For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్త్రీ పురుష సంభోగం జరగకుండా గర్భం దాల్చే అవకాశం ఉందా?

స్త్రీ పురుష సంభోగం జరగకుండా గర్భం దాల్చే అవకాశం ఉందా?

|

మన దేశంలో చర్చకు వచ్చిన ప్రతిసారి వివాదాస్పదం అయ్యే అంశం ఏదైనా ఉందంటే, అది శృంగారం మాత్రమే!

మన దేశంలో ప్రజలు ఇప్పటికి ప్రాచీన సంప్రదాయాలను కొనసాగిస్తూ, శృంగారం విషయానికి వచ్చేటప్పటికి ఇంకా పాత ధోరణి ఆలోచనలే కలిగి ఉన్నారు. శృంగారం అనే పదం నిషిద్ధం అయినట్లుగా భావిస్తారు. సెక్స్ అనే పదం, కేవలం లింగబేధాన్ని తెలియజేయు నిమిత్తం వాడే పదంగా భావిస్తారు.

ప్రపంచంలో రెండవ అతిపెద్ద జనాభా కలిగిన దేశం అయ్యుండి, అందులో యాభై శాతం మంది వయస్సు పాతికేళ్ల లోపు మాత్రమే ఉన్నప్పుడు, పాఠశాలల్లో శృంగార విజ్ఞానాన్ని గురించి బోధించవలసిన తక్షణ అవసరం ఉంది.

How Is It Possible to Become Pregnant Without Intercourse

ఈ విషయాలను గురించి చర్చించడానికి విముఖత చూపించడం వలన, యువతరంలో అనునిత్యం తమ సందేహాలకు జవాబు లభించక ఒక విధమైన సంఘర్షణకు లోనవుతున్నారు. వారి మెదడులో ఉత్పన్నమయ్యే ప్రశ్నలు పరిపరి రకాలుగా ఉన్నప్పటికీ, ఒక ముఖ్య ప్రశ్న వారి మనసును తొలిచేస్తూ ఉంటుంది. అంగప్రవేశం జరగనప్పటికి, గర్భం దాల్చే అవకాశం ఉందా?

దీనికొరకై మీరు, ఒక స్త్రీ గర్భం ధరించడానికి అనుకూలించే పరిస్థితుల గురించి ఒక అవగాహన కలిగి ఉండటం అవసరం.

గర్భం అనేది ఒక ఆరోగ్యవంతమైన పురుషుని శుక్రకణం, స్త్రీ యోని ద్వారా ప్రయాణించి, ఒక ఆరోగ్యవంతమైన అండాన్ని చేరుకుని, దానిని ఫలదీకరిస్తే కలుగుతుంది. గర్భధారణ ప్రక్రియ జరిగినపుడే గర్భం కలుగుతుంది.

గర్భం ధరించడానికి అవసరమైన పరిస్థితులు:

గర్భం ధరించడానికి అవసరమైన పరిస్థితులు:

- స్త్రీలలో అండోత్సర్గం(ovulation) ప్రక్రియ జరుగుతున్న సమయం అయ్యి, గర్భాశయంలో ఆరోగ్యవంతమైన అండం ఉండి ఉండాలి.

- పురుషుడు ఉత్పత్తి చేసే శుక్రకణం ఆరోగ్యవంతమైనదై ఉండి, యోని ముఖద్వారం నుండి గర్భాశయం వరకు ప్రయాణం చేసే సామర్థ్యం కలిగి ఉండాలి.

- తగిన జాగ్రత్తలు తీసుకోకుండా, లేకుండా శృంగారం జరిపినప్పుడు, పురుషుని వీర్యంలో ఉండే కొన్ని కోట్ల శుక్రకణాలు, ఫెలోపియన్ ట్యూబ్యుల్స్ ద్వారా అండాశయం వరకు ప్రయాణించే సామర్ధ్యం కలిగి ఉంటాయి. కానీ కొన్ని సందర్భాలలో ఆశ్చర్యకరంగా అంగప్రవేశం జరగనప్పటికి, గర్భం దాల్చే అవకాశం ఉంటుంది. దీని వెనుక ఉన్న శాస్త్రీయ కారణాలు తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.

దీని వెనుక ఏంతో శాస్త్రీయ విజ్ఞానం ఉంది. సాధారణంగా గర్భం దాల్చడానికి అంగప్రవేశం అవసరం. కానీ కొన్ని సందర్భాలలో కామోద్దీపన సమయంలో చేసే కొన్ని చేష్టల వలన కూడా గర్భం వచ్చే అవకాశం ఉంటుంది. దీని వెనుక ఉన్న వాస్తవం ఏమిటంటే, పురుషులలో ఉత్పత్తి అయ్యే శుక్రకణంకు, స్త్రీ యొక్క ప్రత్యుపత్తి వ్యవస్థ గుండా ప్రయాణం చేసి, అండాన్ని ఫలదీకరించే అసమాన్యమైన శక్తి ఉంటుంది.

శుక్రకణంకు ఉన్న ఇంకొక విశిష్టత ఏమిటంటే, ఇది అనుకూల పరిస్థితులలో, ఐదు రోజుల వరకు జీవించి ఉంటుంది. కనుక యోని పరిసరాల్లో ఎక్కడ స్ఖలించినా, మన శరీరం యొక్క ఉష్ణోగ్రత వలన శుక్రకణం జీవించి ఉండి అండం వరకు ప్రయాణం చేసే అవకాశం ఉంది.

