For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కడుపుతో ఉన్నవారు పన్నీర్ తినాల్సిన 6 కారణాలు

|

దక్షిణాసియాలో, ముఖ్యంగా భారత ఉపఖండంలో తాజా మెత్తని జున్ను లాంటి ఛీజ్, పనీర్ గా ప్రసిద్ధి. దీన్ని కాటేజ్ చీజ్ అని కూడా అంటారు.దీన్ని వేడి పాలను నిమ్మరసం, పెరుగు లేదా వెనిగర్ వంటి వాటితో విరగ్గొట్టి చేస్తారు. ఇది అనేక వంటకాలలో చాలా సాధారణంగా వాడే పదార్థం.

కానీ కడుపుతో ఉన్నప్పుడు, మీ ఆహారంలో దాన్ని తినవచ్చా లేదా అనే సందేహం మీకు కలగవచ్చు. మామ్ జంక్షన్ ఈరోజు మీకు గర్భసమయంలో పన్నీర్ తినవచ్చో లేదో, దాని ఆరోగ్యలాభాలు, దుష్ప్రభావాలు మరియు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నీ తెలియచేస్తుంది.

ఆ వివరాలలోకి వెళ్ళేముందు, పన్నీర్ అనబడే ఈ కాటేజ్ ఛీజ్ మామూలు జున్ను కన్నా ఏవిధంగా వేరో తెలుసుకుందాం.

అవును, పాశ్చరైజ్డ్ పాలతో తయారుచేసిన పన్నీర్ కడుపుతో ఉన్నప్పుడు తినటానికి సురక్షితమే. కానీ మీరు మరీ ఎక్కువగా తినకూడదు. ఇంకా మీరు లాక్టోస్ ఇన్ టోలరెంట్ అయితే అంటే పాల ఉత్పత్తులకి అలర్జీ ఉన్నట్లయితే ఇంకా జాగ్రత్తగా ఉండాలి. పనీర్ లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది, దీన్ని మీ గర్బధారణ సమయం డైట్ లో జతచేయటం వలన మీకు రోజూ సరిపడే 1000మి.గ్రాముల కాల్షియం సరిగ్గా అందుతుంది. ఇదే కాక, కడుపుతో ఉన్న సమయంలో పనీర్ తో చాలా లాభాలున్నాయి...

కడుపుతో ఉన్నప్పుడు పనీర్ ఆరోగ్య లాభాలు

కడుపుతో ఉన్నప్పుడు పనీర్ ఇలా ఉపయోగపడుతుంది ;

1.ఎముకలు, పళ్ళు ఏర్పడటంలో సాయపడుతుంది

1.ఎముకలు, పళ్ళు ఏర్పడటంలో సాయపడుతుంది

పనీర్ లో చాలా ఎక్కువగా కాల్షియం మరియు ఫాస్పరస్ ఉంటాయి, ఇవి బిడ్డ ఎముకలు, పళ్ళు ఆరోగ్యకరంగ ఎదగటానికి చాలా ముఖ్యం (4). ఇది గర్భవతులలో ఎముకలలో పోషకలోపాలను కూడా నియంత్రిస్తుంది. ఈ పోషకాలు రక్త వ్యవస్థ, నాడీవ్యవస్థ సరిగా పనిచేయటానికి కూడా అవసరం.

2.కావాల్సిన ప్రొటీన్ ను అందిస్తుంది

2.కావాల్సిన ప్రొటీన్ ను అందిస్తుంది

మీ పుట్టబోయే బిడ్డ కణజాలం, కండరాల ఎదుగుదలకి ప్రొటీన్ అవసరం. గర్భవతులకి అవసరమైన ప్రొటీన్ నిల్వలన్నీ పన్నీర్ లో ఉంటాయి (5).

3.శక్తిని, సామర్థ్యాన్ని అందిస్తుంది

3.శక్తిని, సామర్థ్యాన్ని అందిస్తుంది

పనీర్ కావాల్సిన ఓపికను అందించి మొదటినెలల్లో వచ్చే లక్షణాలైన పొద్దున్నే వికారం, అలసట, రక్తహీనత వంటివాటిని తగ్గిస్తుంది -100 గ్రాముల పన్నీర్ 265 కిలో క్యాలరీల శక్తిని అందిస్తుంది.

4.పుట్టుకతో వచ్చే లోపాలను తగ్గిస్తుంది

4.పుట్టుకతో వచ్చే లోపాలను తగ్గిస్తుంది

పనీర్ లో ఉండే అత్యధిక ఒమేగా 3 ఫ్యాటీయాసిడ్లు పురుటికి ముందు పుట్టుకతో వచ్చే లోపాల తీవ్రత, సంక్లిష్టతలను తగ్గిస్తాయి.

5.బరువును నియంత్రిస్తుంది

5.బరువును నియంత్రిస్తుంది

అద్భుతంగా కడుపు నింపే స్నాక్ గా, ఇది మీ ఆకలిని తీర్చేసి, కడుపుతో ఉన్నప్పుడు మీ బరువును పెరగకుండా చేస్తుంది

6.యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ;

6.యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ;

పనీర్ లో ఉండే వాపు వ్యతిరేక లక్షణాలు కడుపుతో ఉన్నప్పుడు సాధారణంగా వచ్చే వాపులు, కీళ్ళనొప్పులను నివారిస్తాయి. ఈ లాభాలన్నిటి వలన, మీరు ఆనందంలో తేలిపోతుండవచ్చు. గుర్తుంచుకోండి. ఎక్కువ తింటే హానికరం.

English summary

6 Reasons Why Pregnant Women Should Eat Paneer

Paneer is fresh soft cheese popular in South Asia, especially in the Indian subcontinent. Also known as cottage cheese, it is made by curdling heated milk with lemon juice, curd, or vinegar. It is one of the most common ingredients in several dishes (1).
Desktop Bottom Promotion