For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీరు తెలుసుకోవలసిన పది విచిత్రమైన గర్భధారణ ప్రారంభ లక్షణాలు!

మీరు తెలుసుకోవలసిన పది విచిత్రమైన గర్భధారణ ప్రారంభ లక్షణాలు!

|

గర్భం ధరించడం యొక్క సంకేతాలు ప్రతిఒక్కరికి తెలుసు. నెలసరి తప్పటం, రొమ్ములు సున్నితంగా మారటం, మరియు ఎప్పుడూ అలసటగా ఉండటం గర్భధారణ యొక్క ముఖ్యలక్షణాలు .

కానీ గర్భిణీ స్త్రీలలో ఇవే కాకుండా, అనేక ఇతర లక్షణాలు కూడా కనపడతాయి. తెల్లబట్ట కావడం, నోటిలో లోహపు రుచి కలగడం మొదలు తలనొప్పికి వరకు, ఎన్నో ఊహించని సమస్యలు ఎదురవుతాయి.

Ten Weird Early Pregnancy Symptoms No One Tells You About

పది విచిత్రమైన గర్భధారణ ప్రారంభ లక్షణాలను గురించి ఇప్పుడు మీరు తెలుసుకోబోతున్నారు.
 1. యోని వద్ద నుండి స్రవాలు రావచ్చు.

1. యోని వద్ద నుండి స్రవాలు రావచ్చు.

అనేకమంది మహిళలు యోని నుండి స్రవాలు బయట వస్తున్నప్పటికీ, దీనికి గర్భంతో సంబంధం ఉండకపోవచ్చు. కానీ చాలామంది గర్భిణీ స్త్రీలలో, గర్భం ధరించిన మొట్టమొదటి త్రైమాసికంలో మరియు వారి గర్భధారణ కాలమంతట ప్రారంభంలో జిగురువంటి, తెలని లేదా లేత-పసుపు స్రవాలు కనిపిస్తాయి.

శరీరంలో పెరిగిన హార్మోన్ల స్థాయి మరియు యోని లోనికి పెరిగిన రక్త ప్రవాహం, ఈ స్రవాలకి కారణం. గర్భాశయము మరియు యోని గోడలు మృదువుగా ఉండటం వలన, వాటికి సోకే ఇన్ఫెక్షన్లను నిరోధించటానికి, గర్భధారణ సమయంలో ఈ స్రవాలు పెరుగుతాయి. ఒకవేళ ఆ స్రవాలు, వాసనతో దురద మరియు మంట కలుగజేస్తూ ఆకుపచ్చని పసుపు రంగులో బాగా చిక్కగా లేదా బాగా పల్చగా ఉన్నట్లైతే, వెంటనే డాక్టర్ ను సందర్శించండి. ఇవి ఇన్ఫెక్షన్లకు సంకేతాలు.

2. మీ శరీరం వేడిగా మారుతుంది.

2. మీ శరీరం వేడిగా మారుతుంది.

అండోత్సర్గ సమయంలో, ఉదయం మేల్కొన్న తరువాత, శరీర ఉష్ణోగ్రత కొద్దిగా పెరుగుతుంది. మీ తరువాతి నెలసరి వచ్చేవరకు, ఆ విధంగానే ఉంటుంది.

బేసల్ శరీర ఉష్ణోగ్రతగా పిలువబడే ఈ ఉష్ణోగ్రత, రెండు వారాల కంటే ఎక్కువ సమయం పాటు ఇలా ఉంటే, మీరు గర్భవతి అయ్యే అవకాశాలు ఉంటుంది.

3. మీ తలలో నొప్పి పుడుతుంది, ఒళ్ళు నొప్పులు కలుగుతాయి మరియు పదే పదే మూత్రవిసర్జన చేయాలని కోరుకుంటారు.

3. మీ తలలో నొప్పి పుడుతుంది, ఒళ్ళు నొప్పులు కలుగుతాయి మరియు పదే పదే మూత్రవిసర్జన చేయాలని కోరుకుంటారు.

గర్భధారణ సమయంలో హార్మోన్లు మరియు రక్తపరిమాణంలో తలెత్తే మార్పులు, తలనొప్పికి దారితీయవచ్చు.

కొందరు స్త్రీలకు, పొత్తి కడుపుకు రెండు వైపులా, నెలసరి నొప్పి వంటి నొప్పిని ఎదుర్కొంటారు. మరి కొంతమంది స్త్రీలకు, పదే పదే బాత్రూంకు వెళ్ళవలసి వస్తుంది. ఎందుకంటే, పెరుగుతున్న గర్భాశయవైశాల్యం, మూత్రాశయంపై ఒత్తిడి తెస్తుంది.

