For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పచ్చి బొప్పాయి మరియు గుడ్లు తినడం గర్భవిచ్చిత్తికి ఏ విధంగా దోహదపడతాయి?

|

కడుపులో పిండాన్ని మోస్తూ, అది పూర్తి స్థాయిలో అభివృధ్ధి చెంది బిడ్డగా మారినంత వరకు సరైన పోషణను అందువ్వడం తల్లికి అతి పెద్ద బాధ్యత. దీని కొరకై వారు ఒక క్రమపద్ధతిలో ఆహారం తీసుకోవాలి. గర్భధారణ సమయంలో ఏ పదార్థాలను తినవచ్చో, ఏవి తినకూడదో బాగా అర్ధం చేసుకోవాలి.

గర్భధారణ సమయంలో ఆహార లోపమైనా లేదా అధికమైనా అది తల్లి ఆరోగ్యం పై ప్రభావం చూపి సమస్యలను కలుగజేస్తుంది. సాధారణంగా మనం బొప్పాయి మరియు గుడ్లు గర్భవిచ్చిత్తిని ప్రోత్సహిస్తాయని వింటుంటాం. దీని గురించి పూర్తిగా తెలుసుకుందాం!

బొప్పాయి ఎన్నో వ్యాధులను అరికట్టే అద్భుతమైన ఆహార పదార్థంగా పేరెన్నికగన్నది. పచ్చి మరియు మగ్గిన బప్పాయి పండును రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి, జీర్ణశక్తిని పెంచడానికి మరియు గాయాలని మాన్పేందుకు వాడతారు. బొప్పాయి రసాన్ని కాలిన గాయాలు, బొబ్బలు మరియు కురుపులు మానేందుకు పైపూతగా వాడతారు. అంతేకాక మధుమేహ వ్యాధి ఉన్నవారు, హృద్రోగులు, మరియు కాన్సర్ రోగగ్రస్థులు కూడా దీనిని సేవిస్తారని సమాచారం.

how-can-eating-papaya-or-eggs-cause-miscarriage

పచ్చి బొప్పాయి మాత్రం గర్భం ధరించిన వారికి, గర్భం ధరించాలనుకునే వారికి మాత్రం మంచిది కాదు.

ఇలా అన్నంతమాత్రాన, పచ్చి బొప్పాయి లేదా వండిన గుడ్ల గర్భవిచ్చిత్తిని ప్రోత్సహిస్తాయి అని చెప్పలేము. ఆయుర్వేద శాస్త్ర ప్రకారం పచ్చి బొప్పాయి మరియు వండిన గుడ్లు పిత్తాన్ని (వేడిని) కలుగజేస్తాయి.

పచ్చి బొప్పాయి పండు పాలలో పెపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఈ ఎంజైమ్ ప్రోస్టాగ్లాండిన్ మరియు ఆక్సిటోసిన్ అనే రెండు ఇతర ఎంజైముల మాదిరిగా పనిచేస్తుంది.

ప్రోస్టాగ్లాండిన్ మరియు ఆక్సిటోసిన్ అనే రెండు ఎంజైములను ప్రసవాన్ని ప్రేరేపించడానికి వాడతారు. ఈ కారణం చేత, పచ్చి బొప్పాయిలో ఉండే ఈ ఎంజైముల ప్రోద్భలం వలన ఇంకా ఎదగని పిండం యొక్క ప్రసవాన్ని ప్రేరేపిస్తుంది. కనుక గర్భవిచ్చిత్తి జరగడం లేదా అవకారాలు ఉన్న బిడ్డలు పుట్టటం వంటివి జరిగే అవకాశం ఉంది.

