For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రెగ్నెన్సీ సమయంలో బ్లీడింగ్ మరియు స్పాటింగ్ సాధారణమేనా?

ఒక మహిళ గర్భం దాల్చగానే తన ఆరోగ్యానికి సంబంధించి ఎన్నో సందేహాలు ఆమెను వెంటాడుతాయి. ఈ సమయంలో ఏది సాధారణమైనదో దేనికి మెడికల్ అటెన్షన్ ఇమీడియేట్ గా అవసరమో గర్భిణీలకు కచ్చితంగా తెలియాల్సి ఉంటుంది. లేదంటే,

|

ఒక మహిళ గర్భం దాల్చగానే తన ఆరోగ్యానికి సంబంధించి ఎన్నో సందేహాలు ఆమెను వెంటాడుతాయి. ఈ సమయంలో ఏది సాధారణమైనదో దేనికి మెడికల్ అటెన్షన్ ఇమీడియేట్ గా అవసరమో గర్భిణీలకు కచ్చితంగా తెలియాల్సి ఉంటుంది. లేదంటే, చిన్న చిన్న విషయాలకు కూడా అవగాహన లేమితో అనవసర ఆందోళనకు గురవుతారు. మానసిక ఒత్తిడికి లోనవుతారు. ఇవన్నీ, పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. ఈ సమయంలో మనసు ప్రశాంతంగా ఉండాలి. కాబట్టి, గర్భిణీలు తమ సందేహాలకు గైనకాలజిస్ట్ వద్ద నుంచి సమాధానాలను పొందాలి.

ఇదిలా ఉంటే, గర్భం దాల్చిన మహిళలు బ్లీడింగ్ మరియు స్పాటింగ్ విషయంలో ఎక్కువగా ఆందోళనకు లోనవడం జరుగుతుంది. గర్భం దాల్చక ముందు పీరియడ్స్ అనేవి జీవితంలో ఒక భాగంగా ముఖ్యమైన స్థానాన్ని ఆక్రమించుకుంటాయి. పీరియడ్స్ వలన ఎటువంటి అసౌకర్యానికి గురయినా ఇవి మహిళ ఆరోగ్యానికి చిహ్నంగా వ్యవహరిస్తాయన్న విషయాన్ని విస్మరించకూడదు. వీటికి గర్భం దాల్చాక బ్రేక్ లభిస్తుంది. గర్భం దాల్చిన తరువాత పీరియడ్స్ కొంతకాలం వరకు ఆగుతాయి.

Bleeding And Spotting During Pregnancy: Whats Normal, Whats Not

గర్భిణీలకు ప్రెగ్నెన్సీ సమయంలో పీరియడ్స్ రావన్న సంగతిపై చాలా మందికి అవగాహన ఉంది. అంటే, ఈ సమయంలో బ్లీడింగ్ జరగదని మీరు భావించవచ్చు. అయితే, వెజీనల్ బ్లీడింగ్ అనేది జరగకపోవ మనం చెప్పుకోలేము.

ఈ క్రింద వివరింపబడిన సందర్భాలలో బ్లీడింగ్ లేదా స్పాటింగ్ ఎదురైతే వేటికి తక్షణ వైద్య సహాయం అవసరమో ఇక్కడ స్పష్టంగా వివరించాము. వీటిని పరిశీలించండి మరి.

Bleeding And Spotting During Pregnancy: Whats Normal, Whats Not

• లైట్ స్పాటింగ్ అయితే:
ఈ రకమైన బ్లీడింగ్ ను మీరు సులభంగా గుర్తించలేరు. ప్యాంటీ మీద స్పాట్స్ ను గమనించేవరకు లైట్ స్పాటింగ్ గురించి మీరు గమనించలేరు. దీని వలన ఎటువంటి ఇబ్బందీ తలెత్తదు. లేటు వయసులో గర్భం దాల్చిన మహిళల్లో ఈ పరిస్థితి ఎదురయ్యే అవకాశాలున్నాయి.
ఈ రకమైన బ్లీడింగ్ వలన ఎటువంటి బ్లడ్ లాస్ జరగదు. కాబట్టి, దీని వలన ఎటువంటి ఇబ్బందులూ తలెత్తవు. కాబట్టి, ఈ విషయంలో ఆందోళనకు గురవ్వాల్సిన అవసరం లేదు.

