్గం. మీ చేతులు ఇతర వ్యక్తుల మధ్య ఒక సమన్వయకారిగా ఉన్నట్లయితే అది ఈ వైరస్ వ్యాప్తికి కారణం కావచ్చు. అలాగే కొన్నిసార్లు చేతులతో సమన్వయం చేసే పద్ధతిని పూర్తిగా తప్పించడానికి వీలుపడకపోవచ్చు. అందువల్ల ఈ వైరస్ను మీ శరీరంలో ప్రవేశించకుండా నివారించటం కోసం, గోరువెచ్చని నీటిలో చేతులను ముంచి, సబ్బుతో కడుక్కోవలసిందిగా సూచించబడినది.

3. హ్యాండ్ సానిటైజర్ను ఉపయోగించండి :

3. హ్యాండ్ సానిటైజర్ను ఉపయోగించండి :

మనము బయటన ఉన్నప్పుడు చేతులను కడగడం సాధ్యం కాకపోవచ్చు. అందుకోసం మీరు హ్యాండ్ సానిటైజర్ను మీతో పాటు తీసుకువెళ్లడం మంచిది. హ్యాండ్ సానిటైజర్లో ఉన్న ఆల్కహాల్, మీ శరీరంలోనికి ఈ వైరస్ వ్యాప్తిని తీవ్రంగా నిరోధిస్తుంది. మీరు ఆల్కహాల్ యొక్క వాసనను ఇష్టపడకపోతే, ఒక సువాసన భరితమైన వాసనను కలిగిన సానిటైజర్ను ఎంపిక చేసుకోండి, దానివల్ల మీరు విసుగు చెందరు.

4. పానీయాలను ఎక్కువగా తీసుకోండి :

4. పానీయాలను ఎక్కువగా తీసుకోండి :

పానీయాలను ఎక్కువగా తీసుకుంటూ ఉండటం వలన దగ్గు మరియు జలుబు సమస్యకు సహాయపడుతుంది. శరీరంలో ఉన్న హానికరమైన వ్యర్థాలను బయటకు లాగే సామర్థ్యం కేవలం ఈ పానీయాలు (ద్రవాలు) మాత్రమే కలిగి ఉంటాయి. ద్రవాలు అనేవి కేవలం నీటి రూపంలోనే కాక, కొన్ని పండ్ల రసాలను రూపంలోనూ కలిగి ఉంటాయి. టీ ని వినియోగించవచ్చు, కానీ కెఫీన్కు ప్రతికూలంగా ఉన్న వాటిని మాత్రమే ఎంచుకోవడం మంచిది, లేదంటే అవి గర్భంలో ఉన్న శిశువును ప్రభావితం చేసేదిగా ఉంటుంది. అలాంటి ప్రతికూల ప్రభావాలను తొలగించటానికి హెర్బల్ టీలను వినియోగించుకోవటం చాలా ఉత్తమం.

సమతుల్యమైన ఆహారాన్ని తీసుకోండి :

సమతుల్యమైన ఆహారాన్ని తీసుకోండి :

సరైన ఆహారాన్ని తీసుకోవడం వలన దగ్గు మరియు జలుబును సులభంగా నివారించవచ్చు. శరీరంలో రోగనిరోధక వ్యవస్థ మెరుగ్గా పని చేయడానికి అవసరమయ్యే అన్ని రకాల విటమిన్లు, ఖనిజాలు, మరియు యాంటీఆక్సిడెంట్లను మీరు తీసుకునే ఆహారంలో కలిగి ఉండేటట్లుగా చూసుకోండి. మీరు జలుబుతో బాధపడుతున్నప్పుడు చక్కెరను కలిగిన తీపి పదార్థాలను పక్కనపెట్టి, విటమిన్-సి సమృద్ధిగా ఉన్న చక్కెర స్నాక్స్ ను తీసుకోండి.

