For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కడుపులో బేబీ కిక్స్ గురించి మీరు తెలుసుకోవలసిన ముఖ్య విషయాలు

కడుపులో బేబీ కిక్స్ గురించి మీరు తెలుసుకోవలసిన ముఖ్య విషయాలు

|

గర్భం దాల్చడం ఒక వరం. ప్రతి మహిళ ఈ వరాన్ని పొందాలని కోరుకుంటుంది. గర్భం దాల్చడానికి సిద్ధమైన ప్రతి మహిళా ఆ శుభవార్త కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. హోమ్ ప్రెగ్నెన్సీ టెస్ట్ లోని లైన్స్ ను చూడగానే ఆ మహిళ ఆనందానికి అవధులు ఉండవు.

అయితే, గర్భం దాల్చారని తెలిపేందుకు అనేక లక్షణాలు తోడ్పడతాయి. మార్నింగ్ సిక్నెస్ అనేది అందులోని ముఖ్య లక్షణం. ఆ తరువాత, నెలలు గడిచే కొద్దీ శారీరకంగా అలాగే మానసికంగా అనేక మార్పులకు గర్భిణీలు గురవుతారు. గర్భస్థ శిశువు తల్లిని పలకరిస్తూ గర్భంలో చేసే సందడి అంతా ఇంతా కాదు. ఈ సందడిని మాటల్లో వివరించలేము. బేబీ కిక్స్ ను గుర్తించగానే మహిళ ఎంతో తన్మయానందానికి గురవుతుంది.

Things you need to know about your baby’s kicks in the womb

పాపాయి కిక్స్ ను చిన్న చిన్నగా పొత్తికడుపు ప్రాంతంలో మొదటగా గుర్తించవచ్చు. ఈ చిన్న చిన్న సందడి ని క్వికెనింగ్ అనంటారు. ఇది, పాపాయి ఆరోగ్యకరమైన ఎదుగుదలకు సూచిక. మీలో పెరుగుతున్న మరో ప్రాణం చైతన్యానికి చిహ్నం.

అయితే, ఇక్కడ ఇంకొక విషయాన్ని మీరు గమనించాలి. పొత్తికడుపులో మీరు గుర్తించే ప్రతి అలజడి బేబీ కిక్ అయి ఉండకపోవచ్చు. గర్భంలో పాపాయి అటూ ఇటూ తిరుగుతూ చేతులను కాళ్ళను ఆడిస్తూ ఉంటుంది. తన పరిసరాలను అన్వేషించాలని ప్రయత్నిస్తుంది.

పాపాయి ఎక్కిళ్ళను అలాగే పాపాయి సౌకర్యవంతంగా గర్భంలో చుట్టూ తిరగటాన్ని మీరు గమనించగలుగుతారు.

పాపాయి ఎందుకు కిక్ చేస్తుంది. పొత్తికడుపులోని బేబీ కిక్స్ గురించి తెలుసుకోవలసిన ముఖ్య అంశాలు. ఈ విషయం గురించి మరింత తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్ ను చదవండి మరి.

బేబీ కిక్స్ ను ఎప్పుడు గుర్తించగలుగుతారు?

బేబీ కిక్స్ ను ఎప్పుడు గుర్తించగలుగుతారు?

గర్భంలో ఒకరి కంటే ఎక్కువ శిశువులు ప్రాణం పోసుకున్నప్పుడు బేబీ కిడ్స్ ను తల్లి 14 వ వారం నుంచే గుర్తించగలుగుతుంది. మొదటి సారి తల్లైన మహిళ బేబీ కిక్ ను గుర్తించడానికి అంతకంటే ఎక్కువ సమయం తీసుకుంటుంది.

23వ వారం లేదా 24వ వారంలో గర్భిణీ తన బేబీ కిక్స్ ను గుర్తించగలుగుతుంది. ఒకవేళ పాపాయి కదలికలు తెలియకపోతే కంగారుపడకండి. వైద్యునితో ఈ విషయం గురించి చర్చించండి. వారు మీకు అల్ట్రా స్కానింగ్ ను సూచించగలుగుతారు. కంగారుపడవలసిన విషయమేమీ లేదని తెలియవచ్చు.

• బేబీ ఎందుకు కిక్స్ ఇస్తుంది?

• బేబీ ఎందుకు కిక్స్ ఇస్తుంది?

కేవలం ఒకే చోట ఉండేందుకు శిశువు ఇష్టపడటం లేదు. కొత్త కొత్త విషయాలను తెలుసుకోవడానికి గర్భస్థ శిశువు తనకు నిర్దేశించబడిన ప్రాంతంలోనే ప్రయత్నాలు చేస్తోంది. పరిసరాలకు స్పందిస్తుంది. మీ మాటలకు మీ పనులకు రెస్పాన్స్ ఇస్తుంది. శబ్దానికి, వెలుతురుకు, టెంపరేచర్ కు అలాగే ఆహారంలోని సువాసనలకు గర్భస్థ శిశువు తన స్పందనలను కిక్స్ ద్వారా తెలియచేస్తుంది.

