For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కేవలం ఒకే నెలలో గర్భం దాల్చడం ఎలా?

కేవలం ఒకే నెలలో గర్భం దాల్చడం ఎలా?

|

గర్భం దాల్చడమనేది పూర్తిగా అదృష్టం మీద ఆధారపడి ఉంది. కొంతమంది మహిళలు కేవలం ఒక్కసారి శృంగారంలో పాల్గొనగనే గర్భం దాల్చుతారు. మరికొంతమంది దంపతులు ఎన్ని సార్లు సంభోగం చేసుకున్నా కూడా మహిళ గర్భం దాల్చలేదు. గర్భం దాల్చడానికి కొన్నేళ్ల పాటు ఇబ్బంది పడ్డ సందర్భాలు కూడా ఉంటాయి.

కేవలం ఒకే నెలలో గర్భం దాల్చాలని మీరనుకుంటే, కొన్ని విషయాలను మీరు కచ్చితంగా గుర్తుంచుకుని తీరాలి. ఈ విషయాలను గుర్తుంచుకోవడం ద్వారా గర్భం దాల్చే అవకాశాలను పెంపొందించుకోవచ్చు.

గర్భం దాల్చాలంటే మీరు కొన్ని విషయాలకు ప్రాముఖ్యతనివ్వాలి. ఏ మెన్స్ట్రువల్ సైకిల్ లో నైనా గర్భం దాల్చే అవకాశం కేవలం 20 నుంచి 25 శాతం వరకు మాత్రమే ఉంటుంది. అయితే, ఈ పెర్సెంటేజ్ ను మీరు ఇంకాస్త పెంచుకునే అవకాశము ఉంది.

How to Get Pregnant in One Month

ఈ పెర్సెంటేజ్ ను మీరు 40 నుంచి 50 శాతం వరకు పెంచుకోవచ్చు. అంటే, గర్భం దాల్చే అవకాశాన్ని మీరు రెట్టింపు చేసుకుంటున్నారన్న మాట.

ఈ రోజు, త్వరగా గర్భం దాల్చేందుకు మీరు గమనించదగిన విషయాల గురించి ఇక్కడ పొందుబరిచాము. వీటిని చదివి విషయం తెలుసుకోండి మరి.

• స్మోకింగ్ కు దూరంగా ఉండండి:

• స్మోకింగ్ కు దూరంగా ఉండండి:

మీరు హెవీ లేదా చైన్ స్మోకర్ అయితే, స్మోకింగ్ హ్యాబిట్ ను మీరు తక్షణమే విడిచిపెట్టాలి. ఈ హ్యాబిట్ అనేది స్పెర్మ్ కౌంట్ ని తగ్గించి ఇంఫెర్టిలిటీకి దారితీసే ప్రమాదం ఉంది. అలాగే ఫాలోపియన్ ట్యూబ్ బ్లాకేజ్ తో పాటు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీకి దారితీసే ఆస్కారం ఉంది. ముఖ్యంగా మహిళలు ఈ హ్యాబిట్ కు దూరంగా ఉండాలి. ఈ హ్యాబిట్ వలన పాపాయి మీ శరీరంలో ప్రాణం పోసుకునేందుకు అనువైన వాతావరణం ఉండదు. అందువలన, మిస్ క్యారేజ్ ప్రమాదాలు ఎక్కువ. మీ ఎగ్స్ అనేవి డేమేజ్ కావచ్చు లేదా వాటి నాణ్యత లోపించవచ్చు.

• ఆల్కహాల్ ను అవాయిడ్ చేయండి:

• ఆల్కహాల్ ను అవాయిడ్ చేయండి:

ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ ను తీసుకుంటున్న ఇన్ఫెర్టిల్ కపుల్స్ కు ఆల్కహాల్ కి దూరంగా ఉండమన్న సలహా ఎక్కువగా అందుతుంది. మీరు ఆల్కహాలిక్ అయితే, గర్భం దాల్చే అవకాశాలు తక్కువ. మీరు పండంటి బిడ్డకు జన్మనివ్వాలంటే ఈ హ్యాబిట్ కు దూరంగా ఉండాలి. ఆల్కహాల్ ను దూరంగా ఉంచడం వలన మీ పాపాయి ఆరోగ్యం కూడా బాగుంటుంది.

• బరువును నియంత్రణలో ఉంచుకోండి:

• బరువును నియంత్రణలో ఉంచుకోండి:

మీరు ఓవర్ వెయిట్ తో ఇబ్బంది పడుతూ ఉంటే కేవలం ఒకే నెలలో ఎక్కువ పౌండ్స్ ను తగ్గించుకోవాలనుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదు. కాబట్టి, కొన్ని కిలోలు తగ్గడానికి ప్రయత్నించండి. అలాగే, అండర్ వెయిట్ గా ఉన్నవారిలో కూడా గర్భం దాల్చే అవకాశాలు తక్కువ. మీలో ఫ్యాట్ లెవల్స్ తక్కువగా ఉంటే మీరు ఓవ్యులేట్ కాలేరు. కాబట్టి మీ బీఎంఐ 15.5 నుంచి 24.9 మధ్యలో ఉండేలా జాగ్రత్తలు తీసుకోండి. అప్పుడు గర్భం దాల్చే అవకాశాలు ఎక్కువ.

