Latest Updates
-
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా..
సంతానోత్పత్తి సామర్థ్యాన్ని తగ్గించే 7 ఆహారపదార్థాలు
జీవితంలో ఏదో ఒక సమయంలో ప్రతి స్త్రీ ఒక బిడ్డకి జన్మనివ్వడంలో ఉండే ఆనందాన్ని అందిపుచ్చుకోవాలని అనుకుంటుంది. మాతృత్వమనేది ప్రతి స్త్రీ జీవితంలో సహజమైన ప్రక్రియ అయినప్పటికీ, కొంతమంది వంధ్యత్వ సమస్యలతో అడ్డంకులను ఎదుర్కుంటారు.
వంధ్యత్వం నేటి మహిళలలో సాధారణ సమస్య అయిపోయింది. ఈ సమస్య ఎదురైనప్పుడు అందం విడుదలైనప్పటికి అవి ఫెలోపియన్ ట్యూబ్ లలోకి చేరుకోవు. కనుక ఫలదీకరణ జరగదు. కొన్నిసార్లు అండం ఆరోగ్యంలో సమస్యలు తలెత్తి సంతానోత్పత్తి సామర్థ్యం కోల్పోతుంది. అంతేకాకుండా ఫెలోపియన్ ట్యూబ్స్ లో సరిపడినంత మ్యూకస్ లేకపోయినా కూడా అండం సరిగ్గా కదలలేదు. ఈ కారణాల రీత్యా అండం పిండంగా మారక గర్భధారణ కష్టతరమవుతుంది.

వివిధ కారణాల వలన స్త్రీలకు వంధ్యత్వం కలుగుతుంది. ఒత్తిడితో కూడుకున్న అనారోగ్యకర జీవన శైలి, గర్భనిరోధక మాత్రలను విచక్షణరహితంగా ఎక్కువ కాలంపాటు వాడటం వలన గర్భం ధరించడం కష్టం అవుతుంది. సమస్య అంత తీవ్రతరమైనది కానట్లైతే ఆహారప్రణాళికలో స్వల్ప మార్పులతో సరిచేసుకోవచ్చు.
చాలా వరకు స్త్రీలు గర్భధారణకు ఆరోగ్యకర ఆహారప్రణాళిక తోడ్పడుతుందనే విషయాన్ని గ్రహించరు. పునరుత్పత్తి ఆరోగ్యకరంగా జరగాలంటే మంచి ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినాలి. పునరుత్పత్తి సామర్ధ్యాన్ని పెంచే ఆహారపదార్థాలు ఉన్నట్లే తగ్గించేవి కూడా ఉంటాయి.
ఈ వ్యాసంలో మనం పునరుత్పత్తికి చేటు కలిగించే ఆహారపదార్థాల గురించి తెలుసుకుందాం. వీటిని వీలైనంత వరకు తినకపోవడమే మంచిది.

1.ప్రాసెస్డ్ ఫుడ్స్:
ఇవి పునరుత్పత్తి వ్యవస్థ యొక్క అనారోగ్యానికి మాత్రమే కాక మొత్తం దేహాన్ని దెబ్బతీస్తాయి. ఇవి శరీరానికి హానికారకమైన ట్రాన్స్ ఫ్యాట్, MSG మరియు ఫ్రక్టోజ్ కార్న్ సిరప్ లను అధికంగా కలిగి ఉంటాయి. వీటిలో శరీరం నుండి తొలగించబడలేని విషపదార్థాలు ఉంటాయి. అవి అధిక బరువును కూడా ప్రోత్సహించి ఆడవాళ్ళలో గర్భధారణ కఠినతరంగా చేస్తాయి.

2. కెఫిన్:
రోజుకు 3 కప్పులకన్నా ఎక్కువగా కాఫీ తాగే ఆడవాళ్లలో గర్భధారణ అవకాశం 50% కన్నా తక్కువగా ఉంటుంది. కెఫిన్ ను ప్రాసెసింగ్ చేయడానికి కాలేయం అధికంగా పని చేయాల్సి వస్తుంది. అంటే కాక ఇది మన శరీరం యొక్క కాల్షియం సోషణ సామర్థ్యాన్ని కూడా తగ్గించేస్తుంది. కాల్షియం లోపామ్ ఉన్నవారు గర్భం ధరించడం కష్టమవుతుంది.

