For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సెక్స్ చేసిన 12 రోజుల తరువాత ప్రెగ్నెన్సీ టెస్ట్ ను చేసుకోవచ్చా?

|

కన్సీవ్ అవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నప్పుడు ఆ ప్రయత్నాలు ఫలించి ప్రెగ్నెంట్ అవడం ద్వారా కలిగే సంతోషం అనేది ఆ దశలో ఎదుర్కొన్న ఒత్తిడిని సమూలంగా తొలగిస్తుంది. మరోవైపు, అన్ ప్లాన్డ్ ప్రెగ్నెన్సీ అనేది ఎదురయ్యే ప్రమాదం ఉన్నప్పుడు ఆ ఒత్తిడి కూడా తీవ్రమైనదే. ఈ రెండు సినారియోలలో కూడా ఆయా సందర్భాలకు తగిన భావోద్వేగాలను మనం గమనించవచ్చు. ఈ సందర్భాలలో ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్ కోసం ఎదురుచూడటం సహజం. ఈ సమయంలో సహనం అనేది ఉండదు.

ఇలాంటి సమయంలోనే, ఇంటివద్దే వాడే ప్రెగ్నెన్సీ కిట్స్ అనేవి ఎంతో మందికి స్ట్రెస్ రిలీవర్ లా పనిచేస్తాయి. ఈ హోమ్ ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్స్ ద్వారా ప్రెగ్నెన్సీ ను కన్ఫర్మ్ చేసుకునే అవకాశం ఉంది. అయితే, ఈ అంశానికి సంబంధించి మీరు కొన్ని విషయాలను తెలుసుకోవాలి. వాటి ద్వారా మీకు ప్రెగ్నెన్సీ టెస్ట్ ఫలితం యొక్క యక్యురసీ అర్థమవుతుంది.

హోమ్ ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్స్ ఏ విధంగా పనిచేస్తాయి?

హోమ్ ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్స్ ఏ విధంగా పనిచేస్తాయి?

సాధారణంగా, పీరియడ్ ని మిస్ అయిన నాలుగు లేదా అయిదు రోజుల తరువాత ప్రెగ్నెన్సీ టెస్ట్ ను నిర్వహిస్తారు. అయితే, ఇరెగ్యులర్ పీరియడ్స్ ఉన్నవారికి మాత్రం ఇది కొంచెం ట్రికీ కండిషన్ అని చెప్పుకోవచ్చు.

గర్భధారణ తరువాత, ఫెర్టిలైజడ్ ఎగ్ ఇంప్లాంట్ అయిన తరువాత ప్లాసెంటా అనేది రూపుచెంది ఎదగడం ప్రారంభిస్తుంది. అప్పుడే, హ్యూమన్ కొరియోనిక్ గొనడోట్రోపిన్ (HCG) అనే హార్మోన్ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ అనేది ఈ హార్మోన్ ప్రెజన్స్ ని కన్ఫర్మ్ చేసి ప్రెగ్నెన్సీని నిర్ధారిస్తుంది.

ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ ని వాడటానికి అనువైన సమయం

ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ ని వాడటానికి అనువైన సమయం

అక్యురేట్ రిజల్ట్స్ కోసం, పీరియడ్ మిస్ అయిన తరువాత కనీసం ఒక్క రోజు వేచి చూసి అప్పుడు ఈ టెస్ట్ ని తీసుకోవడం మంచిది. అయితే, ఈ సమయంలో ఈ హార్మోన్ అనేది చాలా తక్కువ మొత్తంలో ఉంటుంది కాబట్టి ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ ఈ హార్మోన్ ని గుర్తించే అవకాశాలు తక్కువ ఉండవచ్చు.

పీరియడ్ ని మిస్ అయ్యాక 7 నుంచి 10 రోజుల తరువాత ఈ హోమ్ ప్రెగ్నెన్సీ టెస్ట్ లో యూరిన్ టెస్ట్ ను కండక్ట్ చేసుకుంటే అక్యురేట్ రిజల్ట్స్ మీ సొంతమవుతాయి. అయితే, ఎక్స్పైరీ అవని టెస్ట్ కిట్ ని వాడండి.

పీరియడ్ మిస్ అయిందా? అయినా, ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ లో నెగటివ్ రిజల్ట్ ఉందా?

పీరియడ్ మిస్ అయిందా? అయినా, ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ లో నెగటివ్ రిజల్ట్ ఉందా?

పీరియడ్ మిస్ అవడానికి అనేక కారణాలు దోహదపడతాయి. అయితే, గత నెలలో మీరు సెక్సువల్ గా యాక్టివ్ గా ఉంటే మిస్డ్ పీరియడ్ అనేది గర్భం దాల్చడం వలన ఏర్పడిన మార్పు అయి ఉండవచ్చు. అయినప్పటికీ, హోమ్ ప్రెగ్నెన్సీ టెస్ట్ లో అనేక సార్లు తప్పుడు నెగటివ్ లేదా పాజిటివ్ ఫలితాలు వచ్చిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అందువలన, వాటిపైనే 100 శాతం ఆధారపడటం మంచిది కాదు.

పీరియడ్ ని మిస్ అయిన తరువాత ప్రెగ్నెన్సీ కిట్ లో పాజిటివ్ రిజల్ట్ ని మీరు గమనిస్తే వెంటనే వైద్యుని చేత కూడా కన్ఫర్మేషన్ చేయించుకోండి. బ్లడ్ టెస్ట్ ద్వారా ప్రెగ్నెన్సీని వారు కన్ఫర్మ్ చేస్తారు.

