For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వానిషింగ్ ట్విన్ సిండ్రోం : గర్భాశయంలోని కవలలలో ఒకరు గర్భస్రావానికి గురైతే, మరొకరు ఆరోగ్యంగా పుట్టే అవకాశాలు ఉన్నాయా.

వానిషింగ్ ట్విన్ సిండ్రోం : గర్భాశయంలోని కవలలలో ఒకరు గర్భస్రావానికి గురైతే, మరొకరు ఆరోగ్యంగా పుట్టే అవకాశాలు ఉన్నాయా.

|

గర్భందాల్చడం అనేది, జీవితంలో ఒక మరపురాని అనుభూతితో పాటు అదనపు భాద్యతలను కూడా ఇస్తుంది అనడంలో ఆశ్చర్యమే లేదు. క్రమంగా శారీరిక మానసిక ఆరోగ్య సంబంధిత అంశాలు, పరిస్థితుల దృష్ట్యా హెచ్చుతగ్గులకు గురవడం కూడా పరిపాటిగా ఉంటుంది. ఈ ప్రపంచంలో అనేక మంది తమకు ఆరోగ్యవంతమైన కవలలు పుట్టాలని కలలు కంటుంటారు. ఇక కోరుకున్నట్లే పుడితే, ఆ ఆనందానికి అవధులు ఉండవు, అవునా కాదా? కానీ ఒకే గర్భాశయంలో కవలలను కలిగిఉండడం అంత తేలికైన విషయమైతే కాదు. కొన్ని ఆరోగ్య సమస్యలను సైతం ఎదుర్కొనవలసి ఉంటుంది.

క్రమంగా కవలలతో గర్భధారణ గావించిన తల్లులు, ఆందోళనలకు గురవుతూ ఉంటారు. అన్నిటికన్నా ఆందోళనా కారకంగా “వానిషింగ్ ట్విన్ సిండ్రోమ్” అను సమస్య ఉంది. ఈ సిండ్రోం కారణంగా కవలలలో ఒక బిడ్డని కోల్పోవడం జరుగుతుంది. ముఖ్యంగా కవలలను మనస్పూర్తిగా కోరుకునే వారికి ఇటువంటి పరిస్థితులు కొంచం భాదాకరంగా ఉంటాయి. మరియు ఒక బిడ్డ గర్భస్రావానికి గురైన పక్షంలో, రెండవ బిడ్డ మీద కూడా అదే ప్రభావం ఉంటుందేమో అన్న అనుమానం మరింత క్షోభకు గుర్తిచేస్తుంటుంది.

Can you miscarry one twin and carry the other to the full term

వానిషింగ్ ట్విన్ సిండ్రోం: గర్భాశయంలోని కవలలలో ఒకరు గర్భస్రావానికి గురైతే, మరొకరు ఆరోగ్యంగా పుట్టే అవకాశాలు ఉన్నాయా.

వానిషింగ్ ట్విన్ సిండ్రోమ్ :

వానిషింగ్ ట్విన్ సిండ్రోమ్ :

ఒక బిడ్డ గర్భస్రావానికి గురైనప్పుడు, గర్భాశయం మొత్తం రెండవ శిశువు వశం అవుతుంది. ఇది ఒక వానిషింగ్ ట్విన్ రూపాన్ని ఇస్తుంది. మొట్టమొదటి త్రైమాసికంలో జరిగే అల్ట్రాసౌండ్ స్కాన్ లో కవలల ఉనికిని గుర్తించడం సులభం. అయితే, మీ తదుపరి అల్ట్రాసౌండ్ స్కాన్ సమయంలో జంటలో ఒక బిడ్డ అదృశ్యం సూచించే అవకాశాలు ఉన్నాయి. ఈ సిండ్రోమ్ సుమారు 21 నుంచి 30 శాతం కవల గర్భాలలో జరిగే అవకాశాలు ఉన్నాయని అనేక అధ్యయనాల నివేదికలు చెప్తున్నాయి.