4. తల తిరుగుతున్నట్లుగా అనిపిస్తుంది.

4. తల తిరుగుతున్నట్లుగా అనిపిస్తుంది.

గర్భిణీ స్త్రీలు మొట్టమొదటి త్రైమాసికంలో, మత్తుగా లేదా మగతగా అనుభూతి చెందడం అసాధారణం కాదు. ఎందుకంటే, గర్భధారణ సమయంలో రక్తపోటు తగ్గి, రక్త నాళాలు విస్తారమవుతాయి.

5. కడుపులో అసౌకర్యం కలుగుతుంది.

5. కడుపులో అసౌకర్యం కలుగుతుంది.

మీకు కడుపు ఉబ్బరించినట్లనిపించి, గ్యాస్ వెలుపలికి వస్తుంది లేదా మాటిమాటికి బాత్రూంకి వెళ్ళవలసి వస్తుంది. ఇది గర్భధారణ సమయంలో జరిగే హార్మోన్లలో మార్పుల వలన కలిగే మలబద్దకం వలన కానీ, లేదా విటమిన్ మాత్రలు వాడటం వలన కానీ కావచ్చు.

మీ జీర్ణక్రియ మందగించి, రక్తంలోకి పోషకాల శోషణ జరిగి, మీ కడుపులో పెరుగుతున్న పాపాయిని చేరడానికి, కొంత అదనపు సమయం పడుతుంది.

దీని నివారణకు, మీ ఆహారప్రణాళికలో పీచుపదార్ధం కలిగిన ఆహారాన్ని భాగం చేసుకోండి. ద్రవాలు ఎక్కువగా తాగండి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి. అవసరమైతే వైద్యుని సంప్రదించి మలాన్ని మృదువుగా మార్చే సురక్షితమైన మందులను వాడండి.

 6. నెలసరి వచ్చినట్లు అనిపించవచ్చు.

6. నెలసరి వచ్చినట్లు అనిపించవచ్చు.

గర్భిణీ స్త్రీలలో సుమారు 25 నుండి 40 శాతం మంది గర్భం దాల్చిన తొలినాళ్లలో కొద్దిగా రక్తస్రావం జరగటాన్ని గమనించవచ్చు. ఫలదీకరణ చెందిన అండం, గర్భాశయ గోడలకు అటుక్కున్నప్పుడు, కొంచెం రక్తస్రావం జరుగుతుంది. దీనినే 'ఇంప్లాంటేషన్ బ్లీడింగ్' అని అంటారు. ఇది గర్భం ధరించిన తరువాత రెండు వారాల తరువాత సాధారణంగా జరుగుతుంది.

అంతేకాక, సర్వీక్స్ వద్ద కలిగే అసౌకర్యం, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ లేదా గర్భస్రావం వలన కూడా ఇలా జరగవచ్చు. రక్తస్రావం కొంచెంగా మొదలై ఎక్కువగా మారినా లేదా రక్తస్రావంతో పాటుగా నఫుము నొప్పి వంటివి కలిగినా, వెంటనే వైద్యుని సంప్రదించాలి.

7. జలుబు, దగ్గు వంటి అనారోగ్యాలు సర్వసాధారణం గర్భధారణ సమయంలో మీ రోగనిరోధకత తగ్గుతుంది. కనుక మీరు తరచుగా దగ్గు, జలుబు, మరియు ఫ్లూ వంటి అనారోగ్యాలకు గురవుతారు. గర్భం ధరించిన తొలినాళ్లలో, జలుబు లేదా ఫ్లూ వంటి రోగాలు గర్భిణీ స్త్రీలలో సాధారణమే! మీ వైద్యుని సంప్రదించి, సురక్షితమైన చికిత్స పొందండి.ఇటువంటి అనారోగ్యాలకు గర్భిణీ స్త్రీలు త్వరగా గురవడం వలన, కడుపులో బిడ్డ ఆరోగ్యంలో కూడా సమస్యలు తలెత్తవచ్చు

7. జలుబు, దగ్గు వంటి అనారోగ్యాలు సర్వసాధారణం గర్భధారణ సమయంలో మీ రోగనిరోధకత తగ్గుతుంది. కనుక మీరు తరచుగా దగ్గు, జలుబు, మరియు ఫ్లూ వంటి అనారోగ్యాలకు గురవుతారు. గర్భం ధరించిన తొలినాళ్లలో, జలుబు లేదా ఫ్లూ వంటి రోగాలు గర్భిణీ స్త్రీలలో సాధారణమే! మీ వైద్యుని సంప్రదించి, సురక్షితమైన చికిత్స పొందండి.ఇటువంటి అనారోగ్యాలకు గర్భిణీ స్త్రీలు త్వరగా గురవడం వలన, కడుపులో బిడ్డ ఆరోగ్యంలో కూడా సమస్యలు తలెత్తవచ్చు

గర్భధారణ సమయంలో మీ రోగనిరోధకత తగ్గుతుంది. కనుక మీరు తరచుగా దగ్గు, జలుబు, మరియు ఫ్లూ వంటి అనారోగ్యాలకు గురవుతారు. గర్భం ధరించిన తొలినాళ్లలో, జలుబు లేదా ఫ్లూ వంటి రోగాలు గర్భిణీ స్త్రీలలో సాధారణమే!

