For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భధారణ సమయంలో రోగ నిరోధక శక్తిని పెంచే ఆహార పదార్ధాలు !

|

మహిళల గర్భదారణ సమయంలో, సాధారణ మందులు (లేదా) మాత్రల కన్నా మంచి శక్తిని అందించే పౌష్టిక ఆహారాన్ని తీసుకోవడం ద్వారా శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవాలని, వారంతా కోరుకుంటారు. గర్భస్రావం ఒక మహిళ యొక్క జీవితంలో చాలా సున్నితమైన దశ, ఈ దశలో ఆమె తన శరీరం లోపల నుండి మరొక జీవిని సృష్టించేందుకు - ఆమె శరీరం తోడ్పడుతుంది.

గర్భిణి స్త్రీలు సరైన పోషకాహారాలను తీసుకోకపోవటం వల్ల ఆమెలో బలము మరియు రోగనిరోధక శక్తి ఎలా అయితే తగ్గుతాయో, అలానే పుట్టబోయే బిడ్డలో కూడా తగ్గుతుంది. అందువల్ల, గర్భధారణ సమయంలో రోగనిరోధక శక్తిని పెంపొందించే ఆరోగ్యకరమైన ఆహారం కోసం ప్రణాళికను సిద్ధం చేసుకొని, వాటిపై దృష్టిని కేంద్రీకరించి మంచి ఆరోగ్యాన్ని సంపాదించడం చాలా అవసరం.

foods-to-increase-immunity-during-pregnancy

వికారంగా ఉన్న కారణంగా మీ నోరు రుచిని గుర్తించడం కోల్పోయిన సమయంలో, ముందుగా సిద్ధం చేసుకున్న ప్రణాళికలో మరికొన్ని బఫర్ పదార్థాలను కలిగి ఉండాల్సిన అవసరం చాలా ఉంది.

మీరు సిద్ధం చేసుకున్న ప్రణాళిక మీ నోటికి రుచిని అందిస్తూ, రోగనిరోధక శక్తిని మరియు ఆరోగ్యాన్ని పెంపొందించే ముఖ్యమైన అంశాలను కలిగి - మీ శరీరానికి సరిగ్గా సరిపోయేదిగా ఉండాలి. మీ ఆరోగ్యాన్ని పరిరక్షించే ఆహార జాబితాలు మీకు అందుబాటులోనే చాలానే ఉన్నాయి కానీ, ఈ క్రింద ఇవ్వబడిన ఆహార జాబితాలో - గర్భధారణ సమయంలో మీలో రోగ నిరోధకశక్తిని పెంపొందించేవిగా ఉంటున్నాయి.


విటమిన్ A :

మీ శరీరంలో బీమా-కెరోటిన్ రూపంలో శోషించబడే శక్తివంతమైన యాంటీ-ఆక్సిడెంట్లు అనేవి విటమిన్-ఎ లో ఉన్నాయి, అవి మీ శిశువు ఆరోగ్యంలో తలెత్తే చిన్నచిన్న ఇన్ఫెక్షన్లకు మరియు జన్యులోపాలకు వ్యతిరేకంగా పోరాడటంలో బాగా ఉపయోగపడతాయి. గర్భధారణ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాలలో విటమిన్-ఎ వంటి ముఖ్యమైన సమ్మేళనం లేకుండా అవి పూర్తి ఆహారంగా మారలేవు మరియు ఇవి పిండం యొక్క పెరుగుదలను పర్యవేక్షిస్తూ, దాని అభివృద్ధికి కావలసిన సహాయమును కూడా అందజేస్తుంది. విటమిన్-ఎ ఎక్కువగా ఉన్న ముఖ్యమైన ఆహారాలు క్యారట్లు, మామిడి, చిలగడ దుంపలు మరియు బాదం పప్పు.

ప్రాచీనంగా ఉన్న నమ్మకాలలో, గర్భిణీ స్త్రీలలో రోగనిరోధక శక్తిని పెంచడానికి బాదమును చాలా ముఖ్యమైన ఆహారపదార్థంగా వారంతా నమ్ముతున్నారు. ఇది రిబోఫ్లావిన్, మాంగనీస్ మరియు కాపర్ వంటి ముఖ్యమైన సమ్మేళనాలను కలిగివున్న కారణంగా, గర్భిణీ స్త్రీలలో రోగనిరోధకతను పెంపొందించడంలో బాదం అనేది అతి ముఖ్యమైన, ఆరోగ్యకరమైన పోషకాహారంగా పరిగణిస్తారు.