వానిషింగ్ ట్విన్ సిండ్రోమ్ గురించి మరికొన్ని వివరాలు :

వానిషింగ్ ట్విన్ సిండ్రోమ్ గురించి మరికొన్ని వివరాలు :

ఈ సిండ్రోమ్ మొదటి త్రైమాసికంలో ఎక్కువగా జరుగుతుంది. సాధారణంగా గర్భిణి స్త్రీ యొక్క ఆరవ లేదా ఏడవ వారంలో ఈ వానిషింగ్ ట్విన్ సిండ్రోం సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. క్రమంగా మొదటి అల్ట్రాసౌండ్ స్కాన్లో కవలలు కనిపించినా, రెండవ స్కాన్లో కేవలం ఒక గుండె చప్పుడు మాత్రమే వినిపించడం ద్వారా వానిషింగ్ ట్విన్ సిండ్రోం ఉన్నట్లుగా నిర్ధారణ జరుగుతుంది. అనగా రెండవ గర్భస్థ పిండం ఉనికి కోల్పోయింది అని అర్ధం.

స్కాన్ సమయంలో రెండు లేదా అంతకన్నా ఎక్కువ ఎంబ్రియోనిక్ శాక్స్ పరిశీలించినప్పుడు, కవలల నిర్ధారణ జరుగుతుంది. అయినప్పటికీ, తరువాతి స్కాన్స్ ఒకే ఒక క్రియాత్మక ఎంబ్రియోనిక్ శాక్ మాత్రమే చూపిన ఎడల వానిషింగ్ ట్విన్ సిండ్రోమ్ యొక్క ఉనికిని ఏర్పాటు చేస్తుంది.

సంకేతాలు మరియు లక్షణాలు :

సంకేతాలు మరియు లక్షణాలు :

ఇటువంటి అదృశ్యమయ్యే ట్విన్ సిండ్రోమ్ సంబందించిన ఖచ్చితమైన కారణం ఇప్పటికీ తెలియకపోయినా, కవలల నిర్ధారణ జరిగిన తర్వాత గమనించవలసిన సంకేతాలు, లక్షణాల గురించిన వివరాలను తెలుసుకోవడం కూడా ముఖ్యం.

సంకేతాలు మరియు లక్షణాలు :

సంకేతాలు మరియు లక్షణాలు :

• రక్తస్రావం : ఇటువంటి సమస్యకు గురైన సందర్భాలలో, రోజుల తరబడి అసాధారణ రక్తస్రావానికి గురవడం వంటి సమస్యలను ఎదుర్కొనవలసి వస్తుంది. క్రమంగా ఇది సమస్య యొక్క లక్షణంగా ఉంటుంది కూడా.

• తిమ్మిరి: గర్భాశయ ప్రాంతంలో తిమ్మిరి తీవ్రత కూడా గర్భస్రావాన్ని సూచించవచ్చు. ఈ తిమ్మిరి తీవ్రమైన బహిష్టు నొప్పిని పోలి ఉంటుంది. గర్భాశయ తిమ్మిరి వాంతి మరియు వికారంతో కూడి ఉంటుంది.

• కటి ప్రాంతంలో నొప్పి: ఇది ట్విన్ సిండ్రోమ్ అదృశ్యాన్ని సూచించే అతిపెద్ద చిహ్నంగా చెప్పవచ్చు. మీ కటి ప్రాంతంలో ఒక నిస్తేజమైన, లేదా వెన్నునొప్పి గర్భస్రావాన్ని సూచిస్తుంది.

• బిడ్డ బంప్ భాగంలో కుదింపు: శిశువు బంప్ భాగంలో కుదింపు ఉన్నట్లు(పరిమాణం తగ్గిన అనుభూతి) గమనించదగినదిగా ఉంటే, కవలలలో ఒకటి గర్భస్రావం అయి ఉండే సూచనలు ఉన్నాయి.

సంకేతాలు మరియు లక్షణాలు :మిగిలిన గర్భస్థ శిశువు లేదా శిశువుల పరంగా తీసుకోవలసిన జాగ్రత్తలు :

సంకేతాలు మరియు లక్షణాలు :మిగిలిన గర్భస్థ శిశువు లేదా శిశువుల పరంగా తీసుకోవలసిన జాగ్రత్తలు :

గర్భాశయంలో ఒక శిశువు వానిషింగ్ ట్విన్ సిండ్రోంనకు గురయిన ఎడల, దీనివెనుక అనేక ఆరోగ్యపరమైన సమస్యలు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఆ సమస్యలు మిగిలిన గర్భస్థ శిశువు యొక్క అసాధారణ పుట్టుక, లేదా జన్యు సంబంధ సమస్యలు ఏర్పడడం, లేదా శిశువు ఎదుగుదల మీద ప్రభావం చూపే అవకాశాలు కూడా ఉన్నాయి.

