For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భం దాల్చిన తరువాత ఎన్ని రోజులకు వాంతులు మొదలవుతాయి?

|

ప్రెగ్నెన్సీ అనేది మహిళ జీవితంలో అద్భుతమైన దశ. తనలోనే మరో ప్రాణికి జీవం పోసి ఆ ప్రాణిని నవమాసాలు మోసే అదృష్టం మహిళకే దక్కుతుంది. అయితే, ప్రెగ్నెన్సీలో కూడా అనేక ఇబ్బందులు ఎదురవుతాయి.

ఈ ప్రెగ్నెన్సీ దశలో ఒక్కొక్క మహిళకు ఎదురయ్యే సమస్యలు ఒక్కోలా ఉంటాయి. అందరూ ఒకే రకమైన సమస్యలను ఎదుర్కొంటారని చెప్పలేము. కొంతమంది ఎక్స్పీరియన్స్ చేసిన సమస్యలు మరికొంత మంది ఎక్స్పీరియెన్స్ చేయకపోవచ్చు. ప్రెగ్నన్సీకి సంబంధించి అనేక అపోహలు ప్రాచుర్యంలో ఉన్నాయి. వాటి గురించి తెలుసుకోకుండా వాటిని నమ్మి దిగులుచెందడం సరికాదు.

ప్రెగ్నన్సీకి చెందిన నవమాసాలలో గర్భిణీ ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటుంది. అందులో వామిటింగ్ ముఖ్యమైనది. గర్భం దాల్చిన ప్రతి మహిళలో వికారమనే సమస్య ఎదురవడం సహజం. అయితే, వికారం తీవ్రత మాత్రం ఒక్కొక్కరికీ ఒక్కోలా ఉండవచ్చు. వాంతులవడమనేది ప్రెగ్నన్సీకి చెందిన ముఖ్య లక్షణమైనా ఇది గర్భిణీలకు అసౌకర్యాన్ని కలిగిస్తుంది.

After How Many days Does Vomiting starts In Pregnancy?

గర్భిణీలకు వాంతులెందుకవుతాయి?

ప్రెగ్నన్సీలో వాంతులవడానికి ముఖ్య కారణం మార్నింగ్ సిక్ నెస్. ఈ సమస్య ఉదయం పూట ఎక్కువగా ఉంటుంది. రోజులో ఎదో ఒక సమయంలో కూడా ఈ సమస్య ఎదురవవచ్చు. అయితే, నిద్రలేచిన వెంటనే గర్భిణీలు వికారంతో ఇబ్బంది పడటం సహజం. కొంతకాలానికి, ఈ సమస్య దానంతట అదే తగ్గిపోతుంది.

కొంతమందికి కేవలం వికారమనే భావన కలుగుతుంది. మరికొంతమందికి వాంతులవుతాయి. ఈ సమస్య అనేక కారణాల వలన ఎదురవుతుంది.

- ప్రెగ్నెన్సీ ప్రారంభ దశలలో HCG హార్మోన్ల స్థాయిల పెరుగుదల వలన వికారం అలాగే వాంతులు కలుగుతాయి.

- ఈస్ట్రోజెన్ వంటి ఇతర హార్మోన్ల పెరుగుదల వలన కూడా వికారంతో పాటు వాంతులు కలుగుతాయి.

- గర్భిణీలలో వాసనను గ్రహించే శక్తి అధికమవుతుంది. దీని వలన వారు వాసనల పట్ల సున్నితంగా ఉంటారు. తద్వారా, వికారంతో పాటు వాంతుల సమస్య ఎదురవవచ్చు.

- ప్రెగ్నెన్సీలో, గర్భిణీల డైజెస్టివ్ ట్రాక్స్ట్స్ అనేవి సున్నితంగా ఉంటాయి. వీటివలన కూడా వికారంతో పాటు వాంతుల సమస్య ఎదురయ్యే ప్రమాదం ఉంది.

