For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కడుపుతో ఉన్నప్పుడు ఐరన్ సప్లిమెంట్ల ప్రాముఖ్యత ఏమిటి

ప్రతి స్త్రీ జీవితంలో కడుపుతో ఉండే తొమ్మిది నెలల సమయం చాలా అద్భుతమైన దశ. ఆ సమయంలో స్త్రీలు వారి ఆహారాన్ని తేలికగా తీసుకోలేరు. తమ బిడ్డ ఆరోగ్యంగా ఉండటానికి మేటి పోషణ ఇచ్చే ఆహారపదార్థాలనే తినవలసి ఉంటుంద

|

ప్రతి స్త్రీ జీవితంలో కడుపుతో ఉండే తొమ్మిది నెలల సమయం చాలా అద్భుతమైన దశ. ఆ సమయంలో స్త్రీలు వారి ఆహారాన్ని తేలికగా తీసుకోలేరు. తమ బిడ్డ ఆరోగ్యంగా ఉండటానికి మేటి పోషణ ఇచ్చే ఆహారపదార్థాలనే తినవలసి ఉంటుంది.

గర్భవతని తెలిసిన సమయం నుంచి, డెలివరీ వరకూ, ఆ తర్వాత కూడా, స్త్రీ శరీరానికి, బిడ్డ ఆరోగ్యకర ఎదుగుదలకి మంచి ప్రత్యేక ఆహార డైట్ అవసరం.

మీ గైనకాలజిస్ట్ ఇప్పటికే తినే కాలరీల సంఖ్య పెంచాలని, విటమిన్లు, ఖనిజలవణాలను సరిగా పొందటానికి క్రమం తప్పకుండా పండ్లు, కాయగూరలు తినాలని సూచించి ఉంటారు.

ప్రెగ్నెన్సీ శరీరంపై చాలా వత్తిడిని కలిగిస్తుంది, అందుకని సమతుల్య ఆహారం తీసుకోవటం శరీరానికి ఈ ప్రయాణంలో మంచిగా సాయపడుతుంది.

ప్రెగ్నెన్సీ సమయంలో ఐరన్ సప్లిమెంట్లు తీసుకోవడం ఎందుకు చాలా ముఖ్యమో కొన్ని కారణాలు ఇక్కడ ఇచ్చాము చదవండి.

అది రక్తంలో ముఖ్య మూలకం;

అది రక్తంలో ముఖ్య మూలకం;

ఐరన్ హిమోగ్లోబిన్ ను తయారుచేస్తుంది, హిమోగ్లోబిన్ రక్తంలో అతిపెద్ద భాగం. ఇదే వివిధ కణాలకు రక్తం ఆక్సిజన్ ను తీసుకెళ్లేలా చేస్తుంది. పిండానికి తన రక్తం తను తయారుచేసుకోటానికి ఐరన్ అవసరం.

ఆరోగ్యకరమైన రోగనిరోధక వ్యవస్థ రూపొందటానికి అవసరం;

ఆరోగ్యకరమైన రోగనిరోధక వ్యవస్థ రూపొందటానికి అవసరం;

ఐరన్ తల్లీబిడ్డ ఇద్దరిలో రోగనిరోధక శక్తి పెంచటానికి సాయపడుతుంది. వివిధ వ్యాధులను నివారించటానికి రోగనిరోధక వ్యవస్థ బలంగా ఉండటం ముఖ్యం. తల్లి వ్యాధి నిరోధక వ్యవస్థ బలంగా ఉంటే, తనకొచ్చే వ్యాధులను నివారించటమే కాక, తన కడుపులో బిడ్డను కూడా కాపాడగలుగుతుంది.

ఎంజైములు ఉత్పత్తవటానికి అవసరం ;

ఎంజైములు ఉత్పత్తవటానికి అవసరం ;

ఐరన్ మన శరీరంలో ముఖ్య ఎంజైములు ఉత్పత్తవటానికి ఉపయోగపడుతుంది. ఎంజైములు శరీరంలో వివిధ పనులకు ఉపయోగపడుతాయి.

కనెక్టివ్ కణజాలం ఏర్పడటానికి సాయపడుతుంది;

కనెక్టివ్ కణజాలం ఏర్పడటానికి సాయపడుతుంది;

ఐరన్ మయోగ్లోబిన్ అనే ప్రొటీన్ ఉత్పత్తి అవడానికి ఉపయోగపడుతుంది. మయోగ్లోబిన్ ఆక్సిజన్ ను కండర కణజాలానికి, ఇతర కణజాలాలకి పంపిణీ చేస్తుంది.

అదనపు రక్తం తయారుచేయడానికి ఉపయోగపడుతుంది.

అదనపు రక్తం తయారుచేయడానికి ఉపయోగపడుతుంది.

