For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భిణీలు ఒత్తిడికి గురయితే గర్భస్థ శిశువు ఆరోగ్యం దెబ్బతింటుందా?

గర్భిణీలు ఒత్తిడికి గురయితే గర్భస్థ శిశువు ఆరోగ్యం దెబ్బతింటుందా?గర్భం దాల్చిన మహిళను ఆ ఇంటి సభ్యులు అల్లారు ముద్దుగా చూసుకుంటారు. కాళ్ళు కిందపెట్టనివ్వకుండా అన్నీ అమర్చి తెస్తారు. ఎటువంటి అసౌకర్యం కల

|

గర్భం దాల్చిన మహిళను ఆ ఇంటి సభ్యులు అల్లారు ముద్దుగా చూసుకుంటారు. కాళ్ళు కిందపెట్టనివ్వకుండా అన్నీ అమర్చి తెస్తారు. ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకుంటారు. ప్రత్యేకమైన శ్రద్ధను గర్భిణీలపై కనబరుస్తారు. గర్భిణీలు మానసికంగా అలాగే శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలి. అప్పుడే, పండంటి పాపాయికి జన్మనివ్వగలుగుతారు. ప్రతి కల్చర్ లో కూడా గర్భిణీలను జాగ్రత్తగా చూసుకోవడం అనాదిగా వస్తున్న ఆనవాయితీ.

గర్భిణీలు ఒత్తిడికి గురైతే ఆ ప్రభావం పుట్టబోయే బిడ్డపై పడుతుంది. గర్భస్థ శిశువు ఆరోగ్యంపై దుష్ప్రభావం పడే ప్రమాదం ఉంది.

How does stress affect the baby in the womb?

గర్భిణీలు ఒత్తిడికి గురైతే ఆ ప్రభావం గర్భస్థ శిశువుపై ఏ విధంగా పడుతుందో తెలుసుకునే ముందు గర్భిణీలు అసలు ఒత్తిడికి ఎందుకు గురవుతారో ఒత్తిడికి దారితీసే కారణాలేంటో తెలుసుకుందాం. ప్రెగ్నెన్సీ వలన వికారం, బరువు పెరగడం వంటి లక్షణాలను గమనించవచ్చు. ఇవి కూడా ఒత్తిడికి దారితీస్తాయి.

కొన్నిసార్లు, మానసిక ఒత్తిడికి గురి చేసే కొన్ని కుటుంబ సమస్యలు అలాగే ఆర్థిక సమస్యల వంటివి ఒత్తిడిని రేకెత్తిస్తాయి. డిప్రెషన్, రేసిజం వంటివి కూడా ఒత్తిడిని కలిగిస్తాయి. ప్రెగ్నెన్సీ అనేది అన్ ప్లాన్డ్ అయితే ఆ ఒత్తిడి మరింత ఎక్కువగా ఉంటుంది.

ఒత్తిడికి కారణాలేవైనా సరే ముందు ఒత్తిడిని తగ్గించేందుకు ప్రయత్నించాలి. అందుకు, ఒత్తిడికి గురి చేసే కారణంపై దృష్టి పెట్టాలి. ఆ కారణాన్ని కనుగొన్నాక, వైద్యున్ని సంప్రదించాలి. బంధుమిత్రుల అలాగే కుటుంబసభ్యుల ప్రోత్సాహంతో గర్భిణీలు ఒత్తిడిని జయించేందుకు ప్రయత్నించాలి.

ఒత్తిడికి సంబంధించి మీరెంత త్వరగా ఒక పరిష్కారాన్ని కనుగొంటే ప్రెగ్నెన్సీ దశ అంతటి మధురమైన అనుభూతిని మీకు కలిగిస్తుంది.

గర్భంలోని శిశువుపై ఒత్తిడి ఏ విధమైన ప్రభావం చూపుతుందో ఇప్పుడు తెలుసుకుందాం:

1. గర్భస్థ శిశువు హార్ట్ రేట్ పెరుగుతుంది:

1. గర్భస్థ శిశువు హార్ట్ రేట్ పెరుగుతుంది:

దీనికి శాస్త్రీయ వివరణ ఉంది. ఎవరైనా ఒత్తిడికి గురయితే స్ట్రెస్ హార్మోన్స్ అనేకం విడుదలవుతాయి. ఈ హార్మోన్స్ అనేవి ఆపదలో ఉన్నప్పుడు విడుదలయ్యే హార్మోన్స్ వంటివే. ఇవన్నీ, శరీరాన్ని ఒత్తిడి పూర్వకమైన పరిస్థితి నుంచి తప్పించుకునేందుకు ప్రేరేపిస్తాయి. అందువలన, హార్ట్ రేట్ అమాంతం పెరుగుతుంది. డేంజర్ నుంచి రక్షించుకునేందుకు శరీరంలో నున్న వ్యవస్థ ఈ విధంగా అంతర్గత మార్పులను కలిగిస్తుంది. అందుకే, గర్భిణీలు ఒత్తిడికి గురవడం మంచిది కాదు. వారెప్పుడూ ప్రశాంతంగా ఉండాలి. గర్భంలోని పాపాయి ఎదుగుతున్నందున పాపాయి మీ నుంచే పోషకాలను గ్రహించడం జరుగుతుంది. శరీరంలోని ముఖ్యమైన పారామీటర్స్ లోని తలెత్తే మార్పులు మీ పాపాయికి ప్రమాదకరంగా మారవచ్చు. అందువలన, మీ పాపాయి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఒత్తిడికి దూరంగా ఉండండి. ప్రశాంతంగా ఉంటూ ఒత్తిడికి దూరంగా ఉండటం వలన తల్లీ బిడ్డలా ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది.

