For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భధారణ సమయంలో వక్షోజాలు, చనుమొనల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

రొమ్ము కణజాలాలలో క్రియాశీలక స్వభావం; అవి ఎల్లప్పుడూ హార్మోన్ల మార్పులకు అనుగుణంగా సర్దుబాటుకు గురవుతుంటాయి. మన శరీర అవసరాలకు తగినవిధంగా, అంతర్గత అవయవాలలో మార్పులకు హార్మోన్లు బాధ్యత వహిస్తాయి.ప్ర

|

గర్భధారణ సమయంలో ఒక మహిళ యొక్క రొమ్ములు మరియు చనుమొనలు పలుమార్పులకు లోనవడం సర్వసాధారణంగా ఉంటుంది. క్రమంగా వీటి పట్ల శ్రద్ద తీసుకోవడం అత్యంత ముఖ్యమైన అవసరంగా ఉంటుంది. ఆమె యుక్త వయస్సు నుండి వీటిలో కొన్ని మార్పులు సంభవించినప్పటికీ, గర్భధారణ సమయంలో సాధారణరోజులకు భిన్నమైన మార్పులను ఎదుర్కోవడం జరుగుతుంది. శరీర క్రియలు సవ్యంగా సాగడంలో వీటికంటూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది అనడంలో సందేహమే లేదు.

గర్భధారణ సమయంలో శిశువుకు పాలను సరఫరా చేయడానికి రొమ్ముల పరిమాణాలలో మార్పులు తలెత్తడం సహజం. రొమ్ము కణజాలాలలో క్రియాశీలక స్వభావం; అవి ఎల్లప్పుడూ హార్మోన్ల మార్పులకు అనుగుణంగా సర్దుబాటుకు గురవుతుంటాయి. మన శరీర అవసరాలకు తగినవిధంగా, అంతర్గత అవయవాలలో మార్పులకు హార్మోన్లు బాధ్యత వహిస్తాయి.

ప్రొజెస్టెరాన్ మరియు ఈస్ట్రోజెన్ వంటి హార్మోనుల స్థాయిలలో మార్పుల మూలంగా, ఇవి ఛాతీ భాగంలో శారీరిక మార్పులకు కారణమవుతాయి. పాల నిల్వ మరియు ఉత్పత్తికి లాక్టిఫెరస్ నాళాలు విస్తరించబడుతాయి.

గర్భధారణ సమయంలో రొమ్ములలో మార్పులు :

గర్భధారణ సమయంలో రొమ్ములలో మార్పులు :

గర్భధారణ సమయంలో మహిళలు తమ రొమ్ములలో ఒక జలదరింపు అనుభూతిని పొందుతుంటారు. ఒక్కోసారి ఇది మండే అనుభూతిని కలిగిస్తుంటుంది. క్రమంగా రొమ్ముల పరిమాణం పెరగడంతో పాటు, బరువు పెరిగిన అనుభూతికి లోనవడం కూడా జరుగుతుంది.

గర్భధారణ సమయంలో రొమ్ములపై చర్మం వ్యాకోచానికి గురవుతుంది. క్రమంగా ఆ ప్రాంతంలో దురదగా అనిపించడం పరిపాటి. అంతేకాకుండా చర్మం సాగినట్లు (స్ట్రెచ్ మార్క్స్) గుర్తులు ఏర్పడుతుంటాయి.

రొమ్ముల పరిమాణంలో

రొమ్ముల పరిమాణంలో

రొమ్ముల పరిమాణంలో మరియు బరువులో అసాధారణ మార్పుల కారణంగా రొమ్ముల మీద నీలం లేదా ఆకుపచ్చ రంగులో సిరలు కనిపించడం జరుగుతుంది. రొమ్ముల పరిమాణం చిన్నగా ఉన్నాయని ఫిర్యాదు చేసేవారు, మార్పులను ఆహ్వనించగలుగుతారు. క్రమంగా, క్లీవేజ్ గుర్తించడం జరుగుతుంటుంది.

