For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

క్రమరహితమైన పిరియడ్స్ వల్ల మీలో సంతానలేమికి దారితీయవచ్చు ? ఈ సమస్యకు సరైన చికిత్స ఏమిటి ?

క్రమరహితమైన పిరియడ్స్ వల్ల మీలో సంతానలేమికి దారితీయవచ్చు ? ఈ సమస్యకు సరైన చికిత్స ఏమిటి ?

|

ఒక అమ్మాయి పూర్తి మహిళగా రూపాంతరం చెందే విషయంలో, రుతుస్రావం ద్వారా పరిపక్వత చెందుతుందనేది ఒక బలమైన సూచన. అమ్మాయిలు యుక్తవయసులోకి అడుగుపెట్టిన ప్రారంభదశలోనే ఈ రుతుస్రావం అనేది ప్రారంభమౌతుంది, అది అలా 40 - 50 సంవత్సరాల వయసు వరకు కొనసాగుతుంది.

ఈ మధ్య గల విరామ సమయంలో, ఆ మహిళ ప్రతి నెలకు ఒకసారి పీరియడ్స్ను పొందుతుంది. ఈ నెలసరి రుతుస్రావమనేది ఆమె శరీరం నుండి అండాలు విడుదలకు సంబంధించినదిగా ఉంటుంది. ఇలాంటి జీవన శైలిని కలిగి ఉన్న ఆ మహిళ సరైన చర్యలను పాటించడంవల్ల, ఆమె సమర్థవంతమైన ప్రత్యేక వ్యవస్థను కలిగి, ఆమె కోరుకున్నట్లుగా గర్భాన్ని పొందవచ్చు.

Can Irregular Periods Cause Infertility? How Can It Be Treated?

దురదృష్టవశాత్తు, కొంతమంది మహిళలలో ఈ ఋతుస్రావమనేది సక్రమంగా ఉండదు. ఇలాంటి వారిలో ఎదురయ్యే రుతుస్రావము, ఒక్కొక్కసారి నెల కన్నా ఎక్కువ సమయము పడుతుంది. మరికొన్ని సమయాల్లో, వీరిలో రుతుస్రావం సంభవించడానికి కొన్ని నెలల సమయం కూడా పట్టవచ్చు.

అయితే, ఇది మీకు సాధారణమైన చిరాకును కలిగించడం కంటే, వంధ్యత్వంతో సహా మరిన్ని తీవ్ర ప్రభావాలను కూడా కలగజేస్తుంది. ఈ ఆర్టికల్ కూడా ఇప్పుడు దాని గురించే మాట్లాడుతుంది & ఈ విధమైన పరిస్థితికి ఏ విధంగా చికిత్స చేయాలో కూడా వివరిస్తుంది. కాబట్టి ఈ వ్యాసాన్ని మీరు పూర్తిగా చదవండి !

• క్రమరహితమైన పీరియడ్స్

• పాలీసైస్టిక్ ఓవరి సిండ్రోమ్ (PCOS)

• PCOS ను పరిష్కరించడం

• ఆధునిక జీవనశైలి

• ఒత్తిడి & క్రమరహితమైన పీరియడ్స్

• ఫెర్టిలిటీకి సంబంధించి ఒత్తిడిని తగ్గించడం

1. క్రమరహితమైన పీరియడ్స్ :-

1. క్రమరహితమైన పీరియడ్స్ :-

అమ్మాయిలు తమ యుక్తవయసు నుంచి రెగ్యులర్గా ఋతుస్రావమును కలిగి ఉంటారు. ఇలాంటి సమయంలో అమ్మాయిలు తమ పరిస్థితుల ప్రభావాన్ని బయటపడనివ్వకుండా, ప్యాడ్స్తో రక్షణ పొందుతారు. ఇలా వారు అసహజమైన రీతిలో పీరియడ్స్ను పొందడం వల్ల, ఇలాంటి పరిస్థితిని సరిచేయడానికి చికిత్సను చేయవలసి ఉంటుందని వారు పరిగణించరు.

అయితే, ఇలాంటి సమస్యను చాలాకాలం నుంచి కలిగినవారు తప్పక మీ పరిస్థితిని గూర్చి డాక్టర్ను సంప్రదించవలసిన అవసరం ఉంది. ఒకవేళ మీరు గర్భం దాల్చాలని అనుకోకపోయినా కూడా, మీరు వైద్య పరమైన చర్యలు తీసుకోవడంలో ఏ మాత్రం ఆలస్యం చేయకూడదు. మీరింకా ఆలస్యంగాని చేస్తే భవిష్యత్తులో మీకు మరిన్ని దుష్ప్రభావాలు సంభవించే అవకాశాలు ఎక్కువవుతాయి.

