For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భిణీలు కంపల్సరీ తినాల్సిన క్యాల్షియం ఫుడ్స్ ..!!

గర్భధారణ సమయంలో మీరు క్యాల్షియం అధికంగా ఉన్న ఆహారాలు తీసుకోవకపోతే, తల్లి నుండి శిశువు పూర్తిగి గ్రహించబడుతుంది. దాంతో తల్లిలో క్యాల్షియం లోపం ఏర్పడి తల్లి ఆరోగ్యం మీద ప్రభావం చూపుతుంది.

By Lekhaka
|

గర్భం ధరించిన మొదటి మూడు నెలలు చాలా ముఖ్యమైన దశ. గర్భం ధరించిన ప్రారంభ దశలో శరీరానికి కావల్సిన పోషకాహారాల అవసరాలను గుర్తించి జాగ్రత వహించాలి. ముఖ్యంగా మొదటి మూడు నెలల్లో ప్రత్యేకంగా నిబంధనలతో ప్రెగ్నెన్సీ డైయట్ ను ఫాలో అవ్వాలి. ఎందుకంటే మొదటి మూడు నెలల్లో గర్భం ప్రోటీన్ మరియు క్యాల్షియం ఆహారాలను ప్రధానంగా చేసుకుంటుంది. ఇవి గర్భంలోని బిడ్డ వేగంగా పెరగడానికి సహాయపడుతుంది. అంతే కాదు బిడ్డలో ఎముకలు మరియు దంతాలు బలంగా ఏర్పడటానికి, శిశువు పెరుగుదలకు చాలా అవసరం. అంతే కాదు ఇటు తల్లికి, అటు బిడ్డకు ఆరోగ్యకరమైన గుండె, నరాలు మరియు కండరాల బలానికి ఇటువంటి పోషకాంశాలు చాలా బాగా సహాయపడుతాయి.

Top 10 Calcium Rich Foods You Should Eat During Pregnancy,

గర్భధారణ సమయంలో మీరు క్యాల్షియం అధికంగా ఉన్న ఆహారాలు తీసుకోకపోతే, తల్లి నుండి శిశువు పూర్తిగి గ్రహించబడుతుంది. దాంతో తల్లిలో క్యాల్షియం లోపం ఏర్పడి తల్లి ఆరోగ్యం మీద ప్రభావం చూపుతుంది.

అందువల్ల క్యాల్షియం తల్లి, బిడ్డకు చాలా ముఖ్యమైన పోషకాంశంగా గుర్తించాలి. ప్రెగ్నెన్సీ డైట్ లో క్యాల్షియం అధికంగా ఉండే ఆహారాలను చేర్చడం చాలా కీలకం. గర్భధారణ సమయంలో క్యాల్షియం ఎక్కువగా తీసుకోవడం వల్ల కడుపులో పెరిగే బిడ్డ ఎముకలు, వెన్నుముక ఏర్పాటుకు సహాయపడుతుంది. గర్భిణీ శరీరానికి సరిపడా క్యాల్షియం అందకపోతే , గర్బిణీ ఇక ముందు ఓస్టిరియోఫోసిస్ అనే ఎముకల వ్యాధి లేదా కీళ్ళ వ్యాధిని ఎదుర్కోవల్సి వస్తుంది. గర్భిణీ రెగ్యులర్ డైట్లో హెల్తీ ఫుడ్స్ ను తీసుకోవడం వల్ల శరీరంలో క్యాల్షియంను రిజర్వ్ చేసి ఉంచుతాయి.
కాబట్టి, గర్భిణీలు రెగ్యులర్ గా తీసుకోవల్సిన క్యాల్షియం రిచ్ ఫుడ్స్ ఈ క్రింది విధంగా..

పాలు :

పాలు :

క్యాల్సియం అత్యధికంగా ఉన్న డైరీ ప్రొడక్ట్ ఇది. పాలను అన్ని వయస్సుల వారు తీసుకోవచ్చు. ప్రతి రోజూ ఉదయం ఒక గ్లాసు పాలతో ప్రారంభిస్తే ఇక ఆరోజంతా హెల్తీగా , ఫిట్ గా కనబడుతారు. పాలు మాత్రమే కాదు, పాల ఉత్పత్తులకు సంబంధించిన పెరుగు, చీజ్, మొదలగునవి కూడా తీసుకోవాలి. ఈ మిల్క్ ప్రొడక్ట్స్ ను9 నెలలు నిండే వరకూ తీసుకోవచ్చు.

టోఫు:

టోఫు:

క్యాల్షియం ఎక్కువగా ఉండే ఫుడ్స్ లో టోఫు ఒకటి, ఇది శరీరంను ఫిట్ గా ఉంచుతుంది న్యూట్రీషియన్ ,క్యాల్షియం, మెగ్నీషియం, ఐరన్ వంటివి ఎక్కువ. ప్రెగ్నెన్సీ ప్లాన్ లోఉన్నవారు కూడా దీన్ని తినవచ్చు.

బాదం:

బాదం:

అన్ని రకాల నట్స్ లో కంటే బాదం గ్రేట్ క్యాల్సియం ఫుడ్, ఇందులో క్యాల్షియంతో పాటు విటమిన్ ఇ కూడా ఎక్కువగా ఉండటం వల్ల దీన్ని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం మంచిది. ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్ తగ్గిస్తుంది.