గతంలో పిల్లలను కలిగి ఉన్న స్త్రీలు, వారి చనుమొనల నుండి స్రావాలు కారడాన్ని గమనించడం జరుగుతుంటుంది.

రొమ్ముల చుట్టుపక్కల ప్రాంతాలలో

రొమ్ముల చుట్టుపక్కల ప్రాంతాలలో

అంతేకాకుండా రొమ్ముల చుట్టుపక్కల ప్రాంతాలలో, ఇంతకు ముందు లేని విధంగా కొన్ని నిరపాయమైన బొడిపెలు కనిపించడం ప్రారంభమవుతుంది. ఏది ఏమైనప్పటికీ, వీటి గురించి మీ గైనకాలజిస్ట్లను సంప్రదించడం మంచిది.

పాలు గడ్డకట్టడం మూలంగా ఏర్పడే ఈ బొడిపెలు, ఎరుపు రంగులో మరియు సున్నితంగా కనిపిస్తాయి. లేపనాలను లేదా మాయిశ్చరైజర్లను ఉపయోగించి మృదువుగా రుద్దడం మరియు మసాజ్ చేయడం ద్వారా తిరిగి రక్తప్రసరణ కొనసాగడానికి సహాయం చేస్తుంది. అత్యవసర పరిస్థితుల్లో ప్రసూతి కేంద్రాన్ని సంప్రదించడం మంచిది.

గర్భధారణ సమయంలో చనుమొనల్లో కలిగే మార్పులు :

గర్భధారణ సమయంలో చనుమొనల్లో కలిగే మార్పులు :

చనుమొనలు అత్యంత సున్నితమైనవి. అవి వేడి లేదా చల్లని పరిస్థితుల పరంగా తీవ్ర సున్నితత్వాన్ని కలిగి ఉంటాయి.చనుమొనలు మరియు అరియోలా(చనుమొనల చుట్టూ ఉన్న భాగం) ముదురు రంగులోకి మారుతుంది. అంతేకాకుండా వాటి పరిమాణం విస్తృతమవుతుంది. గర్భధారణ సమయంలో చనుమొనల ప్రాంతంలో జుట్టు పెరుగుదల కూడా తీవ్రంగా ఉండవచ్చు.

మోంట్గోమెరీ ట్యూబర్కిల్స్ అని పిలవబడే మొటిమల వంటి నిర్మాణాల పెరుగుదల కనిపిస్తుంది. అవి బాధాకరమైనవిగా, మండే స్వభావాన్ని సైతం కలిగి ఉండవచ్చు; అయినప్పటికీ, మృదుత్వాన్ని మరియు సౌమ్యత అందించడమే వాటి విధి. క్రమంగా పిల్లలకు సౌకర్యవంతంగా చనుబాలను అందించేందుకు దోహదం చేస్తుంది.

1. సరైన బ్రా ధరించండి :

1. సరైన బ్రా ధరించండి :

సాధారణంగా రొమ్ము పరిమాణం మొదటి కొన్ని నెలల్లోనే మార్పులకు లోనవడం జరుగుతుంది, కావున మీరు తరచుగా మీ "బ్రా"లను మారుస్తూ ఉండాలి. సౌలభ్యం కోసం సరైన పరిమాణం మరియు మంచి మెటీరియల్ ఉపయోగించి తయారుచేసిన "బ్రా" లను ధరించడం ముఖ్యం. చూసేందుకు బాగుగా కనిపించినా, సౌలభ్యం అందించేవి మాత్రం కొన్నే ఉంటాయి. కావున, ఎంపిక సరిగ్గా ఉండేలా చూసుకోవలసి ఉంటుంది.