మీరు మొదటి త్రైమాసికంలోనే, కవలలలో ఒకశిశువును కోల్పోతే మీకు వైద్యపరమైన సంకేతాలు లేదా లక్షణాలు పెద్దగా ఉండకపోవచ్చు. మొట్టమొదటి త్రైమాసికంలో జీవించి ఉన్న శిశువు యొక్క ఆరోగ్యం సాధారణంగా సమస్యలు లేకుండానే ఉంటుంది. అయినప్పటికీ, ఇటువంటి సమస్య అనేక ఆరోగ్యపర కారకాలపై ఆధారపడి ఉన్న కారణంగా పలు జాగ్రత్తలు తీసుకోకతప్పదు.

రెండవ లేదా మూడవ త్రైమాసికంలో, కవలల్లో ఒకరు చనిపోతే, అప్పుడు మనుగడలో ఉన్న గర్భస్థపిండానికి ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు. మనుగడలో ఉన్న శిశువుకు మస్తిష్క పక్షవాతం(సెరిబ్రల్ పాల్సీ) వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

సంకేతాలు మరియు లక్షణాలు :మిగిలిన గర్భస్థ శిశువు లేదా శిశువుల పరంగా తీసుకోవలసిన జాగ్రత్తలు :

సంకేతాలు మరియు లక్షణాలు :మిగిలిన గర్భస్థ శిశువు లేదా శిశువుల పరంగా తీసుకోవలసిన జాగ్రత్తలు :

కవలల గర్భధారణ కాలం(ఎంబ్రియోనిక్ పీరియడ్) తర్వాత, కవలల్లో ఒకరు చనిపోతే, కవలల కణజాలంలో ఉండే నీరు , ప్లాసింటల్ కణజాలం మరియు అమ్నియోటిక్ ద్రావణం తిరిగి సంతరించుకుంటాయి. డెలివరీ సమయంలో, మరణించిన పిండం గర్భాశయ ఒత్తిడికి కారకాలుగా లేదా పిండం పాపిరోసస్ వలె గుర్తించబడుతుంది.

గర్భస్థ పిండం యొక్క మరణం, రెండవ లేదా మూడవ త్రైమాసికంలో సంభవించినట్లయితే, ప్రమాద తీవ్రత పెరుగుతుందని వైద్యులు చెప్తుంటారు.

గర్భస్రావం అనేది కడుపుతో ఉన్న తల్లికి ఉండే భయాలలో ఒకటి, కానీ కవలలలో ఒకదాన్ని కోల్పోయినప్పుడు, మీరు మీ ఆరోగ్యం పట్ల పూర్తి శ్రద్ధ వహించాలి, తద్వారా జీవించి ఉన్న శిశువు మీద ప్రభావం పడకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు.

ఇటువంటి సందర్భాలలో ఎక్కువగా విశ్రాంతి తీసుకోవలసినదిగా వైద్యులు సూచిస్తుంటారు, మరియు తరచుగా వైద్యుని సంప్రదించడం, క్రమంగా పరీక్షలు చేయించుకుంటూ సూచనలను పాటిస్తూ మీ బిడ్డ ఆరోగ్యాన్ని పర్యవేక్షించడం ద్వారా, ఎటువంటి సమస్యలు లేకుండా బయటపడవచ్చు.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర, ఆహార, ఆరోగ్య, జీవన శైలి, ఆద్యాత్మిక, వ్యాయామ, లైంగిక తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కీ పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసం పై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

English summary

Can you miscarry one twin and carry the other to the full term

Though being pregnant with twins is most enjoyable, carrying twins is tougher than a single fetus pregnancy. Some women experience vanishing twin syndrome in which one of the twins might be miscarried. When the miscarriage of one twin occurs, the fetal tissue is absorbed by the other twin. This gives the appearance of a vanishing twin.
Desktop Bottom Promotion