• కొంత రక్తంతో పాటు మ్యూకస్ డిశ్చార్జ్ అయితే :
వైట్ డిశ్చార్జ్ కి సంబంధించిన విషయంలో తలెత్తే అసౌకర్యాలకు మహిళలు అందరూ అలవాటు పడే ఉండుంటారు. కొన్ని సార్లు, గర్భం దాల్చని మహిళల్లో కూడా కొంత రెడ్డీష్ డిశ్చార్జ్ అనేది వైట్ మ్యూకస్ కి బదులు వెజీనా నుండి రావటాన్ని గమనించే ఉంటారు. అటువంటి సందర్భం గర్భం దాల్చిన తరువాత కూడా ఎదురైనా ఆందోళనకు గురవ్వాల్సిన అవసరం లేదు.

ఇది సాధారణ విషయమే. ప్రతి ముగ్గురిలో ఒక మహిళ ఈ పరిస్థితిని ఎదుర్కొంటుంది. దీని వలన ఎటువంటి అసౌకర్యం తలెత్తదు.

Bleeding And Spotting During Pregnancy: Whats Normal, Whats Not


• ఒక షెడ్యూల్ ప్రకారం బ్లీడింగ్ జరిగి ఆ తరువాత కొన్ని రోజుల వరకు ఆగినట్లైతే:
ఉదయం పూటే మీరు బ్లీడింగ్ ని గమనించగలుగుతున్నట్టయితే (లేదంటే ఏదైనా ప్రత్యేక సమయంలో), అది కూడా ఫస్ట్ ట్రైమ్ స్టర్ లో ఈ పరిస్థితి ఎదురయితే, మీరు ఎటువంటి దిగులూ చెందనవసరం లేదు. మొదటి నెలలో ఎక్స్పీరియెన్స్ చేసే స్పాటింగ్ అనేది ఫెర్టిలైజడ్ ఎగ్ తనంతట తాను యుటెరస్ లైనింగ్ కు ఇంప్లాంట్ అవుతున్నప్పుడు ఏర్పడే స్పాటింగ్.

ప్రెగ్నెన్సీ ప్రారంభ దశలో ఇలా జరుగుతుంది. దీనిని ఇంప్లాంటేడ్ బ్లీడింగ్ అనంటారు. స్టాటిస్టిక్స్ ప్రకారం, దాదాపు 20 శాతం మంది గర్భిణీలు ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ ను ఎక్స్పీరియన్స్ చేస్తారు. దీనిలో దిగులు చెందవలసిన అవసరం లేదు. గర్భం దాల్చిన మొదటి నెల దాటగానే ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ తగ్గుతుంది.

అయినా, స్పాటింగ్ అనేది కొన్ని రకాల ఇబ్బందులకు సూచికగా వ్యవహరిస్తోంది. ఈ విషయాన్ని మనం విస్మరించకూడదు. గైనకాలజిస్ట్ ల అభిప్రాయం ప్రకారం బ్లీడింగ్ అనేది ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీకి ఒక సూచిక. ఈ సందర్భంలో ఫెర్టిలైజ్డ్ ఎగ్ అనేది యుటెరస్ లైన్ కు ఇంప్లాంట్ అవకుండా ఫెలోపియన్ ట్యూబ్ ను ఎంచుకుంటుంది. అత్యంత తీవ్రమైన సందర్భాలలో, ప్రెగ్నెన్సీ సమయంలో బ్లీడింగ్ అనేది ఇన్ఫెక్షన్, ప్రీ టర్మ్ లేబర్ మరియు మిస్ క్యారేజ్ ను సూచిస్తుంది.

• హెవీ బ్లీడింగ్ సమయంలో:
సాధారణంగా పీరియడ్స్ సమయంలో కంటే ఎక్కువగా బ్లీడింగ్ ను గర్భం దాల్చిన తరువాత మీరు గమనించినట్లయితే ఈ విషయాన్ని మీరు తీవ్రంగా పరిగణించాలి. తక్షణమే వైద్యున్ని సంప్రదించాలి. ప్రతి మూడు లేదా నాలుగు గంటలకు ఒకటి కంటే ఎక్కువ ప్యాడ్స్ ను మీరు వినియోగించుకుంటున్నప్పుడు మీ డాక్టర్ కి ఈ విషయాన్ని తెలియచేయాలి.

ఈ సమస్యను మీరు నిర్లక్ష్యం చేస్తే, బ్లడ్ లాస్ ఎక్కువగా ఏర్పడవచ్చు. కొన్ని అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు.

