Latest Updates
-
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు?
ఒక నెల ప్రెగ్నన్సీని అబార్షన్ లేకుండా అవాయిడ్ చేయడమెలా?
ప్రెగ్నన్సీ అనేది ఎంతో ఆనందాన్ని కలిగించేదైనా అయ్యుంటుంది లేదా అంతులేని స్ట్రెస్ ని ఏర్పరిచేది అయినా అయ్యుంటుంది. ప్రెగ్నన్సీని అవాయిడ్ చేయడానికి అనేక పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. ఒకవేళ ప్రివెంటివ్ మెజర్స్ ఫెయిల్ అయినప్పుడు అన్వాన్టేడ్ ప్రెగ్నన్సీని ఎదుర్కోక తప్పదు. లాస్ట్ సెక్సువల్ ఇంటర్ కోర్స్ తరువాత 48 నుంచి 72 గంటల లోపు ప్రెగ్నన్సీని అవాయిడ్ చేసే బర్త్ కంట్రోల్ పిల్స్ ఉండనే ఉన్నాయి.
కొన్ని సందర్భాలలో యుటెరస్ లో ఫెటస్ ఎదుగుదల ఆరోగ్యంగా ఉండదు. అటువంటి సందర్భాలలో, ప్రెగ్నన్సీని ఎలా అవాయిడ్ చేయాలన్న దిగులు ప్రారంభం అవుతుంది. పిల్స్ అనేవి ప్రెగ్నన్సీని అడ్డుకోలేకపోతే, మీకున్న ఒకే ఒక్క ఆప్షన్ అబార్షన్. అయితే, అబార్షన్ అనేది ఎంతో కఠినమైన నిర్ణయం అలాగే వ్యక్తిగతమైనది.

ఫెటస్ కి జీవం వచ్చేలోపు ప్రెగ్నన్సీని టెర్మినేట్ చేయడం లేదా ముగించడాన్ని అబార్షన్ అనంటారు. అబార్షన్ కి సంబంధించి డెసిషన్ తీసుకోవడం అంత సులభం కాదు. ఒక నెల ప్రెగ్నన్సీలో అబార్షన్ వలన మహిళ ఆరోగ్యం దెబ్బతింటుంది.
అబార్షన్ కి సంబంధించి అనేక విషయాలను పరిగణలోకి తీసుకోవాలి. అబార్షన్ అనేది శారీరకంగా అలాగే మానసికంగా మహిళపై ప్రభావం చూపిస్తుంది. దీర్ఘకాలంలో, మహిళ ప్రెగ్నెంట్ అవ్వాలంటే అనేక కాంప్లికేషన్స్ ని ఎదుర్కోవలసి వస్తుంది. అటువంటి సందర్భాలలో, వైద్యుల సలహాను లేదా కౌన్సెలర్ వద్దకు లేదా మీరు నమ్మే వ్యక్తి సలహాను తీసుకోవడం మంచిది.

ఒకవేళ మీరు అబార్షన్ వైపు మొగ్గు చూపకపోతే ఇక్కడ ఉన్న కొన్ని ఆల్టార్నేటివ్ మెజర్స్ మీకు ఉపయోగకరంగా ఉండవచ్చు. ఒక నెల ప్రెగ్నన్సీని టెర్మినేట్ చేసే ఆల్టార్నేటివ్ మెజర్స్ గురించి ఇక్కడ వివరించాము. మహిళ ఏజ్ ను అలాగే ఆరోగ్యాన్ని ఫెటస్ యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఎంతో జాగ్రత్తతో వీటిని పాటించాలి.

సర్జికల్ అబార్షన్:
ఒక వేల అబార్షన్ ప్రాసెస్ ఇంట్లో సమర్థవంతంగా జరిగే అవకాశం లేకపోతే మెడికల్ సూపర్విజన్ లో అబార్షన్ ప్రోసిజర్ ని జరిపించాలి. హాస్పటల్ లో సర్జరీని చేస్తారు. ఇందులో రెండు ప్రాసెస్ లు ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ఎంవిఏ (మ్యానువల్ వాక్యూమ్ అబార్షన్) మరియు డి అండ్ ఈ (డైలేషన్ మరియు ఎవాక్యూయేషన్).
ఈ రెండు ప్రొసీజర్స్ కూడా సక్షన్ టెక్నీక్ ని పాటించి గర్భాన్ని ఖాళీ చేస్తాయి. ఎంవిఏని ప్రెగ్నన్సీ మొదటి దశలో నిర్వహిస్తారు. అంటే 12 వారాల ప్రెగ్నన్సీని టెర్మినేట్ చేయడానికి ఈ ప్రాసెస్ ని ఫాలో అవుతారు. డి ఎండ్ ఈ అనే ప్రాసెస్ ను 13 వారాలు అంతకంటే ఎక్కువ ప్రెగ్నన్సీని టెర్మినేట్ చేయడానికి ప్రిఫర్ చేస్తారు.
ఇది కేవలం 10-15 నిమిషాల ప్రొసీజర్ మాత్రమే. ఈ ప్రొసీజర్ లో భాగంగా గైనకాలజిస్ట్ ఒక ట్యూబ్ ని సెర్విక్స్ లో అమర్చి సూతింగ్ డ్రగ్ తో గర్భాన్ని మొద్దుబరచి గర్భాశయాన్ని క్లీన్ చేస్తారు. ఈ సక్షన్ ట్యూబ్ అనేది గర్భాన్ని ఖాళీ చేయడానికి తోడ్పడుతుంది.

