For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పురుషులలో మరియు స్త్రీలలో వంద్యత్వ సమస్యలకు ప్రధాన కారణాలు

|

సంతాన ప్రాప్తి జరగకుండా అడ్డుకునే పత్యుత్పత్తి సమస్యలను వంధ్యత్వం లేదా ఇన్ఫర్టిలిటీ అని వ్యవహరిస్తారు.

ప్రత్యుత్పత్తి అనేది సహజమైన ప్రక్రియ, భూమి మీద నివసించే జీవజాలం రకరకాల ప్రత్యుత్పత్తి పద్ధతుల ద్వారా పునరుత్పత్తి గావిస్తాయి. స్త్రీపురుషుల అండాలు, మరియు శుక్రకణాల కలయిక తర్వాత జరిగే ఫలదీకరణ ప్రక్రియ ద్వారా మానవులు పునరుత్పత్తి గావిస్తారు. కానీ ఆ ఫలదీకరణ సమస్యలకి వంధ్యత్వం ప్రధాన కారణంగా ఉంది. ఈ వంధ్యత్వానికి గురైన వారికి పిల్లలు కలుగకపోవడం, లిబిడో సమస్యలు, అసౌకర్యం, మొదలైన సమస్యలు ఉత్పన్నమవుతూ ఉంటాయి.

పునరుత్పత్తి వ్యవస్థలోని వ్యత్యాసాల కారణంగా పురుషుల మరియు స్త్రీల వంధ్యత్వ సమస్యలకు కారణాలు మరియు చికిత్సలు భిన్నంగా ఉంటాయి.

Causes of Infertility In Male and Female

పైన చెప్పినట్లుగా, శుక్ర కణం, అండముతో కలవని పరిస్థితుల్లో దాన్ని వంధ్యత్వంగా పరిగణిస్తారు. అందువల్ల, పురుషులలో స్ఖలనం తర్వాత ఉత్పత్తి చేసిన శుక్ర కణం యొక్క పరిమాణం మరియు నాణ్యత మీద సమస్య నిర్ధారణ ఆధారపడి ఉంటుంది. పురుషులలో వంధ్యత్వం రెండు విధాలుగా ఉండవచ్చు, వీర్యంలో శుక్రకణాల సంఖ్య తగ్గడం మరియు అండానికి చేరుకోలేకపోవడం. ఈ రెండు పరిస్థితులలో, దంపతులకు సంతృప్తికరమైన సంబంధం ఉన్నప్పటికీ, ఫలదీకరణం అనేది జరగని పనే.

అలాగే పురుషుడు వంద్యత్వ సమస్యలతో ఉన్నా కూడా, వంధ్యత్వాన్ని గుర్తించగల స్పష్టమైన లక్షణాలు కనపడవు., అతడు సాధారణ అంగస్తంభన కలిగి ఉండడం మరియు అందరిలాగే స్ఖలనం గావిస్తూ ఉండొచ్చు కూడా. కానీ, అండంతో ఫలదీకరణ గావించని పక్షంలో మాత్రమే సమస్య గురించిన అవగాహన వస్తుంది. లేదా ఆసుపత్రిలో వీర్యకణాల పరీక్ష చేయించుకోవడం మూలంగా కూడా సమస్య నిర్ధారణ గావించవచ్చు.

పురుషులలో మరియు స్త్రీలలో వంద్యత్వ సమస్యలకు ప్రధాన కారణాలు

పురుషులలో మరియు స్త్రీలలో వంద్యత్వ సమస్యలకు ప్రధాన కారణాలు

పురుషులలో మరియు స్త్రీలలో వంద్యత్వ సమస్యలకు ప్రధాన కారణాలు

పురుషులలో వంధ్యత్వానికి కారణాలు:

• టెస్టోస్టెరోన్ లోపం, శుక్ర కణాల తగ్గుదలకు దారితీయవచ్చు.

• అదేవిధంగా, కొన్ని రకాల శస్త్రచికిత్సలు, క్యాన్సర్ లేదా వృషణాల సంక్రమణ వ్యాధులు వంటి వైద్య పరిస్థితులు కూడా తక్కువ లేదా అసాధారణ శుక్రకణాల ఉత్పత్తికి కారణమవుతాయి.