• మ్యూకస్ డిస్చార్జ్ ని గమనించండి:

• మ్యూకస్ డిస్చార్జ్ ని గమనించండి:

మ్యూకస్ డిశ్చారిజ్ ని గమనించడం ద్వారా మీరు గర్భం దాల్చే అవకాశాలను పెంచుకోవచ్చు. సెర్వికల్ మ్యూకస్ ని మీరు గమనిస్తూ ట్రాక్ చేసుకోవాలి. ఓవ్యులేషన్ మెథడ్ కంటే ఇది మెరుగ్గా పనిచేస్తుంది. మ్యూకస్ డిశ్చార్జ్ ఎక్కువగా ఉన్న రోజు ఇంటర్ కోర్స్ లో పాల్గొనడం ద్వారా గర్భం దాల్చే అవకాశాలను పెంపొందించుకోవచ్చు.

• శృంగారాన్ని ఆస్వాదించండి:

• శృంగారాన్ని ఆస్వాదించండి:

కేవలం గర్భం దాల్చడం కోసమే శృంగారంలో పాల్గొనటం కాకుండా శృంగారాన్ని ఆస్వాదించండి. లేదంటే శృంగారం అనేది మెకానికల్ గా ఒత్తిడిపూర్వకంగా తయారవుతుంది. మీ భాగస్వామితో ప్రేమానుబంధాన్ని బలపరచుకోవడానికి శృంగారమనే ఆయుధాన్ని వాడండి. మీ ప్రేమను వ్యక్తీకరించండి. ఇలా మీరు సెలెబ్రేట్ చేసుకుంటే గర్భం దాల్చే అవకాశాలు ఎక్కువ. మనస్సులోని ఒత్తిడి మొత్తం మటుమాయమవుతుంది. శృంగారాన్ని పరిపూర్ణంగా ఆస్వాదించినప్పుడు మహిళ ఎక్కువగా ఫ్లూయిడ్స్ ను విడుదల చేస్తుంది. ఇవి స్పెర్మ్స్ కి అనువుగా ఉంటాయి.

• భావప్రాప్తి:

• భావప్రాప్తి:

గర్భం దాల్చడానికి భావప్రాప్తితో సంబంధం లేకపోవచ్చు. అయితే, వేగంగా గర్భం దాల్చడానికి భావప్రాప్తి ఎంతగానో తోడ్పడుతుంది. భావప్రాప్తి సమయంలో కాంట్రక్షన్స్ అనేవి స్పెర్మ్ ను యుటెరస్ లోకి భద్రంగా తీసుకెళ్తాయి. అందువలన, గర్భం దాల్చే అవకాశాలు ఎక్కువ.

• ఆనందించండి:

• ఆనందించండి:

లవ్ మేకింగ్ విషయంలో స్పాంటేనియస్ గా ఉండాలి. ఓవ్యులేషన్ డేట్స్ ను పాటించనవసరం లేదు. మీకు ఇష్టమైనప్పుడు మీ పార్ట్నర్ తో సెక్స్ ను ఆస్వాదించండి. ప్రతి రోజూ సెక్స్ లో పాల్గొంటే పురుషులలోని స్పెర్మ్స్ క్వాలిటీ గణనీయంగా పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. కాబట్టి, రోజూ సెక్స్ లో పాల్గొంటే గర్భం దాల్చే అవకాశాలు ఎక్కువ.

• సెక్స్ - నిద్రలేవగానే చేయాల్సిన మొదటి పని:

• సెక్స్ - నిద్రలేవగానే చేయాల్సిన మొదటి పని:

నిద్రలేవగానే పురుషుల్లో హార్మోన్ లెవెల్స్ అధిక స్థాయిలో ఉంటాయి. అలాగే, ఈ సమయంలో స్పెర్మ్ కౌంట్ కూడా అధికమే. లేచిన వెంటనే శృంగారంలో పాల్గొంటే గర్భం దాల్చే అవకాశాలు ఎక్కువ. అంతేకాక, మీ సెక్స్ లైఫ్ కి ఫన్ కూడా తోడవుతుంది. గర్భం దాల్చేందుకు ఈ చిట్కాలు ఉపయోగపడతాయి.

English summary

How to Get Pregnant in One Month

Did you know that you could become pregnant in one month. Well, that's true if you quit smoking and alcohol, try and normalise your weight. Always have a watch on your mucus discharge, as this would be the best time for love making and you can definitely find results in getting pregnant in a month. How To Get Pregnant In One Month
Desktop Bottom Promotion