అబార్షన్ తరువాత మహిళ సాధారణంగా ఫేస్ చేసే కొన్ని లక్షణాలు
బ్లీడింగ్:
అబార్షన్ తరువాత గర్భాశయం నుంచి విపరీతమైన బ్లీడింగ్ జరుగుతుంది. ఒక నెల ప్రెగ్నన్సీని టెర్మినేట్ చేసిన తరువాత వూమ్బ్ రికవర్ అవడానికి కొన్ని వారాల సమయం తీసుకుంటుంది. దీని వలన బ్లీడింగ్ మరియు క్రామ్ప్స్ సమస్య ఎదురవుతుంది. క్లాగ్స్ తో నాన్ స్టాప్ బ్లీడింగ్ అనేది జరుగుతూ ఉంటే వెంటనే ఎమర్జెన్సీ మెడికల్ హెల్ప్ ను ఆశ్రయించాలి.

నొప్పి:
అబార్షన్ తరువాత నొప్పితో బాధపడటం సహజం. యుటెరస్ లైనింగ్ ను వూమ్బ్ లోంచి తొలగిస్తారు కాబట్టి తీవ్రమైన నొప్పి రావడం సహజం. వైద్యులు ఇందుకు పెయిన్ కిల్లర్ ను ప్రిస్క్రైబ్ చేస్తారు. నొప్పిని తగ్గించేందుకు మరికొన్ని పద్దతులను కూడా సూచిస్తారు. హాట్ వాటర్ బాటిల్ ను ఉపయోగించి నొప్పిని తగ్గించుకోవచ్చు.

మానసిక ఒత్తిడి:
అబార్షన్ వలన మానసికంగా ఒత్తిడికి గురవుతారు. రోలర్ కోస్టర్ రైడ్ లా మానసికంగా అలజడికి గురవుతారు మహిళలు. గిల్టీ, డిప్రెషన్, బాధ వంటి సంఘర్షణలకు గురవుతారు. తమలో ప్రాణం పోసుకున్న జీవి ప్రాణం పోవటంతో ఇలా మానసికంగా బాధపడతారు. సెటిల్ అవటానికి కొంత సమయం పడుతుంది.

అబార్షన్ తరువాత పాటించవలసినవి:
ఫ్లూయిడ్స్ ను ఎక్కువగా తీసుకోవాలి. తద్వారా, శరీరం హైడ్రేటెడ్ గా ఉండేలా చూసుకోవాలి. డీహైడ్రేషన్ ను ఈ విధంగా అరికట్టవచ్చు.
మల్టీవిటమిన్స్, ఐరన్ మరియు ప్రోటీన్స్ కలిగిన హెల్తీ బాలన్స్డ్ డైట్ ను తీసుకోవాలి. డైట్ ద్వారా ఎనర్జీ లభించేలా చూసుకోవాలి.
15 పౌండ్స్ కంటే ఎక్కువ బరువును 2 వారాల వరకు ఎత్తకూడదు.
కొన్ని రోజులు పని నుంచి విరామాన్ని పొందాలి.
టబ్ బాత్స్ మరియు స్విమ్మింగ్ ను రెండు వారాల వరకు అవాయిడ్ చేయాలి.
విపరీతమైన వర్క్ అవుట్ సెషన్స్ ను వారం పాటు అవాయిడ్ చేయాలి.
పని ఒత్తిడిని తగ్గించుకోవాలి.
సెక్స్, ట్యంపన్స్ లేదా డచెస్ వంటి వాటి నుంచి దూరంగా ఉండడం ద్వారా వెజీనాపై ఒత్తిడి తగ్గించుకోవాలి.
రికవర్ అయ్యే వరకు ఫిజికల్ ఇంటర్ కోర్స్ నుంచి దూరంగా ఉండాలి. శారీరకంగా అలాగే మానసికంగా ఆరోగ్యంగా తయారయ్యే వరకు ఈ జాగ్రత్తలు పాటించడం అవసరం.



Click it and Unblock the Notifications