For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రెగ్నెన్సీ సమస్యల్లో వాటర్ మెలన్ ని తీసుకోవడం ద్వారా కలిగే ప్రయోజనాలు

ప్రెగ్నెన్సీ సమస్యల్లో వాటర్ మెలన్ ని తీసుకోవడం ద్వారా కలిగే ప్రయోజనాలు

|

ప్రెగ్నెన్సీ సమయంలో డైట్ కి ప్రాముఖ్యత ఇవ్వాలన్న సంగతి తెలిసిందే. సరైన ఆహారాన్ని తీసుకోకపోవడం వలన మీ ఆరోగ్యంతో పాటు మీ గర్భంలో ఉన్న శిశువు ఆరోగ్యం కూడా అనేక విధాలుగా దెబ్బతినే ప్రమాదం ఉంది. ప్రెగ్నెన్సీలోని త్రీ ట్రైమ్స్టర్స్ ని దాటుకోవడం సులభం కాదు.

అనేక రకాల ఇబ్బందులు తలెత్తుతాయి. మూడ్ స్వింగ్స్, ఫుడ్ క్రేవింగ్స్ తో పాటు ఎన్నో రకాల సమస్యలు ఎదురవుతాయి. మీకు మీ ప్రియమైన వారి దగ్గరనుంచి అలాగే తెలిసిన వారి దగ్గర నుంచి ఈ సమయంలో ఎక్కువగా ఫ్రూట్స్ ని తీసుకోమన్న సలహా అందుతుంది.

Advantages Of Having Watermelon During Pregnancy

అయితే, ప్రెగ్నెన్సీ వలన కొన్ని ఫ్రూట్స్ ని తినలేరు. ఇదివరకు నచ్చినవి కూడా ఇప్పుడు నచ్చకపోవడం వలన ఇలా జరుగుతుంది. అలాగే, కొన్ని రకాల పండ్లకు ప్రెగ్నెన్సీ సమయంలో దూరంగా ఉండాలి. అందువలన, ఎప్పుడూ మీరు ఏ ఫ్రూట్ ని తీసుకోవాలి అలాగే ఏ ఫ్రూట్ ని అవాయిడ్ చేయాలన్న లిస్ట్ ను అప్డేట్ చేసుకుంటూ ఉండాలి.

మీకు ఈ విషయంలో అవగాహన లేకపోతే మీరు మీ హెల్త్ కేర్ ప్రొవైడర్ ని సంప్రదించండి. వారు మిమ్మల్ని సరైన విధంగా గైడ్ చేస్తారు. ఏ ఫ్రూట్స్ తింటే మీకు ఆరోగ్యకరమో వాటిని ప్రిస్క్రైబ్ చేస్తారు. వాటర్ మెలన్ ని తీసుకోమన్న సలహా మీకు అందవచ్చు. ఈ సమయంలో వాటర్ మెలన్ ని తీసుకోవడం అన్ని విధాలా ఆరోగ్యకరం. ఈ ఫ్రూట్ మీ టేస్ట్ బడ్స్ ని కూడా సంతృప్తి పరుస్తుంది.

ప్రెగ్నెన్సీ సమయంలో వాటర్ మెలన్ ని తీసుకోవడం ఆరోగ్యకరం అలాగే సురక్షితం

వాటర్ మెలన్ లో 92 శాతం వాటర్ కంటెంట్ ఉంటుంది. ఇది సమ్మర్ ఫ్రూట్. ఇందులో పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. విటమిన్ ఏ, సీ, బీ6, పొటాషియం మరియు మెగ్నీషియంలు ఇందులో లభిస్తాయి.

వాటర్ మెలన్ లో ఫైబర్ కంటెంట్ అధికంగా లభిస్తుంది. అందువలన, ఆకలి తీరిన భావన లభిస్తుంది. ప్రెగ్నెన్సీ సమయంలో ఈ ఫ్రూట్ ను తీసుకోవడం మంచిది. ఈ సమయంలో తరచూ ఆకలి వేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ ఫ్రూట్ మీ ఆకలిని తీరుస్తుంది.

