For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పుట్టబోయే బిడ్డ మగనా, ఆడనా అని తెలుసుకోవడం ఎలా? కవలలు ఎలా పుడతారు?

కడుపులో ఉన్న శిశువు మగ బిడ్డ లేదా ఆడ పిల్ల అని తెలుసుకోవడానికి శాస్త్రీయ పద్ధతులు, మన పెద్దలు ఎప్పటి నుంచో ఫాలో అవుతున్న విషయాలు ఎన్నో ఉన్నాయి. కానీ మానవులలో లింగ నిర్ధారణ ఎలా జరుగుతుంది?

|

గర్భం దాల్చడం అనేది ఆ భగవంతుడు మహిళలకు ఇచ్చిన గొప్ప వరం. మీరు గర్భంతో ఉన్నప్పుడు కొన్ని లక్షణాలను బట్టి మీకు మగబిడ్డ పుడతాడా? ఆడపిల్ల పుడుతుందా అని తెలుసుకోవొచ్చు. అలాగే మీకు కు కవల పిల్లలు పుట్టబోతున్నారు అని తెలిపే లక్షణాలు కూడా ఉంటాయి.

కడుపులో ఉన్న శిశువు మగ బిడ్డ లేదా ఆడ పిల్ల అని తెలుసుకోవడానికి శాస్త్రీయ పద్ధతులు, మన పెద్దలు ఎప్పటి నుంచో ఫాలో అవుతున్న విషయాలు ఎన్నో ఉన్నాయి. కానీ మానవులలో లింగ నిర్ధారణ ఎలా జరుగుతుంది? అంటే కడుపులో బిడ్డ మగ లేదా ఆడ బిడ్డగా ఎప్పుడు మారతారు? ఎలా మారతారు? అని చాలామందికి ఉన్న అనుమానం. ఆ విషయాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

లింగ నిర్ధారణ ఎలా జరుగుతుంది?

లింగ నిర్ధారణ ఎలా జరుగుతుంది?

సైన్స్ ప్రకారం మానవ శరీరంలో ఎక్స్ ఎక్స్ , ఎక్స్, వై అనే రకం క్రోమోజోముల ద్వారా లింగ నిర్ధారణ జరుగుతుంది. మానవ శరీరంలోని కారియోటైప్ లో మొత్తం 23 క్రోమోజోములు ఉంటాయి. వీటిలో దైహిక క్రోమోజోములు 22 అని, ఒక జత మాత్రం లైంగిక క్రోమోజోములు. కానీ పురుష, మహిళల శరీరంలో దైహిక క్రోమోజోములు ఒకే విధంగా ఉంటాయి. ఐతే లైంగిక క్రోమోజోములు మాత్రం విభిన్నంగా ఉంటాయి.

మగవారిలో ఎక్స్, వై క్రోమోజోములు

మగవారిలో ఎక్స్, వై క్రోమోజోములు

ఎలా అంటే మగవారిలో ఎక్స్, వై (ఎక్స్, వై ) క్రోమోజోములుగా, మహిళల్లో ఎక్స్, ఎక్స్ (ఎక్స్, ఎకస్) క్రోమోజోములుగా ఉంటాయి. పురుషులలో ఉత్పత్తి అయ్యే శుక్రకణాలు సగం ఎక్స్క్రోమోజోములుగా, మిగతా సగం వై క్రోమోజోములు, కానీ స్త్రీలు మాత్రం ఒకే రకం (ఎక్స్) అండకణాలను ఉత్పత్తి చేస్తారు. ఎప్పుడైతే అండకణాలు ఎక్స్ శుక్రకణాలతో ఫలదీకరణం చెందితే ఆడ పిల్లగా, అండకణాలు వై శుక్రకణాలతో ఫలదీకరణం చెందితే మగ బిడ్డగా మారుతారు. మొత్తానికి మగవారికి శుక్రకణాలపై పుట్టబోయే బిడ్డ అమ్మాయా, అబ్బాయా అనేది ఆధారపడి ఉంది.

ఎప్పడు తెలుస్తుంది

ఎప్పడు తెలుస్తుంది

సాధారణంగా గర్భం దాల్చిన మహిళ కడుపులో ఉన్న శిశువు మగ లేదా ఆడ బిడ్డ అనేది 19 లేదా 20 వ వారంలో తెలుస్తుంది. కడుపులోని బిడ్డ ఆరో వారం నుంచి ఎదుగుదల, అవయవాల్లో చిన్న చిన్న మార్పులు వస్తుంటాయి. 9 వ వారంలో మగ, ఆడ లింగ నిర్ధారణ అవయవాలు అభివృద్ధి జరుగుతుంది. 20 వ వారానికి వచ్చేసరికి పూర్తిగా వారి లింగ నిర్ధారణకు సంబంధించిన అవయవాలు ఏర్పడతాయి.