మీరు ఆందోళనకు గురయినప్పుడు లేదా ఎక్కువ ఒత్తిడికి గురయినప్పుడు బేబీ కిక్స్ ను ఎక్కువగా మీరు గుర్తించే అవకాశం ఉంది. అలాగే, బేబీ చుట్టూ తిరిగినప్పుడు శరీరాన్ని స్ట్రెచ్ చేసుకున్నప్పుడు మీకు కిక్స్ తెలుస్తాయి.

గర్భస్థ శిశువు యొక్క ఎముకలు అలాగే కండరాల యొక్క ఎదుగుదలలో కదలికలు అలాగే కిక్స్ అనేవి ప్రధాన పాత్ర పోషిస్తాయి. గర్భస్థ శిశువు కదలికలు వ్యాయామంలా పనిచేస్తాయి. గర్భంలో కూడా శిశువు వ్యాయామంతో శరీరాన్ని ఫిట్ గా ఉంచేందుకు ప్రయత్నిస్తుంది.

• ఎటువంటి కిక్స్ అనేవి నార్మల్?

• ఎటువంటి కిక్స్ అనేవి నార్మల్?

ప్రతి ఒక్క శిశువులో చైతన్యం అనేది ఒక్కొక్క విధంగా ఉంటుంది. కొంతమంది పాపాయిలు ఎంతో యాక్టివ్ గా ఉంటారు. రోజంతా కిక్ చేస్తూ ఉంటారు. మరికొంతమంది కొంచెం తక్కువ యాక్టివ్ గా ఉంటారు. అయితే, సగటున రోజుకు 20 కిక్స్ ను గమనించవచ్చు. భోజనం సమయంలో ఈ కిక్స్ అనేవి పీక్ స్టేజ్ కు వెళ్లడాన్ని మీరు గమనించవచ్చు.

అయితే, కిక్స్ ను రిసీవ్ చేసుకునే ప్రాంతంపై కూడా కిక్స్ తీవ్రత ఆధారపడి ఉంటుంది. బేబీ ముందుకు ఫేస్ చేసినప్పుడు, పొత్తికడుపు వద్ద కిక్స్ ను మీరు గుర్తించగలుగుతారు. బేబీ ఇంకొక డైరెక్షన్ లో ఉన్నప్పుడు కిక్స్ ను మీరు బ్లాడర్ వద్ద అలాగే వెన్ను వద్ద గుర్తించగలుగుతారు.

• కిక్స్ కౌంట్ ను ఎప్పుడు గమనించాలి?

• కిక్స్ కౌంట్ ను ఎప్పుడు గమనించాలి?

బేబీ కిక్స్ ను మీరు గమనించే సందర్భంలో ఏది నార్మల్ ఏది అబ్నార్మల్ అన్న విషయంలో మీకొక అవగాహన లభిస్తుంది. పాపాయి ఎదుగుతున్న కొద్దీ, కిక్స్ సంఖ్య పెరుగుతూ ఉండాలి. కిక్స్ స్ట్రాంగ్ గా కూడా మారాలి. కిక్స్ యొక్క ప్యాటర్న్ అనేది మారినట్టుగా మీరు భావిస్తే మీరు కిక్స్ ను కౌంట్ చేయడం ప్రారంభించాలి.

వైద్యున్ని ఎప్పుడు సంప్రదించండి

వైద్యున్ని ఎప్పుడు సంప్రదించండి

- పది కంటే తక్కువ కిక్స్ ను లేదా తక్కువ మూవ్మెంట్స్ ను రెండు గంటల సమయంలో మీరు గుర్తించినప్పుడు.

- ధ్వనికి, స్పర్శకి అలాగే వెలుగుకి పాపాయి స్పందించనట్టు మీకు అనిపించినప్పుడు.

- గత కొద్ది రోజులుగా బేబీ మూవ్మెంట్ లో మార్పులు ఎదురయినప్పుడు.

• పాపాయి కదలికలు తగ్గిపోవటానికి గల కారణాలు?

• పాపాయి కదలికలు తగ్గిపోవటానికి గల కారణాలు?

