For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రెగ్నెన్సీ సమయంలో స్తనాల నుంచి పాలు రావడం సాధారణమేనా?

ప్రెగ్నెన్సీ సమయంలో స్తనాల నుంచి పాలు రావడం సాధారణమేనా?

|

ఒక్కమాటలో చెప్పాలంటే, మీ ప్రెగ్నెన్సీలో వచ్చే మార్పులు శారీరకంగా లేదా భావోద్వేగాలతో కూడి ఉంటాయి. శారీరక మార్పుల గురించి చెప్పాలంటే, ముఖ్యంగా శరీరం లోపల జరుగుతాయి,మీకు కూడా ఆ అనుభవం తెలుస్తూ ఉంటుంది.

కొన్ని ఇతర మార్పులు కూడా ఉంటాయి, ఇవి కూడా అంత దాగి వుండవు. మేమనేది పొట్ట బయటకి పెరగడం, మీ మొహం కాంతితో మెరిసిపోవడం, కాళ్ళు వాచటం వంటివి. ఇవన్నిటితోపాటు, ఇక్కడ వచ్చే తర్వాత ప్రశ్న ప్రెగ్నెన్సీలో సాధారణమైనవి ఏంటి, కానివి ఏంటి అని.

Is it normal for breasts to leak in pregnancy?

ప్రతి ప్రెగ్నెన్సీ ప్రత్యేకమైనదే, సరిగ్గా ఇవే జరుగుతాయని ఏ ప్రెగ్నెన్సీకి రూల్ బుక్ లాంటిది ఏమీ ఉండదు. కొందరు గర్భవతులకి కొన్ని విషయాలు కామన్ గా జరుగుతాయి.

మీరు అలా ఏ విషయాలు జరగని గర్భవతులతో మిమ్మల్ని మీరు పోల్చుకుంటే, మీ ప్రెగ్నెన్సీలో ఏదో తప్పు జరుగుతోందని అన్పించవచ్చు. ఇలా సాధారణంగా మొదటిసారి గర్భం దాల్చినవారిలో జరుగుతుంది.

ఇలా వెంటాడే పీడకలల నుంచి మిమ్మల్ని శాంతపర్చటానికి, ఈ ఆర్టికల్ లో ప్రెగ్నెన్సీ సమయంలో స్తనాల నుంచి పాలు రావటం సాధారణమేనా, వస్తే ఏం జరుగుతుంది అని చర్చించబోతున్నాం.

-మూడవ ట్రైమిస్టర్లో పాలు రావడం

-మూడవ ట్రైమిస్టర్లో పాలు రావడం

మొట్టమొదటిగా, అవును, ప్రెగ్నెన్సీ ఆఖరి నెలల్లో స్తనాల నుంచి పాలు రావటం సహజమే. కానీ ఇది ప్రెగ్నెంట్ మహిళ అనుభవించదు. నివేదికల ప్రకారం ప్రతి 5గురు గర్భవతుల్లో ఒకరికి ఇలా జరుగుతుంది.

ఎలా అయినా, మీరు ఆందోళన పడక్కర్లేదు, ఇది చాలా సాధారణమైనది, దీనివల్ల మీ బేబీ ఆరోగ్యానికి ఏ హాని ఉండదు. మీరు గమనించాల్సింది కేవలం పాలు పడుతున్నాయా లేదా అని మాత్రమే, దీంతో బేబీ డెలివరీ తర్వాత వచ్చే పాలు ఎంత వస్తాయన్నదానికి ఏమాత్రం సంబంధం లేదు.

-ఎప్పుడు వర్రీ అవ్వాలి

-ఎప్పుడు వర్రీ అవ్వాలి

ప్రెగ్నెన్సీ సమయంలో స్తనాల నుంచి వచ్చేది కొలోస్ట్రం కానీ పాలు కాదు.ఇది మామూలు పాలకన్నా కొంచెం గాఢంగా ఉండి,పసుపుపచ్చ రంగులో ఉంటాయి. ఇందులో పోషకాలు నిండుగా ఉండి, మీ బేబీ ప్రాణాలు కాపాడగలిగే శక్తి వుంటుంది. అందుకని మీ బ్రా లేదా టీ షర్టుపై మరకలు తెలుపు లేదా పసుపు రంగులో చారల్లాగా కన్పిస్తే, మీరు బేబీకి,మీకు అంతా చక్కగానే ఉందని అర్థం చేసుకోండి.

కానీ స్తనాల నుంచి వస్తున్న పాలు రక్తం మరకలతో కన్పిస్తే, మీరు వెంటనే డాక్టరు దగ్గరకి వెళ్ళాలి. అది ఒకవేళ ముదురు ఆకుపచ్చ లేదా నల్ల రంగులో ఉంటే కూడా డాక్టరు దగ్గరకి సమయం వృథా చేయకుండా వెంటనే వెళ్ళాలి.