అండర్వైర్ లైనింగ్ కలిగిన, మరియు పుషప్ బ్రా రకాలను దూరంగా ఉంచడమే మంచిది. బదులుగా, మృదువైన పాడింగ్ కలిగిన కాటన్ బ్రా ఎంచుకోవడం ఉత్తమం. అండర్వైర్ బ్రాలు పాల ఉత్పత్తికి అంతరాయం కలిగించవచ్చు., మరియు చనుమొనల నాళాలలో అవరోధాన్ని కలిగించవచ్చు. పెద్దవైన రొమ్ములకు మెరుగైన మద్దతు అవసరం, కాబట్టి సరైన బ్రా ఎంచుకోవడం ఖచ్చితంగా అవసరమవుతుంది.

Most Read :కామంతో కళ్లు మూసుకుపోయాయి.. శారీరక సుఖం కోసం మేకను కూడా వదలలేదుMost Read :కామంతో కళ్లు మూసుకుపోయాయి.. శారీరక సుఖం కోసం మేకను కూడా వదలలేదు

2. వెచ్చని మర్దన

2. వెచ్చని మర్దన

చనుమొనలు గర్భధారణ సమయంలో పగుళ్లతో కూడుకుని., మరియు పొడిగా మారుతుంటాయి. క్రమంగా చనుమొనల ప్రాంతంలో తేమను నిర్వహించడం, మరియు నొప్పి లేకుండా చేయడమనేది కష్టతరంగా ఉంటుంది. కొబ్బరి నూనె లేదా ఆలివ్ నూనెతో రోజులో పలుసార్లు తేలికగా మర్దన చేయడం ద్వారా, ఈ సమస్య నుండి కొంతైనా ఉపశమనాన్ని పొందగలరు. ఈ పద్దతి, తేమను నిర్వహించడానికి ఉత్తమంగా సహాయపడుతుంది. మర్దన సమయంలో ఎక్కువ ఒత్తిడిని కలిగించరాదు. కేవలం చేతి కొనవేళ్లతో మాత్రమే మర్దన చేస్తున్నారని నిర్ధారించుకోండి. ఇలా చేయడం ద్వారా నొప్పి మరియు అసౌకర్యం నుండి స్వాంతన చేకూరుతుంది.

3. పరిశుభ్రత నిర్వహణ

3. పరిశుభ్రత నిర్వహణ

పరిశుభ్రత నిర్వహణ, అన్నిటికన్నా ముఖ్యమైనది, ఎప్పటికప్పుడు చనుమొనలను శుభ్రపరచుకొనుట. చివరి త్రైమాసికంలో కొలోస్ట్రం అని పిలవబడే చిక్కటి ద్రవం స్రవించబడుతుంది. కావున ఒక పొడి టిష్యూ పేపర్ అందుబాటులో ఉంచుకుని ఎప్పటికప్పుడు శుభ్రపరచుకునేలా చర్యలు తీసుకోవలసి ఉంటుంది. అంతేకాకుండా ఆ ప్రాంతం పొడిగా ఉంచే క్రమంలో భాగంగా బ్రెస్ట్ పాడ్స్ కూడా ఉపయోగించవచ్చు. ఇవి చర్మాన్ని పొడిగా చేసి, పగుళ్ల బారిన పడకుండా కాపాడేందుకు సహాయపడుతుంది. అంతేకాకుండా సబ్బును ఉపయోగించి శుభ్రపరచడం ఎట్టిపరిస్థితుల్లో సరికాదని గుర్తుంచుకోండి.

ప్రత్యామ్నాయంగా పెట్రోలియం జెల్లీ

ప్రత్యామ్నాయంగా పెట్రోలియం జెల్లీ

సబ్బుకు ప్రత్యామ్నాయంగా పెట్రోలియం జెల్లీ, కొబ్బరి లేదా నువ్వుల నూనె అత్యంత ప్రభావవంతంగా ఉంటాయని చెప్పబడింది. స్నానం చేస్తున్నప్పుడు బ్రొటన వేలు మరియు చూపుడు వేలును ఉపయోగించి శాంతముగా పట్టి లాగడం కూడా మంచిది. ఇది చనుబాల నిర్వహణను సక్రియం చేస్తుంది మరియు ప్రసవం తర్వాత పాల ఉత్పత్తిలో సహాయం చేస్తుంది.

