For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మహిళలు గర్భం పొందడానికి సహాయపడే ఆహారాలు

పిల్లల్ని కనే సామర్థ్యం అనేది మహిళలకు లభించడం ఒక వరం వంటిది. మహిళ శరీరం మరో ప్రాణికి జన్మనివ్వడానికి అనుగుణంగా తయారై ఉంది.

|

మహిళలు ఇదివరకటిలా వంటింటి కుందేలులా వంటింటికే పరిమితం అవటం లేదు. వారిప్పుడు పురుషులతో సమానంగా ఉద్యోగం చేస్తూ సంపాదనలో తమ వంతు పాత్రను పోషిస్తున్నారు. ఆడవారు కేవలం వంటింటికే పరిమితం అన్న ఆలోచన అనేది తగ్గుతోంది. ఇది నిజంగా మెచ్చుకోదగిన పరిణామం.

21వ సెంచరీలో ఆడవారు అన్ని రంగాల్లో తమదైన ముద్రను చాటుకుంటున్నారనడంలో అతిశయోక్తి లేదు. పురుషులు కూడా మహిళలను గౌరవించడం నేర్చుకుంటున్నారు. అలాగే వారి ఎదుగుదలకు ప్రోత్సాహాన్ని కూడా అందిస్తున్నారు. ఇంటిని, పిల్లల్ని చూసుకోవడంలో పురుషులు కూడా మహిళలకు సహాయపడుతున్నారు.

These 7 Foods Boost Fertility in Women

పిల్లల్ని కనే సామర్థ్యం అనేది మహిళలకు లభించడం ఒక వరం వంటిది. మహిళ శరీరం మరో ప్రాణికి జన్మనివ్వడానికి అనుగుణంగా తయారై ఉంది. కానీ, కొన్ని సార్లు ప్రకృతి అనేది సహకరించదు.

ఈ రోజుల్లో ఒత్తిడి వలన అలాగే అనారోగ్యకరమైన జీవనశైలి వలన ఫెర్టిలిటీపై దుష్ప్రభావాలు పడుతున్నాయి. బర్త్ కంట్రోల్ పిల్స్ ని అతిగా వాడటం అందుకు సంబంధించిన ఇంజెక్షన్స్ ను దీర్ఘ కాలం పాటు తీసుకోవడం వలన మహిళల్లో పిల్లల్ని కనే సామర్థ్యం తగ్గిపోతోంది.

ఈ రోజుల్లో ఫిమేల్ ఇంఫెర్టిలిటీ అనేది సీరియస్ హెల్త్ కండిషన్ గా మారిపోయింది. ప్రతి ఆరుగురిలో ఒక జంట పిల్లల్ని కనేందుకు ఇబ్బందులు పడుతున్నారు.

డైట్ అనేది ఫెర్టిలిటీను పెంచేందుకు దోహదపడుతుంది. ఈ విషయంపై అనేక రీసెర్చ్ లు చేయబడ్డాయి. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం ద్వారా ఫెర్టిలిటీను పెంపొందించుకోవచ్చు.

ఈ కింద వివరించబడిన ఫుడ్స్ ని తీసుకోవడం ద్వారా కన్సీవ్ అయ్యే సామర్థ్యాన్ని సహజసిద్ధంగా పెంచుకోవచ్చు. పాపాయికి జన్మనివ్వడమంటే ప్రపంచంలో అంతకు మించిన ఆనందం ఇంకేముంటుంది.

1) బీన్స్:

1) బీన్స్:

బీన్స్ ని మీరిష్టపడని వారైతే, వాటిపై మీరు ఇష్టాన్ని పెంచుకోవడం ముఖ్యం. వాటిలో లీన్ ప్రోటీన్స్ అలాగే ఐరన్ లభిస్తాయి. ఈ రెండు ఓవరీస్ పై మంచి ప్రభావం చూపుతాయి. అలాగే, బీన్స్ లో ఫైబర్ ఎక్కువగా లభిస్తుంది. ఫ్యాట్ కంటెంట్ తక్కువగా ఉంటుంది. వెయిట్ గెయిన్ గురించి మీరు ఇబ్బంది పడనవసరం లేదు. స్నాక్స్ లో భాగంగా వీటిని తీసుకోవడం అలాగే కర్రీ రూపంలో కూడా బీన్స్ ను తీసుకోవడం మంచిది. మీ కలను నిజం చేయడానికి బీన్స్ తోడ్పడతాయి.

2) ఒమేగా-3 ఆయిల్స్:

2) ఒమేగా-3 ఆయిల్స్:

కన్సీవ్ అయ్యే సామర్థ్యాన్ని పెంచేందుకు ఒమేగా-3 ఆయిల్స్ ఎంతగానో తోడ్పడతాయి. ఇందులో EPA (ఐకోసపెంటెనోయిక్ యాసిడ్) మరియు DHA (డొకోసహేక్సలెనోయిక్ యాసిడ్), లభిస్తాయి. ఇవి ఫెర్టిలిటీను పెంచేందుకు తోడ్పడతాయి. పెల్విక్ ఏరియాలో అలాగే ఇంఫ్లేమేషన్ ను తగ్గిస్తాయి. అలాగే ఎగ్ సెర్వికల్ మ్యూకస్ ను మెరుగుపరుస్తాయి. తద్వారా, స్పెర్మ్ అనేది సులభంగా ట్రావెల్ చేస్తుంది. కన్సీవ్ అవడానికి కనీసం మూడు నెలల ముందు నుంచి ఒమేగా 3లను స్టార్ట్ చేయమని డాక్టర్లు రికమెండ్ చేస్తారు.