వాటర్ మెలన్ ని తీసుకోవడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయి. ఈ ఫ్రూట్ ని ప్రెగ్నెన్సీ సమయంలో మీరు మిస్ చేయకూడదు. గర్భిణీలు వాటర్ మెలన్ ని తీసుకోవడం వలన ఎటువంటి ప్రయోజనాలు పొందుతారో ఇప్పుడు తెలుసుకుందాం.

• హార్ట్ బర్న్ సమస్య తగ్గుతుంది:

• హార్ట్ బర్న్ సమస్య తగ్గుతుంది:

ప్రెగ్నెన్సీ సమయంలో ఎసిడిటీ మరియు హార్ట్ బర్న్ వంటి అనేక జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. వాటర్ మెలన్ ని తగు మోతాదులో తీసుకోవడం వలన ఫుడ్ పైప్ తో పాటు ఉదరం ప్రశాంతపడుతుంది. వాటర్ మెలన్ లో కూలింగ్ ప్రాపర్టీస్ సమృద్ధిగా లభిస్తాయి. ఇది హార్ట్ బర్న్ సెన్సేషన్ నుంచి మీకు తక్షణ ఉపశమనాన్ని అందిస్తుంది.

• చేతులు మరియు కాళ్ళ వాపును తగ్గిస్తుంది:

• చేతులు మరియు కాళ్ళ వాపును తగ్గిస్తుంది:

ప్రెగ్నెన్సీ సమయంలో చాలా మంది చేతులు మరియు కాళ్ళ వాపుకు గురవుతారు. ఈ పరిస్థితిని ఎడీమా అనంటారు. దాదాపు 90 శాతం గర్భిణీలు ఈ పరిస్థితిని ఎదుర్కొంటారు. వాటర్ మెలన్ లో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. మజిల్స్ మరియు వెయిన్స్ లో బ్లాకేజెస్ ను తగ్గించేందుకు ఇది ప్రభావవంతంగా ఉంటుంది. తద్వారా, ఎడీమా సమస్య తగ్గుముఖం పడుతుంది.

• మార్నింగ్ సిక్నెస్ ను తగ్గిస్తుంది:

• మార్నింగ్ సిక్నెస్ ను తగ్గిస్తుంది:

ప్రెగ్నెన్సీ సమయంలో మార్నింగ్ సిక్నెస్ సమస్య సర్వసాధారణం. ఉదయాన్నే వాటర్ మెలన్ ను తీసుకోవడం వలన ప్రశాంతంగా ఉంటుంది. ఇందులో నున్న పోషక విలువలు మార్నింగ్ సిక్నెస్ సమస్యను దరిచేరనివ్వవు. ఉదయాన్నే, ఒక గ్లాసుడు వాటర్ మెలన్ ను తీసుకోవడం ద్వారా మార్నింగ్ సిక్నెస్ సమస్య అరికట్టబడుతుంది.

• డీహైడ్రేషన్ ను అరికడుతుంది:

• డీహైడ్రేషన్ ను అరికడుతుంది:

ప్రెగ్నెన్సీ సమయంలో హైడ్రేటెడ్ గా ఉండటం ఎంతో ముఖ్యం. డీహైడ్రేషన్ సమస్య వలన అనేక కాంప్లికేషన్స్ తలెత్తుతాయి. ప్రీమెచ్యూర్ బర్త్ అనేది డీహైడ్రేషన్ వలన ఎర్లీ కాంట్రాక్షన్స్ ఏర్పడటం వలన సంభవిస్తుంది. కాబట్టి వాటర్ మెలన్ ని తీసుకోవడం ద్వారా హైడ్రేటెడ్ గా ఉండవచ్చు.

• రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది:

• రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది:

రెగ్యులర్ గా వాటర్ మెలన్ ని తీసుకోవడం ద్వారా రోగనిరోధక శక్తి పెంపొందించబడుతుంది. ప్రెగ్నెన్సీలో ఈ వ్యవస్థ సక్రమంగా పనిచేయడం మంచిది. లేదంటే, తరచూ అనారోగ్యాలకు గురికావలసి వస్తుంది. వాటర్ మెలన్ లో లైకోపీన్ లభిస్తుంది. ఇది ప్రీ ఎక్లమ్ప్సియా ప్రమాదాన్ని దాదాపు 50 శాతం వరకు అరికడుతుంది. అలాగే, ఈ పదార్థం రోగనిరోధక వ్యవస్థను కూడా మెరుగుపరుస్తుంది.