4. చనుమొనల మీద సబ్బును ఉపయోగించడం సరికాదు

4. చనుమొనల మీద సబ్బును ఉపయోగించడం సరికాదు

రసాయనాలు కలిగిన సబ్బులు మరియు బాడీ వాష్ల వంటి వాడకం, చనుమొనల ప్రాంతం మీద ప్రతికూల ప్రభావాన్ని చూపి, పొడిగా చేయడమే కాకుండా దురదను కలిగిస్తాయి. క్రమంగా ఇది చర్మం పగుళ్లకు కూడా దారితీస్తుంది. రాను రాను తల్లులకు బాధాకరమైన విషయంగా మారే అవకాశం ఉంది. కావున ఇదివరకే మీరు ఈ సమస్యతో భాదపడుతున్న పక్షంలో, మాయిశ్చరైజింగ్ క్రీములతో శుభ్రపరచడం ద్వారా కూడా కొంత ఉపశమనాన్ని పొందగలరు. ఇవి సబ్బులకు మంచి ప్రత్యామ్నాయంగా కూడా ఉంటాయి. గర్భధారణ సమయంలో రొమ్ములు మరియు చనుమొనల విషయంలో మహిళలు తప్పనిసరిగా తీసుకోవాల్సిన ప్రధాన జాగ్రత్తలలో ఇది కూడా ఒకటి.

5. చనుమొనల ప్రాంతంలో మాయిశ్చరైజింగ్ వినియోగం

5. చనుమొనల ప్రాంతంలో మాయిశ్చరైజింగ్ వినియోగం

గర్భధారణ సమయంలో రొమ్ములు దురదగా తయారవుతాయి. చర్మం సాగిన గుర్తులు ఏర్పడడమే కాకుండా, చర్మం పగుళ్ళకు లోనై బాధాకరంగా పరిణమిస్తాయి. రొమ్ములు మరియు చనుమొనలపై చమురు, లేదా మాయిశ్చరైజింగ్ క్రీములు కూడా ఒక పరిహారం వలె ఉపయోగపడవచ్చు. స్నానం తర్వాత మాయిశ్చరైజర్ రాయడం, లేదా సున్నితంగా మర్దన చేయడం ద్వారా చనుమొనలు హైడ్రేట్ అవుతాయి. క్రమంగా సమస్య నుండి ఉపశమనం లభిస్తుంది.

పెట్రోలియం జెల్లీ అనేది చర్మం నుండి నీరు బయటకు వెళ్ళకుండా చేయగలిగే, అద్భుతమైన మాయిశ్చరైజర్. గర్భధారణ తర్వాత మహిళలు అధిక కాలం పాటు వారి రొమ్ములు మరియు చనుమొనల భాగంలో స్క్రబ్బింగ్ నివారించవలసి ఉంటుంది. ముఖ్యంగా ప్రతిరోజూ నిద్రకు ఉపక్రమించే ముందు ఈ పద్దతి అనుసరించడం ద్వారా, ఉత్తమ ఫలితాలను పొందగలరు.

Most Read :ఆ సమయంలో కలయిక జరిగితే కచ్చితంగా గర్భం వస్తుంది, ఎలాంటి అమ్మాయినైనా నెలరోజుల్లో నెల తప్పించొచ్చు

పొడి చర్మం మీద తరచుగా గోకడం

పొడి చర్మం మీద తరచుగా గోకడం

పొడి చర్మం మీద తరచుగా గోకడం లేదా తువ్వాలుతో రుద్దడం కారణంగా కూడా దురద తీవ్రత పెరుగుతుంది. గ్రంధుల నుండి స్రవించబడే స్రావాలు, నూనెలు దెబ్బతిని, సెబంగా మారి కరిగించబడి బాహ్యచర్మం మీద చేరుతుంది. దీన్ని, నీటిలో నానబెట్టిన ఒక శుభ్రమైన వస్త్రాన్ని తీసుకుని తేలికగా తుడిచివేయాలి. అలోవెరా జెల్ కూడా పెట్రోలియం జెల్లీకి బదులుగా వినియోగించవచ్చు. దీనిలోని సహజ సిద్దమైన వైద్య లక్షణాల కారణంగా, ప్రభావిత ప్రాంతాన్ని చల్లబరచి, దురద నుండి ఉపశమనం ఇస్తుంది.

