For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భధారణ మధుమేహం తలెత్తడానికి కారణాలు ఏమిటి?

గర్భధారణ మధుమేహం తలెత్తడానికి కారణాలు ఏమిటి?

|

'మధుమేహం, అనే పదం వినడం మాత్రం చేతనే మనలో ఒక విధమైన భయం మొదలవుతుంది. సామాన్య మానవులు, ఈ పదాన్ని ఆహారపు అలవాట్లకు హద్దులు పెట్టేది గానో లేదా జీవనశైలిలో పెనుమార్పులు తీసుకువచ్చేది గానో చూస్తారు. ఇది నిజమే అయినప్పటికీ, మధుమేహంలో వందల రకాలున్నాయి పైగా వీటన్నింటిని ఒకె విధంగా పరిష్కారించాలంటే సాధ్యపడదు. నిజానికి, రకరకాల మధుమేహాలు రకరకాల కారణాల వల్ల కలుగుతాయి.

గర్భధారణ కాలం అనేది ఏ స్త్రీ జీవితంలో అయినా ఒక పరీక్ష కాలం లాంటిది. మీకు ఇదివరకే మధుమేహం ఉన్నా,లేకపోయినా, ఈ సమయంలో మాత్రం మధుమేహంతో పోరాడాలని ఏ స్త్రీ కోరుకోదు. అయినప్పటికీ, గర్భధారణ సమయంలో ఒక స్త్రీని గర్భధారణ మధుమేహం ప్రభావితం చేయడం చాలా బాధాకరం. ఏ స్త్రీ అయినా,గర్భధారణ సమయంలో కొన్ని జీవనశైలి మార్పులు చేసుకోవాలి. ఇలాంటి పరిస్థితిని కలిగి ఉండటం వలన జీవనశైలిలో తక్షణ మార్పులు మరియు సర్దుబాట్లను పెంచుతుంది. అందువల్ల, మీరు గర్భం ధరించడానికి ముందే, ఈ పరిస్థితికి సంబంధించిన పరిజ్ఞానం పెంచుకోవడం ఉత్తమం, తద్వారా మీరు అటువంటి పరిస్థితి ఎదురవకుండా తగిన జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ వ్యాసం ద్వారా మీకు సహాయమందించడానికి మేము గర్భధారణ మధుమేహం యొక్క కారణాల గురించి తెలియజేస్తున్నాం.

What are the causes of gestational diabetes?

గర్భధారణ మధుమేహం తలెత్తడానికి కారణాలు ఏమిటి?

• మీ వయస్సు 25 ని మించిందా?

• మీ వయస్సు 25 ని మించిందా?

వినడానికి బాధ కలిగించినా,తల్లి యొక్క వయస్సు ఆమె గర్భధారణలో గణనీయమైన పాత్రను పోషిస్తుంది. 25 ఏళ్ల తరువాత మొదటి సారి గర్భధారణ జరిగిన స్త్రీలలో మధుమేహం వచ్చే ప్రమాదం అధికమని పరిశోధనలు తెలుపుతున్నాయి.

• అధిక బరువు కలిగి ఉన్నారా?

• అధిక బరువు కలిగి ఉన్నారా?

ఊబకాయం ఉన్న స్త్రీలలో గర్భధారణ మధుమేహ వ్యాధి కలిగే అవకాశం ఒకింత ఎక్కువగా ఉంటుంది. కనుక, గర్భధారణ మధుమేహ వ్యాధి రాకుండా ఉండాలంటే మీరు గర్భం దాల్చక ముందే మీ బరువును సరిచూసుకోవాలి. BMI 30 కన్నా అధికంగా ఉండే స్త్రీలలో గర్భధారణ మధుమేహం తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

• గతగర్భ చరిత్ర:

• గతగర్భ చరిత్ర:

బరువైన బిడ్డలను కన్న తల్లులలో గర్భధారణ మధుమేహంకలిగే ప్రమాదం ఎక్కువ. మీరు ప్రసవించిన బిడ్డ యొక్క బరువు 4 కిలోల కన్నా ఎక్కువగా ఉంటే, ఇది నిజమవుతుంది. దగ్గర దగ్గరగా గర్భం ధరించినప్పుడు, రెండవ గర్భం ధరించిన సమయంలో గర్భధారణ మధుమేహంతో పోరాడవలసిన పరిస్థితి తలెత్తుతుంది.