2. పాలీసైస్టిక్ ఓవరి సిండ్రోమ్ (PCOS)

2. పాలీసైస్టిక్ ఓవరి సిండ్రోమ్ (PCOS)

ప్రతీ 5 గురు భారతీయ మహిళలలో ఒకరిని ప్రభావితం చేయగల ఒక చెడు పరిస్థితి ఇది. ఈ రకమైన పరిస్థితి ఎక్కువగా ప్రాచుర్యం పొందినప్పటికీ, దీనిని చాలా తీవ్రమైన పరిస్థితిగా భావించి తక్షణమే కావలసిన వైద్యసహాయాన్ని పొందటంలో ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. ఇలాంటి పరిస్థితులకు లోనైన అండాశయాలను - సాధారణ అండాశయాల పరిమాణంతో పోలిస్తే కాస్త చిన్నవిగా ఉండి, ద్రవముతో నిండిన తిత్తులను కలిగి ఉంటాయి.

ఈ విధమైన పరిస్థితి, క్రమరహితమైన పీరియడ్స్ ఏర్పడటం వల్ల జరుగుతుంది. కొన్ని తీవ్రమైన పరిస్థితులలో మహిళలలో రుతుస్రావం జరగడమనేది పూర్తిగా ఆగిపోతుంది. దాని ఫలితంగా మహిళలలో అండోత్సర్గ చక్రమనేది ప్రభావితం కాబడినందువల్ల ఆ మహిళకు శిశువు జన్మించడమనేది చాలా కష్టతరంగా మారుతుంది.

3. PCOS ను పరిష్కరించడం :

3. PCOS ను పరిష్కరించడం :

PCOS అనే పరిస్థితి, ఊబకాయంతో బాధపడే మహిళలను ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. కాబట్టి మీరు మొదటగా ఊబకాయంతో పోరాడాలి. కొన్ని పరీక్షల ద్వారా తెలుసుకున్న విషయమేమంటే, అధిక మొత్తంలో ఇన్సులిన్ను కలిగి ఉన్న మహిళలలో PCOS ను తరచుగా చూస్తూ ఉంటాం. అందువల్ల మీరు డాక్టర్ను సంప్రదించి ప్రిస్క్రిప్షన్లో ఇవ్వబడిన మందులను వాడి, ఇన్సులిన్ను తగ్గించుకోవలసిందిగా సూచిస్తున్నారు.

ఇలా చేయడం వల్ల మీరు గర్భవతి అయ్యే అవకాశాలను పెంచడమే కాకుండా, మిమ్మల్ని టైప్-2 మధుమేహం బారినపడకుండా కూడా చేస్తుంది. మీరు సరైన రీతిలో ఇన్సులిన్ను నియంత్రించే మందులను వాడటం వల్ల, ఇన్సులిన్ తగ్గడమే కాకుండా మీలో అండోత్సర్గము కూడా ప్రేరేపించబడుతుంది.

దీనివల్ల, PCOS తో బాధపడుతున్న మహిళల్లో అండోత్సర్గము & రుతుస్రావము తిరిగి సరైన రీతిలోకి పునరుద్ధరించబడ్డతాయి. ఒకవేళ అలా ఏదీ పని చేయకపోతే, PCOS తో బాధపడుతున్న మహిళల్లో బాగా పనిచేయగల విట్రో ఫెర్టిలైజేషన్ ద్వారా గర్భస్రావాన్ని కలుగజేయవచ్చు.

4. ఆధునిక జీవనశైలి :

4. ఆధునిక జీవనశైలి :

మహిళల్లో క్రమరాహిత్యమైన రక్తస్రావానికి & వంధ్యత్వానికి సంబంధించి అనేక కేసుల పెరుగుదలకు దోహదపడే విషయాలలో మీ ఆధునిక జీవనశైలి చాలా దారుణంగా ఉండటమే ప్రధాన కారణంగా ఉంది. ఈ రోజుల్లో, మనమందరం పట్టణ సంస్కృతికి దగ్గరగా ఉంటూ నిత్యం జంక్ఫుడ్ ఎక్కువగా వినియోగిస్తున్నాము. ఆకుపచ్చని ఆకుకూరలను, కూరగాయలను మన డైట్ లో భాగంగా తీసుకోవటం పూర్తిగా మానివేశాము.

