For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భధారణ సమయంలో వచ్చే శారీరిక మార్పులు

గర్భధారణ సమయంలో స్త్రీల శరీరం అనేక మార్పులకు గురవుతుంది. ఈ మార్పులన్నీ పిండ౦ పెరుగుదలకు అనుగుణంగా శరీరాన్ని తయారుచేసే క్రమంలో సంభవిస్తాయి.

By Lakshmi Bai Praharaju
|

గర్భధారణ సమయంలో స్త్రీల శరీరం అనేక మార్పులకు గురవుతుంది. ఈ మార్పులన్నీ పిండ౦ పెరుగుదలకు అనుగుణంగా శరీరాన్ని తయారుచేసే క్రమంలో సంభవిస్తాయి.

కొన్ని మార్పులు పైకి కనిపించేట్టు జరగవు కానీ కొన్ని మార్పులు బైటికి కనిపించినా లోపల సంభవిస్తాయి.

9 నెలల తరువాత బిడ్డ బైట ప్రపంచంలోకి అడుగుపెట్టడానికి సహాయపడడానికి ప్రతిదీ సాధ్యపడే తగినంత తెలివి మానవ శరీరానికి ఉంటుంది. ఏ తల్లైనా ఈ తొమ్మిది నెలలు ఎలా గడుపుతుందో చర్చిద్దాం...

శ్వాసకోశ వ్యవస్ధలో మార్పులు

శ్వాసకోశ వ్యవస్ధలో మార్పులు

శ్వాస రేటు పెరుగుతుంది. ఇది పిండం పెరుగుతున్న డిమాండ్ కారణంగా ఉంటుంది. కొన్నిసార్లు, ఊపిరాడని పరిస్ధితి కూడా రావొచ్చు.

మూత్ర వ్యవస్ధలో మార్పులు

మూత్ర వ్యవస్ధలో మార్పులు

గర్భాశయం పెరుగుదల వల్ల, మూత్రాశయం కొంత ఒత్తిడికి గురవుతుంది. అంతేకాకుండా, మూత్రపిండాలు వ్యర్ధాలను తొలగించడానికి చాలా కష్టపడి పనిచేస్తాయి. దీనివల్ల తరచూ మూత్రవిసర్జనకు కారణం కావొచ్చు.

హృదయనాళ వ్యవస్ధలో మార్పులు

హృదయనాళ వ్యవస్ధలో మార్పులు

బిడ్డ పెరుగుదల కారణంగా గుండె రేటు, గుండె పనితీరు పెరుగుతుంది. రెండవ త్రైమాసికం తరువాత రక్తపోటు తగ్గుతుంది.

పొత్తికడుపులో మార్పులు

పొత్తికడుపులో మార్పులు

శిశువుకు అనుగుణంగా మధ్యభాగం పెరగడం వల్ల, కొంతమంది స్త్రీలలో పొట్ట పక్కన నొప్పి సంభవించవచ్చు. స్కేలటేన్, కండరాల పునరమరిక ద్వారా బిడ్డను క్యారీ చేయడానికి శరీరం సర్దుబాటు చేయడం వల్ల కొంత నొప్పి సంభవించవచ్చు.

ఎ౦డోక్రైన్ వ్యవస్ధలో మార్పులు

ఎ౦డోక్రైన్ వ్యవస్ధలో మార్పులు

హార్మోన్ల మార్పుల వల్ల మెటబాలిక్ రేటు పెరగవచ్చు. కొంతమంది స్త్రీలు వేడి ఆవిర్లు సంభవించడం కూడా ఎదుర్కొంటారు.

జీర్ణకోస వ్యవస్ధలో మార్పులు

జీర్ణకోస వ్యవస్ధలో మార్పులు

గర్భాశయం కొద్దిగా ఉబ్బినట్లుగా, ఆసిడ్ రిఫ్లక్స్ వల్ల విసేరల్ అవయవాలు కొద్దిగా స్ధానభ్రంశం చెందుతాయి. కొంతమంది స్త్రీలలో, ప్రొజెస్టెరోన్ వల్ల కొన్ని కండరాల సడలింపుల కారణంగా మలబద్ధకం కూడా ఏర్పడుతుంది.

రొమ్ముల్లో మార్పులు

రొమ్ముల్లో మార్పులు

ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరోన్ స్థాయిలు పెరగడం వల్ల, చాలామంది స్త్రీలలో రొమ్ములు సున్నితంగా తయారవడం చాలా సాధారణం. అంతేకాక, ప్రసవ సమయానికి రొమ్ముల పరిమాణం కూడా పెరుగుతుంది. ఇది బిడ్డకు పాలు ఇవ్వడం కోసం శరీరాన్ని తయారుచేయడానికి జరుగుతుంది.

ఇతర మార్పులు

ఇతర మార్పులు

చర్మంపై చారలు పడతాయి, హార్మోన్ల వల్ల గోళ్ళు, జుట్టు పెరుగుతాయి. పాదాలలో వాపు, శరీర ఉష్ణోగ్రత కూడా పెరుగుతుంది. ఈవిధంగా, గర్భధారణ సమయంలో శరీరంలో అనేక మార్పులు సంభవిస్తాయి.

English summary

Bodily Changes During Pregnancy | Breast Changes During Pregnancy | Physiological Changes During Pregnancy

Many changes occur in the woman's body during pregnancy. They occur in order to prepare the body to carry the baby. Read on to know about the physiological
Story first published:Wednesday, January 24, 2018, 18:17 [IST]
Desktop Bottom Promotion