గర్భిణీలలో వాంతులు ఎప్పుడు మొదలవుతాయి?

గర్భిణీలలో వాంతులు ఎప్పుడు మొదలవుతాయి?

4-6 వారాల ప్రెగ్నెన్సీ నుంచి గర్భిణీలు వికారం సమస్యతో ఇబ్బంది పడటం జరుగుతూ ఉంటుంది. కొన్ని సార్లు ఇంకాస్త ముందు నుంచే వారిలో ఈ లక్షణాలు కనిపిస్తాయి. నెలలు గడిచే కొద్దీ ఈ పరిస్థితి కొంచెం విపరీతంగా మారుతుంది. 14-16 వారాల సమయంలో గర్భిణీలకు ఈ వికారం అలాగే వాంతుల నుంచి కాస్త ఉపశమనం కలుగుతుంది.

అయితే, చాలా మంది గర్భిణీలు తమకు ప్రెగ్నెన్సీ పొడవునా ఈ వికారం అలాగే వాంతుల సమస్య వేధించిందని తెలుపుతున్నారు. కాబట్టి, కొందరిలో ఈ సమస్య కొద్దికాలంలోనే తగ్గుముఖం పడితే మరికొంతమందిలో ప్రెగ్నెన్సీ దశ మొత్తం ఈ సమస్య కొనసాగుతుందని తెలుస్తోంది. మరికొంతమందిలో, ఈ సమస్య సెకండ్ మరియు థర్డ్ ట్రైమిస్టర్ లో అప్పుడప్పుడూ ఉదృతంగా కనిపించినట్టు తెలుస్తోంది. అయితే, ఈ సమస్య సహజమే. దీని గురించి దిగులు అవసరం లేదు.

వికారం మరియు వాంతుల గురించి మీరు ఎప్పుడు దిగులు చెందాలి?

వికారం మరియు వాంతుల గురించి మీరు ఎప్పుడు దిగులు చెందాలి?

వికారం అలాగే వాంతుల సమస్య అనేది తాత్కాలిక సమస్య. కొన్ని ఫ్యాక్టర్స్ వలన ఈ సమస్య తలెత్తుతుంది. ఇది సాధారణమే. అయితే, ఈ సమస్య వలన ఆహారాన్ని సరిగ్గా తీసుకోలేరు. కొన్ని ఆహారాలను పూర్తిగా అవాయిడ్ చేస్తారు కూడా.

కొన్ని ఎక్స్ట్రీమ్ కేస్ లలో, ఏ ఆహారాన్ని కూడా తీసుకోలేని స్థితికి చేరుకుంటారు. తినే ప్రతి ఆహారాన్ని వాంతి చేసుకోవటం జరుగుతుంది. అటువంటప్పుడు మెడికేషన్ ను తీసుకోవాలి. తీవ్రమైన వామిటింగ్ వలన డీహైడ్రేషన్ అలాగే విటమిన్ మరియు మినరల్ లోపం తలెత్తుతుంది. వెయిట్ లాస్ సమస్య కూడా ఎదురవుతుంది.

మార్నింగ్ సిక్ నెస్ నుంచి సహజంగా రిలీఫ్ ను పొందే మార్గాలు:

మార్నింగ్ సిక్ నెస్ నుంచి సహజంగా రిలీఫ్ ను పొందే మార్గాలు:

మార్నింగ్ సిక్ నెస్ అనేది మీ జీవితాన్ని కష్టతరంగా మర్చి మీకిష్టమైన ఆహారాల జోలికి మిమ్మల్ని వెళ్లనీయకుండా చేస్తుందా. అయితే, ఈ సమస్యను ఈ మార్గాల ద్వారా అలాగే ఈ రెమెడీల ద్వారా పరిష్కరించుకోండి.