గర్భం దాల్చిన తరువాత డాక్టర్ ని వెంటనే కన్సల్ట్ చేయడం ఉత్తమం. అప్పట్నుంచి మీకు ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్స్ ను అందిస్తారు. మీ పీరియడ్ మిస్ అయిన వెంటనే మీరు హోమ్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటే నెగటివ్ రిజల్ట్ వచ్చిందా? ఆ తరువాత పది రోజులకు కూడా పీరియడ్ రాలేదా? అంటే మీరు ప్రెగ్నెన్సీ టెస్ట్ ని ముందుగానే వినియోగించారు. మరికొన్ని రోజులు ఆగి టెస్ట్ చేసుకుంటే యక్యురేట్ రిజల్ట్స్ వస్తాయి.

కొన్నిసార్లు, ఫెయింట్ పాజిటివ్ లైన్స్ ను మీరు గమనించగలుగుతారు. ఇవి కూడా ప్రెగ్నెన్సీ ని కన్ఫర్మ్ చేస్తాయి. అటువంటి సమయాల్లో, మీరు మరో రెండు రోజులు ఆగిన తరువాత మళ్ళీ టెస్ట్ చేసుకుంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవుతుంది.

సెక్స్ లో పాల్గొన్న ఎన్ని రోజుల తరువాత ప్రెగ్నెన్సీ టెస్ట్ అవసరపడుతుంది?

సెక్స్ లో పాల్గొన్న ఎన్ని రోజుల తరువాత ప్రెగ్నెన్సీ టెస్ట్ అవసరపడుతుంది?

ఎంత అక్యురేట్ గా మీ రిజల్ట్స్ వస్తాయో అనేది మీ బ్లడ్ లోని హెచ్ సీ జీ హార్మోన్ల స్థాయిపై ఆధారపడి ఉంది. శరీరంలోని హెచ్ సీ జీ హార్మోన్ ఒక స్థాయికి చేరాక దీనిని గుర్తించేందుకు వీలుగా హోమ్ ప్రెగ్నెన్సీ టెస్ట్ లని తయారుచేస్తారు.

ఒకవేళ, గర్భం దాల్చారన్న విషయంపట్ల మీరు మరీ ఆతృతగా ఉంటే మీరు పాథాలజికల్ సెంటర్ లో బ్లడ్ టెస్ట్ లను ప్రయత్నించవచ్చు. ఇవి ప్రెగ్నెన్సీ కిట్ కంటే ముందుగానే మీకు ఫలితాల్ని తెలియచేస్తాయి. అయితే, దీనికి కూడా మీరు పీరియడ్ మిస్ అయ్యే వరకూ ఆగాలి.

అన్ ప్రొటెక్టెడ్ సెక్స్ లో పాల్గొన్న 10 నుంచి 15 రోజుల తరువాత ఈ హోమ్ ప్రెగ్నెన్సీ టెస్ట్ ని వాడాలి. ఇది స్టాండర్డ్ టైం ఫ్రేమ్. హెచ్ సీ జీ హార్మోన్ స్థాయిలను గుర్తించడం వివిధ బ్రాండ్స్ కి సంబంధించిన టెస్ట్ కిట్స్ క్వాలిటీపై ఆధారపడి ఉంటుంది.

అయితే, ఒవ్యులేషన్ అలాగే కాన్సెప్షన్ తరువాత హెచ్ సీ జీ హార్మోన్ అనేది తగిన మోతాదులో ఉత్పత్తి అవుతుంది. మీది 28 డే సైకిల్ ఐతే, మీరు 14వ రోజున ఒవ్యులేట్ అయ్యే అవకాశం ఉంది.

అందుకే, ఇందులో మీ మంత్లీ సైకిల్స్ రెగ్యులారిటీ కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది. అన్ ప్రొటెక్టెడ్ ఇంటర్ కోర్స్ తరువాత 10 రోజుల కంటే ముందే ఈ టెస్ట్ ను చేసుకుంటే యాక్యురిటీ రిజల్ట్స్ వచ్చే అవకాశం లేదు.

మీరు కచ్చితంగా ఎప్పుడు కన్సీవ్ అయ్యారో గమనించడం అనేది కష్టతరమైన టాస్క్. మీరు మెడికల్ ప్రాక్టీషనర్ అయితే ఇది మీకు సులభతరమే. శరీరంలోని స్పెర్మ్ అనేది అయిదు రోజుల వరకు సజీవంగా ఉంటుంది. అందువలన, కచ్చితంగా ఎప్పుడు కన్సీవ్ అయ్యారో తెలుసుకోవడం కష్టతరమే.

ఓవ్యులేషన్ కి ముందు లేదా కొన్ని రోజుల తరువాత జరిగిన ఇంటర్ కోర్స్ వలన కూడా గర్భం దాల్చే అవకాశం ఎక్కువే ఉంది (ఇక్కడ కన్సెప్షన్ అనేది అన్ ప్రొటెక్టెడ్ ఇంటర్ కోర్స్ యాక్ట్ తరువాత కొన్ని రోజుల తరువాత జరగవచ్చు). అయితే, ఫెర్టిలైజ్డ్ ఎగ్ అనేది ఇంప్లాంట్ అయ్యాక హెచ్ సీ జీ హార్మోన్ తగినంత ఉత్పత్తి అవుతుంది. అప్పటి వరకు టెస్ట్ రిజల్స్ యక్యురేట్ గా ఉండకపోవచ్చు.

English summary

Can I do pregnancy test 12 days after sex?

If you are very eager to get pregnant and also active in your sexual life, then here's when you need to check if you are pregnant after your missed period. Doctors advise that you need to atleast wait for 4 to 5 days after your missed period. Checking one day immediately after your missed period may not help you get the accurate results.
Story first published:Saturday, May 5, 2018, 15:12 [IST]
Desktop Bottom Promotion