ప్రెగ్నెన్సీ సమయంలో, మన శరీరానికి మామూలు కన్నా ఎక్కువ రక్తం అవసరమవుతుంది. అందుకని ఆ అదనపు రక్తం ఉత్పత్తికి ఐరన్ చాలా అవసరం.

రెండు మరియు మూడవ ట్ర్రైమిస్టర్ దశల్లో పిండానికి ఐరన్ అవసరం;

రెండు మరియు మూడవ ట్ర్రైమిస్టర్ దశల్లో పిండానికి ఐరన్ అవసరం;

పిండం తల్లి రక్తంలోని ఐరన్ ను వాడుకుని కండరాలను మరియు ప్రొటీన్లను ఉత్పత్తి చేసుకుంటుంది. అందుకే ఈ సమయంలో చాలామంది డాక్టర్లు ఐరన్ డోస్ ను పెంచుతారు.

సరైన మోతాదు ఐరన్ ను గర్భిణీల్లో వచ్చే అనేక సంక్లిష్టతలను, రిస్క్ లను తగ్గిస్తుంది;

సరైన మోతాదు ఐరన్ ను గర్భిణీల్లో వచ్చే అనేక సంక్లిష్టతలను, రిస్క్ లను తగ్గిస్తుంది;

తల్లి రక్తంలో కావాల్సినంత ఐరన్ ఉంటే, తల్లికి ప్రెగ్నెన్సీ సమయంలో సంక్లిష్టతలు అంత ఉండవు. శరీరంలో కావాల్సినంత రక్తం ఉంటే, డెలివరీ సమయంలో కొంత రక్తం పోయినా తల్లి బాగుంటుంది.

ఆరోగ్యకరమైన బేబీ కోసం ఐరన్ అవసరం

ఆరోగ్యకరమైన బేబీ కోసం ఐరన్ అవసరం

కావాల్సినంత పరిమాణంలో ఐరన్ ఉండటం వలన బేబీ సహజంగా పెరిగి, తన అవయవాలన్నీ కూడా బాగా పనిచేస్తాయి. సమయానికి ముందే పుట్టే రిస్క్ మరియు డెలివరీ సమయంలో ఇతర సంక్లిష్టతలు తగ్గుతాయి.

బిడ్డ సరైన బరువు ఉండేట్లా ఐరన్ చూస్తుంది;

బిడ్డ సరైన బరువు ఉండేట్లా ఐరన్ చూస్తుంది;

పుట్టినపుడు తక్కువ బరువు అధిక పురిటి శిశు మరణాలకు ఎక్కువ కారణమవుతుంది. పిండానికి సరైన ఐరన్ అందుతుంటే, అది సహజంగా పెరిగి పుట్టేటప్పుడు సరైన బరువు కూడా ఉంటుంది.

డెలివరీ తర్వాత తల్లి కోలుకోటానికి కూడా ఐరన్ అవసరం;

డెలివరీ తర్వాత తల్లి కోలుకోటానికి కూడా ఐరన్ అవసరం;

ప్రెగ్నెన్సీ ప్రభావాల నుండి తల్లి కోలుకోటానికి ఐరన్ చాలా ముఖ్యం. ఐరన్ తల్లి శరీరం నయమయి, తిరిగి తన స్వాధీనంలోకి వచ్చేలా చేస్తుంది.

గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయాలు;

గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయాలు;

డాక్టర్ సూచించిన విషయాలను పాటించడం ఎప్పుడూ మంచిది, మీరు సొంతగా ఐరన్ సప్లిమెంట్ వేసుకోవడం వలన చాలా అపాయకరంగా మారవచ్చు, వైద్యులు సూచించిన మోతాదే మీ శరీరానికి అవసరమై ఉంటుంది.

ఇంకా, రోజుకి సూచించిన మోతాదు కంటే ఎక్కువ ఐరన్ మాత్రలు వాడవద్దు, ఎందుకంటే అధిక ఐరన్ కూడా మీ ప్రెగ్నెన్సీకి మంచిది కాదు. రక్తంలో అధిక ఐరన్ గర్భసమయ మధుమేహాన్ని, ప్రీక్లాంప్సియా,అధిక రక్తపోటు మరియు గర్భస్రావానికి దారితీయవచ్చు.

కొన్ని ఐరన్ మందులు మలబద్ధకం, లేదా ఎక్కువ వికారానికి కూడా దారితీయవచ్చు. మీ డాక్టర్ సలహా పాటిస్తూ మీరు ఆరోగ్యంగా ఉండి, మీ బిడ్డ సరిగ్గా ఎదిగేలా చూసుకోండి.

English summary

Importance of taking Iron Supplements During Pregnancy

Pregnancy puts a lot of pressure for the human body, therefore maintaining a good and balanced diet is very important. During pregnancy, many doctors suggest you to consume iron supplements. Yes, there is a specific reason behind the same and here's why.
Story first published:Thursday, January 25, 2018, 13:02 [IST]
Desktop Bottom Promotion