మనము ఎక్కువ సమయాన్ని సోషల్ మీడియా వెబ్సైట్లలో గడపటం వల్ల మన నిద్రావస్థ పూర్తిగా దెబ్బతింటుంది. మన చాలామంది ఆఫీసుల్లో గాడ్జెట్లు మీద పనిచేయడం వల్ల, మన ఇంటి పనులను పనిమనుషులు చూసుకుంటున్నారు. ఇలా మనము నిశ్చలమైన జీవనశైలిని ఎక్కువగా పొందుతున్నాము. ఇటువంటి పరిస్థితులు అన్నీ కలిపి మన సాధారణ ఆరోగ్యంపైన, పునరుత్పత్తి వ్యవస్థపైన తీవ్ర పరిణామాలను చూపుతోంది.

5. ఒత్తిడి & క్రమరహితమైన పీరియడ్స్ :

5. ఒత్తిడి & క్రమరహితమైన పీరియడ్స్ :

ఆ తర్వాత మన జీవితంలోకి ఎదురయ్యే మరొక అంశం ఒత్తిడి. మనము వ్యక్తిగతంగా గానీ, వృత్తిపరంగా గానీ ఒత్తిడిని ఎదుర్కోవడం వల్ల క్రమరహితమైన పీరియడ్స్ ఏర్పడటానికి కారణమవుతుంది. మీరు చాలా కాలంగా గర్భందాల్చడానికి ప్రయత్నిస్్చడానికి ప్రయత్నిస్తూ విజయవంతం కానట్లయితే మీరు ఒత్తిడిని పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నొక్కి చెప్పవచ్చు.

గర్భస్రావం పొందడానికి ప్రయత్నిస్తున్న ప్రతి 2 జంటలలో ఒకరు ఈ రకమైన ఒత్తిడి వల్ల బాధపడుతున్నారు. మీరు అలాంటి మహిళగాని అయితే గర్భం దాల్చిన అవకాశాలు కూడా మీకు ఇబ్బందికరంగా మారతాయని అర్థం చేసుకోవాలి.

6. ఫెర్టిలిటీకి సంబంధించి ఒత్తిడిని తగ్గించడం :

6. ఫెర్టిలిటీకి సంబంధించి ఒత్తిడిని తగ్గించడం :

మీరు ఈ బాధాకరమైన పరిస్థితి నుంచి బయటపడటం కోసం మద్యాన్ని సేవిస్తారు. అలా మీరు మీ భాగస్వామితో మనస్పూర్తిగా మీ బాధ గురించి మాట్లాడటానికి ప్రయత్నించండి. మద్యం, సిగరెట్, కెఫిన్ వంటి వాటిని తీసుకోవడాన్ని పరిమితం చేసుకోండి. మీ శారీరక & మానసిక భావోద్వేగ ఒత్తిడి నుండి పడటం కోసం తరచుగా ఫిట్నెస్ మీద ఎక్కువ దృష్టి పెట్టండి.

మీరు కూడా యోగా, ధ్యానం వంటి ఇతర విషయాలలో పూర్తిగా మునిగిపోవచ్చు. ఒకవేళ మీరు వీటితో పూర్తిగా గానీ మునిగిపోకపోతే, మీ భావోద్వేగానికి మద్దతునిచ్చే వారితో ఎక్కువ సమయాన్ని గడపడానికి ఏమాత్రం వెనుకాడవద్దు. మీ మనసును ఆహ్లాదపరిచే అందమైన ప్రదేశాలకు వెళ్లడం ఎల్లప్పుడు మంచిదే. మరి కొంతమంది వ్యక్తులు లాజికల్గా ఆలోచించడం ద్వారా తాము ఎదుర్కొంటున్న ఒత్తిడిని దూరం చేసుకోగలిగేందుకు ఇష్టపడతారు.

English summary

Can Irregular Periods Cause Infertility? How Can It Be Treated?

In this interval of time, a woman gets her periods once every month. This monthly cycle is related to the release of eggs from her body. In this stretch of life, a woman is considered to be fertile and can get pregnant if she wants to and takes the necessary course of actions.
Story first published:Wednesday, June 20, 2018, 13:05 [IST]
Desktop Bottom Promotion