3) బెర్రీస్:

3) బెర్రీస్:

యాంటీ ఆక్సిడెంట్స్ వలన మనం అనేక ఆరోగ్యప్రయోజనాలను పొందవచ్చన్న విషయం మనకు తెలిసినదే. నిజానికి, ఇవి కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ని పెంచుతాయి. సెల్ డేమేజ్ ను తగ్గించి ఇంటర్నల్ ఆర్గాన్స్ ను ఫ్రీ రాడికల్ డేమేజ్ నుంచి రక్షిస్తాయి. దాంతో ఓవరాల్ హెల్త్ మెరుగవుతుంది. ఇది కన్సీవింగ్ ఛాన్సెస్ ను ఆటోమేటిక్ గా పెంచుతుంది.

4) డైరీ ప్రోడక్ట్స్:

4) డైరీ ప్రోడక్ట్స్:

కేల్షియం రిచ్ ఫుడ్స్ ని తీసుకోవడం వలన బోన్ హెల్త్ మెరుగవడంతో పాటు రీప్రొడక్టివ్ హెల్త్ కూడా మెరుగవుతుంది. పోల్యామిన్స్ అనేవి డైరీ ప్రోడక్ట్స్ లో సమృద్ధిగా లభిస్తాయి. ఇవి సాధారణంగా ప్లాంట్ మరియు ఏనిమల్ ప్రోడక్ట్స్ లో లభ్యం అవుతాయి. ఈ ప్రోటీన్స్ అనేవి ఎగ్ హెల్త్ ని ఇంప్రూవ్ చేసి ఓవరీస్ ఫంక్షన్ ను మెరుగుపరిచేందుకు తోడ్పడతాయి. అలా, ఓవులేషన్ సమస్యను తగ్గిస్తాయి.

4) చిలగడదుంపలు:

4) చిలగడదుంపలు:

ఫెర్టిలిటీను పెంచేందుకు చిలగడదుంపలు తోడ్పడతాయని అంటారు. ప్రాచీన కాలం నుంచి చిలగడదుంపలపై ఈ అభిప్రాయం ఉంది. సైన్స్ కూడా ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. మెన్స్ట్రువల్ సైకిల్ మొదటి రెండు వారాలలో వీటిని తీసుకోవడం వలన ఓవులేషన్ విండో పెరుగుతుంది. తద్వారా ఫెర్టిలిటీ పెరుగుతుంది. ఇవి, శరీరంలోని ప్రొజెస్టెరాన్ అలాగే ఈస్ట్రోజెన్ లెవెల్స్ ని బాలన్స్ చేసి శరీరాన్ని కన్సీవ్ అయ్యేందుకు అనుగుణంగా తయారుచేస్తాయి.

6) లీఫీ గ్రీన్స్:

6) లీఫీ గ్రీన్స్:

లీఫీ గ్రీన్స్ లో ఫోలేట్ మరియు ఇతర ఎసెన్షియల్ న్యూట్రియెంట్స్ కలవు. ఇవి, మహిళల్లోనే ఓవరాల్ హెల్త్ ను మెరుగుపరుస్తాయి. ఇవి శారీరకమైన అలాగే మానసికమైన ఒత్తిళ్లను తగ్గిస్తాయి. ఈ రెండు ఫ్యాక్టర్స్ అనేవి మెన్స్ట్రుయేషన్ సైకిల్ ను రేగులేట్ చేయడంలో సహకరిస్తాయి. తద్వారా, ప్రెగ్నన్సీ ఛాన్సెస్ మెరుగవుతాయి.

7) ఆల్మండ్స్:

7) ఆల్మండ్స్:

ఆల్మండ్స్ టేస్టీగా ఉండడంతో పాటు ఆరోగ్యానికి మంచి కూడా చేస్తాయి. ఇందులో విటమిన్ ఈ, మ్యాంగనీజ్, కాపర్ మరియు బయోటిన్ లు లభిస్తాయి. విటమిన్ ఈ అనేది ఎగ్స్ క్వాలిటీను మెరుగుపరిచి బర్త్ డిఫెక్ట్స్ ను తగ్గించడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి.

English summary

These 7 Foods Boost Fertility in Women

Women who are looking forward to conceive should consume foods that can boost their fertility. Including dairy products, green leafy vegetables, omega-3 fatty acid foods, berries and yams in your everyday diet can help in boosting fertility and increase your chances of conceiving.Foods That Boost Fertility In Women
Story first published:Monday, April 9, 2018, 18:10 [IST]
Desktop Bottom Promotion