సంభోగం జరగకుండా గర్భం దాల్చే అవకాశం ఉందా?

సంభోగం జరగకుండా గర్భం దాల్చే అవకాశం ఉందా?

ఈ అవకాశం లక్షల్లో ఒకసారి అరుదుగా జరుగుతున్నప్పటికీ, ప్రపంచ వ్యాప్తంగా ఇలా జరిచిన సందర్భాలు కొన్ని ఉన్నాయి.

గర్భధారణ జరగడానికి పురుషులు ఉత్పత్తి చేసే శుక్రకణం స్త్రీలోని అండాన్ని చేరి ఫలదీకరించాలి. అంగప్రవేశం జరగనప్పటికి, పురుషుడు స్త్రీ యొక్క యోని పరిసరాల్లో స్ఖలించినట్లైతే, గర్భం దాల్చే అవకాశం ఉంటుంది. యోని పరిసరాల్లో వీర్యస్ఖలనం జరిగినప్పుడు, శుక్రకణంకు స్త్రీ యొక్క అండాశయం వరకు ప్రయాణం చేసి, గర్భం కలుగజేసే సామర్ధ్యం ఉంటుంది.

అంగప్రవేశం జరగనప్పటికి, గర్భధారణకు దారితీసే పరిస్థితులు:

అంగప్రవేశం జరగనప్పటికి, గర్భధారణకు దారితీసే పరిస్థితులు:

ఈ రోజుల్లో , శృంగార సమయంలో కామోద్దీపన వివిధ రకాల చర్యలతో జరుపుతున్నారు. జననేంద్రియాలను ప్రేరేపించుకోవడం, ముఖరతి, జననేంద్రియాలలో వేళ్ళు చొప్పించడం, శృంగారానికి సంబంధించిన పరికరాలు వాడటం వంటివి వీటిలో కొన్ని. వీటిలో ఏ చర్య వలనైనా, యోని పరిసరాల్లో స్ఖలించినట్లైతే, ఆ శుక్రకణం స్త్రీ యొక్క అండాశయం వరకు ప్రయాణం చేసి, గర్భం కలుగజేసే అవకాశం ఉంది. దీనికి అవసరమయ్యే ముఖ్య పరిస్థితి ఏమిటంటే, స్త్రీలలో అండోత్పత్తి ప్రక్రియ జరిగి, గర్భాశయంలో ఆరోగ్యవంతమైన అండం ఉండాలి.

ఈ క్రింది కొన్ని సందర్భాలలో స్త్రీ అంగప్రవేశం జరగనప్పటికి, గర్భం ధరించే అవకాశం ఉంటుంది:

ఈ క్రింది కొన్ని సందర్భాలలో స్త్రీ అంగప్రవేశం జరగనప్పటికి, గర్భం ధరించే అవకాశం ఉంటుంది:

1. దుస్తులు ధరించకుండా జననేంద్రియాలను ప్రేరేపించుకునేటప్పుడు, యోని పరిసరాల్లో వీర్యస్ఖలనం జరిగితే గర్భం రావచ్చు.

ఈ క్రింది కొన్ని సందర్భాలలో స్త్రీ అంగప్రవేశం జరగనప్పటికి, గర్భం ధరించే అవకాశం ఉంటుంది:

ఈ క్రింది కొన్ని సందర్భాలలో స్త్రీ అంగప్రవేశం జరగనప్పటికి, గర్భం ధరించే అవకాశం ఉంటుంది:

2. పాయువు ద్వారా సంపర్కం (anal sex) వలన గర్భం కలుగదనేది ఒక అపోహ మాత్రమే! పాయువు యోనికి సమీపంలో ఉండటం వలన వీర్యం సులభంగా యోనిలోకి ప్రవేశించగలదు. దీని వలన గర్భం కలగవచ్చు.

ఈ క్రింది కొన్ని సందర్భాలలో స్త్రీ అంగప్రవేశం జరగనప్పటికి, గర్భం ధరించే అవకాశం ఉంటుంది:

ఈ క్రింది కొన్ని సందర్భాలలో స్త్రీ అంగప్రవేశం జరగనప్పటికి, గర్భం ధరించే అవకాశం ఉంటుంది:

3. రతి కొరకు బొమ్మలు లేదా పరికరాలు వినియోగించినపుడు, వీర్యం వాటికి తాకిఉండి, వాటిని యోనిలోనికి చొప్పిస్తే గర్భం కలగవచ్చు

ఈ క్రింది కొన్ని సందర్భాలలో స్త్రీ అంగప్రవేశం జరగనప్పటికి, గర్భం ధరించే అవకాశం ఉంటుంది:

ఈ క్రింది కొన్ని సందర్భాలలో స్త్రీ అంగప్రవేశం జరగనప్పటికి, గర్భం ధరించే అవకాశం ఉంటుంది:

4. ముఖరతి సమయంలో పురుషుడు యోని సమీపంలో వీర్యాన్ని స్ఖలిస్తే, శుక్రకణం స్త్రీ యొక్క అండాశయం వరకు ప్రయాణం చేసి, గర్భం కలుగజేసే అవకాశం ఉంది.

English summary

How Is It Possible to Become Pregnant Without Intercourse

Is it possible to become pregnant without proper penetrative sex? Yes, though the percentage is very less it is possible to become pregnant and this may happen when the ejaculation happens anywhere near the vagina, and the warm temperature of the body lets the sperm thrive and travel all the way inside.
Story first published:Tuesday, May 22, 2018, 15:18 [IST]
Desktop Bottom Promotion