For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భవతుల ఆహార ప్రణాళిక : 9 వ నెలలో నెయ్యి తీసుకోవడం మంచిదేనా ?

|

నెయ్యి లేదా కాచిన వెన్న లో లాక్సేటివ్ గుణాలు ఎక్కువగా ఉంటాయి. ఈ ప్రత్యేకమైన గుణం, డెలివరీ ని ప్రేరేపించే లక్షణాన్ని కలిగి ఉంటుంది. తద్వారా నెలలు నిండకుండానే డెలివరీ ముందుకు జరిగే అవకాశాలు ఉన్నవి. నెయ్యి తీసుకోవడం వలన ప్రేగులు అసౌకర్యానికి గురవుతూ ఉంటాయి. గర్భాశయానికి నెయ్యి ఒక లూబ్రికెంట్ లేదా కందెన లా పని చేస్తుంది. తద్వారా డెలివరీకు సిద్దమయిందన్న భావనకు గురవుతుందని తద్వారా డెలివరీ ముందుకు జరుగుతుందని పెద్దలు చెప్తుంటారు. ఒకరకంగా ఇది పాతకాలం నుండి పెద్దలు చెప్తున్నదే. ఏది కూడా పరిమితి దాటితే అమృతమైనా విషమే అవుతుంది. అన్న సామెత దీనికి వర్తిస్తుంది.

కానీ నెయ్యికి సంబంధించిన పదార్ధాలు కానీ తీసుకోవడం వలన , తల్లికి కానీ బిడ్డకు కానీ ఎటువంటి ప్రమాదం లేదు. నెయ్యికి , డెలివరీ కి ఎటువంటి సంబంధం లేదని అనేక నివేదికలు కూడా తేల్చాయి. కాకపోతే నెయ్యి తీసుకోవడంలో మాత్రం ఒక పద్దతి అనేది ఉంటుంది.

 Is consuming ghee during pregnancy is safe in ninth month?

కానీ ఇలాంటి అనేక నమ్మకాలు నెయ్యి చుట్టూతా ఉన్నాయి, ముఖ్యంగా గర్భవతుల దృష్ట్యా. ఇక్కడ కొన్ని పొందుపరచడం జరిగింది, మనసులో ఉంచుకోండి.

•నెయ్యి శరీరాన్ని వెచ్చగా ఉంచడంతో పాటు, మంచి పోషకంగా కూడా ఉంటుంది.

•దీనిలో ఉన్న లాక్సేటివ్ లక్షణాలు గర్భాశయానికి ఎంతో మేలు చేస్తుంది. సరైన సాగుదల తత్వాన్ని ఇవ్వడంలో సహాయం చేస్తుంది.

•కడుపులో బిడ్డ మెదడు ఎదుగుదలలో సహాయం చేస్తుంది.

•జాననాంగల ద్వారానికి కందెనగా ఉపయోగపడి, డెలివరీ సున్నితంగా అయ్యేందుకు సహాయం చేస్తుంది.

•మలబద్దక సమస్యలను దూరం చేయుటలో, జీర్ణక్రియ మెరుగవ్వడంలో సహాయం చేస్తుంది.

 Is consuming ghee during pregnancy is safe in ninth month?

ఆహార ప్రణాళికలో నెయ్యి తప్పనిసరా ?

గర్భం దాల్చిన మహిళలకు సరైన ఆహార ప్రణాళిక ఉండడం ఖచ్చితం, డైటీషియన్ లేదా డాక్టర్ సలహా మేరకు ఆహార ప్రణాళికలో సమయానుసారం మార్పులు చేసుకొనవలసి ఉంటుంది. తద్వారా తల్లికి బిడ్డకు అవసరమైన పోషకాలను సరైన మోతాదులో అందివ్వడానికి అనువుగా ఉంటుంది. కావున నెయ్యి ఖచ్చితమే అని చెప్పనవసరంలేదు.

కానీ ఇటీవలి కాలం లో జరిగిన పరిశోధనల ప్రకారం, గర్భవతులకు చివరి త్రై మాసికంలో 200 కాలరీల శక్తి ఎక్కువ అవసరం ఉంది. డాక్టర్లు కూడా రెండవ మరియు మూడవ త్రైమాసికం నందు 200 నుండి 300 కాలరీలు అధికంగా స్వీకరించవలసినదిగా సూచిస్తూ ఉంటారు. నిజానికి ఈ ఆహారప్రణాళిక , ఆరోగ్యం , బరువు మొదలైన అంశాలను బట్టి నిర్ణయించబడుతుంది. ఏదైనా ఆహారం గురించిన అనుమానం మీకు వస్తే, వెంటనే డాక్టరుని పర్యవేక్షించి నిర్ణయాలు తీసుకొనవలసిన అవసరం ఉంది. ఒక డాక్టరుగా మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించవలసిన భాధ్యత కూడా వారిపై ఉంది. కావున మొహమాటపడకుండా అడిగి తెలుసుకోండి.

 Is consuming ghee during pregnancy is safe in ninth month?

ఒక్కోసారి మీ ఆహార ప్రణాళిక ప్రకారం మీకు అధికంగా కాలరీలు అవసరమవుతుంటాయి, ఇలాంటి సందర్భాలలో ఆ లోటును నింపే దిశగా కొన్ని మార్పులు చేయడం కూడా మంచిదే. అలాగని క్రొవ్వు పదార్ధాలు కాదండోయ్. నెయ్యిలో పోషకాల కన్నా, క్రొవ్వు పదార్ధాలు అధికంగా ఉంటాయి. కావున నెయ్యి నేరుగా సేవించడం చేయరాదు.

 Is consuming ghee during pregnancy is safe in ninth month?

నెయ్యి కి పరిమితులు ఉన్నాయి:

నేరుగా నెయ్యిని సేవించడం గర్భం దాల్చిన మహిళలకు శ్రేయస్కరం కాదని సూచించబడింది. కానీ వెన్న, లేదా మిగిలిన నూనె పదార్ధాల కన్నా నెయ్యి మంచిది. మీ శరీర జీవక్రియలను నియంత్రించుటలో నెయ్యి చక్కగా పనిచేస్తుంది. మీ ఆహార ప్రణాళికలో భాగంగా నెయ్యిని చేర్చుకోడానికి ఇష్టపడుతున్నట్లయితే, ఇతర నూనెలకు లేదా వెన్న లాంటి పదార్ధాలకు ప్రత్యామ్నాయంగా చేర్చుకోవచ్చు. ఇది మానసిక సంతృప్తిని కూడా ఇస్తుంది.

English summary

Is consuming ghee during pregnancy is safe in ninth month?

Ghee or clarified butter is known to be a laxative and is believed to help induce labor in women who have not entered the stage yet. Drinking ghee can irritatethe bowels and is thought to be a way to lubricate the uterus for a smoother delivery. But this is completely a myth that is widely popular amongst people of older generations. There is little to no relevance to this line of thought and while consuming ghee or ghee based products is not harmful for the mother, there is no correlation between the consumption and any aid in pregnancy or childbirth.
Story first published:Tuesday, April 10, 2018, 14:01 [IST]
Desktop Bottom Promotion