Latest Updates
-
ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలం.. ఉదయాన్నే తినాల్సిన హెల్తీ మల్టీగ్రెయిన్ దోస ఇదే! -
చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా? -
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.!
గర్భం దాల్చిన తర్వాత అండాశయ సిస్టులు ఏర్పడితే ఎలా, బిడ్డకు ప్రమాదమా? నొప్పి వస్తే ఏం చెయ్యాలి
బిడ్డకు కావాల్సిన హార్మోన్లు అందేలా కొన్ని రకాల టాబ్లెట్స్ డాక్టర్లు సూచిస్తారు. కొన్ని రకాల హార్మోన్స్ ఇంజెక్షన్స్ కూడా ఇస్తారు. అయితే సిస్ట్ చాలా పెద్దగా ఉంటే మాత్రం డాకర్స్ చెప్పే చాలా సూత్రాలు పాట
గర్భం దాల్చిన తర్వాత మహిళలకు రకరకాల ఇబ్బందులు తలెత్తుతుంటాయి. ప్రెగ్నెన్సీ వచ్చాక అసలు ఎలాంటి సమస్యలు వస్తాయో కూడా చాలా మంది అమ్మాయిలకు తెలియవు.
ప్రెగ్నెన్సీ వచ్చాక కొందరికి అండాశయంలో సిస్టు ఏర్పడే అవకాశం ఉంటుంది. అయితే ఈ సమస్య గురించి చాలా మందికి తెలియదు. ఇక కొందరు అండాశయంలో సిస్ట్ ఏర్పడితే ఎక్కడ ప్రెగ్నెన్సీ పోతుందోనని కూడా భయపడుతుంటారు.

అబార్షన్
అబార్షన్ అయితుందేమోనని ఆందోళన చెందుతారు. ప్రెగ్నెన్సీ వచ్చాక సిస్ట్ ఏర్పడడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఏర్పడవు. అలాంటి సమస్య వస్తే మీరేమీ ఆందోళన చెందకండి.

త్రీ మంత్స్ మాత్రమే
ప్రెగ్నెన్సీ వచ్చాక ఫస్ట్ త్రీ మంత్స్ మాత్రమే అండాశయంలో విడులదయ్యేటటువంటి కొన్ని రకాల హార్మోన్స్ గర్భంలోని బేబీకి అందుతుంటాయి. అయితే ఫోర్త్ మంత్ నుంచి బేబీ తనే స్వయంగా హర్మోన్స్ ను తయారు చేసుకోగలదు.

అండాశయం నుంచి
ఫస్ట్ త్రీ మంత్స్ హార్మోన్స్ అండాశయం నుంచి విడుదల అవుతాయి కాబట్టి ఆ సమయంలో అండాశయం ఎక్కువగా స్పందిచినట్లయితే సిస్ట్ ఏర్పడే అవకాశం ఉంది.

పెయిన్ వస్తుంది
సిస్ట్ ఏర్పడడం వల్ల ఒక్కోసారి పెయిన్ వస్తుంది. వెంటనే చెకప్ చేయించుకుని, ఎక్స్ రే తీయించుకుంటే అసలు సమస్య బయటపడుతుంది. సిస్టు వల్ల పెయిన్ బాగా వస్తుంటే డాక్టర్స్ కొన్ని రకాల సూచనలు ఇస్తారు.

టాబ్లెట్స్ సూచిస్తారు
బిడ్డకు కావాల్సిన హార్మోన్లు అందేలా కొన్ని రకాల టాబ్లెట్స్ డాక్టర్లు సూచిస్తారు. కొన్ని రకాల హార్మోన్స్ ఇంజెక్షన్స్ కూడా ఇస్తారు. అయితే సిస్ట్ చాలా పెద్దగా ఉంటే మాత్రం డాకర్స్ చెప్పే చాలా సూత్రాలు పాటించాలి.

డాకర్లు తొలగిస్తారు
సమస్య మరీ పెద్దగా అయితే డాక్టర్స్ దాన్ని తొలగిస్తారు. ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత అండాశయంలో పెయిన్ వస్తే మాత్రం వెంటనే అలర్ట్ కండి. డాక్టర్స్ తో చెకప్ చేయించుకోండి.

ఇబ్బందులుపడాలి
సమస్యను నిర్లక్ష్యం చేస్తే చాలా ఇబ్బందులుపడాల్సి వస్తుంది. అతి మొదటి దశలో ఉన్నప్పుడే మీరు దాని బారి నుంచి బయటపడండి.

ఆందోళన చెందకండి
అయితే కొందరికి కార్పస్ ల్యూటియమనే సిస్ట్ కూడా ఉండే అవకాశం ఉంది. అది ఉంటే మీరు పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. డాక్టర్లు చెప్పే సూచనల్ని పాటిస్తే సరిపోతుంది.



Click it and Unblock the Notifications