6. వోట్మీల్ బాత్

6. వోట్మీల్ బాత్

వేడి నీటి స్నానం చర్మాన్ని మరింత దురదకు మరియు నొప్పికి గురిచేస్తుంది, ఎందుకంటే వేడి నీటికి చర్మం ద్వారా స్రవించే సహజ నూనెలను కరిగించే స్వభావాన్ని కలిగి ఉంటుంది. పొడి చర్మం నుండి ఉపశమనం పొందేందుకు, మెరుగైన ఎంపికగా ఓట్మీల్ ఉంటుంది. గోరు వెచ్చని నీటిలో వోట్మీల్ జోడించి స్నానం చేయాలి. లేదా ఓట్మీల్ పేస్ట్ తీసుకుని, రొమ్ములు మరియు చనుమొనల ప్రాంతాలలో స్నానానికి ముందుగా సున్నితంగా మర్దన చేసి, కాసేపటి తర్వాత నీటితో కడిగి వేయడం ద్వారా దురద మరియు నొప్పి నుండి స్వాంతన పొందగలరు. ఈ పద్దతి తరచుగా అనుసరించడం ఉత్తమంగా సూచించబడుతుంది.

7. నిపుల్ ప్రొటెక్టర్

7. నిపుల్ ప్రొటెక్టర్

చనుమొనలు దురద పుడుతూ, నొప్పిని కలిగిస్తున్న ఎడల, దుస్తులు తగిలినప్పుడు, రాపిడికిలోనై అసౌకర్యానికి గురవడం కూడా జరుగుతుంటుంది. క్రమంగా దురద లేదా నొప్పి పెరిగే అవకాశం కూడా ఉంది. కావున దుస్తులకు మరియు చనుమొనల మధ్య రక్షణగా నిపుల్ ప్రొటెక్టర్స్ సహాయం చేస్తాయి. చర్మం నుండి స్రవించే చెమట మరియు తేమను నిలుపుకోవటానికి ఈ నిపుల్ ప్రొటెక్టర్లు ఖచ్చితంగా సహాయపడుతాయి. చర్మం మరియు దుస్తుల మధ్య ఎటువంటి తాకిడి లేని కారణాన, క్రమంగా నొప్పి నుండి కూడా ఉపశమనం పొందగలరు.

8. బ్రెస్ట్ పాడ్స్ మరియు ఐస్ పాడ్స్ ఉపయోగించండి :

8. బ్రెస్ట్ పాడ్స్ మరియు ఐస్ పాడ్స్ ఉపయోగించండి :

గర్భధారణ సమయంలో రొమ్ములు మరియు చనుమొనలపట్ల అత్యంత జాగురూతులై ఉండవలసి ఉంటుంది. రొమ్ముల మరియు చనుమొనల నుండి లీకేజ్ నిరోధించడానికి బ్రెస్ట్ పాడ్స్ అత్యుత్తమంగా సహాయం చేయగలవు. ఇవి ఆ ప్రాంతం చుట్టూ అవసరమైన వరకే పొడిగా ఉంచేలా సహాయం చేస్తాయి. అవి చనుమొనల నుండి వచ్చే లీకేజ్ను తొలగిస్తూ, ఫలితంగా ఇన్ఫెక్షన్స్ కలుగకుండా సహాయపడగలవు. వీటిని బ్రా మరియు చనుమొనల మధ్య ఉంచవచ్చు. ఇవి వాడిపడేసే డిస్పోసల్స్ లేదా పునర్వినియోగానికి ఉపయోగపడేలా, రెండు రకాలుగా మార్కెట్లో లభిస్తాయి. వీటిని తరచుగా వినియోగించడం మూలంగా ఒత్తిడి నుండి ఉపశమనం లభిస్తుంది.

