For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫాస్ట్ ఫుడ్స్ మీ ఫెర్టిలిటీపై దుష్ప్రభావం చూపొచ్చని అధ్యయనాలు తెలుపుతున్నాయి

ఫాస్ట్ ఫుడ్స్ మీ ఫెర్టిలిటీపై దుష్ప్రభావం చూపొచ్చని అధ్యయనాలు తెలుపుతున్నాయి

|

ఫాస్ట్ ఫుడ్స్ వలన సౌకర్యం కలగడం వాస్తవమే. ఈజీగా తయారుచేసుకోవచ్చు. తినడానికి సౌకర్యంగా ఉంటాయి. చౌకగానే లభిస్తాయి. ఈ గజిబిజీ లైఫ్ స్టైల్స్ లో ఫాస్ట్ ఫుడ్ వలన అమితమైన సౌకర్యం లభిస్తోంది. బిజీ లైఫ్ తో సతమతమయ్యే వారు ఫాస్ట్ ఫుడ్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే, వారందరికీ ఈ ఫాస్ట్ ఫుడ్స్ వలన కలిగే దుష్ప్రభావాల గురించి సరైన అవగాహన లేదు. ఫాస్ట్ ఫుడ్స్ వలన అనేక అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి.

ఫాస్ట్ ఫుడ్స్ ని తీసుకోవడం వలన అతి పెద్ద సమస్యకు మహిళలు గురవుతారని ఒక అధ్యయనం స్పష్టం చేస్తోంది. ఇటీవలి అధ్యయనాల ప్రకారం, ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్స్ ని తీసుకునే మహిళల్లో సంతానోత్పత్తి సమస్యలు ఎక్కువగా ఉత్పన్నమవుతాయట.

Fast Food May Affect Your Fertility Adversely, Study Reveals

ఫాస్ట్ ఫుడ్ ని తరచూ తీసుకునే మహిళల్లో ఫాస్ట్ ఫుడ్ వలన ఇన్ఫెర్టిలిటీ సమస్య తలెత్తుతుందని ఆస్ట్రేలియన్ స్టడీ స్పష్టం చేస్తోంది. ఈ స్టడీలో ఫాస్ట్ ఫుడ్ ని ఎక్కువగా తీసుకోవడం వలన శరీరంలోకి హానీకర కెమికల్స్ తో పాటు సోప్స్ తో పాటు మేకప్ సామగ్రిలో అలాగే ఆటోమొబైల్ ఇంటీరియర్ లో లభించే ఫ్తాలెట్స్ వంటి ఏసిడ్ ప్రవేశిస్తాయని, తద్వారా అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఎక్కువని తెలుస్తోంది. నాన్ స్టిక్ కోటింగ్ లో పెర్ఫ్ల్యూరూక్తేనిక్ యాసిడ్ (PFOA) అనే కెమికల్ ఉంటుంది. ఇది రీప్రొడక్టివ్ సమస్యలను కలిగిస్తుంది.

ఫుడ్ ప్రోసెసింగ్ టెక్నాలజీలో కెమికల్ మరియు మెకానికల్ ప్రొసెసింగ్ ను వాడతారు. ఫుడ్ ప్రోసెసింగ్ అనే విధానం టాక్సిక్ కెమికల్స్ ని ఆహారంలో జోడించడంతో పాటు ఆహారంలో లభ్యమయ్యే పోషకాలను పూర్తిగా తొలగిస్తాయి. అందుకే, ప్రొసెస్డ్ ఫుడ్స్ ఆరోగ్యానికి హానికరం అంటారు. ఈ కెమికల్స్ అనేవి మహిళలకు హానికరం. ముఖ్యంగా, కన్సీవ్ అవ్వాలని అనుకుంటున్న వారికి మరింత హానికరం.

