For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ కడుపులో పెరుగుతున్నది బాబని తెలిపే 10 లక్షణాలు

మీ కడుపులో పెరుగుతున్నది బాబని తెలిపే 10 లక్షణాలు

|

కడుపుతో ఉన్నవారెవరికైనా ఉండే ఆతృతలాగానే, మీకు కూడా మీ కడుపులో పెరుగుతున్నది బాబో,పాపో తెలుసుకోవాలని ఉంటుంది కదా? ప్రెగ్నెన్సీ సమయంలో, మీ శరీరం గురించి, బేబీ గురించి అక్కర్లేని అభిప్రాయాలు చాలా విన్పిస్తాయి.

ఈ చర్చల్లో అన్నిటికన్నా పైన ఎప్పుడూ ఉండే టాపిక్ 'బాబా,పాపా’ అన్న ప్రశ్న. ఈ విషయంలో పాత కథలు, ఊహాగానాలు ఇంకా నడుస్తుంటాయి, మన అమ్మమ్మలు,నానమ్మలు తమ ఊహాశక్తితో కడుపులో ఉన్నది పాపా,బాబా అని ఎలా కనిపెట్టేవారో చాలానే కథలు వింటాం.

10 Signs That Tell It’s A Baby Boy In The Womb

బాబు లేదా పాప థియరీకి చాలా జానపద కథలు అటాచ్ అయి ఉన్నా,కావాలని పాపో లేదా బాబును కనగలగటం మీ చేతుల్లో ఉండదనేది మీక్కూడా తెలిసిన కామన్ సెన్స్ విషయం. కానీ ఈ ప్రశ్న మాత్రం ఉంటుంది, అలాగే ఆత్రుత కూడా. అందుకే ఇక్కడ మీలో ఉన్నది బాబు అయితే గుర్తుపట్టగలిగే లక్షణాలు కొన్ని ఇచ్చాం.

కానీ గుర్తుపెట్టుకోండి ఈ కథలకి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఇవి కొన్ని సాధారణ లక్షణాలను గమనించి చెప్పేవి. ఇవి అందరికీ ఒకేలా ఉంటాయని చెప్పలేం. ఆ లక్షణాలు ఇవిగో.

1.మొదట్లో వచ్చే ప్రెగ్నెన్సీ లక్షణాలు

1.మొదట్లో వచ్చే ప్రెగ్నెన్సీ లక్షణాలు

మీకు గర్భం దాల్చినప్పుడు మొదట్లో వచ్చే వికారం, లేదా పొద్దున్నే అలసట వంటివి రాకపోతే మీలో బాబు పెరుగుతున్నాడని అనుకోవచ్చు. దీని అర్థం ఏంటంటే పుట్టబోయేది బాబు అయితే పొద్దున వచ్చే వికారం తీవ్రత తక్కువగా ఉండి కొంచెం ఎక్కువ ప్రశాంతంగా ఉదయాలు గడుపుతారని.

2.తల్లి చర్మం పరిస్థితి

2.తల్లి చర్మం పరిస్థితి

పుట్టబోయేది పాప అయితే తల్లి అందాన్ని పుణికిపుచ్చుకుంటుందని అంటారు. కానీ పుట్టేది బాబు అయితే తల్లి చర్మం మరింత కాంతివంతంగా మెరుస్తూ, జుట్టు కూడా మెరుగ్గా పెరుగుతుంది. అదే పాప అయితే మీ జుట్టు సన్నబడిపోయి, జీవం లేకుండా ఉంటుంది.

3.గుండె వేగం

3.గుండె వేగం

మీ బేబీ గుండె నిమిషానికి 140 సార్ల కన్నా ఎక్కువ కొట్టుకుంటే పుట్టబోయేది బాబని,140 సార్ల కన్నా తక్కువైతే పాపని సాధారణంగా అనుకుంటారు.

4.పొట్ట సైజు కిందివైపుకు వాలి ఉండటం

4.పొట్ట సైజు కిందివైపుకు వాలి ఉండటం

మీ పొట్ట కిందవైపుకి వాలి ఉంటే పుట్టబోయేది బాబు అని, పొట్ట ఎత్తుగా ఉంటే పాపని అర్థం.

5.పుల్లని, ఉప్పుతో నిండిన ఆహారపదార్థాలు ఇష్టపడటం

5.పుల్లని, ఉప్పుతో నిండిన ఆహారపదార్థాలు ఇష్టపడటం

ప్రెగ్నెన్సీ సమయంలో రకరకాల ఆహారపదార్థాలు తినాలనిపించటం సాధారణం. బాబు కడుపులో ఉంటే,మీకు పుల్లని,ఉప్పు,కారం పదార్థాలు తినాలనిపిస్తుంది, అదే పాప అయితే మీకు చాక్లెట్లు, స్వీట్లు తినాలనిపిస్తుంది.

6.ప్రవర్తన మార్పు

6.ప్రవర్తన మార్పు

పుట్టబోయే బిడ్డ బాబో పాపో అన్నదానిబట్టి మీ ప్రవర్తనలో మార్పులు కూడా వస్తాయి. కడుపులో బాబు ఉన్నట్లయితే మీరు ధైర్యంగా, కోపంగా, డామినేటింగ్ గా ఉంటారు ఎందుకంటే, మీ శరీరంలో టెస్టోస్టిరాన్ ఎక్కువస్థాయిలో ఉంటుంది.

7. మూత్రం రంగు

7. మూత్రం రంగు

మీరెప్పుడైనా ఆలోచించారా, ప్రెగ్నెన్సీ సమయంలో మూత్రం రంగు కూడా పుట్టబోయే బిడ్డ బాబో,పాపో చెప్తుందని? మూత్రం రంగు ముదురుగా ఉంటే,పుట్టబోయేది బాబు కావచ్చు.

8.చల్లబడే పాదాలు

8.చల్లబడే పాదాలు

ప్రెగ్నెన్సీ సమయంలో ప్దాదాలు చల్లబడిపోతుంటే, పుట్టబోయేది బాబు కావచ్చు.

9.బరువు పెరగటం

9.బరువు పెరగటం

మీరు బరువు పెరిగే విధానాన్ని బట్టి పుట్టబోయే బిడ్డ మగ లేదా ఆడ అని ఊహించవచ్చు. మీలో బాబు పెరుగుతుంటే, అదనంగా పెరిగే బరువు సాధారణంగా పొట్టచుట్టూ పేరుకుంటుంది, కానీ పాపైతే, శరీరం మొత్తంలో కొవ్వు చేరుతుంది, ముఖంలో కూడా.

10.స్తనాల సైజు

10.స్తనాల సైజు

ప్రెగ్నెన్సీ సమయంలో, మీ స్తనాల సైజు బేబీకి పాలివ్వడం కోసం తయారీగా పెద్దగా పెరుగుతాయి. కానీ బాబు పుట్టబోతుంటే మాత్రం కుడిస్తనం ఎడమ దానికన్నా పెద్ద సైజులో ఉంటుందంటారు.

English summary

10 Signs That Tell It’s A Baby Boy In The Womb

Just as is the case with any pregnant mom, are you too eager to know whether the little bundle of joy that you are carrying in your womb is a boy or a girl? During pregnancy, you will probably get plenty of unwarranted opinions about your body and baby.
Story first published:Thursday, June 21, 2018, 19:04 [IST]
Desktop Bottom Promotion