2. ఇంఫ్లేమేటరీ రెస్పాన్స్:

2. ఇంఫ్లేమేటరీ రెస్పాన్స్:

ఇటువంటి రెస్పాన్స్ ను చాలా కాలంగా ఒత్తిడిని ఎదుర్కొంటూ వస్తున్న గర్భిణీల యొక్క గర్భస్థ శిశువులలో గమనించవచ్చు. పాపాయి మీలో ప్రాణం పోసుకుంటుందన్న విషయాన్ని మీరు మరచిపోకూడదు. పాపాయికి సంబంధించిన సెన్సెస్ అన్నీ అభివృద్ధి దశలో ఉంటున్న కారణంగా మీరు మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి. అటువంటి పరిస్థితులలో, శరీరంలోని స్ట్రెస్ మేనేజ్మెంట్ కూడా అభివృద్ధి దశలోనే ఉంటుంది. కాబట్టి, ఎక్కువగా ఒత్తిడికి గురయితే ఆ దుష్ప్రభావం గర్భస్థ శిశువుపై పడుతుంది. అందువలన, స్ట్రెస్ మేనేజ్మెంట్ సిస్టం సరిగ్గా పనిచేయదు.

అందువలన, గర్భస్థ శిశువుపై చిన్నపాటి లేదా దీర్ఘకాలం పరిణామాలు పడవచ్చు. చాలా సందర్భాలలో, గర్భస్థ శిశువు ఎక్కువగా రియాక్ట్ అయి ఇంఫ్లేమేటరీ రెస్పాన్స్ లను పంపడం జరుగుతుంది. ఈ ఇంఫ్లేమేటరీ రెస్పాన్స్ లు గర్భస్థ శిశువు ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపిస్తాయి. ప్రెగ్నెన్సీ దశ మొత్తం ఈ స్థితి కంటిన్యూ అవవచ్చు.

3. లో బర్త్ వెయిట్:

3. లో బర్త్ వెయిట్:

పుట్టుకతో వచ్చే కాంప్లికేషన్స్ అనేవి ఒత్తిడి వలన పెరిగే ప్రమాదం ఎక్కువగా ఉంది. గర్భస్థ శిశువుపై ఒత్తిడి ఎక్కువగా పడటం వలన తల్లి నుంచి పోషకాలను ఎక్కువగా గ్రహించలేక తక్కువ బరువుతో శిశువు జన్మించే ప్రమాదం ఉంది. అందువలన, గర్భస్థ శిశువు ఉండాల్సిన బరువు కంటే తక్కువగా ఉంటుంది. అందువలన, నేచురల్ డెలివరీ అనేది అత్యంత కష్టతరం కావచ్చు. అలాగే అనేక బర్త్ కాంప్లికేషన్స్ ఎదురవవచ్చు.

4. మెదడు అభివృద్ధిపై దుష్ప్రభావం:

4. మెదడు అభివృద్ధిపై దుష్ప్రభావం:

గర్భిణీలు ఒత్తిడికి గురయితే గర్భస్థ శిశువు మెదడు ఎదుగుదలపై దుష్ప్రభావం పడుతుందని వైద్యులు వెల్లడిస్తున్నారు. శిశువు జన్మించిన తరువాత కూడా వారి ఆరోగ్యంపై దీని ప్రభావం దీర్ఘకాలం పాటు ఉంటుందని తెలుస్తోంది. మరికొన్ని సందర్భాలలో, ఈ సమస్య అనేది కొన్ని సంవత్సరాల వరకూ బయటపడకపోవచ్చు.

5. మిస్ క్యారేజ్ కు గురయ్యే ప్రమాదం:

5. మిస్ క్యారేజ్ కు గురయ్యే ప్రమాదం:

ఒత్తిడి ఏ విధమైనదైనా కావచ్చు అది గర్భసంచిలోని రసాయన అలజడిని సృష్టిస్తుంది. ఎందుకంటే కార్టికోట్రోపిన్ రిలీసింగ్ హార్మోన్ (CRH) విడుదలవడం వలన ఇలా జరుగుతుంది. బ్లడ్ స్ట్రీమ్ లో CRH స్థాయి ఎక్కువగా ఉండడం వలన గర్భాశయంలో కాంట్రాక్షన్స్ సంభవించవచ్చు. యుటెరిన్ కాంట్రక్షన్స్ రాంగ్ టైమ్ లో ఎక్కువవడం వలన మిస్ క్యారేజ్ జరిగే ప్రమాదం తలెత్తుతుంది.

అందువలన, గర్భిణీలు ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉండేందుకే ప్రయత్నించాలి.

English summary

How does stress affect the baby in the womb?

Doctors advise us not to take stress. And specially pregnant women are advised not to take stress at all.An abrupt change in any of the vital parameters of your body will actually prove to be dangerous for your baby. And it may be the reason for low birth weight, issues in fetal brain development and also cause miscarriage.
Desktop Bottom Promotion