Fast Food May Affect Your Fertility Adversely, Study Reveals

అంతేకాక, పెర్ఫ్ల్యూరూక్తేనిక్ యాసిడ్ (PFOA) ను క్యాండీ ర్యాపర్స్, పిజ్జా అలాగే ఫాస్ట్ ఫుడ్ ర్యాపర్స్ లో విస్తృతంగా వినియోగిస్తారు. ఇది కూడా మహిళల్లో ఇన్ఫెర్టిలిటీకి కారణం అవుతుంది. అలాగే ఈ ఏసిడ్ అనేది ప్రోస్టేట్ మరియు బ్రెస్ట్ క్యాన్సర్స్ ని కలిగించి మహిళల్లో మెన్స్ట్రువల్ సైకిల్ ని డిస్టర్బ్ చేస్తుందని అధ్యయనంలో వెల్లడైంది. తద్వారా, సంతానోత్పత్తిపై దుష్ప్రభావం కలుగుతుంది.

పెర్ఫ్ల్యూరూక్తేనిక్ యాసిడ్ (PFOA) మరియు పెర్ఫ్ల్యూరూక్టెన్ సల్ఫోనెట్ (PFOS) అనేవి రెండూ మానవ నిర్మిత పదార్థాలు. ఇవి మహిళల్లో వంధ్యత్వాన్ని కలిగిస్తాయి. వీటిని మొట్టమొదటి సారి 1950లో ప్రవేశపెట్టినప్పుడు ఇవి బయలాజికల్ గా ఇనాక్టివ్ అని తేలాయి. అయితే PFOA మరియు PFOSకి చెందిన యానిమల్ స్టడీస్ లో ఇవి లివర్, ఇమ్మ్యూన్ సిస్టం మరియు రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ పై దుష్ప్రభావం చూపుతాయని తెలిసింది.

Fast Food May Affect Your Fertility Adversely, Study Reveals

ఇటీవలి దశాబ్దాల్లో, ఫెర్టిలిటీ రేట్స్ లోని గణనీయమైన తగ్గుదలను డెవెలప్డ్ కంట్రీస్ లో గమనించడం జరిగింది. మెరుగైన కాంట్రాసెప్టివ్ పద్దతుల వలన అలాగే సోషల్ ఛేంజెస్ ప్రభావం వలన ఇలా జరిగుండొచ్చు.

యూఎస్ఏ లో రీప్రొడక్టివ్ వయసులో ఉండే రెండు శాతం మంది మహిళలు గతేడాదిలోనే ఇన్ఫెర్టిలిటీ సమస్యకు చెందిన మెడికల్ అపాయింట్మెంట్ ను తీసుకున్నారు. మరోవైపు ఎనిమిది శాతం మంది గతంలో ఎదో ఒక సందర్భంలో ఇన్ఫెర్టిలిటీకి చెందిన మెడికల్ విజిట్ చేశారు.

ఈ అధ్యయనం కోసం ప్రెగ్నెన్సీ ప్రారంభ దశకి చెందిన మెటర్నల్ బ్లడ్ శాంపిల్స్ ను తీసుకోవడం జరిగింది. ప్లాస్మాలోని PFOA మరియు PFOS కాన్సంట్రేషన్ అనేది హై పెర్ఫార్మెన్స్ లిక్విడ్స్ తో పోల్చడం జరిగింది. సాలిడ్ ఫేజ్ ఎక్స్ట్రాక్షన్ టెక్నీక్స్ ను అనుసరించి ఎక్స్ట్రాక్షన్స్ ను చేయడం జరిగింది. వాల్యూస్ అన్నీ లోయర్ లిమిట్ క్వాన్టిఫికేషన్ కంటే ఎక్కువగా ఉన్నాయి.

జంక్ ఫుడ్ వలన అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం కలదన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే, మహిళల ఫెర్టిలిటీపై దుష్ప్రభావం చూపుతుందన్న విషయంపై చాలా మందికి అవగాహన లేదు. కాబట్టి, ఈ విషయాన్ని గ్రహించి జంక్ ఫుడ్ కి దూరంగా ఉండేందుకు ప్రయత్నించండి.

