For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పాజిటివ్ ప్రెగ్నెన్సీ టెస్ట్ రిజల్ట్ అసత్యమయ్యే అవకాశం ఉందా?

పాజిటివ్ ప్రెగ్నెన్సీ టెస్ట్ రిజల్ట్ అసత్యమయ్యే అవకాశం ఉందా?

|

మహిళ జీవితంలో ప్రెగ్నెన్సీ అనేది ముఖ్య పాత్ర పోషిస్తుంది. ప్రతి మహిళ మాతృత్వపు ఆనందాన్ని పొందాలని భావిస్తుంది. మహిళ జీవితంలో గర్భం దాల్చడమనేది ముఖ్యమైన మలుపు. ఈ దశపై మహిళలు అనేక అంచనాలను పెట్టుకుంటారు.

గర్భం దాల్చిన విషయాన్ని నిర్ధారించేందుకు హోమ్ ప్రెగ్నెన్సీ టెస్ట్ లు తోడ్పడతాయి. ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ పై కనిపించే రెండు లైన్లు గర్భం దాల్చిన విషయాన్ని నిర్ధారిస్తాయి. ఈ విషయాన్ని తెలుసుకున్న మహిళ ఆనందానికి అవధులు ఉండవు.

Is It Possible to Get a False Positive Pregnancy Test Result ?

అయితే, ఈ ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ ల ద్వారా వెల్లడైన ఫలితం నిజమైనదేనా అన్న సందేహం కొన్ని సార్లు వెంటాడుతుంది. గర్భం దాల్చకపోయినా కొన్ని సందర్భాలలో టెస్ట్ రిజల్ట్ పాజిటివ్ గా రావచ్చు. అందువలన, ప్రెగ్నెన్సీ టెస్ట్ పై వంద శాతం ఆధారపడలేము. ఇది కూడా కొన్ని సార్లు తప్పుడు ఫలితాలను వెల్లడించే ప్రమాదం ఉంది.

ఈ ఆర్టికల్ లో ఈ విషయం గురించి ప్రస్తావించుకుందాం. ఏయే సందర్భాలలో ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ ఫలితం తప్పుగా వచ్చే అవకాశం ఉందో తెలుసుకుందాం.

1. ఈ కిట్ ని రీడ్ చేసేందుకు ఎక్కు సమయం తీసుకున్నప్పుడు

1. ఈ కిట్ ని రీడ్ చేసేందుకు ఎక్కు సమయం తీసుకున్నప్పుడు

ప్రెగ్నెన్సీ కిట్ ను వాడేముందు దానికి సంబంధించిన గైడ్ లైన్స్ ను కూడా మీరు పాటించాలి. అప్పుడే, మీరు అక్యురేట్ ఫలితాలను పొందగలుగుతారు. ప్రతి ప్రెగ్నెన్సీ కిట్ లో దాన్ని వాడే విధానాన్ని వివరిస్తారు. వాటిని మీరు తెలుసుకోవాలి. కిట్ లోని రిజల్ట్స్ ను చెక్ చేసేందుకు తగినంత సమయాన్ని తీసుకోవాలి. అప్పుడు, రిజల్ట్స్ ను గమనించాలి.

ఈ విషయంలో మీరు గైడ్ లైన్స్ పాటించకుండా రిజల్ట్స్ ను చెక్ చేసేందుకు ఎక్కువ సమయం తీసుకుంటే ప్రెగ్నెన్సీ కిట్ లోని యూరిన్ అనేది ఆవిరైపోతుంది. అప్పుడు, మీరు ఒకే లైన్ బదులు రెండు లైన్స్ ఉన్నట్టు పొరబడే అవకాశం ఉంది. గర్భం దాల్చారని తెలిపేందుకు రెండు లైన్స్ సూచికగా వ్యవహరిస్తాయి. కాబట్టి, మీరు సరైన సమయంలోనే రిజల్ట్స్ ని చెక్ చేసుకోవాలి. లేదంటే, రిజల్ట్స్ విషయంలో మీరు పొరబడే అవకాశం ఉంది.

2. ఫెర్టిలిటీ మెడికేషన్స్ ని వాడుతున్నప్పుడు:

2. ఫెర్టిలిటీ మెడికేషన్స్ ని వాడుతున్నప్పుడు:

ఫెర్టిలిటీ మెడికేషన్స్ ను మీరు వాడుతున్నారా? అయితే, మీరు గుడ్ న్యూస్ ని వినేందుకు ఎదురుచూస్తున్నారన్నమాట. అయితే, ఈ టెస్ట్ రిజల్ట్స్ పాజిటివ్ వచ్చినంత మాత్రాన మీరు గర్భం దాల్చారని భావించకూడదు. వట్రో ఫెర్టిలైజేషన్ లో భాగంగా కొన్ని ఇంజెక్షన్స్ ని వైద్యులు మీకు అందించినప్పుడు మీలోని హెచ్ సి జీ లెవల్స్ అనేవి పెంపొందుతాయి.