6. ఒత్తిడికి దూరంగా ఉండండి :

6. ఒత్తిడికి దూరంగా ఉండండి :

మీరు ఒత్తిడిలో ఉన్నప్పుడు - మీ శరీర రోగనిరోధక వ్యవస్థ ప్రభావితమవ్వడానికి కారణం కావచ్చు. బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ అనేది కూడా, మీరు కొన్ని నిమిషాలలోనే అనారోగ్యానికి గురయ్యేటట్లుగా చెయ్యవచ్చు. కాబట్టి, మీరు శారీరకంగా మరియు మానసికంగా ఒత్తిడిని కలిగి ఉండకండి. అందుకోసం మీకు ఒక రోజులో కావలసినంత విశ్రాంతిని పొందటం కోసం తగిన సమయాన్ని కేటాయించుకోండి. ధ్యానం మరియు కొన్ని రకాల లోతైన శ్వాస వ్యాయామాలను చేయటం ద్వారా ఒత్తిడిని సమర్థవంతంగా నివారించవచ్చు.

7. జలుబును, దగ్గుని కలిగి ఉన్న వ్యక్తులకు దూరంగా ఉండండి :

7. జలుబును, దగ్గుని కలిగి ఉన్న వ్యక్తులకు దూరంగా ఉండండి :

మీ చుట్టుపక్కల ఉన్న ఎవరికైనా జలుబు మరియు దగ్గు సమస్యలతో బాధపడుతున్నట్లయితే, అవి పూర్తిగా తగ్గేంతవరకు - అలాంటి వ్యక్తులకు మీరు కాస్త దూరంగా ఉండండి. దూరంగా ఉండడమంటే, శారీరకంగా దూరంగా ఉండటం మాత్రమే కాకుండా, వారు వినియోగించే వంట సామాగ్రిని, తువాళ్లను మీరు వినియోగించకపోవడం చాలా మంచిది.

8. మీ ముఖాన్ని తాకవద్దు :

8. మీ ముఖాన్ని తాకవద్దు :

మీ చేతులు తగినంత శుభ్రంగా లేవని మీకు అనుమానంగాని ఉంటే, మీ ముఖాన్ని తాకడం మంచిది కాదు. ఎందుకంటే, వైరస్ అనేది మీ నోరు మరియు ముక్కు ద్వారా శరీరంలోకి ప్రవేశించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ మీరు చేతులు కడిగినట్లయితే, అప్పుడు కూడా అనవసరంగా మీ చేతులతో ముఖాన్ని తాకవద్దు, ఎందుకంటే మీ చేతిలో వైరస్ అనేది దాగి ఉందని మీకు తెలియకపోవచ్చు.

9. మీ చుట్టూ ఉన్న ప్రదేశాలను ఎల్లప్పుడు శుభ్రంగా ఉంచుకోండి :

9. మీ చుట్టూ ఉన్న ప్రదేశాలను ఎల్లప్పుడు శుభ్రంగా ఉంచుకోండి :

బాక్టీరియా మరియు వైరస్ అనేవి మీరుండే ప్రతిచోట ఉంటాయి, ముఖ్యంగా అపరిశుభ్రంగా ఉన్న పరిసరాలలో ! కాబట్టి దగ్గు మరియు జలుబులను నివారించడానికి మీరు ఆచరించవలసిన కార్యాచరణలో "పరిశుభ్రత" అనేది చాలా ముఖ్యమైనది. మీ పరిసరాలలో ఉన్న దుమ్ము, ధూళి మరియు తేమ అనేవి మీ ఆరోగ్య సమస్యలకు కారణం కావచ్చు. మీ గర్భధారణ సమయంలో దుమ్ము, ధూళి అనేవి విపరీతమైన ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు. తేమ అనేది మీ ఛాతికి ఒత్తిడిని కలిగించేదిగా దారితీయవచ్చు. అందువల్ల మీరు ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా వుంచుకోవాల్సిన అలవాటును అభివృద్ధి చేసుకోవటం చాలా మంచిది.

English summary

tips to prevent cold and cough | how to prevent cold and cough during pregnancy | homemade tips to prevent cold and cough during pregnancy

Cough and cold are common illnesses that occur to anyone. Some of the symptoms include irritated throat, runny nose, tiredness, etc. Even before any of these happen to a pregnant woman, it is better to take steps to prevent both a cough and cold. And natural remedies are the best way to go about it.
Story first published:Monday, December 18, 2017, 17:09 [IST]
Desktop Bottom Promotion