1. డైట్ ను ప్లాన్ చేసుకోండి:

డైట్ ను ముందుగానే ప్లాన్ చేసుకోండి. ఆరోగ్యకరమైన లంచ్ ను అలాగే బ్రేక్ ఫాస్ట్ ను చేసిన రోజు మధ్యాహ్నం మూడు గంటల సమయంలో స్నేహితులతో కలిసి బర్గర్ ని తినే అవసరం రాదు. బర్గర్ కి బదులుగా ఏదైనా ఆరోగ్యకరమైన పానీయాన్ని తీసుకోవచ్చు.

2. ఆరోగ్యకరమైన పదార్థాలనే ఎంచుకోండి:

గ్రాసరీ షాపింగ్ సమయంలో ఆరోగ్యకరమైన వాటినే ప్రిఫర్ చేయండి. బ్రౌన్ రైస్, బీన్స్, గ్రీన్ వెజిటబుల్స్, సలాడ్స్, సోయ్ వంటివి తీసుకోండి.

3. సరైన కంటైనర్లని వాడండి:

ఫాయిల్ లేదా ఫుడ్ స్టోరేజ్ కంటైనర్లు ని అలాగే జార్స్ ని లంచ్ మరియు బ్రేక్ ఫాస్ట్ ను ప్యాక్ చేసుకునేందుకు వాడండి.

4. తగినంత ప్రోటీన్ ను తీసుకోండి:

గుడ్డు మరియు చికెన్ లో లభ్యమయ్యే ప్రోటీన్స్ టమ్మీను హెవీగా ఉంచుతాయి. అందువలన, అనారోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలన్న ఆలోచన తగ్గుతుంది.

5. పండ్లను తీసుకోండి:

ఆపిల్స్, అరటిపండు, ఆరెంజ్ వంటివి మీకు ఈవెనింగ్ స్నాక్స్ లా బాగా ఉపయోగపడతాయి.

6. కలర్ఫుల్ డైట్ ను తీసుకోండి:

వివిధ రకాల కూరగాయలను అలాగే పండ్లను మీ డైలీ డైట్ లో భాగంగా చేసుకోండి. ఎంత ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటే అంత ఆరోగ్యకరంగా ఉంటారు. అనారోగ్యకరమైన ఆహారం వైపు మనసు మళ్ళదు.

7. కేలరీలను గమనించండి:

మీరు జంక్ ఫుడ్ ని తీసుకునే ప్రతీసారి కేలరీల కౌంట్ ను దృష్టిలో ఉంచుకోండి. ఫ్యాట్ ను బర్న్ చేయడానికి ఎంత సమయం పడుతుందో ట్రాక్ చేయండి. తద్వారా, జంక్ ను తీసుకోవాలన్న ఆలోచన తగ్గుముఖం పడుతుంది.

కాబట్టి, మహిళల్లారా! ఫాస్ట్ ఫుడ్ కు దూరంగా ఉండేందుకు సాధ్యమైనంత వరకు ప్రయత్నించండి. ఫాస్ట్ ఫుడ్స్ నుంచి దూరంగా ఉండటం కష్టమైనా విషయమే. అయినా, ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఫాస్ట్ ఫుడ్ ను అవాయిడ్ చేయండి. స్నాక్స్ లో ఆరోగ్యకరమైన ఆప్షన్స్ ని పరిగణలోకి తీసుకోండి. లాస్ట్ మినిట్ లో ఫాస్ట్ ఫుడ్ వైపు ఆకర్షితులవడం తగ్గించుకోండి. బాలన్స్డ్ డైట్ ను తీసుకోవడం ద్వారా కన్సీవ్ అయ్యే ఛాన్స్ లను పెంపొందించుకోండి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి. మీకు ఈ విషయంలో ఎటువంటి సందేహాలున్నా డాక్టర్లను సంప్రదించడం మరచిపోకండి. సందేహాలను నివృత్తి చేసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

English summary

Fast Food May Affect Your Fertility Adversely, Study Reveals

Studies reveal that eating fast food regularly can lead to infertility in women. They contain chemicals which include phthalates - an acid found in soaps, makeups, etc. It affects women's fertility adversely. Women are advised to plan their diet properly, following a balanced diet which includes proteins and all sorts of fruits & veggies to avoid infertility.
Story first published:Thursday, May 24, 2018, 18:25 [IST]
Desktop Bottom Promotion