శరీరంలోని హెచ్ సి జీ లెవెల్స్ అనేవి ఎక్కువగా ఉన్నప్పుడు ప్రెగ్నన్సీ టెస్ట్ కిట్ లో పాజిటివ్ టెస్ట్ రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. అయితే, ఈ విషయంపై మీరు వైద్యున్ని సంప్రదించాలి. ఫెర్టిలిటీ మెడికేషన్ వలన ఇలా జరిగే అవకాశం ఉందన్న విషయంపై మీరు అవగాహన పెంచుకోవాలి. సందేహాన్ని నివృత్తి చేసుకోవాలి.

3. శరీరంలో హెచ్ సి జీ మిగుళ్లు ఎక్కువగా ఉన్నప్పుడు:

3. శరీరంలో హెచ్ సి జీ మిగుళ్లు ఎక్కువగా ఉన్నప్పుడు:

ఇంతకు ముందు ప్రస్తావించుకున్నట్టుగా, శరీరంలోని హెచ్ సి జీ లెవల్స్ అనేవి ప్రెగ్నెన్సీ ని నిర్ధారించేందుకు తోడ్పడతాయి. అయితే, ప్రతిసారి దీన్నే ప్రాతిపదికన తీసుకోకూడదు. అనేక సందర్భాలలో, గర్భం దాల్చకపోయినా శరీరంలో హెచ్ సి జీ స్థాయిలు అధికంగా ఉంటాయి. బిడ్డను ప్రసవించిన తరువాత, మహిళ శరీరంలో హెచ్ సి జీ స్థాయిలు తిరిగి సాధారణ స్థాయికి చేరడానికి ఎక్కువ సమయం తీసుకుంటాయి.

అదే విధంగా, మిస్ క్యారేజ్ కు గురైన మహిళ శరీరంలో కూడా హెచ్ సి జీ స్థాయిలు అధికంగా ఉంటాయి. .అందువలన, ఇటీవలి కాలంలో మీరు బిడ్డను కన్నపుడు లేదా మిస్ క్యారేజ్ కు గురయినప్పుడు హోమ్ ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ పై ఆధారపడకుండా, అక్యురేట్ రిజల్ట్స్ కోసం వైద్యున్ని సంప్రదించండి.

4. యూజర్ ఎర్రర్

4. యూజర్ ఎర్రర్

ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ ను ఒక పర్టిక్యులర్ టైమ్ లో ఉపయోగించాలి. ఈ విషయం కిట్ ద్వారా లభించే సూచనలలో వివరించబడి ఉంటుంది. ఆ సూచనలను సరిగ్గా చదవండి. అలాగే, యూరిన్ నేచురల్ గా ఉన్నప్పుడు ఈ టెస్ట్ ను తీసుకోవాలి. యూరిన్ డైల్యూట్ అయినప్పుడు లేదా ఎక్కువగా కాన్సెన్ట్రేటెడ్ అయినప్పుడు టెస్ట్ రిజల్ట్స్ పై ప్రభావం పడుతుంది.

ప్రెగ్నెన్సీ కిట్ పై కొన్ని స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ ఉండుంటాయి. వాటిని పాటిస్తే కిట్ అనేది అక్యురేట్ రిజల్ట్స్ ను అందిస్తుంది. వాటిని పాటించకపోతే రిజల్ట్స్ పై ఆధారపడలేము. కాబట్టి, ఎప్పుడైనా కిట్ పై ఇన్స్ట్రక్షన్స్ ను చదవడం మంచిది.

5. కొన్ని ప్రత్యేకమైన ఆరోగ్య స్థితులు:

5. కొన్ని ప్రత్యేకమైన ఆరోగ్య స్థితులు:

కిడ్నీ వ్యాధుల వలన వైట్ బ్లడ్ సెల్స్ లేదా శరీరంలోని రక్తంపై దుష్ప్రభావం పడుతుంది. ఇదే అంశం యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ లేదా ఒవేరియన్ సిస్ట్స్ లకి (ముఖ్యంగా కార్పస్ లెట్టేం సిస్ట్స్ కి) కూడా వర్తిస్తుంది. ఈ వ్యాధుల బారిన మీరు పడినట్టు మీకు తెలిస్తే హోమ్ ప్రెగ్నన్సీ టెస్ట్ కిట్ పై వచ్చే ఫలితం అక్యురేట్ అయి ఉండకపోవచ్చు. ఈ విషయాన్ని మీరు గమనించాలి.