ఓట్ మీల్ :

ఓట్ మీల్ :

ఓట్స్ తో తయారుచేసిన పోరిట్జ్ లో న్యూట్రీషియన్ అధికంగా ఉంటాయి. ముఖ్యంగా క్యాల్షియం, రిబోఫ్లెవిన్, కార్బోహైడ్రేట్స్, ఫోలిక్ యాసిడ్, పొటాషియంలు ఎక్కువగా ఉన్నాయి. ఓట్ మీల్ ను ఉదయం హెల్తీ బ్రేక్ ఫాస్ట్ గా తీసుకోవచ్చు.ఇది పొట్ట నిండుగా ఉన్న అనుభూతిని కలిగిస్తుంది. ఆకలి కరికలను దూరం చేస్తుంది.

ఎండు ఖర్జూరం:

ఎండు ఖర్జూరం:

ప్రతి ఒక్కరూ ఎండు ఖర్జూరం తినవచ్చు. ఇందులో ఎనర్జీని అందించే న్యూట్రీషియన్ ఎక్కువగా ఉన్నాయి. ఈ స్వీట్ ఫ్రూట్ లో క్యాల్షియం అధికంగా ఉంటుంది. మీ దంతాలు, ఎముకలు స్ట్రాంగ్ ఉంచుతంది. ఎండుఖర్జూరాలు సూపర్ మార్కెట్స్ లో సులభంగా అందుబాటులో ఉన్నాయి. కాబట్టి స్వీట్ టూత్ తగ్గించుకోవడాని డేట్స్ గ్రేట్ గా సహాయపడుతుంది.

డ్రైడ్ ఫిగ్స్:

డ్రైడ్ ఫిగ్స్:

ఒక కప్పు ఎండిన అంజూర పండ్లతో 241 క్యాల్షియం పొందవచ్చు. అంతే కాదు వీటిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మరియు జింక్ కూడా పుష్కలంగా ఉన్నాయి. ఇవి గర్భిణీని ఆరోగ్యాంగా ఉంచుతాయి. ఫిగ్స్ ను ఫర్ఫెక్ట్ మిడ్ డే స్నాక్స్ గా తీసుకోవచ్చు. ఇందులో క్యాల్షియం ఒక్కటి మాత్రమేకాదు,ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కవగా ఉంటుంది. ఇవి బోన్ హెల్త్ ను ప్రోత్సహించడం మాత్రేమే కాదు, మలబద్దకంను కూడా నివారిస్తుంది.

ఆరెంజెస్:

ఆరెంజెస్:

గర్భిణీలకు అవసరమయ్యే క్యాల్షియంను అందివ్వడంలో ఆరెంజెస్ బెస్ట్ ఆప్షన్ మీరు డైరీ ఫుడ్ ప్రొడక్ట్స్ ను తినకపోతే ఆరెంజస్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి. ఆరెంజెస్ లో యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉన్నాయి. ఇది విటమిన్ సి అందివ్వడంత పాటు, వ్యాధినిరోధకశక్తిన పెంచుతుంది మరియు హెల్తీ ప్రెగ్నెన్సీని పొందుతారు. ఈ ట్యాంగీ ఫ్రూట్ టేస్ట్ బడ్స్ నోరూరిస్తూ మార్నింగ్ సిక్నెస్ ను తగ్గిస్తుంది.

బ్రొకోలి:

బ్రొకోలి:

బ్రొకోలీ క్యాల్షియంను అందిస్తుంది. ఈ క్రూసిఫెరస్ వెజిటేబుల్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల వివిధ రకాల కాంప్లికేషన్స్ తగ్గించుకోవచ్చు.

కెల:

కెల:

ఇది కూడా క్యాబేజ్ లానే ఉంటుంది. క్యాల్షియంకు స్టోర్ హౌస్ వంటిది. దీన్నిసలాడ్స్ రూపంలో చిప్స్ లేదా ప్యాటిస్ రూపంలో తీసుకోవచ్చు. క్యాల్షియం లోపం ఉన్నవారు కూడా కేలాను తినడం వల్ల గర్భధారణ సమయంలో వచ్చే సమస్యలను నివారించుకోవచ్చు.

బోక్ చోయ్:

బోక్ చోయ్:

ఈ గ్రీన్ లీఫీ వెజిటేబుల్ క్యాబేజ్ ఫ్యామిలికి చెందినది.ఇది చైనీస్ వంటల్లో అత్యంత ముఖ్యమైనది. కాబట్టి, గర్భిణీల్లో ల్యాక్టోజ్ ఇంటాలరెన్స్ లేదా ఆవుపాలు నచ్చని వారు సింపుల్ గా బోక్ చోయ్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి.

English summary

Top 10 Calcium Rich Foods You Should Eat During Pregnancy

Calcium intake during pregnancy is quite essential to ensure the skeletal development of the fetus. An insufficient intake of calcium while expecting can increase your risk of suffering from osteoporosis in the later stages of life manifold. So all you moms-to-be do take very good care of your diet during pregnancy and increase the calcium reserves in your body.
Desktop Bottom Promotion