అలా అయితే మగ బిడ్డ

అలా అయితే మగ బిడ్డ

ఇక గర్భిణీ పొట్ట కనుక పై భాగంలో అధికంగా పొడుచుకు వస్తే ఆడబిడ్డ పుడుతుందని, లేదా పొట్ట దిగువ భాగంలో బయటకు పొడుచుకు వస్తే మగబిడ్డ పుడతాడని చెప్పచ్చు.మీ పాలిండ్లు కనుక పెద్దవిగా తయారైతే పుట్టబోయేది కచ్చితంగా ఆడపిల్లే!

కవల పిల్లలు పుట్టడానికి కారణం

కవల పిల్లలు పుట్టడానికి కారణం

ఇక సాధారణంగా జన్యుపరమైన సంబధం వల్ల కవలలు జన్మిస్తారు అని వైద్యులు చెబుతున్నారు. అలాగే ఇంతకుముందు మీ కుటుంబంలో అంటే రెండు అండాలు విడుదలయ్యే కుటుంబ చరిత్ర కలిగిన వారికి కవలలు జన్మించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయట.

కవలలు పుడతారనడానికి లక్షణాలివే

కవలలు పుడతారనడానికి లక్షణాలివే

సాధారణంగా ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు ఒక బిడ్డను కడుపులో మోస్తున్నప్పుడు మాములు బరువు కలిగి ఉంటారు. అయితే కవల పిల్లలు పుట్టబోతున్నారు అని చెప్పడానికి రోజురోజుకీ అధిక బరువు పెరుగుతూ ఉండటం, గర్భం కూడా ఎక్కువ సైజులో ఉండటం జరుగుతుంది. కొందరు ప్రెగ్నన్సీతో ఉన్నప్పుడు బరువు తగ్గుతూ ఉంటారు, పెరుగుతూ ఉంటారు. కానీ ఇక్కడ అలా జరగదు.

ఎక్కువ అలసట

ఎక్కువ అలసట

ప్రెగ్నన్సీ సమయంలో సాధారణంగా అలసట ఉండటం సహజమే కానీ గర్భంలో ఇద్దరు బిడ్డలు ఉన్నప్పుడు కాస్త ఎక్కువ అలసట ఉంటుంది. ఎంత శక్తివంతమైన ఆహారం తీసుకున్నా త్వరగా నీరసం వచ్చి అలసిపోతుంటారు. కానీ ఒక బిడ్డను మోసేవారు మరీ ఇంతగా అలసిపోరు. కొందరైతే బిడ్డ ప్రసవించేవరకు కూడా చాలా ఎనర్జిటిక్ గా ఉంటారు.

అతి వికారం

అతి వికారం

గర్భంతో ఉన్నప్పుడు మొదటి మూడు నెలలు లేదా చివరి మూడు నెలలప్పుడు వికారం ఉండటం, ఉదయం లేవగానే వాంతులు

అవ్వటం జరుగుతూ ఉంటుంది. కానీ కవల పిల్లలు పుట్టబోయే లక్షణాలు ఉన్నపుడు మహిళలలో వికారం ఎక్కువగా ఉంటుంది. ఎన్ని నెలలు ఇలా ఉంటుంది అనేది చెప్పలేరు. అలాగే కొందరికి అతి వికారం తక్కువగా నూ ఉంటుంది.

ఎక్కువ రక్తం అవసరం

ఎక్కువ రక్తం అవసరం

ఒక బిడ్డను కడుపులో మోస్తున్నప్పుడు కంటే రెండు రెట్లు ఎక్కువగా రక్తం మీ శరీరంలో రక్తనాళాల నుండి ప్రసరణ జరగాల్సిన అవసరం ఉంది. ఇలా ఎక్కువ రక్తం సరఫరా అయితేనే గర్భంలో ఉన్న మీ పిల్లలు ఆరోగ్యంగా ఎదగడానికి ఉపయోగపడుతుంది. మీ శరీరం నుండి ఎక్కువ రక్తప్రసరణ జరుగుతున్నపుడు మోకాలి కింద వెనుక భాగంలో ఉండే నరాలు కొంచెం లావుగా, ఉబ్బినట్లుగా ఉంటాయి.

ఐరన్ లోపం, రక్తహీనత

ఐరన్ లోపం, రక్తహీనత

ఐరన్ లోపం, రక్తహీనత లక్షణాలు మీ గర్భంలో ఇద్దరు బిడ్డలు ఉన్నప్పుడు ఎక్కువ రక్తసరఫరా ఎర్ర రక్త కణాలు వృద్ధి చెందడానికి ఎక్కువ ఒత్తిడి జరుగుతుంది. దీని వలన శ్వాసలో మార్పులు, అలసట, తలనొప్పి, హృదయ స్పందనలలో మార్పులు, మైకం కమ్మినట్లు ఉండటమే జరుగుతుంది. అందుకని మీలో ఈ లక్షణాలు ఐరన్ ఆహారం తక్కువైందని నిర్ధారించుకోవాలి.

English summary

how to tell if you are having a boy or a girl

how to tell if you are having a boy or a girl
Desktop Bottom Promotion