6. కెమికల్ ప్రెగ్నెన్సీ:

6. కెమికల్ ప్రెగ్నెన్సీ:

ఈ కండిషన్ లో ఫైబ్రాయిడ్స్, స్కార్ టిష్యూ లేదా ఏదైనా ఒక రకమైన కాంజేనిటాల్ యుటెరిన్ డిజార్డర్ వలన ఫెర్టిలైజ్డ్ ఎగ్ అనేది ఉదరంలోనే ఇంప్లాంట్ అవుతుంది. దానివలన యుటెరస్ ఒక అసాధారణ షేప్ లో తయారౌవుతుంది.

ప్రతి అయిదుగురి మహిళల్లో ఒకరు తమ జీవితంలో ఎదో ఒక దశలో కెమికల్ ప్రెగ్నెన్సీ బారిన పడే ప్రమాదం ఉందని గణాంకాలు చెబుతున్నాయి. ఈ విషయంలోని గుర్తించదగిన విషయం ఏంటంటే ఈ స్థితి కేవలం ఒకటి లేదా రెండు వారాలకంటే ఎక్కువ ఉండదు.

కెమికల్ ప్రెగ్నెన్సీ దశలో ప్రెగ్నెన్సీ టెస్ట్ ద్వారా ఫలితం పాజిటివ్ వచ్చినా అది తప్పుడు ఫలితమే. అందువలన, పీరియడ్ మిస్ అయిన తరువాత ఇంకో రెండు వారాలు ఆగితే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యే సూచనలు ఉంటాయి.

7. ఎర్లీ మిస్ క్యారేజ్:

7. ఎర్లీ మిస్ క్యారేజ్:

ఈ స్థితిలో పాజిటివ్ ప్రెగ్నెన్సీ టెస్ట్ రిజల్ట్ వచ్చిన తరువాత మహిళకి పీరియడ్స్ రావడం ప్రారంభమవుతాయి. ఆ తరువాత అంతా నార్మల్ గానే ఉంటుంది. అటువంటి పరిస్థితులలో, రిజల్ట్స్ అనేవి గర్భం దాల్చకపోయినా పాజిటివ్ గా వెల్లడయ్యాయని భావించడం సహజం.

అయితే, టెస్ట్ రిజల్ట్ అనేది సరిగ్గానే వచ్చినా ఎర్లీ మిస్ క్యారేజ్ వలన ఈ స్థితి తలెత్తవచ్చు. ఇటువంటి పరిస్థితి అనేది నిజానికి ప్రమాదకరం. ఇది, భవిష్యత్తులో మీ ఫెర్టిలిటీపై ప్రభావం చూపవచ్చు.

అందువలన, పాజిటివ్ ప్రెగ్నెన్సీ టెస్ట్ రిజల్ట్ తరువాత పీరియడ్స్ వస్తే వెంటనే గైనకాలజిస్ట్ ను సంప్రదించండి.

8. కిట్ ఎక్స్పైర్ అయినప్పుడు:

8. కిట్ ఎక్స్పైర్ అయినప్పుడు:

ఇది ఫాల్స్ రిజల్ట్స్ రావడానికి దారితీసే ఇంకొక సందర్భం. సాధారణంగా దంపతులు ప్రెగ్నన్సీ కిట్స్ ను అధికంగా తీసుకుంటారు. వాటిని భద్రపరచి అవసరానికి ఉపయోగించవచ్చని భావిస్తారు. పీరియడ్ మిస్ అవగానే భద్రపరచిన కిట్స్ ను వాడటం ప్రారంభిస్తారు. నిజానికి, ఆ కిట్ అప్పటికే ఎక్స్పైర్ అయి ఉండుంటుంది.

ఎక్స్పైర్డ్ ప్యాక్ నుంచి అక్యురేట్ రిజల్ట్స్ ను ఆశించలేము. అందువలన, ఎక్స్పైరీ డేట్ ను చెక్ చేసుకుని కిట్ ను వాడటం ద్వారా రిజల్ట్స్ అక్యురేట్ గా వచ్చే అవకాశం ఉంది.

English summary

Is It Possible to Get a False Positive Pregnancy Test Result ?

Home pregnancy tests are generally accurate, but some women will receive a false result confirming a pregnancy when it is not. When you get the kit don't prolong it for too long. Try to check the results at the earliest. Getting the test positive does not necessarily mean that you are carrying a child.
Desktop Bottom Promotion