 -పాలు కారుతున్న స్తనాలతో ఎలా ఉండాలి

-పాలు కారుతున్న స్తనాలతో ఎలా ఉండాలి

ఈ ప్రక్రియ అంతా సాధారణంగానే కన్పించినా, మీ స్తనాల నుంచి అస్తమానూ పాలు రావటం అంత సౌకర్యంగా ఉండదు. ఈ పాల వాసన చిరాగ్గా కూడా అన్పించవచ్చు. అలాంటప్పుడు మీరు చేయగలిగింది పొద్దునంతా బ్రెస్ట్ ప్యాడ్ లు ధరించటం. ఇవి బ్రాలో వేసుకునే చిన్న రౌండ్ ప్యాచ్ లు.

వచ్చే పాలను పీల్చేసుకోవటంతోపాటు, ఇవి మీ బట్టలపై తడి మరకలు కూడా రాకుండా చేస్తాయి. కాటన్ తో తయారైన మెటర్నిటీ బ్రాలను వేసుకోవటం కూడా మీకు సౌకర్యంగా ఉంటుంది. ఇది గాలి తగిలే మెటీరియల్ తో తయారవ్వటమేకాదు, మీకు ఏ మాత్రం అసౌకర్యం లేకుండా బ్రెస్ట్ ప్యాడ్లు కూడా పట్టేలా ఉంటాయి. టాప్ లాంజెరీ బ్రాండ్లన్నీ ప్రత్యేక మెటర్నిటీ కలెక్షన్ కలిగివుంటాయి.

-ఉత్పత్తవుతున్న పాలను నిల్వచేయడం

-ఉత్పత్తవుతున్న పాలను నిల్వచేయడం

ఆధునిక మెడికల్ టెక్నాలజీతో,ఈ రోజుల్లో కష్టతరమైన ప్రెగ్నెన్సీ రాబోతోందని ముందే కనిపెట్టడం సులువవుతోంది. ఆఖరి నెలలను పరిశీలించి మీ డాక్టరు ఆ సమయానికి బేబీ ఇంకా సరిపడినంత ఎదగలేదనో, అంగిలి చీలికతో,డౌన్ సిండ్రోం వంటి వాటితో పుడతారని ముందుగానే చెప్పగలరు.

ఇలాంటి ఏ కేసులలోనైనా, పుట్టగానే బేబీకి అదనంగా సంరక్షణ అవసరమవుతుంది. అలాంటి కేసుల్లో మీ డాక్టరు మీరు ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు కొలోస్ట్రోం ను పిండమని సూచిస్తారు. ఇలా చేత్తో పిండి, నిల్వ చేయటం వలన, మీ బేబీ పుట్టేనాటికి చాలా కొలోస్ట్రోం రెడీగా ఉంటుంది. ఇది కేవలం వారి ప్రాణాలు నిలిచే అవకాశాలను పెంచటమే కాదు, వేగవంతమైన డెలివరీకి కూడా సాయపడుతుంది.

-ప్రసవానికి సూచన కాదు

-ప్రసవానికి సూచన కాదు

ప్రెగ్నెన్సీ ఆఖరులో ఇలా జరుగుతుంది కాబట్టి, చాలామంది స్త్రీలు పురుడు మొదలవబోవటానికి ఇది సంకేతంలా భావిస్తారు. కానీ ఇందులో నిజం లేదు. సెక్స్ సమయంలో స్తనాలు స్రవించటంతో పాటు తరచుగా బ్రాక్స్ టన్ ఎక్కిళ్ళు కూడా వస్తాయి.

కానీ అక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది వీటన్నిటికీ సెక్స్ తో సంబంధం ఉండదని. స్తనాలు స్రవించటానికి మరో పెద్ద కారణం నిపుల్స్ రాపాడించటం. అర్థం చేసుకోండి,ఇది కూడా అంత చెడ్డ విషయం కాదు, మీ డెలివరీ సమయాన్ని ముందుకి జరిపి బేబీకి హాని కలిగించే విషయం అంతకన్నా కాదు.

-దాని గురించి ఆలోచించవద్దు

-దాని గురించి ఆలోచించవద్దు

ఇది నిజమే అనిపిస్తున్నా,మీ శరీరానికి ఒకసారి పాలు స్రవించడం ఇంతకుముందు జరిగితే ఈసారి ఉత్పత్తి చేయడం సులువనిపిస్తుంది. అందుకని మొదటిసారి గర్భం కాని వారికి, ముందునెలల్లోనే పాలు రావటం కన్పిస్తుంది, అలాగే డెలివరి కన్నా ముందే ఎక్కువ పాలు రావచ్చు కూడా.

English summary

Is it normal for breasts to leak in pregnancy?

Breast leaking is quite common during pregnancy. It is believed that few of the pregnant women notice a white substance on their breast and often confuse it to be milk. The white substance produced during pregnancy is not milk but a substance called colostrum. This is slightly thicker than normal milk and is yellowish in colour.
Story first published:Thursday, July 12, 2018, 14:09 [IST]
Desktop Bottom Promotion