foods-to-increase-immunity-during-pregnancy

విటమిన్ D :

ఇది జలుబు మరియు ఫ్లూ జ్వరంతో పోరాడేటమే కాకుండా, రొమ్ములో పాలను కూడా నింపుతుంది. అయితే, సూర్యరశ్మి ద్వారా విటమిన్ D ను పొందవచ్చు కానీ, శీతాకాలంలో అలా పొందటం చాలా కష్టమైనది. గర్భధారణ సమయంలో రోగనిరోధకతను పెంచే ఆహారాలలో చేపలు, గుడ్లు, బహుళ విటమిన్లు కలిగిన తృణధాన్యాలు, జింక్ మొదలగునవి ఉన్నాయి.

జింక్ :
ఈ జాబితాలో తర్వాత వచ్చేది జింక్, ఇది DNA యొక్క పనితీరును, పునరుత్పత్తిని, చేపట్టవలసిన మరమ్మత్తులను మరియు వాటి యొక్క ఇతర ప్రయోజనాలన్నింటినీ పర్యవేక్షిస్తుంది. పాల ఉత్పత్తులు, షెల్ చేపలు, నట్స్, పండ్లు వంటివాటిలో జింక్ సమృద్ధిగా ఉన్నందున, గర్భిణి స్త్రీలలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది.


విటమిన్ B

విటమిన్ B అనేది వికారంతో బాధపడుతున్న మహిళలకు చాలా ముఖ్యమైన పోషకాహారం. విటమిన్ B సమ్మేళనాలలో విటమిన్ B6 అనేది వికారంతో బాధపడుతున్న వారికి చికిత్స అందించే ముఖ్యమైన సమ్మేళనముగా పరిగణించబడుతుంది.

కాల్షియం :

చికెన్ మరియు పాలకూరలో క్యాల్షియం అనేది చాలా సమృద్ధిగా దొరుకుతుంది. ఎముకల వృద్ధికీ మరియు రోగ నిరోధకతను పెంపొందించటంలో, ఇది చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది.

foods-to-increase-immunity-during-pregnancy

ప్రోటీన్లు :

శరీర రోగనిరోధక వ్యవస్థను నిర్మించడంలో ప్రోటీన్లు చాలా కీలకమైన పాత్రను పోషించడమే కాకుండా, రోగనిరోధక వ్యవస్థను మరింత బలోపేతం చేసే బూస్టర్లని కూడా చెప్పవచ్చు.


వెల్లుల్లి :

వెల్లుల్లి, యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉండటం వల్ల, అంటువ్యాధులు మరియు ఇతర జబ్బుల కారకాలను చంపే శక్తిని కలిగి ఉంది. ఇది ఒక ఆరోగ్యకరమైన మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థను పెంపొందించుటలో సహాయపడే ఒక ముఖ్యమైన అంశంగా మారింది.

foods-to-increase-immunity-during-pregnancy

ఐరన్ :

రక్తము మరియు రోగనిరోధక వ్యవస్థలో ఐరన్ యొక్క పాత్ర ఎన్నటికీ అనుమానించబడలేదు (లేదా) చర్చించబడలేదు. రోగనిరోధక వ్యవస్థను పెంచడంతో పాటు, రక్త కణాల యొక్క పునరుత్పత్తిని పెంచడంలో ఇది చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. ఎర్రని మాంసము, నేరేడు పండ్లు మరియు క్లస్టర్ బీన్స్లో ఈ ఐరన్ అనేది సమృద్ధిగా దొరుకుతుంది.


ప్రోబయోటిక్స్ :
పర్యావరణ (లేదా) తక్కువగా వున్న రోగనిరోధక వ్యవస్థ వలన కలిగి తేలికపాటి ఇన్ఫెక్షన్లకు, "ప్రోబయోటిక్స్" అనేది ఒక కొత్త సమాధానము. అవి మెరుగైన, ఆరోగ్యవంతమైన జీవన శైలి కోసం మన రోగనిరోధక వ్యవస్థను బాగా బలపరుస్తాయి. మన ఇంట్లో సాధారణంగా చేసిన పెరుగు ద్వారా ఈ ప్రోబయోటిక్స్ను సేకరించగలము.

English summary

Foods To Increase Immunity During Pregnancy | Fruits To Increase Immunity In Pregnancy | Best Foods To Increase Immunity During Pregnancy

Foods To Increase Immunity During Pregnanc,Here are the foods that helps to increase immunity during pregnancy. These are the best foods that help in increasing immunity during pregnancy
Desktop Bottom Promotion