• నొప్పితో కూడిన బ్లీడింగ్:
రక్తస్రావం జరుగుతున్నప్పుడు బాధ ఏర్పడటం సహజం. అయితే, మీ రోజువారీ పనులకు ఈ నొప్పి వలన ఇబ్బందులు ఎదురైతే మీరు కాస్త రిలాక్స్ అవడం మంచిది. వైద్య సలహాలను స్వీకరించాలి. హోమ్ రెమెడీస్ పాటించి తగ్గించుకోవడానికి ప్రయత్నించే కంటే మీ సమస్యను వెంటనే మీ డాక్టర్ కు తెలియచేయాలి. లేదంటే పరిస్థితి చేజారే ప్రమాదం ఉండవచ్చు. పరిస్థితిని అదుపులో ఉంచుకోవడనికి ప్రెగ్నెన్సీ సమయంలో ఎదురయ్యే అబ్నార్మల్ సిట్యువేషన్స్ గురించి ఎప్పటికప్పుడు డాక్టర్ కు తెలియచేయాలి.

• కొన్ని రోజులపాటు అలాగే వారాలపాటు బ్లీడింగ్ కొనసాగితే:
బ్లీడింగ్ హెవీగా లేనప్పుడు పెయిన్ లేనప్పుడు ఎటువంటి ఆందోళనకు గురవ్వాల్సిన అవసరం లేదు. అయితే, బ్లీడింగ్ అనేది కొంతకాలం పాటు కొనసాగితే అప్పుడు మీరు ఈ విషయంలో ఆలోంచించాల్సిన అవసరం ఏర్పడుతుంది. మీరు గర్భం దాల్చాక అయిదు రోజుల పాటు రక్తస్రావాన్ని గుర్తించి ఉంటే వైద్యునికి ఈ విషయాన్ని తక్షణమే తెలియచేయాలి.

చాలా సందర్భాలలో, గర్భం దాల్చిన తరువాత బ్లీడింగ్ అనేది ప్రమాదాలకు సంకేతంగా నిలుస్తుంది. సరైన సమయంలో డయాగ్నసిస్ ను చేయడం ద్వారా సమస్యను విజయవంతంగా నిర్మూలించవచ్చు. బ్లీడింగ్ సమయంలో 100.4 డిగ్రీల ఫారెన్ హీట్ లో శరీర ఉష్ణోగ్రత ఉంటే తక్షణమే వైద్య సహాయం అవసరం. ఇది గర్భిణీకి గర్భస్థ శిశువుకు ఏ మాత్రం మంచిది కాదు. బ్లీడింగ్ సమయంలో టెంపరేచర్ సమస్య లేకున్నా మీరు వణుకుతో ఇబ్బంది పడుతున్నా మీరు తక్షణమే వైద్య సహాయాన్ని పొందాలి.

• ప్లాసెంటల్ అబ్రప్షన్:
ప్రెగ్నన్సీ సమయంలో యుటెరస్ వాల్ నుంచి ప్లాసెంటా తనంతట తానుగా విడిపోవడాన్ని ప్లాసెంటల్ అబ్రాప్షన్ అనంటారు. దీని వలన యుటెరస్ మరియు ప్లాసెంటా మధ్యన రక్తం చేరుకుంటుంది. ఇలా జరగడం వలన తల్లీ బిడ్డల ఆరోగ్యానికే ప్రమాదం. వెజీనల్ ఏరియా నుంచి రక్త స్రావం ధారలుగా ప్రవహిస్తుంటే ఈ సమస్యను గుర్తించవచ్చు.

డిజ్జీనెస్ మరియు ఫెయింటింగ్ లు కూడా ఈ సమయంలో ఎదురవుతాయి. ఇటువంటి సమస్య మీకు తలెత్తిందని గుర్తించగానే వైద్యున్ని వెంటనే సంప్రదించాలి. ఈ సమస్యని సరైన సమయంలో గుర్తిస్తే తల్లీ బిడ్డల ఆరోగ్యాన్ని కాపాడుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి, గర్భం దాల్చిన తరువాత తీసుకోవాలిసిన జాగ్రత్తలు అలాగే ఎటువంటి పరిస్థితులలో వైద్య సహాయం తక్షణమే అవసరమో గైనకాలజిస్ట్ వద్ద నుంచి తెలుసుకుని తగిన విధంగా చర్యలు తీసుకోండి. పండంటి బిడ్డకు జన్మనివ్వండి.

English summary

Bleeding And Spotting During Pregnancy: What's Normal, What's Not

Now, most people are aware of the fact that during the nine months of pregnancy a woman does not have her periods. This clearly means that during those days you will not have bleeding. However, this does not guarantee the fact that there will not be any vaginal bleeding whatsoever throughout the pregnancy.
Story first published:Tuesday, July 10, 2018, 15:23 [IST]
Desktop Bottom Promotion