• కొన్నిసార్లు, వేడి వాతావరణంలో అతిగా వ్యాయామం చేయడం, గట్టిగా బిగుతైన దుస్తులను ధరించడం, ఎక్కువగా ఆవిరి స్నానాలు మరియు వేడినీళ్ళతో బాత్ టబ్బుల వినియోగం, మరియు వృషణాలలో అనారోగ్యకర సిరలు వంటి వాటివలన కలిగే అవకాశాలు ఉన్నాయి.

• కొన్ని సందర్భాల్లో, తక్కువ శుక్రకణాల సంఖ్య అనేది జన్యు పరమైన సమస్య కూడా కావచ్చు.

• ధూమపానం మరియు మద్యం వినియోగం కూడా పురుషులలో వంధ్యత్వానికి దారితీస్తుంది.

• ఇటీవల అధ్యయనాలలో మరో విషయం కూడా కనుగొనబడింది. భిన్నంగా ఉండే సెంట్రియోల్ అని పిలువబడిన ఒక కొత్త భాగం కనుగొనబడింది. ఈ అధ్యయనం ప్రకారం, జైగోట్ (గర్భస్థ పిండం) పెరుగుతున్న స్థితుల్లో ఉండే అసాధారణతల వెనుక ఉన్న కారణం సెంట్రియోల్ కూడా అయ్యే అవకాశం ఉండొచ్చునని అభిప్రాయపడింది. దీని కారణంగా గర్భస్రావం అయ్యే అవకాశాలు కూడా కనపడినట్లు తేలింది.

స్త్రీలలో వంధ్యత్వ సమస్య:

స్త్రీలలో వంధ్యత్వ సమస్య:

మహిళలలో వంధ్యత్వానికి సహజ కారణాలలో ప్రధానమైనది వయస్సు. వయసు కారణంగా గర్భం దాల్చే సామర్థ్యం మహిళలలో తగ్గుముఖం పట్టొచ్చు. వయస్సు కారకం కాకుండా, స్త్రీలలో అత్యంత సాధారణమైన ఇతర పరిస్థితులు, ఫెలోపియన్ ట్యూబ్ సమస్యలు, అండోత్సర్గ సమస్య లేదా గర్భాశయం దెబ్బతినడం మొదలైనవి కూడా వంద్యత్వానికి కారణం కావొచ్చు. సమస్య అధికమైన పక్షాన, ఆరోగ్యకరమైన శుక్రకణం అండాన్ని చేరుకున్నప్పటికీ ఫలదీకరణ గావించడం మాత్రం జరగదు.

అవివాహితులలో వంధ్యత్వానికి కారణాలు:

అవివాహితులలో వంధ్యత్వానికి కారణాలు:

మహిళల్లో వంధ్యత్వానికి కారణమయ్యే అనేక కారణాలు ఉన్నాయి.

తలేని థైరాయిడ్ గ్రంధి మరియు అధిక ఒత్తిడి కారణంగా హార్మోన్ల అసమతౌల్యం మరియు వంద్యత్వ సమస్యకు కారణం కావచ్చు.

• అస్తవ్యస్త ఋతుచక్రం లేదా అసాధారణ బహిష్టు స్రావ సమస్యలు కూడా వంద్యత్వ సమస్యలకు కారణం కావొచ్చు.

• ఊబకాయం లేదా బరువు నష్టం కూడా వంధ్యత్వానికి కారకాలు.

• గర్భాశయం లేదా అండాశయాలలో కణితి లేదా తిత్తి ఏర్పడడం వంటివి వంధ్యత్వానికి దారితీస్తుంది.

• గర్భవతిగా ఉన్నప్పుడు డి.ఈ.ఎస్ మందులు ఇవ్వబడిన మహిళల పిల్లలకు వంధ్యత్వ సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

• మద్యం, నికోటిన్ మరియు ఇతర డ్రగ్స్ వినియోగం కూడా మహిళల్లో వంధ్యత్వానికి కారణమవుతుంది.