కొన్ని పరిశోధనల ప్రకారం, పచ్చి లేదా ముగ్గని బొప్పాయిలో పలు రకాల ఎంజైములు మరియు చీము వంటి పదార్థాలు ఉంటాయి. వీటి ప్రభావం చేత గర్భసంచిలో నొప్పి మొదలై గర్భవిచ్చిత్తికి దారితీయవచ్చు. కానీ పచ్చి బొప్పాయిలో ఉండే ప్రోస్టాగ్లాండిన్ మరియు ఆక్సిటోసిన్ లు బిడ్డ జన్మించాక తల్లి తిరిగి మామూలు స్థితికి రావడానికి తోడ్పడతాయి.

how-can-eating-papaya-or-eggs-cause-miscarriag

కనుక ప్రసవానికి తయారుగా లేని ఆడవాళ్లు పచ్చిబొప్పాయి తినడం మంచిది కాదు. కానీ గర్భవతులను పండిన బొప్పాయిని తినమని చాలామంది డాక్టర్లు సలహా ఇస్తారు. గర్భవిచ్చిత్తి జరుగుతుందేమో అనే అనుమానంతో మగ్గిన బొప్పాయిని తినడం మానేయాల్సిన అవసరం లేదు.

పచ్చిబొప్పాయిలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది మహిళల ఋతుచక్రంను నియంత్రిస్తుంది. పచ్చిబొప్పాయిని తిన్నప్పుడు శరీరంలో ఈస్ట్రోజన్ హార్మోన్ స్థాయి పెరుగుతుంది. ఇది నెలసరి సక్రమంగా వచ్చేలా చేస్తుంది. అనాదిగా పచ్చిబొప్పాయిని కుటుంబనియంత్రణ కొరకు వాడుతున్న దాఖలాలు అనేకం.

మహిళల్లో గర్భవిచ్చిత్తిని ప్రేరేపించే పదార్ధాన్ని ఆంగ్లంలో అబార్టిఫంఫేషియంట్ అని అంటారు. పలు ఆసియా దేశాల్లోని ఆడవాళ్లు గర్భనిరోధానికై పచ్చిబొప్పాయిని తింటారు. ఇది సహజ గర్భనిరోధక పదార్థం మరియు గర్భవిచ్చిత్తి కారకం.

పచ్చిబొప్పాయి పండులో ఉండే పెపైన్ అనే ఎంజైమ్ ప్రొజెస్టిరాన్ ఉత్పత్తిని అణచివేసి ఎండోమెట్రియం పైపొరను సక్రమంగా వృద్ధి కానివ్వదు. దీనివలన బిడ్డ ఎదుగుదలకు ప్రతికూల వాతావరణం ఏర్పడుతుంది. ఎదిగే పిండాన్ని పచ్చిబొప్పాయి ప్రాణాంతకమైనది. ఇది పిండం యొక్క అభివృద్ధిని నిలిపేస్తుంది.

how-can-eating-papaya-or-eggs-cause-miscarriage

పెపైన్ మాత్రమే కాక పచ్చిబొప్పాయి లో ఉండే లేటక్స్ కూడా గర్భవతులకు చేటు చేస్తుంది. లేటెక్స్ గర్భాశయములో సంకోచాలను ప్రేరేపించి గర్భవిచ్చిత్తికి దోహదపడుతుంది. బ్రిటీష్ జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్ యొక్క పరిశోధనలో శాస్త్రవేత్తలు పచ్చిబొప్పాయి ఆరోగ్యంపై దుష్పరిణామాలు చూపిస్తుందని అంగీకరించారు.


గర్భవతులు పచ్చి ఆహర పదార్థాలను కూడా సేవించరాదు. పచ్చి గుడ్లు, లేదా ఇంట్లో తయారు చేసిన మయోనీస్ తినరాదు. గుడ్డు పూర్తిగా ఉడికిన తరువాత మాత్రమే భుజించాలి.

ఆఖరుగా, పచ్చి బొప్పాయి మరియు గుడ్లు గర్భిణి స్త్రీల ఆరోగ్యం పట్ల ప్రతినాయక పాత్ర వహిస్తాయి. కనుక వారు ఆహారపదార్థాల విషయంలో ఏ పదార్థాలను తినవచ్చో, ఏవి తినకూడదో బాగా అర్ధం చేసుకోవాల్సిన ప్రత్యేక సమయం ఇది.

English summary

how-can-eating-papaya-or-eggs-cause-miscarriage

There is always a myth that if one eats papaya or eggs, it can cause a miscarriage? Raw papaya is considered highly dangerous and hazardous for the developing embryos and it might stagnate the process of its development. Raw eggs and papaya are two main anti-heroes for pregnant women.Carrying an embryo inside and nurturing
Story first published:Wednesday, April 4, 2018, 15:19 [IST]
Desktop Bottom Promotion