For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రెగ్నన్సీ సమయంలో ఉమ్మనీరు తగ్గిపోవడాన్ని ఎలా గుర్తించవచ్చు?

|

స్వచ్ఛమైన, తేలికపాటి పసుపు రంగులోనుండే ఉమ్మనీరు గర్భంలోని శిశువుకి రక్షణనిస్తుంది. అమ్నియోటిక్ కేవిటీలో ఉండే ఈ నీటినే ఆమ్నాయిటిక్ ఫ్లూయిడ్ (ఉమ్మనీరు) అని అంటారు. ఈ నీరు శిశువు ఆరోగ్యకరంగా ఎదిగేందుకు తగిన సపోర్ట్ ని ఇస్తుంది. శిశువు ఎదుగుదలలో కీలకపాత్ర పోషిస్తుంది. సెకండ్ ట్రైమ్స్టర్ లో గర్భస్థ శిశువు మూత్రం వలన ఫ్లూయిడ్ సమృద్ధిగా లభిస్తుంది.

ఈ ఫ్లూయిడ్ లో యాంటీ బాడీస్, న్యూట్రియెంట్స్ అలాగే హార్మోన్స్ కూడా లభిస్తాయి. అమ్నియోటిక్ ఫ్లూయిడ్ అనేది వివిధ ఫంక్షన్స్ ను నిర్వర్తిస్తుంది. గర్భస్థ శిశువుకు మెత్తని పరుపులా సపోర్ట్ ని ఇస్తుంది. తద్వారా, గర్భస్థ శిశువును వివిధ ఇంజ్యూరీల నుంచి రక్షిస్తుంది. ఈ ఫ్లూయిడ్ అనేది గర్భంలో సరైన టెంపరేచర్ తో ఉంటుంది. అందువలన, ఇది లంగ్స్, డైజెస్టివ్ సిస్టమ్, బోన్స్ మరియు మజిల్స్ వృద్ధిని పెంపొందిస్తుంది. యంబిలికల్ కార్డుని నొక్కుబడకుండా కాపాడటం ఆమ్నాయిటిక్ ఫ్లూయిడ్ ముఖ్య పాత్ర. ఆ విధంగా గర్భస్థ శిశువుకి లభించే ఆహారానికి అలాగే ఆక్సిజన్ సప్ప్లైకి ఏ విధమైన ఆటంకం రాకుండా చూస్తుంది.

English summary

How To Detect Low Amniotic Fluid Levels During Pregnancy

The clear, slightly yellow colored liquid that borders the foetus in your womb is called amniotic liquid. This fluid exists within the amniotic cavity as well as it plays a vital function in your child’s life support and advancement. Throughout the second trimester, the foetal urine composes a good percent of the fluid.
Desktop Bottom Promotion