• మలబద్దకం సమస్యను తగ్గిస్తుంది:

• మలబద్దకం సమస్యను తగ్గిస్తుంది:

ప్రెగ్నెన్సీ సమయంలో మలబద్దకం సమస్య వేధిస్తుంది. ఈ సమస్య అసౌకర్యాన్ని కలిగిస్తుంది. వాటర్ మెలన్ ని తీసుకోవడం ద్వారా మలబద్దకం సమస్యను తగ్గించుకోవచ్చు. ఇందులో ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది. అందువలన, స్టూల్ ఫార్మేషన్ ను ప్రేరేపిస్తుంది. అలాగే, వాటర్ మెలన్ అనేది పాసేజ్ వే క్లియర్ గా ఉండేలా చేస్తుంది. అందువలన, బౌల్ మూవ్మెంట్ ఈజీగా ఉంటుంది.

• మజిల్ క్రామ్ప్స్ ను అరికడుతుంది:

• మజిల్ క్రామ్ప్స్ ను అరికడుతుంది:

ప్రెగ్నెన్సీ సమయంలో మజిల్ క్రామ్ప్స్ సమస్య ఎదురవుతుంది. వాటర్ మెలన్ ని తీసుకోవడం ద్వారా అదనపు బరువు ద్వారా ఎదురయ్యే సమస్యలను అలాగే హార్మోన్ల మార్పుల ద్వారా తలెత్తే ఇబ్బందులను శరీరం ఎదుర్కోగలుగుతుంది. తద్వారా, కండరాలతో పాటు ఎముకల నొప్పి తగ్గుముఖం పడుతుంది.

• యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ను అరికడుతుంది:

• యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ను అరికడుతుంది:

చాలా మంది గర్భిణీలు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ కు గురవుతున్నారు. ఈ సమస్య గర్భిణీలలో ఎదురవడం సాధారణంగా మారింది. యాంటీ బాక్టీరియల్ ప్రాపర్టీస్ తో పాటు నీటి శాతం అధికంగా ఉండటం వలన వాటర్ మెలన్ అనేది యూరినరీ ట్రాక్ట్ నుంచి బాక్టీరియాను తొలగించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది.

• ఫెటస్ బోన్ ఎదుగుదలకు తోడ్పడుతుంది:

• ఫెటస్ బోన్ ఎదుగుదలకు తోడ్పడుతుంది:

వాటర్ మెలన్ లో పొటాషియం మరియు కేల్షియం సమృద్ధిగా లభిస్తాయి. ఇవి ఎముకల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు తోడ్పడతాయి.

• కంటిచూపును మెరుగుపరుస్తుంది:

• కంటిచూపును మెరుగుపరుస్తుంది:

వాటర్ మెలన్ లో బీటా కెరోటిన్ అధికంగా లభిస్తుంది. ఇది విటమిన్ ఏ గా మారిపోయే యాంటీ ఆక్సిడెంట్. అందువలన, ఇది కంటిచూపును మెరుగుపరుస్తుంది. కంటి అవుటర్ లేయర్ ని ప్రొటెక్ట్ చేసేందుకు విటమిన్ ఏ తోడ్పడుతుంది.

వాటర్ మెలన్ ద్వారా కలిగే ప్రయోజనాలను తెలుసుకున్న తరువాత ఈ ఫ్రూట్ ను డైట్ లో భాగంగా చేసుకుంటాము. ఇది రుచికరమైన ఫ్రూట్ మాత్రమే కాదు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందించే ఫ్రూట్. ముఖ్యంగా, గర్భిణీలు ఈ ఫ్రూట్ ద్వారా ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు.ఇది ప్రెగ్నెన్సీ సమయంలో తలెత్తే ఎన్నో సమస్యలను నివారించేందుకు తోడ్పడుతుంది.

English summary

Advantages Of Having Watermelon During Pregnancy

Having the right kind of food is important during pregnancy. It is also important to have the right fruit such as a watermelon, as it has several health benefits and is considered safe to be had during pregnancy. Common problems during pregnancy such as digestive problems, acidity and heartburn can be prevented by having a watermelon.
Story first published:Wednesday, May 30, 2018, 12:36 [IST]
Desktop Bottom Promotion