• వ్యక్తిగత ఆరోగ్య చరిత్ర:

• వ్యక్తిగత ఆరోగ్య చరిత్ర:

చాలామంది మహిళలలో మధుమేహం లేనప్పటికీ, ప్రీ డయాబెటిస్ తో బాధపడుతుంటారు. ఈ పరిస్థితి టైప్ 2 మధుమేహంకు దారితీస్తుంది. ప్రీ డయాబెటిక్ దశలో ఇన్సులిన్ స్థాయిలో స్వల్ప మార్పులు చోటుచేసుకుంటాయి. ఈ పరిస్థితి మధుమేహంగా గుర్తింపబడనప్పటికిని, దీని వలన గర్భధారణ మధుమేహం తలెత్తే అవకాశాలు పెరుగుతాయి.

• జాతి బేధాలు:

• జాతి బేధాలు:

దేశంలో ప్రముఖ ఆరోగ్య సంస్థలచే నిర్వహింపబడిన అనేక పరిశోధనలలో భారత ఉపఖండంలోని మహిళలలో ఎక్కువగా గర్భధారణ మధుమేహం సంభవిస్తుందని ధృవీకరింపబడింది. ఆఫ్రికన్ మహిళలలో కూడా గర్భధారణ మధుమేహ బారినపడుతున్నారు. పాశ్చాత్య మహిళలలో ఈ పరిస్థితి సంభవించడం చాలా తక్కువ.

• నిశ్చలమైన జీవనశైలి:

• నిశ్చలమైన జీవనశైలి:

కొంతమంది మహిళలలో గర్భం ధరించిన ఆఖరి దశలో మధుమేహానికి గురవుతారు. దీనికి కారణం తగినంత వ్యాయామం కరువవడమే! గర్భం ధరించినంతనే కొందరు స్త్రీలు అపురూపంగా భావించి అవసరానికి మించి విశ్రాంతి తీసుకుంటారు. దీనివలన శరీర కదలికలు మందగించి గ్లూకోజ్ స్థాయి పెరగడం, బరువు పెరగడం వంటివి జరుగుతాయి. ఇవి మధుమేహానికి దారితీస్తాయి. కనుక గర్భిణీ స్త్రీలు రోజులో కొంత సమయాన్ని తేలికపాటి వ్యాయామాలకు, నడకను వెచ్చిస్తే రక్తంలో గ్లూకోజ్ స్థాయి నియంత్రణలో ఉండి మధుమేహ సమస్య తలెత్తదు.

• అసమతుల ఆహారం:

• అసమతుల ఆహారం:

చాలామంది స్త్రీలు గర్భాన్ని సాకుగా చూపించి తమకు నచ్చిన ఆహారపదార్ధాలు అన్నింటినీ తినవచ్చని అనుకుంటారు. గర్భం ధరించినప్పుడు కొన్ని ఆహారపదార్ధాలు తినాలనే కోరిక కలగటం వలన పరిస్థితి మరీంత దిగజారుతుంది. దీని మూలంగా వారు అనారోగ్యకరంగా అధిక బరువు పెరిగి మధుమేహం సంభవించే పరిస్థితి తెచ్చుకుంటారు.

• ఒత్తిడి

• ఒత్తిడి

శాస్త్రీయంగా నిరూపింపబడనప్పటికిని, ఒత్తిడితో పోరాడుతున్న స్త్రీలలో, గర్భధారణ మధుమేహ వ్యాధి అధికంగా ఉన్నట్లు తేలింది. ఇక్కడ గుర్తించవలసిన విషయం ఏమిటంటే, ఒక వ్యక్తి యొక్క శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యంతో ముడిపడి ఉంటుంది. తల్లీబిడ్డల ఆరోగ్యం సక్రమంగా ఉండాలంటే,ముందుగా తల్లి యొక్క మానసిక ఆరోగ్యం సక్రమంగా ఉండాలి. అప్పుడు,

గర్భధారణ మధుమేహం వంటి శారీరక సమస్యలు సులభంగా పరిష్కరించబడతాయి.

• కుటుంబ చరిత్ర

• కుటుంబ చరిత్ర

కొన్ని కుటుంబాలలో గర్భధారణ మధుమేహం వివిధ తరాలలో, పలువురిలో కనిపిస్తుంది. కనుక, మీ తల్లి లేదా తోబుట్టువులకు గర్భధారణ మధుమేహం కలిగినట్లైతే, ఆ విషయాన్ని మీరు వైద్యునికి తప్పక తెలియజేయండి.

English summary

What are the causes of gestational diabetes?

The word 'diabetes' is enough to bring out a sense of fear in most of us. As layman, we tend to associate this word with restrictions in our dietary habits and a lot of lifestyle adjustments. While this is true, the fact is that there are hundreds of different types of diabetes and it is near impossible for us to pin point a single one strop solution.
Desktop Bottom Promotion