వంధ్యత్వానికి చికిత్సలు మరియు ప్రత్యామ్నాయాలు:

వంధ్యత్వానికి చికిత్సలు మరియు ప్రత్యామ్నాయాలు:

పురుషులు మరియు స్త్రీలలో వంధ్యత్వాన్ని గుర్తించే క్రమంలో అనేక పరీక్షలు ఉన్నాయి. మూత్రం, స్పెర్మ్ లేదా రక్త పరీక్షలు సాధారణమైనవి మరియు వేగవంతమైన ప్రక్రియలుగా ఉంటాయి. అనేక సందర్భాల్లో వంధ్యత్వానికి చికిత్సలు సాధ్యమవుతాయి కూడా. క్రమంగా తల్లిదండ్రులయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి.

పురుషులలో చికిత్స:

పురుషులలో చికిత్స:

తక్కువ శుక్రకణాలు ఉన్న సందర్భంలో, స్త్రీల గర్భాశయములో పురుషుని శుక్రకణాలను కృత్రిమంగా ఇంజెక్ట్ చేయడం ద్వారా కూడా కృత్రిమ గర్భధారణను పొందవచ్చు. విట్రో ఫెర్టిలైజేషన్ ప్రక్రియలో, శుక్రకణాలు మరియు అండాన్ని కృత్రిమంగా ప్రయోగశాలలో ఫలదీకరణం చేసి, తరువాత గర్భాశయంలోనికి పంపిస్తారు. ఈ ప్రక్రియలో అవసరాన్ని బట్టి స్త్రీ, పురుషులకు ఔషధాలు మరియు హార్మోన్ ఇంజెక్షన్లను ఇవ్వడం ద్వారా, తక్కువ స్పెర్మ్ కౌంట్ లేదా ఇతర సంక్రమణ వ్యాధులకు చికిత్స చేస్తారు.

స్త్రీలలో వంద్యత్వ సమస్యలకు చికిత్స:

స్త్రీలలో వంద్యత్వ సమస్యలకు చికిత్స:

వంధ్యత్వానికి కారణమయ్యే సంక్రమణ వ్యాధుల చికిత్సలో, యాంటీబయాటిక్స్ ఉపయోగిస్తారు. హార్మోన్ల అసమానతలను సవరించే ప్రక్రియలో ఓరల్ లేదా ఇంజెక్షన్ రూపంలో హార్మోన్లను ఇవ్వవలసి ఉంటుంది. అదేవిధంగా థైరాయిడ్ సమస్య ఉన్న ఎడల, రోజూవారి మందులను వినియోగించవలసి ఉంటుంది.

ముఖ్య గమనిక:

ముఖ్య గమనిక:

చాపకింద నీరులా విస్తరిస్తున్న క్షయవ్యాధి కూడా గర్భాశయ ప్రాంతంలో చేరడం మూలంగా శుక్రకణాలు అండాన్ని చేరుకునే వీలు లేక వంద్యత్వ సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. కావున వైద్యుని సంప్రదించి, వీలయితే టి.బి.పి.సి.ఆర్ టెస్ట్ చేయించుకోవలసి ఉంటుంది. దీని ద్వారా మోల్ బాక్టీరియా ట్యూబర్క్యులాసిస్ ఉన్నదో లేదో నిర్ధారణ గావించబడుతుంది. తద్వారా ముందు ఆ సంక్రమణవ్యాధిని తొలగించే చికిత్సకు పూనుకోవడం లేదా కృత్రిమ పద్దతుల్లో గర్భధారణకు పూనుకోవడం అనేది వైద్యులు సూచిస్తారు. ఈ ఒక్క విషయం అవగాహన లేక సంవత్సరాల తరబడి చెట్లకు, పుట్టలకు మొక్కుకుంటూ కాలం వెళ్ళదీస్తున్న అనేకమందిని మనం చూస్తూనే ఉంటాం. మరియు ఈ విధానం గురించి అవగాహన, వైద్య పరికరాలు అన్నీ అందుబాటులో ఉన్న వైద్యుని సంప్రదించడం మేలు.

English summary

Causes of Infertility In Male and Female

Infertility is the condition when the fertilisation between the sperm and the egg cell does not happen. Both males and females may have infertility problems. Low sperm count is common in males, whereas ovulation problem is common in females. Some of the common causes are overweight, heredity, too much exercising and the age factor.
Story first published: Monday, July 16, 2018, 11:52 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more