పాపాయి కదలికలు తగ్గిపోయినట్లు మీరు భావించినప్పుడు కూడా మీరు ఆందోళనకు గురవ్వాల్సిన అవసరం లేదు. ఎక్కువ సార్లు, పాపాయి నిద్రలో ఉండుంటుంది. మీరు కౌంట్స్ ని ప్రారంభించినప్పుడు పాపాయి నిద్రలో ఉండటం వలన మీకు కిక్ కౌంట్స్ అనేవి తెలియకపోవచ్చు. అలాగే, పాపాయికి చెందిన చిన్న చిన్న మూవ్మెంట్స్ ను మీరు బిజీగా ఉండటం కారణంగా కూడా గుర్తించలేకపోవచ్చు. అటువంటప్పుడు, మీరు కేవలం యాక్టివ్ కిక్స్ ను మాత్రమే గుర్తించగలుగుతారు.

కొన్ని సార్లు, పాపాయికి పోషకాలు సరిగ్గా అందకపోవటం వలన, ఆక్సిజన్ సప్లై అందకపోవటం వలన లేదా పాపాయి ఒత్తిడిలో ఉండటం వలన కిక్స్ తగ్గిపోతాయి.

• ప్రతి రోజూ కిక్స్ ను అలాగే మూవ్మెంట్స్ ను కౌంట్ చేయవలసిన అవసరం ఉందా?

• ప్రతి రోజూ కిక్స్ ను అలాగే మూవ్మెంట్స్ ను కౌంట్ చేయవలసిన అవసరం ఉందా?

ఒక వేళ మీది హై రిస్క్ ప్రెగ్నన్సీ కాకపోతే మీరు కిక్స్ పై రోజూ దృష్టి పెట్టాల్సిన అవసరం లేదు. మీది హై రిస్క్ ప్రెగ్నెన్సీ అయితే మీ డాక్టర్ బేబీ మూవ్మెంట్స్ ను గమనించమని మీకు సూచించవచ్చు.

• నెలలు గడిచే కొద్దీ బేబీ మూవ్మెంట్స్ తగ్గిపోతాయా?

• నెలలు గడిచే కొద్దీ బేబీ మూవ్మెంట్స్ తగ్గిపోతాయా?

బేబీలో 35 లేదా 36 వ వారం తరువాత కదలికలు తగ్గిపోవచ్చన్నది కేవలం అపోహ మాత్రమే. అప్పటికి, పాపాయి స్వేచ్ఛగా కదిలేందుకు తగినంత స్థలం ఉండదని భావిస్తారు. అయితే, ఇది అపోహ మాత్రమే. నిజానికి, ఇంతకు ముందు ఏ విధంగా యాక్టివ్ గా ఉందో అదే విధంగా యాక్టివ్ గా ఉంటుంది. కిక్స్ కి అలాగే మూవ్మెంట్స్ కు మాత్రం ఇదివరకు ఉన్నంత స్థలం ఉండకపోవచ్చు. అయినా, పాపాయి స్ట్రెచ్ చేస్తుంది. పాపాయి కదలికల్ని బయటి నుంచి చూడగలం కూడా. పాపాయికి గర్భంలో కూడా ఎక్కిళ్ళు వస్తాయి. ఆ విషయాన్ని మీరు గుర్తించగలరు కూడా.

• గర్భంలో బేబీ మూవ్మెంట్ ప్యాటర్న్ ను బట్టి బేబీ పుట్టిన తరువాత తన ప్రవర్తనను అంచనా వేయవచ్చా?

• గర్భంలో బేబీ మూవ్మెంట్ ప్యాటర్న్ ను బట్టి బేబీ పుట్టిన తరువాత తన ప్రవర్తనను అంచనా వేయవచ్చా?

గర్భంలో ఎక్కువగా అల్లరి చేసి సందడి చేసిన శిశువులు పుట్టిన తరువాత అల్లరి పిడుగులుగా మారతారని అంటారు. గర్భంలో ప్రశాంతంగా ఉన్న శిశువు పుట్టిన తరువాత కూడా అలాగే బుద్ధిగా ఉంటుందని అంటారు.

గర్భంలో రాత్రిపూట శిశువు కదలికలను గుర్తించినట్లయితే పాపాయి పుట్టిన తరువాత ఉదయమంతా నిద్రపోవడానికి ప్రాధాన్యతనిచ్చి రాత్రంతా ఆటలకు సమయాన్ని కేటాయించేందుకు ఇష్టపడుతుందని అంటారు. ఈ విషయం శాస్త్రీయంగా నిరూపితం కాలేదు. అయినా, ఈ విషయాన్ని ఎంతో మంది తల్లులు తెలిపారు.

English summary

Things you need to know about your baby’s kicks in the womb

During your pregnancy, you will experience the most beautiful things. One such thing is your baby's kick in your womb. But have you wondered why babies kick? The kicking and moving are integral for the proper development of the baby's bones and muscles. The movements of the baby are a kind of exercise that your baby needs even while in the womb.
Story first published:Wednesday, July 4, 2018, 12:39 [IST]
Desktop Bottom Promotion