1) రోజంతా స్మాల్ మీల్స్ ను తీసుకోండి:

1) రోజంతా స్మాల్ మీల్స్ ను తీసుకోండి:

ఆకలిగా ఉన్నప్పుడు వికారం అనేది సహజంగా తగ్గిపోతుంది. కాబట్టి, రోజంతా స్మాల్ మీల్స్ ను తీసుకుంటూ ఉంటే వికారాన్ని అరికట్టవచ్చు.

2) సులభంగా జీర్ణమయ్యే ఆహారాలని తీసుకోండి:

2) సులభంగా జీర్ణమయ్యే ఆహారాలని తీసుకోండి:

పాస్తా మరియు బ్రెడ్స్ అనేవి సులభంగా జీర్ణమవుతాయి. వికారం భావనను తొలగిస్తాయి. ఇవి మీకు శక్తినిచ్చే ఆహారం కేటగిరీలోకి వస్తాయి కూడా.

3) షుగర్ క్యూబ్స్ తో పెప్పెర్మింట్ ఆయిల్ ను తీసుకోండి:

3) షుగర్ క్యూబ్స్ తో పెప్పెర్మింట్ ఆయిల్ ను తీసుకోండి:

వికారంగా అనిపిస్తే, ఒక చుక్క పెప్పెర్మింట్ ఆయిల్ ను షుగర్ క్యూబ్ పై వేసి దానిని చప్పరించండి. ఈ రెమెడీని మీల్స్ తరువాత పాటిస్తే ప్రయోజనకరంగా ఉంటుంది.

4) ఆక్యుప్రెషర్ బ్యాండ్ ను ధరించండి:

4) ఆక్యుప్రెషర్ బ్యాండ్ ను ధరించండి:

అన్ని మెడికల్ స్టోర్స్ లో ఈ బ్యాండ్ లభిస్తుంది. దీనిని మణికట్టుపై ధరిస్తే ఇది అందించే ప్రెషర్ వలన వికారం భావన తగ్గుతుంది.

5) జింజర్ టీ ను తాగండి:

5) జింజర్ టీ ను తాగండి:

చాలా మంది గర్భిణీలకు జింజర్ ద్వారా అనేక లాభాలు కలుగుతాయి. రోజంతా జింజర్ టీను సిప్ చేస్తూ ఉంటే వికారం భావన తగ్గిపోతుంది.

6) బెడ్ సైడ్ స్నాక్స్ ను ఏర్పాటు చేసుకోండి:

6) బెడ్ సైడ్ స్నాక్స్ ను ఏర్పాటు చేసుకోండి:

చాలా మందికి ఉదయాన్నే వాంతులు కలిగి ఇబ్బంది కలుగుతుంది. ఈ సమస్యను అరికట్టాలంటే, బెడ్ సైడ్ టేబుల్ వద్ద బిస్కట్స్, క్రాకర్స్ వంటి కొన్ని లైట్ స్నాక్స్ ను ఏర్పాటు చేసుకోండి. వీటిని రాత్రిళ్ళు ఆకలేసినప్పుడు తినండి. పొట్ట ఖాళీగా ఉన్నప్పుడు వికారం కలుగుతుంది.

7) నడక:

7) నడక:

నడక లేదా తేలికపాటి వ్యాయామం వలన పొట్టలోని కండరాలు పనిచేసి వికారం తగ్గుతుంది. కాబట్టి, హెడ్ ఫోన్స్ ను తీసుకుని వికారాన్ని అరికట్టేందుకు నడకను లేదా వ్యాయామాన్ని మీ రొటీన్ లో భాగం చేసుకోండి.

English summary

After How Many days Does Vomiting starts In Pregnancy?

Pregnancy is a wonderful phase. One common thing during pregnancy is morning sickness such as vomiting and dizziness. Generally, nauseousness starts from around 4-6 weeks into pregnancy, and sometimes even before the women test positive for pregnancy. This condition slowly becomes worse as the pregnancy progresses.
Story first published:Wednesday, April 18, 2018, 17:55 [IST]
Desktop Bottom Promotion