3. పంచదార:
మనం తినే ఆహారంలో చెక్కెరలు అధికంగా ఉంటే మన హార్మోన్ వ్యవస్థ అతలాకుతలం అయ్యి పునరుత్పత్తి హార్మోన్ల స్రవించడంలో తేడాలు మొదలవుతాయి. ఈ హార్మోన్ల సమతుల్యతతోనే అండం ఫెలోపియన్ నాళాలోకి విడుదలవ్వడం, ఆరోగ్యకరమైన శుక్రకణంచేత ఫలదీకరణ చేయబడుతుంది.

4. చాక్లెట్:
చాక్లెట్లంటే ఇష్టపడేవారికి ఇది ఒక దుర్వార్త. చాక్లెట్లలో కూడా కెఫిన్ ఉంటుంది కనుక చాక్లెట్లను తినకపోవడమే ఉత్తమం. అంతేకాక వీటిలో చెక్కెరలు కూడా అధికం. నాణ్యత కలిగిన తీపిలేని డార్క్ చాక్లెట్ తినడం మంచిదైనా కానీ హద్దులు మీరి తినరాదు.

5. సోయా గింజలు మరియు సోయా ఉత్పత్తులు:
వేగన్లు గా మారిన వారు తమ ఆహారప్రణాళికలో సోయాను చేర్చుకుంటారు. అధిక సోయా ప్రోటీన్ వలన కూడా సంతానోత్పత్తి సమస్యలు ఎదురవుతాయి. సోయా గింజలలో వృక్ష సంబంధిత ఈస్ట్రోజన్ రూపమైన ఫైటో ఈస్ట్రోజన్ ఉంటుంది. ఇది గర్భధారణ నిరోధకం. శరీరంలో ఈస్ట్రోజన్ అధికమైనప్పుడు ఇతర హార్మోన్ల అసమతుల్యత మొదలవుతుంది. దీని ప్రభావం వలన ఫలదీకరణ జరగడానికి అండం విడుదల అవ్వటం ఆలస్యం అవుతుంది.

6. అధిక సీసం కలిగిన చేపలు:
కింగ్ మాకెరెల్, సొరచేప మరియు కత్తి చేపలు మొదలైన చేపలలో సీసం అధిక మొత్తంలో ఉంటుంది. దీన్ని శరీరం నుండి తొలగించండం చాలా కష్టతరం. ఇది ఎదిగే పిండం యొక్క నాడీవ్యవస్థకు హానికలిగిస్తుంది. సీసంకు శరీరంలో నిలువ ఉండే గుణం ఉన్నందున ఇది అనేక పుట్టుకతోనే వచ్చే లోపాలు మరియుఅల్పబరువుకు కారణమవుతుంది.

7. మద్యపానం మరియు ధూమపానం:
మద్యపానం స్త్రీలలో పునరుత్పత్తి వ్యవస్థ యొక్క అనారోగ్యానికి దారితీస్తుంది. ఇది హార్మోన్ల అసమతుల్యత, అధిక బరువు, కాలేయ వైఫల్యం, పునరుత్పత్తి వ్యవస్థకు హాని కలుగజేసి వంధ్యత్వంకు దారితీస్తుంది. అదేవిధంగా ధూమపానం వలన ఆనారోగ్యంతో ఉన్న అండాలు విడుదలవుతాయి. అంతేకాక జన్యులోపాలు కూడా కలుగచేస్తాయి. ఒక్కమాటలో చెప్పాలంటే అనారోగ్యకరమైన అలవాట్లు వదిలించుకొని, మంచి ఆహారం తీసుకుంటూ, ఒత్తిడి లేని జీవనశైలి అలవర్చుకుంటే పండంటి బిడ్డను మీ పొత్తిళ్ల చూసుకోవచ్చు.



Click it and Unblock the Notifications