మీ వైద్యుని సంప్రదించి, సురక్షితమైన చికిత్స పొందండి.ఇటువంటి అనారోగ్యాలకు గర్భిణీ స్త్రీలు త్వరగా గురవడం వలన, కడుపులో బిడ్డ ఆరోగ్యంలో కూడా సమస్యలు తలెత్తవచ్చు

8. మీ ఛాతీలో మంట పుడుతుంది.

8. మీ ఛాతీలో మంట పుడుతుంది.

గర్భధారణ సమయంలో హార్మోన్లు ప్రతి విషయంలోనూ మార్పును తీసుకుని వస్తాయి. ఇలా మార్పు చెందే విషయాలలో, కడుపు మరియు అన్నవాహికల మధ్య ఉండే వాల్వ్ కూడా ఒకటి. ఈ ప్రాంతం, గర్భధారణ సమయంలో సడలించబడుతుంది. దీని వలన మీ కడుపులో ఉత్పత్తి అయ్యే ఆమ్లాలు అన్నవాహికలోకి చేరుతాయి. దీనితో గుండెల్లో మంట ఉంటుంది.

కొంచెం కొంచెంగా, ఎక్కువసార్లు భోజనం తినడం ద్వారా, ఈ సమస్యను నియంత్రించవచ్చు. వేయించిన పదార్థాలను తినకండి. కార్బనేటెడ్ శీతల పానీయాలు, సిట్రస్ పండ్లు, రసాలు మరియు ఘాటైన ఆహారాన్ని నివారించేందుకు ప్రయత్నించండి.

9. మీ మూడ్ లో హెచ్చుతగ్గులు ఉంటాయి.

9. మీ మూడ్ లో హెచ్చుతగ్గులు ఉంటాయి.

మీరు గర్భవతిగా ఉన్నప్పుడు, మీ హార్మోన్ల స్థాయిలు అకస్మాత్తుగా మారుతాయి. అందువలన, మీ భావోద్వేగాలు అల్లకల్లోలం కావచ్చు. మీకు అసాధారణంగా దుఃఖం కలగడం మరియు భావోద్వేగాలు ఉధృతంగా మారటం జరుగుతుంది. మీలో లైంగిక వాంఛ పెరగడం, తగ్గడం జరుగుతుంది. మీరు మానసిక కల్లోలం కూడా అనుభవించవచ్చు. ఇది ప్రారంభ గర్భధారణ సమయంలో చాలా సాధారణం.

10. మీ నోటిలో ఖనిజ రుచి కలుగుతుంది.

10. మీ నోటిలో ఖనిజ రుచి కలుగుతుంది.

గర్భధారణ సమయంలో ఈస్ట్రోజెన్ మరియు ప్రొజెస్టెరోన్ పెరుగుదల వలన, గర్భిణీ స్త్రీల నోటి రుచిలో మార్పులు వస్తాయి.

డిసెగుసియా అని పిలువబడే ఈ పరిస్థితి వలన, కొంతమంది గర్భిణీ స్త్రీలు, నోటిలో ఖనిజ రుచిని కలిగి ఉంటారు. మీరు భోజనం చేస్తున్నప్పుడు, పాత నాణేలును చప్పరిస్తున్నట్లుగా అనుభూతి చెందుతారు. ఉప్పటి పదార్థాలు చప్పరించడం మరియు తీపిలేని చూయింగ్ గమ్ ని నమలడం ద్వారా లోహ రుచిని వదిలించుకోవచ్చు. అలాగే శీతల పానీయాలను తాగడం లేదా ఘాటైన ఆహారం తినడానికి ప్రయత్నించండి.

English summary

Ten Weird Early Pregnancy Symptoms No One Tells You About

Everyone knows the classic signs of pregnancy. You’ve missed your period. Your breasts are tender. And you’re tired all the time.But pregnant women also experience a whole host of symptoms beyond these first signs. From mucus discharge to tasting metal to headaches, expect the unexpected.
Desktop Bottom Promotion