ఐస్ పాడ్స్ కూడా నొప్పిని, దురదను తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తాయి. క్రమంగా సౌకర్యవంతంగా ఉంటుంది.

Most Read :రోజూ హస్త ప్రయోగం చేసుకుని వీర్యాన్ని స్కలిస్తే వచ్చే ప్రయోజనాలు తెలుసా? బోలెడన్నీ ఉన్నాయిMost Read :రోజూ హస్త ప్రయోగం చేసుకుని వీర్యాన్ని స్కలిస్తే వచ్చే ప్రయోజనాలు తెలుసా? బోలెడన్నీ ఉన్నాయి

తీసుకోవలసిన జాగ్రత్తలు

తీసుకోవలసిన జాగ్రత్తలు

స్త్రీలు కోరుకోకపోయినా, రొమ్ములలో కలిగే మార్పులను నిర్లక్ష్యం చేయరాదు. క్రమంగా ఉపశమనం దృష్ట్యా జాగ్రత్తలు తీసుకుంటూ, ఇన్ఫెక్షన్స్ బారిన పడకుండా ఆరోగ్యకరమైన జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది.

చర్మాన్ని కడిగేందుకు, మోస్తరు గోరువెచ్చని నీటిని వినియోగిస్తున్నారని నిర్ధారించుకోండి. అధిక వేడితో కూడిన నీటిని వినియోగించడం, అదనపు దురదకు కారణమవడమే కాకుండా, కడుపులోని శిశువుకు కూడా హాని కలిగించవచ్చు.

తప్పనిసరిగా ప్రతి రోజు "బ్రా" ను మార్చాలి. క్రమంగా చెమట మరియు లీకేజ్ వలన తలెత్తే చికాకు నుండి దూరంగా ఉండవచ్చు. ప్రతి రోజు రొమ్ములలో జరుగుతున్న మార్పులను గమనిస్తూ ఉండాలి.

స్ట్రెచ్చింగ్ వ్యాయామాలు

స్ట్రెచ్చింగ్ వ్యాయామాలు

రొమ్ములలో ఎటువంటి ప్రత్యేకమైన లేదా అసాధారణ మార్పులను గమనించినా వెంటనే వైద్యుని సంప్రదించాలి. ఆర్మ్ రొటేషన్స్ వంటి, సాధారణ స్ట్రెచ్చింగ్ వ్యాయామాలు రొమ్ములు కుంగిపోకుండా నిరోధించడానికి సహాయపడుతాయి. రొమ్ముల పట్ల శ్రద్ధ వహించే క్రమంలో భాగంగా ప్రతిరోజూ కొద్దిగా సమయం కేటాయించడం ద్వారా, దీర్ఘకాలిక శరీర ఆకృతిని నిర్వహించడంలో ప్రసవానికి ముందు ఇది సహాయపడుతుంది. కానీ ఎటువంటి వ్యాయామాలైనా, వైద్యుని సూచన ప్రకారమే అనుసరిస్తున్నారని నిర్ధారించుకోండి.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర, ఆరోగ్య, జీవనశైలి, మాతృత్వ, శిశు సంబంధ, ఆహార, లైంగిక, వ్యాయామ, ఆద్యాత్మిక, జ్యోతిష్య, హస్త సాముద్రిక, తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి

English summary

Breast and Nipple Care During Pregnancy

A woman's breasts and areolas go through multiple changes during pregnancy. She needs to invest more time nurturing and caring for her breasts, even though she never did the same during puberty. The breasts play an important role to support a human life to develop and grow.
Desktop Bottom Promotion